Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pawan Kalyan Really Surrendered To Kiran Royal Black Mail1
మహా కంత్రీ కిరణ్‌ రాయల్‌! ఏకంగా పవన్‌నే..

తిరుపతి, సాక్షి: జనసేన నేత కిరణ్‌ రాయల్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నా.. ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓ మహిళ అతని చేతిలో మోసపోయానని, తనకు న్యాయం చేయమని, తనలాంటి వాళ్లెందరినో మోసం చేశాడని మీడియా ముందుకు వచ్చినా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) గప్‌చుప్‌గా ఉండిపోయారు. అయితే కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మి.. ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది .పవన్‌ కల్యాణ్‌ అండ చూసుకునే కిరణ్‌ రాయల్‌ రెచ్చిపోతున్నాడని లక్ష్మి(Laxmi) మరోసారి మీడియా ముందు ఇవాళ ఉద్ఘాటించారు. ఈ క్రమంలో సంచల వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్ నా వెంట ఉన్నారని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడు. నా దగ్గర పవన్ రహస్య జీవితాన్ని సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, అందుకే ఆయన తనను ఏమీ చేయడని.. ఏమీ అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడు. .. ఈ కారణం వల్లనే తాను ఏమి చేసినా.. చంద్రబాబు సహా ఎవరినీ తిట్టినా పవన్ కల్యాణ్‌ అసలు పట్టించుకోరని కిరణ్ రాయల్‌(kiran Royal) అనేవాడు. ఒకానొక టైంలో.. ‘పవనే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశా.. ఇక నువ్వు ఎంత అని కిరణ్‌ నాతో అన్నాడు’ అని లక్ష్మి మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆడవాళ్లను మోసం చేసి.. వాళ్ల సొమ్ముతో రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తికి అండగా నిలబడడం సమంజసమేనా? అని పవన్‌ కల్యాణ్‌ను ఆమె ప్రశ్నించారు కూడా. మరి ఇంతటి సంచలన ఆరోపణల నేపథ్యంలో అయినా.. జనసేన కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Donald Trump Says Auto Tariffs To Come Around April 2nd2
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?

జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్‌కు పిలుపునిచ్చింది.

Child Who Shocked Chandrababu In The Kandukur Meeting3
చంద్రబాబుకు చిన్నారి షాక్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్‌ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేశారు.

Ranveer Allahbadia Shares Details Of What Happening With Him Post Controversy4
చాలా భయంగా ఉంది.. వివాదం తర్వాత ఏం జరిగిందంటే?: యూట్యూబర్‌

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) ప్రస్తుతం ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ యావత్‌దేశం అతడిని దుమ్మెత్తిపోసింది. అది నోరా? డ్రైనేజీనా? అంటూ తిట్లదండకం అందుకుంది. ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.ఫోన్‌ స్విచ్ఛాఫ్‌?అయితే అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడని, అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై అతడు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. నేను, నా టీమ్‌ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది.నా తల్లి క్లినిక్‌పై దాడిచాలామంది నన్ను చంపుతానని బెదిరిపిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్‌కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రణ్‌వీర్‌ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@beerbiceps) చదవండి: జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్‌ మ్యారేజ్‌

Team India arrives in UAE for ICC Champions Trophy5
ICC Champions Trophy: దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కోసం భార‌త క్రికెట్ జ‌ట్టు దుబాయ్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, హెడ్‌కోచ్‌​ గౌతం గంభీర్‌తో కూడిన తొలి బృందం శనివారం దుబాయ్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఈ మొదటి బ్యాచ్‌లో రోహిత్‌-కోహ్లిలతో పాటు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు ఉన్నారు. మిగతా ప్లేయర్లు ఆదివారం దుబాయ్‌కు చేరుకునే అవకాశముంది.ఇక దుబాయ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నారు. ఈ టోర్నీలో రన్నరప్‌గా బరిలోకి దిగుతున్న బారత జట్టు.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు.బుమ్రా స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి తప్పించారు. జైశ్వాల్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్‌​ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే వేదికలో దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. కాగా భారత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి.చదవండి: ENG vs IND: రోహిత్ శ‌ర్మకు బిగ్‌ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ ప్లేయర్‌?

