మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-2 నియామక ఎంపిక ప్రక్రియకు సోమవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జాబితా నుంచి తొలగించిన 343 మంది అభ్యర్థుల పత్రాలను పునర్‌సమీక్షించాలని టీఎస్‌పీఎస్సీను హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్‌నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో గతంలో తొలగించిన 343 మందికి ఊరట లభించింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.