శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మహమ్మద్ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం... ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో టీఆర్‌ఎస్, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు ఏకపక్షంగా సాగింది. ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి ఐదుగురు అభ్యర్థులను పోటీలోకి దించాయి. కాంగ్రెస్ తరఫున గూడూరు నారాయణరెడ్డి పోటీ చేశారు. శాసనసభలో మంగళవారం పోలింగ్ జరిగింది. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసింది.