
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి మండలంలో విజయవంతంగా కొనసాగుతుంది. రాజన్న బిడ్డకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 103వ రోజును తాళ్లురు శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం రాజానగరం గిరిజన కాలనీ మీదుగా కంకుపాడు చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి శ్రీరాంనగర్ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కు ప్రారంభమౌతుంది. అనంతరం పార్వతీపురం క్రాస్, తిమ్మయ్యపాలెం మీదుగా అద్దంకి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మొత్తం 1,383.1 కిలోమీటర్లు నడిచారు. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.