2019 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని దుర్బాషలాడుతున్న తీరును చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్ తప్పినట్లుగా కనిపిస్తున్నారని విశాఖ శాసనమండలి చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ భవిష్యత్తులో సైతం గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతందన్నారు. కాగా, టీడీనీ నాయకులు పార్టీని వీడుతుంటే ఆత్మవిమర్శ చేసుకోకపోగా, కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. ఈ క్రమంలో పార్టీ నుండి నాయకులు వలస వెల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబే అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏమి అనకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.