prakasam dist
-
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులర్పించారు
-
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
-
ఒంగోలులో నటి పాయల్ రాజ్‌పుత్ హంగామా.. బ్లూ డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ
-
కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పచ్చి అబద్ధాలు
-
సైకిల్‌కు రూ.300: పరువు పోగొట్టుకున్న టీడీపీ నేతలు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీకి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఝులక్ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయానికి సోమవారం ఉదయం ప్రధాన నాయకులు వచ్చారు. ఎంత సేపటికీ మిగతా నేతలు, కార్యకర్తలు రాకపోయేసరికి కంగుతిన్నారు. ఎక్కడ పరువు పోతుందోనని డబ్బులిచ్చి చిన్నపిల్లలను ర్యాలీకి తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. ర్యాలీలో చిన్నపిల్లలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కనీసం ఉనికి సైతం చాటుకోలేక పరువుపోగొట్టుకుని బిక్కమొహాలతో వెనుదిరిగారు. జిల్లాలో టీడీపీ నిరసన ర్యాలీ ‘నీరసంగా’ సాగింది. ఆ పార్టీ దయనీయ పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డీజిల్, పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా సైకిల్ ర్యాలీ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఆ పార్టీ జిల్లా నాయకులు సోమవారం జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తీరా సోమవారం నిర్వహించాల్సిన సైకిల్ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు కరువయ్యారు. పాల్గొనేందుకు ప్రజలు కూడా విముఖత చూపారు. అసలు సైకిల్ ర్యాలీకి సైకిళ్లే కరువయ్యాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన పది నుంచి పదిహేను మంది కూడా కార్లు, బైకుల్లో అక్కడకు చేరుకున్నారు. మరి సైకిళ్లు ఎవరు తేవాలి..? చదువుకునే పిల్లల్ని వాళ్లకున్న సైకిళ్లతో సహా టీడీపీ జిల్లా కార్యాలయానికి రప్పించారు. సైకిళ్లకు పార్టీ జెండాలు కట్టారు. పిల్లల మెడలో వేసుకోవడానికి కూడా పార్టీ జెండాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాగానే పాత గుంటూరు రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కొద్ది మంది నాయకులు, చిన్నారులతో ర్యాలీగా బయలుదేరారు. అంతే, ఒంగోలు డీఎస్పీ ప్రసాదు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదు, దానికితోడు చదువుకునే పిల్లలతో సైకిల్ ర్యాలీ ఏమిటని టీడీపీ నేతలను నిలదీశారు. అనంతరం పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీలో జనార్దన్‌కు మాత్రమే ఒక్క సైకిల్ మిగిలింది. అక్కడ నుంచి ర్యాలీగా నడుచుకుంటూ బయలుదేరేందుకు టీడీపీ నాయకులు పూనుకున్నారు. కానీ, పోలీసులు అడ్డుకుని తిరిగి పార్టీ కార్యాలయంలోకే పంపించి వేశారు. ఆ సమయంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ర్యాలీకి వచ్చిన పిల్లాడితో పాటు సైకిల్‌కు రూ.300 ఇస్తామని చెప్పిమరీ తీసుకొచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. నేతలకు, కేడర్‌కు మధ్య అగాధం... జిల్లాలో తెలుగుదేశం పార్టీ రానురానూ ఉనికి కోల్పోతోంది. నాయకులే కాదు కార్యకర్తలు సైతం పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు చెప్పడం.. ఆ కార్యక్రమాలకు పార్టీ జిల్లా నాయకులు కేడర్‌కు పిలుపునివ్వడం సర్వసాధారణమైంది. అయితే, ఇక్కడే పార్టీ పెద్దలకు, కేడర్‌కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఏ నిరసన కార్యక్రమానికి పిలుపినిచ్చినా ఆ పది, పదిహేను మంది మాత్రమే హాజరవుతున్నారే తప్ప పార్టీ కేడర్‌లో కదలిక లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన నాయకులంతా కరోనా కష్టకాలంలో సైతం కనిపించకుండాపోయి ఇప్పుడు నిరసన కార్యక్రమాలంటూ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల మాట అటుంచితే కరోనా సమయంలో పార్టీ కార్యకర్తల బాగోగులు సైతం పట్టించుకోకుండా తప్పించుకు తిరిగారంటూ ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు వారి సంగతి తేలుద్దామని వేచిచూస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఆ సమయం రానే వచ్చింది. నిరసన కార్యక్రమానికి తరలిరావాలంటూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చినా కనీస స్పందన కూడా లేని దుస్థితి నెలకొంది. కార్యకర్తలు ఝలక్ ఇచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు కంగుతిని పరువు నిలుపుకునేందుకు స్కూలు పిల్లలను పిలిపించుకుని ఛీ అనిపించుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన విషయం స్పష్టమవుతోంది. -
తెలంగాణలో ఒకరిని.. ఆంధ్రాలో మరొకరిని..
