ప్రాణాంకత కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. దీంతో చాలామంది వేరువేర్వు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. నెలల తరబడి కుటుంబ సభ్యులను దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు సుమారు రెండు నెలల తరువాత ఒకరినొకరు కలుసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా ఎడబాటుకు దూరమైన ఈ దంపతులు ఆదివారం ఓ సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఆ వృద్ధ జంట ఆనందానికి అంతేలేకుండా పోయింది. రెండు నెలల తరువాత కలుసుకోవడంలో ముద్దుపెట్టుకుని ఒకరినొకరు తనవితీరా హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇదీ జీవితమంటే అంటూ ఆ జంటపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం ఆ జంట ప్రేమకు ఫిదా అయ్యారు. ఇంటర్‌నెట్‌లో నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇదే అంటూ కామెంట్ చేశారు.
వృద్ధ జంటకు సానియా, అనుష్క ఫిదా
Published Sun, May 24 2020 6:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:42 PM
Advertisement
Advertisement
Advertisement