ఏపీ, తెలంగాణ ఉన్నతస్థాయి ఇంజనీర్ల సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గోదావరి నీటిని కృష్ణానది రిజర్వాయర్లకు తరలించే అంశంపై చర్చించారు. తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్ రావు, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ నరసింహరావు, నీటి పారుదల శాఖ ప్రత్యేకాధికారి శ్రీధర్ దేశ్‌పాండే, పలువురు విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల అవసరాలు, నీటి లభ్యతను గుర్తించడం జరిగిందని మురళీధర్‌రావు తెలిపారు.