regidi
-
సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం
రేగిడి(శ్రీకాకుళం జిల్లా): సాగులో ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ వరికోతపనుల్లో మాత్రం కొడవలిదే ప్రధానపాత్ర. తరతరాలుగా కొడవలి లేనిదే వరి పంట ఇంటికి చేరదంటే అతిశయోక్తి కాదు. సర్రుమని తెగే పదునుతో పాటు చురుకైన పనితనం రేగిడి మండలంలోని వండాన పేట గ్రామం కొడవలి సొంతం, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొడవలి తయారీ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. గ్రామానికి చెందిన కనీసం పది కుటుంబాల వండ్రంగులు వాటిని తయారు చేస్తున్నారు. విజయవాడ నుంచి ముడిసరుకును ఇక్కడికి తీసుకువస్తారు. ముడిసరుకును బాగా కర్రబొగ్గు మధ్యలో వేడి చేసి కరిగించి కొడవలిగా మారుస్తారు. దానికి పదును పెట్టడంతో పాటు కక్కుర్లు వేస్తారు. కుడిచేతి వాటం ఉన్నవారితో పాటు పాటు ఎడమచేతి వాటం వారు కూడా ఈ కొడవలితో అవలీలగా వరి కోత కోయగలరు. సుమారు 60 మందికిపైగా కూలీలు ఈ పనిద్వారా లబ్ధిపొందుతున్నారు. నిత్యం వారికి పని ఉంటుంది. అన్‌సీజన్‌లో తయారు చేసిన వాటితో పాటు ప్రస్తుతం తయారుచేస్తున్నవి కూడా హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ధరతో పాటు డిమాండ్ ఇక్కడ తయారు చేసిన కొడవలి బరువు 300 గ్రాములు ఉంటుంది. దాని పిడిని ఇరుడుకర్రతో వేస్తారు. ఒక దాని తయారీకి గంట సమయం పడుతుంది. రోజుకు సగటున నలుగురు కూలీలు 15 నుంచి 18 వరకు తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఒక దాని ధర రూ. 300 నుంచి రూ.350లు ఉంటుంది. విజయవాడ, చీరాల, ఒంగోలు, ఒడిశా, కోల్కత్తా తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే ముఠామేస్త్రీలు కూడా ఇక్కడి నుంచి కొడవళ్లు తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఒక్కోటి రూ.500కు విక్రయిస్తుంటారు. నిత్యం డిమాండ్ ఖరీఫ్ కోతల సీజన్ ప్రారంభం కావడంతో హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతున్నాయి. కొడవలి తయారీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నాం. ప్రతి నెల రూ.15వేల వరకూ ఆదాయం వస్తుంది. - మేటికోటి రామకృష్ణ, తయారీదారు, వండానపేట బంధువులకు పంపిస్తాం ఇక్కడి కొడవలితో కోత బాగా వేగంగా అవుతుంది. ఏటా కొత్తవి కొని ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులకు పంపిస్తాం. ఈ ఏడాది పంపించడానికి 20కిపైగా కొనుగోలు చేశాను. - పైల తవిటినాయుడు, రైతు, చాటాయివలస -
విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) వివరాలు సేకరిస్తున్న ఎస్.ఐ షేక్ మహమ్మద్ ఆలీ మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం) -
అత్యవసరమా.. అయితే రావొద్దు!
