పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా సమర్ధించారు. దేశవ్యాప్తంగా కొంతకాలంగా నెలకొన్న కుల రాజకీయాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
శుక్రవారం జీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తనపై వస్తున్న విమర్శలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపైనా తన అభిప్రాయా న్ని కుండబద్దలు కొట్టారు. పలు అంశాల్లో తనపై వచ్చిన విమర్శలకు ఎప్పుడూ భయపడలేదన్నారు. ‘2019 ఎన్నికల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. 125 కోట్ల మంది ప్రజల గురించే నేను ఆలోచి స్తాను’ అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతోపాటు తమ ప్రభుత్వం ఎన్నో ప్రజోపయోగ పథకాలను అమలుచేస్తోందన్నారు.