వెలిగండ్ల(ప్రకాశం జిల్లా): బేల్దారి పనికి తెలంగాణ రాష్ట్రం వెళ్లి అక్కడ ఒక మహిళతో పరిచయం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పా పెట్టకుండా ఆంధ్రాకు వచ్చి మరొకరిని వివాహం చేసుకున్నాడంటూ తెలంగాణకు చెందిన మహిళ ఓ యువకుడిపై వెలిగండ్ల పోలీసుస్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ ముస్తాఫా కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం బోయినపల్లి మండలం వర్ధపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వనజకు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తుమ్మల మహేష్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అనారోగ్యంతో భర్త మహేష్ చనిపోయాడు. (చదవండి: ఏడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి..) వెలిగండ్ల మండలం గండ్లోపల్లికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షన్ బేల్దారి పని చేసుకునేందుకు వర్దపల్లి వెళ్లాడు. అక్కడ వనజతో పరిచయం ఏర్పడింది. వనజను వివాహం చేసుకొని నాలుగేళ్లు కాపురం చేసి చెప్పాపెట్టకుండా ఏపీకి వచ్చి గండ్లోపల్లిలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి ఆమె నిరీక్షన్‌కు ఫోన్ చేయగా తాను వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నానని, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించినట్లు ఫిర్యాదులో వనజ పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ముస్తఫా తెలిపారు.(చదవండి: లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం) -
దారుణం: మనవడిని రోకలిబండతో కొట్టి..
బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా): వ్యసనాలకు బానిసైన మనవడిని తాత హత్య చేశాడు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విషాదం: వివాహమైన 28 రోజులకే..) అవాక్కైన గ్రామస్తులు.. ప్రతి కుటుంబంలో పిల్లలతో గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మనువడిని హత్య చేయడంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. హత్య చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మేదరమెట్ల: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఇక తనకు పెళ్లి కాదని భావించి మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మేదరమెట్లలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సాతులూరి భరత్‌కుమార్ (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పెళ్లి కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో దూలానికి ఉరేసుకున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం భరత్‌కు కీళ్లవ్యాధి ఉంది. పెళ్లి చేసుకునేందుకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు కూడా దూరంగా ఉండటంతో ఇక తనకు పెళ్లి కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బజారు నుంచి వచ్చిన తాత నిర్జీవంగా ఉరికి వేలాడుతున్న మనుమడిని చూసి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పాండురంగారావు తెలిపారు. -
ప్రారంభమైన 108వ రోజు ప్రజాసంకల్పయాత్ర
-
108వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వేటపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ 108వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 02.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. చీరాల పట్టణంలో క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగం సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1,449.5 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అనే భరోస్తా ఇస్తూ రాజన్న బిడ్డ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. -
107వ రోజు ముగిసిన పాదయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 107వ రోజు ప్రకాశం జిల్లా వేటపాలెంలో ముగిసింది. నేటి ఉదయం సంతరావురు శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించిన పాదయాత్ర రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా కొనసాగింది. దారి పొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘన స్వాగతం లభించింది. నేటి ప్రజాసంకల్పయాత్ర వేటపాలెంలో ముగిసింది. నేడు జననేత వైఎస్ జగన్ 4.8 కిలోమీటర్లు నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్‌గా వైఎస్ జగన్ 1,449.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. -