సాక్షి, శ్రీకాకుళం: పీహెచ్‌సీల్లో వైద్య సేవలు తీసికట్టుగా మారాయి. సిబ్బంది కొరతతోపాటు అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు. ఆదివారం అత్యవసర కేసులు వస్తే చేతులెత్తేస్తున్నారు. ఇక్కడ వైద్యులు డుమ్మా కొట్టడం, లేదా ఉదయం వచ్చి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం పాముకాటు, కుక్కకాటు, గర్భిణులు, ప్రమాద కేసులకు అత్యవసర సేవలందడం లేదు. కొన్నిచోట్ల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల్లో, రాజాం సీహెచ్‌సీలో సాక్షి విజిట్ చేయగా, వెలుగు చూసిన అంశాలు ఇవి... రాజాం సీహెచ్‌సీలో.. రాజాం పట్టణంతోపాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, చీపురుపల్లి, తెర్లాం, బలిజిపేట తదితర మండలాలకు రాజాం సీహెచ్‌సీయే ప్రధాన కేంద్రం. ఇక్కడ ఆదివారం ఒకరిద్దరు డ్యూటీ డాక్టర్లు మాత్రమే ఉంటున్నారు. ఈ సమయాల్లో ప్రమాద బాధితులు, గర్భిణులు వంటి అత్యవసర కేసులు వస్తే, రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆదివారం డ్యూటీ డాక్టర్ రవీంద్రబాబుతోపాటు మరో ఐదుగురు సిబ్బంది మాత్రమే కనిపించారు. వంగర మండలం నుంచి వచ్చిన కుక్కకాటు బాధితులకు సేవలందించారు. పలు ప్రాంతాల నుంచి 14 మంది మాత్రమే ఓపీ విభాగంలోనూ, అత్యసవర సేవలు నిమిత్తం వచ్చారు. బొద్దాంలో.. రాజాం మండల పరిధి బొద్దాం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ ఆదివారం ఒకరు తమ వంతు డ్యూటీ వేసుకుని సేవలందిస్తున్నారు. ఆదివారం వైద్యులు ఉండటం లేదు. హెల్త్ సూపర్వైజర్లు ఎం సావిత్రి, డీవీ నిర్మలదేవి మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ఆస్పత్రికి పది మంది వరకూ వచ్చిన రోగులకు సాధారణ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడకు వైద్యులు వస్తారని రోగులు వాపోతున్నారు. వీరు కాకుండా ఆదివారం మరో నలుగురు ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు ఇక్కడ లేకపోవడంతో రోగులు రాజాం వెళ్తున్నారు. సంతకవిటి పీహెచ్సీలో.. సంతకవిటి పీహెచ్సీలో ఆదివారం వైద్యాధికారి గట్టి భార్గవి హాజరయ్యారు. ఒకరిద్దరు రోగులు మాత్రమే రాగా వీరికి వైద్యాధికారిని ఆరోగ్య తనిఖీలు చేసి మందులు అందించారు. అత్యవసర సేవలకు సంబంధించి మందులు అందుబాటులో లేవు. ప్రసూతి పరికరాలు, పలు రకాల వైద్య పరికరాలు ఇక్కడ లేవు. దీంతో అత్యవసర సమయంలో రోగులను రాజాం తరలిస్తున్నారు. దారుణంగా వైద్య సేవలు.. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో గ్రామాల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి తోడు గర్భిణులు, ప్రమాద బాధితులు, అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 108 వాహన సేవలు గత ప్రభుత్వం కంటే అధికంగా అందుతున్నాయి. ఆశా కార్యకర్తల సేవలు విస్తృతం చేసి సకాలంలో రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దారుణంగా ఉంది. రేగిడిలో... రేగిడి పీహెచ్సీలో అత్యవసర వైద్యసేవలకు మందులు అందుబాటులో లేవు. దీంతో ప్రమాద బాధితులు, గర్భిణులు, పాముకాటు బాధితులు ఇక్కడకు వస్తే రాజాం తరలిస్తున్నారు. ఆదివారం ఈ సేవలు మందగిస్తున్నాయి. వైద్యాధికారి స్వర్ణలత రోగులకు ఆరోగ్య పరీక్షలు అందించారు. ఓపీలో 12 మంది హాజరుకాగా, కొంతమందికి ఇక్కడ మందులు అందజేశారు. మిగిలినవారిని రాజాం తరలించారు. వంగర పీహెచ్సీలో అంతే.. వంగర పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవుపై ఉండగా మరొకరిని నియమించలేదు. దీంతో సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. ఆదివారం సీహెచ్‌వో బీ భాస్కరరావు, ల్యాబ్‌టెక్నీషియన్ దమయంతి, హెల్త్‌అసిస్టెంట్ వెంకన్న విధుల్లో ఉన్నారు. పొగిరి పీహెచ్సీ వైద్యుడు ఆకిరి భార్గవ్ ఇక్కడకు ఇన్చార్జి వైద్యుడిగా ఉండటంతో రెండు చోట్ల విధులకు హాజరుకాలేని పరిస్థితి. హెచ్వీ, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టు, అటెండర్‌తోపాటు ఆరోగ్య సిబ్బంది ఆదివారం విధులకు హాజరు కాలేదు. రోగులకు హెల్త్ అసిస్టెంట్ వెంకన్న, సీహెచ్‌వో భాస్కరరావు వైద్యసేవలందించారు. సిబ్బంది కొరతతో సేవలు డీలాపడుతున్నాయి. -
రైతు పారకు కేరాఫ్ వండానపేట
సాక్షి, రేగిడి : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందంటే చాలు రైతులంతా పొలం పనుల్లో నిమగ్నమవుతుంటారు. ఇదే సమయంలో సాగుకు సంబంధించి పార, నాగళి, కొడవలి.. తదితర అన్నిరకాల వస్తు సామగ్రిని సిద్ధం చేసుకుంటారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు దుక్కులు చేపట్టి పొలాలు గట్లను చదునుచేయాల్సి ఉంది. ఈ పనులకు పారలు ఎంతో అవసరం. జిల్లావ్యాప్తంగా ఉన్న మార్కెట్ల కంటే రేగిడి మండలంలోని వండానపేట గ్రామంలో లభ్యమయ్యే పారలకే ఎక్కువ గిరాకీ. ఉంగరాడమెట్టకు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ చిన్నపల్లెలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే వడ్రంగుల ఇళ్లు కళకళలాడుతుంటాయి. ఇంటి ముందర పారలు తయారీచేసే షెడ్డులో రైతులు కిటకిటలాడుతుంటారు. వీరంతా ఈ మండలానికి చెందిన రైతులే కాకుండా సుదూర ప్రాంతాలు నుంచి కూడా వస్తుంటారు. జిల్లా రైతులతో పాటు చీరాల, గుంటూరు, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారలు, రైతులు వచ్చి ఇక్కడ పారలు కొనుగోలు చేస్తుంటారు. నాణ్యతలో మేటి.. ఈ పారలు సాధారణంగా అడుగున్నర నుంచి రెండు అడుగుల పొడవు, 9 నుంచి 12 ఇంచీల వెడల్పు ఉంటాయి. కొన్ని పారల వెడల్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వీటికి వాడే ఇనుప రేకులును ముడిసరుకు రూపంలో విజయనగరంలో కొనుగోలు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇరుడుకర్రను వినియోగిస్తారు. ఈ కర్ర అన్ని ప్రాంతాల్లో దొరకదు. ముడిసరుకులో కల్తీలేకుండా బొగ్గులు పొయ్యిలో ఇనుము కరిగించి పారను సౌష్టంగా తయారీచేస్తారు. ఇనుము గట్టిగా ఉండడంతో పాటు బాగా పదునుగా మారుతుంది. ఇరుడు కర్ర వినియోగించడం వల్ల రైతుల చేతికి ఎటువంటి దెబ్బలు తగలకపోగా పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. -
రేగిడి బహిరంగ సభలో విజయమ్మ
-
చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలుసా?
