సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిహార్‌లో ఆదివారం ఎన్నికల శంఖారావాన్ని సీఎం నితీష్‌తో కలిసి మోదీ పూరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. సైనికులు జరిపిన మెరుపు దాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాయ్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని మోదీ ఆరోపించారు.