దేశాన్ని 73 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ విధానాల కారణంగా ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల కాలంలో సరైన వ్యవస్థను ఏర్పాటుచేయలేకపోయారని గత పాలకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 54 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లు దేశాన్ని పాలించాయని, వారి పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. ఈ స్థితిలో దేశ వ్యాప్తంగా మార్పు రావాలని, ఆ పులికేక తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభంకావాలని ఆయన పిలుపునిచ్చారు.