రేగిడి (శ్రీకాకుళం) : మామిడి తోటలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో తోటలో పని చేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.