లంగాణ టీడీపీలో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి అన్నావ్..మరి ఏపీలో అదే మాట చెప్పగలవా అని టీడీపీ అధినేత నారా చంద్రనాయుడు నుద్దేశించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రోజా విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే అభివృద్ధి చూసి వచ్చారు అంటావ్..మరి తెలంగాణలో పార్టీ మారితే నీతి బాహ్యమా అని అడిగారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని వ్యాక్యానించారు. తెలంగాణ ప్రజలు వెర్రివాళ్లు కాదు చంద్రబాబు చెప్పే మాటలు విని ఓటు వేయడానికి అన్నారు.
Published Sun, Dec 2 2018 5:21 PM | Last Updated on Wed, Mar 20 2024 4:08 PM
Advertisement