తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా ఎన్నికల నగారా మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఓటు హక్కు విషయంలో కీలకమైన సూచనలు చేశారు. ఇటీవల ఆంధ్ర ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ గురికావడం.. అధికార టీడీపీ ఓట్ల తొలగింపునకు యత్నిస్తుందనే ఆరోపణలు వస్తున్న వేళ ఆయన ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.