ఏఆర్ కానిస్టేబుల్ మద్యం మత్తులో చేసిన ప్రమాదం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబాన్ని కుదిపేసింది. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయి జీవచ్ఛవంలా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మద్యం మత్తులో బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన ఆ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.