అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే మంగళవారం కూడా లోక్‌సభ వాయిదా పడింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య సభ బుధవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం బయటికొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ జనరల్ సెకట్రరీకి నాలుగో సారి నోటిసులు ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగి, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని తెలిపారు.