జల, వాయు, శబ్ద, నేల కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులకు కొదవే ఉండదు. లక్షలాది వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి తూట్లు పొడుస్తుండగా.. అదేపనిగా మోగించే వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడినా కూడా కొందరు హారన్లతో హోరెత్తిస్తుంటారు. దాంతో అక్కడ పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చెవిపోటు ఖాయం. అందుకే దీనికో పరిష్కారం కనుగొన్నారు ముంబై పోలీసులు.