107వ రోజు ప్రారంభమైన జననేత పాదయాత్ర
-
107వ రోజు ప్రారంభమైన జననేత పాదయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం వైఎస్ జగన్ సంతరావురు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తూ ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డ ఇప్పటివరకు 1,444.7 కిలోమీటర్లు నడిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేట్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మహిళలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. -
103వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధినేత, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి మండలంలో విజయవంతంగా కొనసాగుతుంది. రాజన్న బిడ్డకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 103వ రోజును తాళ్లురు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం రాజానగరం గిరిజన కాలనీ మీదుగా కంకుపాడు చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి శ్రీరాంనగర్ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం పార్వతీపురం క్రాస్, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మొత్తం 1,383.1 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
94వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం శివారు నుంచి వైఎస్ జగన్ 94వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా జననేత పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 తిరిగి పాదయాత్ర మొదలవుతోంది. కొండేపి నియోజక వర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం వెంగళాపురం క్రాస్ మీదుగా పాదయాత్ర పెద్దఅలవలపాడుకు చేరుకుంటుంది. రాత్రి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1262.4 కిమీ నడిచారు. దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. -
మళ్లీ మొదటికొచ్చిన నగదు సమస్య
= ఏటీఎంల్లో నగదు లేక ఖాతాదారుల ఇబ్బందులు = నగదు డ్రా కోసం వెళ్తే పది రూపాయల కాయిన్స్ ఇస్తున్న బ్యాంకర్లు కంభం : బ్యాంకుల్లో సరిపడా నగదు లేక.. ఏటీఎం సెంటర్లు పనిచేయక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో 11 ఏటీఎం సెంటర్లు ఉన్నా నగదు లేక అవి నిరుపయోగంగా ఉన్నాయి. నెల రోజులుగా ఒకటి.. రెండు ఏటీఎం సెంటర్లు మినహా మిగిలిన ఏటీఎంలు పని చేసిన దాఖలాలు లేవు. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే పని చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేదు. కేవలం కొద్ది మొత్తంలో నోట్లు ఉండగా మిగిలిన వారికి పది రుపాయల కాయిన్స్ ఇస్తున్నారు. దీంతో ఖాతాదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రూ.10 వేలు, రూ.20 వేలు విత్‌డ్రా తీసుకున్న వారు ఆ కాయిన్లు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ నోట్లను చిల్లరగా మార్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో చిల్లరను నోట్లుగా మార్చుకోవాల్సి వస్తోంది. దుకాణాల్లో ఎక్కువ చిల్లర ఇస్తే తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. బ్యాంకులతో పాటు ఎస్బీఐ ఖాతాదారుల సేవా కేంద్రాల్లో సైతం పది రుపాయల కాయిన్స్ విత్‌డ్రాగా ఇస్తున్నారు. నగదు అవసరమై గురువారం బ్యాంకుకు వెళ్లి రూ.20 వేలు విత్‌డ్రా చేసా. అన్నీ పది రూపాయల కాయిన్స్ ఇచ్చారు. దాదాపు పది కేజీల పైన బరువు ఉన్నాయి. వీటిని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. --- చెన్నకేశవులు, కంభం బ్యాంకులో నగదు అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. నగదు ఉన్నంత వరకూ ఇచ్చేస్తున్నాం. పది రూపాయల కాయిన్లు కొంతమేర ఉండటంతో వాటిని ఖాతాదారులకు అందిస్తున్నాం. --- రాఘవులు, ఎస్బీఐ మేనేజర్, కంభం -
ట్రావెల్స్ బస్సు బోల్తా,15మందికి గాయాలు