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో మాట్లాతుంటే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టలేదా అని వైఎస్సార్సీసీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అడ్డుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా నిలదీశారు. వైఎస్ జగన్ మీద చంద్రబాబు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రేగిడిలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. విజయమ్మ మాట్లాడుతూ..‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌ది. వైఎస్సార్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు పాలనలో అందరికీ కష్టాలే. వైఎస్సార్ ఆశయాల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీ పనిచేస్తుంది. 2014 ఎన్నికల సమయంలో 600కు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదు. ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదు. సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. టీడీపీ పాలనలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలు. మళ్లీ అవే అబద్ధాలతో మీ ముందకొస్తున్న చంద్రబాబును నమ్మకండి. వైఎస్ జగన్ నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుంది. రాజన్న రాజ్యం కోసం ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి చంద్రబాబు ఏం చేశాడంటే.. తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులు వైఎస్సార్ పూర్తి చేశారు. రాజాం ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడే జరిగింది వైఎస్సార్ కాలంలోనే శ్రీకాకుళం నుంచి రాజాంకు రోడ్లు వేశారు. మట్టివలస కాలువ ఆధునీకరణ జరిగింది. వైఎస్సార్ హయంలో ఈ నియోజకవర్గంలోనే 60 వేల ఇళ్లు ఇచ్చారు. కానీ చంద్రబాబు చెప్పిన ఏ ఒక్క హామీ అయిన నెరవేరిందా? రాజం స్మార్ట్ సిటీ అయిందా?. తోటపల్లి ఆధునీకరణ పనులు జరిగాయా?. రోడ్ల విస్తరణ జరిగిందా?. కానీ చంద్రబాబు ఏం చేశాడంటే.. 3600 మంది పింఛన్లు తీసేశారు. 18 స్కూళ్లు మూసేళారు. 30 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు తీసేశారు. రాజాంలోని 17 పరిశ్రమలను మూసేని 20వేల మందిని రోడ్డున పడేలా చేశారు.బలసల రేవు వంతెన కోసం 700 రోజులు దీక్షలు చేస్తే చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం మంత్రినైనా అక్కడికి పంపించారా?. కిడ్నీ వ్యాధులతో అంబకంది గ్రామంలో 24 మంది చనిపోతే చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేదు. కానీ నాగావళిలో యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే.. తోటపల్లి కాలువ ఆధునీకరణ చేపడతాం. బలసల రేవు వంతెన నిర్మిస్తాం. రాజాంలో రోడ్ల విస్తరణ చేపడతాం. వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పే రకం కాదు. ఓదార్పు యాత్ర కోసం మాట ఇచ్చినందుకే.. జగన్ జీవితమే మారిపోయింది. చంద్రబాబు అమరావతిలో శాశ్వత నిర్మాణాల కోసం ఒక్క ఇటుకైనా వేశారా?. రైతులకు మూడు పంటలు పండే భూములు తీసుకుని తన బినామీలకు అప్పజెప్పారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుతున్న చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో దుర్గ గుడి ఫ్లైఓవర్ కూడా ఎందుకు కట్టలేకపోయారు?. సంక్షేమ పథకాల డోర్ డెలివరీ.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలి. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. గిరిజనులు భూములకు పట్టాలు ఇస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారు. అంతేకాకుండా గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తారు. పెట్టుబడి సాయంగా రూ. 12, 500 అందిస్తారు. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. గ్రామా సచివాలయాల ద్వారా ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే అయిపోతుంది. సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 7లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగులును, ఎంపీ అభ్యర్థి బెల్లాని చంద్రశేఖర్‌ను అత్యధిక మోజారిటీతో గెలిపించండ’ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు పాలనలో అందరికీ కష్టాలే
-
మామిడి తోటలో మృతదేహం
రేగిడి (శ్రీకాకుళం) : మామిడి తోటలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో తోటలో పని చేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ట్యాంక్‌పై నుంచి జారిపడి మేస్త్రీ మృతి
శ్రీకాకుళం (రేగిడి) : రేగిడి మండలం చిన్నసెర్లాం గ్రామంలో మంగళవారం ట్యాంక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి పఠాన్ మోతీ ఖాన్(52) అనే రాడ్ బైండింగ్ మేస్త్రీ మృతిచెందాడు. గ్రామంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సంబంధించిన వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోతీఖాన్ స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకాని. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.