Telangana Traffic Police
-
తెలంగాణలో జోరందుకున్న పెండింగ్ చలానాల చెల్లింపులు
-
వాహనాల విడుదలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్ పే, మీ సేవ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. ఇక ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మాత్రం కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైన్ షాపులతో పాటు, నిర్మాణ, కిరాణా తదితర వ్యాపారాలకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కూడా సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేశారు. ఇందులో సివిల్ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్ పోలీసులు మరో 50 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తాజా నిర్ణయంతో వాహన దారులకు భారీ ఊరట లభించింది. -
ముంబైలో సరికొత్త ప్రయోగం.. కేటీఆర్ ఆసక్తి
-
హారన్‌పై చెయ్యి పడిందో.. ఇక అంతే..!
సాక్షి, హైదరాబాద్ : జల, వాయు, శబ్ద, నేల కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులకు కొదవే ఉండదు. లక్షలాది వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి తూట్లు పొడుస్తుండగా.. అదేపనిగా మోగించే వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడినా కూడా కొందరు హారన్లతో హోరెత్తిస్తుంటారు. దాంతో అక్కడ పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చెవిపోటు ఖాయం. అందుకే దీనికో పరిష్కారం కనుగొన్నారు ముంబై పోలీసులు. కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబెల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. వాహనదారుల హారన్ మోతలకు కళ్లెం వేశారు. హారన్ శబ్దాలు డెసిబెల్స్ మీటర్లో 85 కంటే ఎక్కువ నమోదైందంటే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. ఎవరిదారిన వారు.. సైలెంట్‌గా వెళ్లి పోతే సమస్యే లేదు. కాదూ కూడదు అని.. హారన్‌పై చెయ్యి పడిందో ఇక అంతే..! గ్రీన్ సిగ్నల్ పడినా వెంటనే రెడ్ సిగ్నల్‌కు జంప్ అవుతుంది. ఈ ప్రయోగం ముంబైలో సత్ఫలితాలనిస్తోంది. దీనిపట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొద్దామని ట్విటర్లో వెల్లడించారు. -
నేటి నుంచే 'ట్రాఫిక్' డిస్కౌంట్
హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాల్పడి..పెద్ద మొత్తంలో జరిమానాలు బకాయిపడ్డ వాహనదారులకు గొప్ప రిలీఫ్. జరిమానాలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ముందుకొచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా బకాయి మొత్తాన్ని సగానికి తగ్గించుకోవడానికి అవకాశం కల్పించే ‘ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్’ బుధవారం నుంచి ప్రారంభంమైంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గుర్తించుకోవాల్సిన అంశాలివీ... ఎన్నాళ్ళు, ఎక్కడ? బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోషామహల్‌లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో. ట్రాఫిక్ విభాగం పది కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎవరు రావచ్చు? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏ కమిషనరేట్ నుంచి జారీ అయిన ఈ–చలాన్లు అయినా ఈ లోక్ అదాలత్ ద్వారా తగ్గింపు పొందవచ్చు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన కేసుల్లో మాత్రం తగ్గింపు లేదు. ఏమేమి తీసుకురావాలి? వాహనయజమానే రావాల్సిన అవసరం లేదు. వారి తరఫున ఎవరైనా హాజరుకావచ్చు. వచ్చేప్పుడు ఈ–చలాన్ ప్రింట్ ఔట్, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ/నెంబర్, ఆధార్ కార్డ్ (తప్పనిసరి కాదు), వాహనచోదకులు సెల్‌ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఈ మెగా లోక్ అదాలత్‌లో జరిమానా బకాయిలు చెల్లించిన వాహనచోదకులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకోండిలా: వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్ ఈ–చలాన్ వివరాలు నగర ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.htp.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్ (www.ctp.gov.in) లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.