వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భోజన విరామం తీసుకుంటారు.