Maharashtra Government Committe On Religion Change Marriages6
‘లవ్‌ జిహాద్‌’పై మహారాష్ట్ర కీలక నిర్ణయం

ముంబయి:‘లవ్‌ జిహాద్‌’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి డిసైడయింది.‘లవ్‌ జిహాద్‌’పై చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్‌ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, లవ్‌ జిహాద్‌ ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.కాగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్‌ పూనావాలా 2022లో ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు.దీంతో అప్పట్లో లవ్‌ జిహాద్‌ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలొచ్చాయి.అప్పట్లో లవ్‌జిహాద్‌పై తీవ్రంగా చర్చ జరిగింది.దీంతో ఈ అంశంపై ఇటీవలే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నేత సుప్రియా సూలే సూచించారు.

Ysrcp Leader Ponnavolu Sudhakarreddy Comments On Ap Government7
‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

సాక్షి,హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌ను రావణ కాష్టంలా ప్రభుత్వం మారుస్తోంది.వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా ముసుగులో మాఫియాలా తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు చేస్తోంది.దాడులపై కమిషన్‌ను అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా కేసులో ఇరికించారు .2023లో సత్య వర్ధన్‌ను విచారిస్తే కులం పరంగా నన్ను తిట్టలేదు అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని బలవంతంగా రప్పించి అతని వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం చట్టాలను అవహేళన చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో కాలు పెడితే చంపేస్తాం అని పబ్లిక్‌గా ఓ ఎమ్మెల్యే కామెంట్‌ చేస్తే చర్యలేవి.మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు.

Cm Revanth Gives Clarity For His Remarks On Pm Modi 8
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్‌ క్లారిటీ

సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్‌తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్‌ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్‌ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది.

Ysrcp Leader Ramesh Reddy House Demolished In Tadipatri9
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేత ఇల్లు కూల్చివేత

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్‌సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్‌ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్‌ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్‌ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్‌ పరికరాలు, మోటర్‌ సెల్‌ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sunita Williams Will Face Gravity Problems On Earth10
సునీత,విల్మోర్‌లకు ‘గ్రావిటీ’ భయం..!

వాషిం‍గ్టన్‌: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌,బుచ్‌ విల్మోర్‌లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్‌ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.శరీరం బరువెక్కిన ఫీలింగ్‌ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్‌ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్‌ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్‌లను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన.. ఏప్రిల్ 2 నుంచి అమలు!?

జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుక

title
మీ వాటా బంగారం.. మూడు తులాలు!

పసిడి ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో అని భారంగానే నడుస్తోంది. అయితే..

title
సునీత,విల్మోర్‌లకు ‘గ్రావిటీ’ భయం..!

వాషిం‍గ్టన్‌: నాసా  వ్యోమగాములు సునీతా విలియమ్స్‌,బుచ్‌

title
మెట్టుదిగిన హమాస్‌..మరో​ ముగ్గురు బందీల విడుదల

గాజా: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌

title
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది.

NRI View all
title
ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు

ఆర్మూర్‌: తెలంగాణ‌ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్‌కామ్‌ (TOMCOM) ద్వారా ఇజ్రాయెల్‌ (Israel)

title
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దశాబ్ద వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)  దశాబ్ద వేడుకలు డిసెంబర్‌లో జరగనున్నాయి.

title
USA: ‘మాట’ నూతన కార్యవర్గం ఎన్నిక

డల్లాస్‌: మాట (మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) బోర్డు మీటిం

title
ప్రధాని మోదీతో మస్క్‌-శివోన్‌ పిల్లల అల్లరి

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో

title
సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..

చిన్నశంకరంపేట(మెదక్‌): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స

Advertisement

వీడియోలు

Advertisement