రాయుడికి బీసీసీఐ నోటీసు: కారణమైన ఫోర్ | BCCI issues notice to Hyderabad captain Ambati Rayadu | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 1:32 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా వారం రోజుల క్రితం కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో ఘర్షణకు దిగిన హైదరాబాద్‌ కెప్టెన్‌ అంబటి రాయుడికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నోటీసులు జారీ చేసింది. అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి నిబంధనల్ని ఉల్లంఘించడానికి కారణాలను తెలియజేయాలని కోరుతూ నోటీసులో పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌ టీమ్‌ మేనేజర్‌ కృష్ణారావు కూడా బీసీసీఐ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని వారిద్దర్నీ కోరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement