కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడతామని చెప్పారు.
ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎన్టీఆర్ బంధువులు స్వయంగా వైఎస్ జగన్‌కు చూపించారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్‌కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్ జగన్ చూపించారు.