ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌! | Watch, Anushka Sharma Hilariously Asks Virat Kohli To Hit A Four | Sakshi
Sakshi News home page

ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!

Published Fri, Apr 17 2020 5:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

ముంబై: విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ మైదానంలో దిగితే అటు పరుగుల మోతైనా మోగాలి.. లేకపోతే దూకుడు దూకుడుగానైనా ఉండాలి. ఇదే కోహ్లి స్వభావం. క్రికెట్‌నే శ్వాసగా భావించే కోహ్లి ఇప్పుడు ఇంట్లో లాక్‌ అయిపోయాడు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో క్రీడా ఈవెంట్లు ఏమీ జరగడం లేదు. దాంతో అభిమానులకు కోహ్లి  ఆట దూరమై పోయింది. ఇక భార్య అనుష్క శర్మ కూడా ఇంట్లోనే ఉండటంతో వీరిద్దరూ లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో కూడా అలరిస్తూనే ఉన్నారు. 

ఇటీవల కోహ్లికి న్యూ హెయిర్‌ కట్‌ ట్రై చేసిన అనుష్క శర్మ.. ఇప్పుడు కోహ్లిని ఆట పట్టించే యత్నం చేశారు.. క్రికెట్‌కు దూరమైన కోహ్లిని దాన్ని గుర్తు చేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసేశారు. ‘ ఏయ్‌ కోలీ(కోహ్లి) చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. కాగా, అనుష్క అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. అనుష్క మాటలకు ఒక్కసారిగా క్రికెట్‌ గుర్తుకు రావడంతో కోహ్లి పేలగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement