యూపీలో బస్సు బోల్తా పడి 17మంది మృతి | Private bus hits divider and overturns in UP's Mainpuri; 17 dead | Sakshi
Sakshi News home page

యూపీలో బస్సు బోల్తా పడి 17మంది మృతి

Published Wed, Jun 13 2018 9:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు 17 మంది మృతి చెందగా 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిరాత్‌పుర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇటవా- మెయిన్‌పూర్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement