నడిరోడ్డుపై దారుణ హత్య | Tamil Nadu Astrologer Hacked To Death On Road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై దారుణ హత్య

Published Mon, Dec 24 2018 8:33 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

తమిళనాడులోని తిరుపూర్‌లో దారుణం జరిగింది. రమేశ్‌ అనే జ్యోతిష్కుడిని గుర్తు తెలియని వ్యక్తి నడిరోడ్డుపై కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... కుమరన్‌ రోడ్డులో కూర్చుని జ్యోతిష్యం చెప్పే రమేశ్‌పై.. సమీపంలో ఉన్న పార్కుకు వచ్చే మహిళలు, ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యభిచార కూపంలోకి దింపుతుడున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2016లో తన ప్రియురాలిని కూడా ఇదే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రోత్సహించాడనే అనుమానంతోనే హంతకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement