డూ అండ్ డై బ్యూటీ పార్లర్‌లో యువతి మృతి | Woman suspicious death in guntur | Sakshi
Sakshi News home page

డూ అండ్ డై బ్యూటీ పార్లర్‌లో యువతి మృతి

Published Thu, Jun 21 2018 9:50 AM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM

గుంటూరు జిల్లా రేపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్‌లో తెలంగాణకు చెందిన ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఉరి వేసుకుని చనిపోయిందని సిబ్బంది చెబుతున్నా.. అక్కడ ఆ తరహా అనవాళ్లు లేకపోవటం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. రేపల్లెలోని ‘డూ ఆర్‌ డై బ్యూటీ పార్లర్‌’లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో ఉంటున్న తోట సింధు అనే మహిళ ఈ బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఇందులో పనిచేసేందుకు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు చెందిన జి.సిరి (18) బుధవారం ఉదయమే వచ్చి చేరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement