వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాతుంటే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టలేదా అని వైఎస్సార్‌సీసీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అడ్డుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా నిలదీశారు. రాజశేఖరరెడ్డి కుటుంబం మీద చంద్రబాబు చాలా రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రేగిడిలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. విజయమ్మ మాట్లాడుతూ..‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌ది. వైఎస్సార్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది