రెండో ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ముంబై స్పిన్నర్ శశాంక్ వేసిన బంతిని పఠాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో పఠాన్ ఛాతికి తగిలి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జయ్ బిస్తా చేతుల్లో పడింది. దీంతో ముంబై ఫీల్డర్లు బ్యాట్‌కు తగిలిందనుకోని అప్పీల్ చేశారు. అయితే అంపైర్ కాసేపు సంకోచించి అనూహ్యంగా పఠాన్ అవుటని ప్రకటించాడు. దీంతో ముంబై క్రికెటర్లు సంబరాల్లో మునిగితేలగా.. పఠాన్ షాక్‌కు గురయ్యాడు. అంతేకాకుండా క్రీజు వదిలి పోవడానికి నిరాకరించాడు. అంపైర్ల వైపు అసంతృప్తితో చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే వచ్చి పఠాన్ దగ్గరికి వచ్చి అది ఔటని సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో చేసేదేమిలేక పఠాన్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు.