Top Stories
ప్రధాన వార్తలు

GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే
సాక్షి, విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీరెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక, వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్ తిట్టడంతో జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్‌నెట్‌లో ఎండీ దినేష్ కుమార్‌పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్‌తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది.

ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్ జగన్ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది.

మీడియాపై పక్షపాత ధోరణి సమంజసం కాదు: ఏపీయూడబ్యూజే
విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొన్ని పత్రికలు, చానెళ్లపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విదించడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్యూజే) తప్పుబట్టింది. మీడియాపై ఆంక్షలు, పక్షపాత ధోరణి సరికాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ కవరేజీకి అందరికీ అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. దీనిపై స్పీకర్, ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొంది. కొన్ని పత్రికలు, చానెళ్లను అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కు అనుమతించకపోవడం సరికాదని తెలిపింది, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్యూజే పేర్కొంది.‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలుఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు .. దారి తప్పిన ఓ భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రదారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.

కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన గిల్.. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ ఎటాక్‌ను గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరూ కొనియాడారు."శుబ్‌మన్ గిల్ ఒక అద్బుతం. తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన రెండున్నర ఏళ్ల వన్డే క్రికెట్ కెరీర్లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు. ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్లను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ ఉన్నప్పటికి వారి మధ్య నుంచి బంతిని బౌండరీకు తరలిస్తున్నాడు. అతడు కచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నముకగా నిలుస్తాడని" బంగర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధరణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్కలు పెరగవు. కానీ గిల్ మాత్రం.. రోహిత్, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్‌లు, కవర్ డ్రైవ్ షాట్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆ షాట్లు చూసి ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి

అమ్మా.. నేనేం పాపం చేశా!
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల్లల పాలిట మృత్యు దేవతగా మారింది. తన భర్త మరణించాక మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అయితే తన సుఖానికి పిల్లలే అడ్డొస్తున్నారని భావించి వాళ్లను లేకుండా చేయాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆ చిట్టితల్లిని విషమిచ్చి ఆ కన్నతల్లి చేజేతులారా చంపేసుకుంది. డోర్నకల్ మండలంలోని జోగ్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళ్ తండాకు చెందిన వాంకుడోత్ వెంకటేష్(30) నాలుగు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆయన భార్య ఉష, ఇద్దరు పిల్లలు నిత్యశ్రీ (05) అబ్బాయి వరుణ్ తేజ (07)ల అత్తింట్లోనే ఉంటోంది. ఈ నెల 5వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటూ పిల్లలిద్దరూ కిందపడి పోయారు. వాంతులు, విరోచనాలు కావడంతో కంగారు పడిపోయిన వెంకటేష్ తల్లి.. పిల్లలను ఏం జరిగిందని వాకబు చేసింది. అమ్మ కూల్‌డ్రింక్ తాగించిందని అమాయకంగా చెప్పారు ఆ ఇద్దరూ. ఆ తర్వాత బాబాయ్ రాంబాబు సహాయంతో పిల్లలను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం పిల్లల శరీరంలో గడ్డిమందు అవశేషాలు ఉన్నాయని వైద్యులు తెలపడంతో బంధువులు ఉషను నిలదీశారు. పిల్లలకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి తాగించినట్లు ఒప్పుకుందామె. ఈలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ఏమైనా జరిగితే తనను చంపేస్తారన్న భయంతో.. ఉష ఎలుకల మందు తాగింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పిల్లల బాబాయ్ ఫిర్యాదు చేయడంతో.. డోర్నకల్ పోలీసులు ఈ నెల 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు రెండువారాల తర్వాత వరుణ్‌తేజ్ కోలుకోగా.. పరిస్థితి విషమించి నిత్యశ్రీ ఆదివారం మృతి చెందింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమెను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఆ అధికారితో ఉష సంబంధం!నిత్యశ్రీ పోస్టుమార్టంను పర్యవేక్షించిన డోర్నకల్ సీఐ బీ రాజేశ్.. దగ్గరుండి ఆ చిన్నారి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో జోగ్యతండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉషను తీసుకు రావాలంటూ ఆగ్రహంతో స్థానికులు ఊగిపోయారు. ఆంబులెన్స్‌కు అడ్డుపడి ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న ఓ పోలీస్ అధికారితో ఉష సంబంధం ఉందని, ఆ అధికారి చెప్పడంతోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడిందని ఆరోపించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా.. 12 గంటలు ధర్నా కొనసాగించారు. ఈ తరుణంలో గ్రామ పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. నిత్యశ్రీ మృతికి కారణమైన పోలీస్ అధికారిపై విచారణ జరిపించి.. ఈ విషయంలో అయన పాత్ర ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించగా.. నిత్యశ్రీ మృతదేహాన్ని బంధవులకు అప్పగించారు.

గుంటూరు పెదకాకానిలో తీవ్ర విషాదం
గుంటూరు: జిల్లాలోని పెదకాకానిలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో నలుగురు దుర్మరణ చెందారు. గోశాల వద్ద సంపులో పూడిక తీస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుది. ఒక రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. సంపులో పూడిక తీసివేతకు రైతు.. కూలీలను మాట్లాడుకుని ఆ పని చేస్తుండగా ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది.

వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupta) వివాదంలో చిక్కుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం రేఖా గుప్తా అవమానించారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది?ఢిల్లీ సీఎం కార్యాలయంలో బీజేపీ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులైన అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని, ఆ ఫొటోల స్థానంలో మహాత్మా గాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను ఉంచినట్లు ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఆప్‌నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ మర్లేనా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో తాను సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయని, నూతన సీఎంగా బాధత్యలు చేపట్టిన రేఖాగుప్తా ఆ ఫొటోల్ని తొలగించి వాటి స్థానంలో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టారని పేర్కొన్నారు.बीजेपी को दलितों और सिखों से है गहरी नफ़रत‼️सरकार में आते ही बाबा साहेब और भगत सिंह जी की तस्वीर हटवाई। pic.twitter.com/9loyTc7R1w— AAP (@AamAadmiParty) February 24, 2025 ఇదే అంశంపై అతిషీ మర్లేనా మీడియాతో మాట్లాడారు. బీజేపీ దళిత వ్యతిరేకి. తాజాగా,ఘటనతో ఆధారాలతో సహా భయట పడింది. తమ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్,అంబేద్కర్ ఫొటోలు పెట్టేలా ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ యాంటీ దళిత్ ఎజెండాతో ముందుకు సాగుతుంది. అంబేద్కర్,భగత్ సింగ్ ఫొటోల్ని తొలగించిందని విమర్శలు గుప్పించారు.ఆప్‌కు భయం పట్టుకుందిఆ ఆరోపణల్ని సీఎం రేఖాగుప్తా స్పందించారు. తన కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉన్నాయంటూ ఆప్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాడు పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని ఆదివారం సీఎం రేఖాగుప్తా ప్రకటించారు. ఆ ప్రకటనకు ఆప్ భయపడిందని, ప్రజల్ని మభ్య పెట్టేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా.. కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ అధిపతి ఫొటో పెట్టకూడదా? దేశ రాష్ట్రపతి ఫొటో పెట్టకూడదా? జాతిపిత గాంధీజీ ఫొటో పెట్టకూడదా? భగత్ సింగ్, అంబేద్కర్ మన మార్గదర్శకులు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా, మేం వారి ఫొటోలు పెట్టేందుకు స్థలం కేటాయించాం. ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం నా పని కాదు.నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని స్పష్టం చేశారు.

అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్, రిజ్వాన్, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు."తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అతడి హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. అతడు చాలా కష్టపడి ఈ స్దాయికి చేరుకున్నాడు. అతడు ఫామ్‌లో లేడని క్రికెట్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద మ్యాచ్‌లలో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వచ్చేస్తాడు.అతడు ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది పడేట్లు కన్పించలేదు. చాలా సులువగా షాట్లు ఆడాడు. అతడు మేమి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయాలనకున్నాము. కానీ అతడు ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్నెస్ లెవల్స్‌తో పాటు హార్డ్ వర్క్‌ను ప్రశంసించాల్సిందే.అతడు మా లాంటి క్రికెటరే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతడు తన అద్బుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా!
ఇంగ్లిష్‌లో టాక్సిక్
భలే చాన్స్?
స్త్రీశక్తి... ఇంధనమై
సెంచరీతో మెరిసిన రవీంద్ర.. బంగ్లాను చిత్తు చేసిన కివీస్
మరేటి సేత్తామ్ .. పనుల్లేవు.. దేశం ఎలిపోదాం
డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు .. దారి తప్పిన ఓ భార్య కథ
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే
చరిత్ర సృష్టించిన పెర్రీ.. తొలి ప్లేయర్‌గా రికార్డు
సాక్షి కార్టూన్ 24-02-2025
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
ఇంగ్లిష్‌లో టాక్సిక్
భలే చాన్స్?
స్త్రీశక్తి... ఇంధనమై
సెంచరీతో మెరిసిన రవీంద్ర.. బంగ్లాను చిత్తు చేసిన కివీస్
మరేటి సేత్తామ్ .. పనుల్లేవు.. దేశం ఎలిపోదాం
డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు .. దారి తప్పిన ఓ భార్య కథ
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
GV Reddy : జీవీ రెడ్డి రాజీనామా వెనక అసలు కారణం అదే
చరిత్ర సృష్టించిన పెర్రీ.. తొలి ప్లేయర్‌గా రికార్డు
సాక్షి కార్టూన్ 24-02-2025
ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
'గేమ్ ఛేంజర్'తో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు
‘పాకిస్తాన్లో గెలిచి ఉంటే బాగుండేది’.. ఇచ్చిపడేసిన శ్రేయస్ అయ్యర్
‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
'తండేల్' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు
జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్ కల్యాణ్
'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!
సినిమా

హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వారంపాటు అమ్మ బాధలోనే: డైరెక్టర్
ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్‌లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.ఎలాంటి శిక్ష వేసినా ఓకేతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది. అమ్మను చూసి భయమేసిందిఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు

అలాంటి మాంసం కూడా తిన్నా.. రుచికరంగా..: టాలీవుడ్ విలన్
ఒకప్పుడు విలన్లను చూస్తేనే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఫిట్నెస్తో అబ్బురపరుస్తున్నారు. ఈ జాబితాలో నటుడు ఆదిత్య మీనన్ (Adithya Menon) ఉన్నాడు. మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.హీరోగా ఛాన్సులు..ఆదిత్య మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను. తర్వాత నాకు ఏవి సెట్టవుతాయి? ఏవి సెట్టవవు? అని ఆలోచించి సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నాను.(చదవండి: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత)చిత్రవిచిత్ర దేశాలకు వెళ్తుంటా.. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్‌కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. అక్కడ గుర్రపు మాంసం తిన్నాను. ఇదే కాదు పాము మాంసం, కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు.సినిమాఆదిత్య మీనన్.. తెలుగులో బిల్లా, సింహా, అధినాయకుడు, కృష్ణం వందే జగద్గురుం, ఈగ, బాద్షా, బలుపు, మిర్చి, పవర్, లయన్, పండగ చేస్కో, రుద్రమదేవి, అమర్ అక్బర్ ఆంటోని, కార్తికేయ 2, పుష్ప 2.. ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేశాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు

ఎలాన్ మస్క్‌ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా అనుపమ్ ఖేర్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ లాక్ అయినట్లు వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్ లాకైంది. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్‌కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.దీనిపై అనుపమ్ తన ట్వీట్లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నా. నాకు ట్విటర్ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Dear X! Even though my account has been restored I was surprised to see it locked. I have been on this platform since September 2007. Have always been mindful of rules of #X (formerly twitter). Or for that matter any social media copyright rules. So found it a little absurd.… pic.twitter.com/tNmhc30vtP— Anupam Kher (@AnupamPKher) February 24, 2025

కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో..: బాలా
నాకు హానికరమైన ఔషధాలు ఇచ్చి నా ఆరోగ్యం చెడగొట్టారు అంటున్నాడు మలయాళ నటుడు బాలా (Actor Bala). రెండేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి జరిగింది. ఆ సమయంలో తను కోలుకోకుండా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలా మాట్లాడుతూ.. నాకు ఇప్పటివరకు రెండు సర్జరీలు జరిగాయి. రెండేళ్ల క్రితం నేను చనిపోయానని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ, చూడండి నేను మీ ముందు ఇలా ఆరోగ్యంగా నిలబడ్డాను.తనెవరో చెప్పనుఅయితే సర్జరీ జరిగాక గతేడాది నాకు మంచి మెడిసిన్ ఇవ్వలేదు. దానికి బదులుగా నా ఆరోగ్యాన్ని దిగజార్చే ఔషధాలు ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఎవరిచ్చారన్నది నేను చెప్పను. అయితే ఆ విషయం తెలియక గుడ్డిగా అవే ఉపయోగించాను. తీవ్ర అనారోగ్యంతో పదిరోజులపాటు ఆస్పత్రిపాలయ్యాను. అప్పుడు నా బంధువైన కోకిల ఒక తల్లిలా నాకు సేవ చేసింది. అప్పుడే తను నన్నెంత ప్రేమిస్తుందో అర్థమైంది.చనిపోయానని అనుకున్నారునేను ఐసీయూలో ఉన్నప్పుడు మరణించానన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో నాకు వెంటిలేటర్ తీసేయాలనుకున్నారు. అంతర్గత అవయవాలు పని చేయడం లేదన్నారు. కిడ్నీ, లివర్, బ్రెయిన్.. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పని చేయడం ఆగిపోతున్నాయి. అప్పుడు మా అమ్మ చెన్నైలో ఉంది. నా చావు ఖాయమని అర్థమై పోస్ట్‌మార్టమ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాకోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థించారు. ముఖ్యంగా నా సినిమాలు చూసిన చిన్నపిల్లలు నేను బతకాలని బలంగా కోరుకున్నారు. అలాగే 25 ఏళ్లుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను. అరగంటలో అద్భుతంవీటన్నిటి ఫలితమో ఏమో కానీ.. అరగంటలో అద్భుతం జరిగింది. నాలో ప్రాణం తిరిగి వచ్చింది. నన్ను ఎంతో ప్రేమించిన కోకిలతో నా పెళ్లి జరిగి మూడు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో కూడా ఒకరికి హార్ట్ సర్జరీ చేయించాను, స్కూల్ కట్టించాను. కోకిల స్థానంలో మరొకరుంటే కచ్చితంగా నాపై ఫిర్యాదు చేసేవారు. కానీ కోకిలకు నా లక్ష్యం ఏంటో తెలుసు. రేపు మాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇదే సేవా మార్గంలో వెళ్లాలని కోరుకుంటాను అని పేర్కొన్నాడు.చిత్రహింసలు పెట్టాడన్న మూడో మాజీ భార్యకాగా మలయాళ నటుడు బాలా ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో మాజీ భార్య అమృత గతేడాది అతడిపై వేధింపుల కేసు పెట్టింది. మూడో మాజీ భార్య ఎలిజబెత్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బాలా తనను చిత్రహింసలు పెట్టాడన్న విషయాన్ని వెల్లడించింది. బాలాకు విషపూరితమైన మెడిసిన్ ఇచ్చారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. అది నిజమని నిరూపించమని సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బాలా పై కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: అభిమాని అత్యుత్సాహం.. కోపంతో ఫోన్ లాక్కున్న హీరో
క్రీడలు

చెలరేగిన కివీస్ బౌలర్లు.. 236 పరుగులకే పరిమితైన బంగ్లాదేశ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా టాపర్డర్‌ను దెబ్బతీశాడు. బ్రేస్‌వెల్‌ను ఎదుర్కోలేక బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ కివీ స్టార్ స్పిన్నర్ తన 10 ఓవర్ల కోటాలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధిస్తే సెమీస్‌కు ఆర్హత సాధిస్తుంది.న్యూజిలాండ్‌తో పాటు భారత్ కూడా అధికారికంగా గ్రూపు-ఎ నుంచి సెమీస్ అడుగుపెడుతోంది. భారత్ ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోతే, పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. తమ సెమీస్ ఆశలను బంగ్లాపైనే పెట్టుకుంది. అయితే కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉండడంతో పాక్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టేట్లే కన్పిస్తోంది.చదవండి: అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్

చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి
విరాట్ కోహ్లి అంటే విరాట్ కోహ్లి(Virat Kohli)నే.. తనకు ఎవరూ సాటిలేరు.. సాటిరారు అని మరోసారి నిరూపించాడు ఈ రన్‌మెషీన్. తన పనైపోయిందన్న వారికి అద్బుత శతకంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో పోరులో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఈ సందర్భంగా కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలవడంతో పాటు.. ఈ మైలురాయి చేరుకున్న మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తనకు ఒక్క శతకం కూడా లేదన్న లోటును కూడా కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా తీర్చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 51 సెంచరీలు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 82 సెంచరీల మైలురాయిని అందుకుని.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.ఈ నేపథ్యంలో తన మ్యాచ్ విన్నింగ్స్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. చాలా అలసిపోయానుఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం.ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం’’ అని పేర్కొన్నాడు.నాకు ఇదొక క్యాచ్-22 లాంటిదిఇక బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తన బలహీనత, బలం అయిన షాట్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘కవర్ డ్రైవ్ షాట్.. నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది(ముందే వద్దని అనుకున్నా ఓ పని చేయకుండా ఉండలేకపోవడం అనే అర్థంలో). అంటే.. చాలా ఏళ్లుగా నాకు ఇది బలహీనతగా మారింది. అయితే, ఈ షాట్ కారణంగా నేను ఎన్నో పరుగులు రాబట్టాను.ఈరోజు మాత్రం ఆచితూచే ఆడాను. తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ షాట్ల ద్వారానే వచ్చినట్టు గుర్తు. అయితే, కొన్నిసార్లు రిస్క్ అని తెలిసినా సాహసం చేయకతప్పలేదు. ఏదేమైనా అలాంటి షాట్లు ఆడటం ద్వారా మ్యాచ్ నా ఆధీనంలో ఉందనే భావన కలుగుతుంది.వ్యక్తిగతంగా నాకిది ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. ఇక జట్టుకు కూడా ఇది గొప్ప విజయం’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ.. టెస్టుల్లో కోహ్లి అవుటైన తీరుపై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సమయంలో ఆఫ్ సైడ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో అతడు ఎక్కువసార్లు అవుటయ్యాడు. అయితే, తాజాగా ఆ షాట్ల గురించి కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)

అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా టోర్నీలో పాక్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ పాక్ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో 241 పరుగులకు కుప్పకూలిన పాక్.. అనంతరం బౌలింగ్‌లోనూ తేలిపోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లోనూ సౌద్ షకీల్, రిజ్వాన్, కుష్దీల్ షా మినహా మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లిపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు."తొలుత విరాట్ కోహ్లి గురుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను. అతడి హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. అతడు చాలా కష్టపడి ఈ స్దాయికి చేరుకున్నాడు. అతడు ఫామ్‌లో లేడని క్రికెట్ ప్రపంచం మొత్తం అనుకుంటుంది. కానీ ఇటువంటి పెద్ద మ్యాచ్‌లలో మాత్రం విరాట్ ఆటోమేటిక్‌గా ఫామ్‌లోకి వచ్చేస్తాడు.అతడు ఈ మ్యాచ్‌లో ఎక్కడ కూడా ఇబ్బంది పడేట్లు కన్పించలేదు. చాలా సులువగా షాట్లు ఆడాడు. అతడు మేమి పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయాలనకున్నాము. కానీ అతడు ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్నెస్ లెవల్స్‌తో పాటు హార్డ్ వర్క్‌ను ప్రశంసించాల్సిందే.అతడు మా లాంటి క్రికెటరే. కానీ మా కంటే ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వికెట్ల మధ్య ఎంతో వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడిని ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ అతడు తన అద్బుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను మా నుంచి తీసుకుపోయాడు. ఇక మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మేము నిరాశపరిచాం.అందుకే ఓడిపోయాము. అర్బర్ ఆహ్మద్ మాత్రం అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఒక్కటి మినహా ఇంకా ఏమీ మాకు సానుకూళ అంశాలు లేవు. మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రిజ్వాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’.. ఆ కోరల నుంచి తప్పించుకుని ఇలా!

IND vs PAK: ‘కావాలనే అలా చేశాడు.. లూజర్’
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది(Shaheen Afridi) అనుసరించిన వ్యూహంపై విమర్శలు వస్తున్నాయి. బౌలింగ్ పరంగా అతడి ఆటకు వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఆఖర్లో అతడు వైడ్లు వేసిన తీరు ఇందుకు కారణం. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా రిజ్వాన్ బృందం.. ఆదివారం రోహిత్ సేనను ఢీకొట్టిన విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థుల(India vs Pakistan) పోటీని చూసేందుకు భారత సినీ, క్రీడా తారలు దుబాయ్ స్టేడియానికి విచ్చేయగా.. వారికి టీమిండియా పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. టాస్ ఓడిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేసి.. దాయాదిని 241 పరుగులకు కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.36 ఓవర్లు ముగిసే సరికిఇక లక్ష్య ఛేదనలో భారత్ అలవోకగా విజయం వైపు దూసుకుపోతోంది... 36 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు సరిగ్గా 200కు చేరింది. 84 బంతుల్లో 42 పరుగులు చేయడం ఇక లాంఛనమే! సరిగ్గా ఇక్కడే అభిమానులు ఫలితం గురించి కాకుండా కోహ్లి శతకం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో విరాట్ స్కోరు 81. అంటే మరో 19 పరుగులు కావాలి.కానీ మరో వైపు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా చకచకా పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. పరుగులు తరుగుతూ పోవడంతో అటు వైపు బ్యాటర్ పరుగులు చేయరాదని, కోహ్లి సెంచరీ పూర్తి చేసుకోవాలని అంతా కోరుకున్నారు. ముందుగా అయ్యర్ 7, ఆపై పాండ్యా 8 పరుగులు చేశారు!ఇక పాండ్యా అవుటయ్యే సమయానికి కోహ్లి 86 వద్ద ఉన్నాడు. విజయానికి 19 పరుగులు కావాలి. ఈ సమయంలో అక్షర్ పటేల్ కాస్త సంయమనం పాటించాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా ఆగిపోయాడు. దాంతో కోహ్లి పని సులువైంది. గెలుపు కోసం 2 పరుగులు చేయాల్సిన స్థితిలో కోహ్లి 96 వద్ద ఉన్నాడు. తర్వాతి బంతి(42.3 ఓవర్)కి ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్ కొట్టడంతో కోహ్లి 51వ వన్డే సెంచరీ, భారత్ గెలుపు పూర్తయ్యాయి.ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడంతోఅయితే, టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ ఖుష్దిల్ వేయగా.. అంతకంటే ముందు ఓవర్లో షాహిన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. ఆ ఓవర్లో అతడు ఏకంగా మూడు వైడ్ బాల్స్ వేయడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పించింది. అప్పటిదాకా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేసిన షాహిన్.. కోహ్లి శతకానికి చేరువైన సమయంలో వైడ్స్ వేయడం విమర్శలకు తావిచ్చింది. షాహిన్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లి శతకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.లూజర్.. లూజర్ అంటూఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా లూజర్.. లూజర్ అంటూ అతడి బౌలింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటుడు పరేశ్ రావల్ కూడా స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి నుంచి నిజంగా ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్. అతడి 51వ వన్డే శతకాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. షాహిన్ ఆఫ్రిది వైడ్ బాల్స్ అనే కోరల నుంచి తప్పించుకుని సూపర్ సెంచరీ చేశాడు’’ అని బాలీవుడ్, టాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ షాహిన్ ఆఫ్రిదిని ఉద్దేశించి సెటైరికల్ ట్వీట్ చేశాడు.చదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
బిజినెస్

మస్క్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk)ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను కొనియాడుతూ.. మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''ఎలాన్ గొప్ప పని చేస్తున్నాడు, కానీ అతను మరింత దూకుడుగా ఉండటం నేను చూడాలనుకుంటున్నాను. గుర్తుంచుకోండి, మనం కాపాడుకోవాల్సిన దేశం ఉంది, ఇంతకు ముందు కంటే గొప్పగా చేయాలి" అని అన్నారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ.. ''చేస్తాను మిస్టర్ ప్రెసిడెంట్'' అని అన్నారు.డొనాల్డ్ ట్రంప్.. ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం. ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.Will do, Mr. President! pic.twitter.com/2VMS2wY7mw— Elon Musk (@elonmusk) February 22, 2025

రూ.1,655 కోట్లతో హైదరాబాద్‌లో ‘ఆమ్జెన్’ జీసీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా కంపెనీ తన జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)ని ప్రారంభించింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ‘ఆమ్జెన్’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆమ్జెన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్వే, ఆమ్జెన్ ఇండియా ఉన్నతాధికారి నవీన్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవశాస్త్ర రంగం, బయోటెక్నాలజీ, ఫారా, డేటాసైన్స్, కృత్రిమ మేథ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆమ్జెన్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ జీసీసీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.‘‘రోగుల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్జెన్కు స్వాగతం. బయోటెక్ హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆమ్జెన్ లాంటి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాది క్రితం ఆమ్జెన్తో తొలిసారి మాట్లాడామని, ఆ తరువాత అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఆమ్జెన్ కేంద్రాన్ని సందర్శించిన తరువాత హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు అంగీకరించారని ముఖ్యమంత్రి వివరించారు. ఆమ్జెన్ లాంటి కంపెనీలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ స్థూల జాతీయోత్పత్తిని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.అంతకుమునుపు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆమ్జెన్ జీసీసీ కేంద్రం ఏర్పాటు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మాత్రమే పరిమితం కారాదని, ఆకాంక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లోని పరిశోధన సంస్థలు, యూనివర్శిటీలతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.‘‘ఆమ్జెన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తూండటం తెలంగాణ సామర్థ్యాన్ని మరింత పెంచేది.. మరిన్ని అవకాశాలను కల్పించేది. అలాగే బయోటెక్, టెక్నాలజీ రంగాలు రెండింటిలోనూ అత్యద్భుత ఆవిష్కరణలకు వీలు కల్పించేది’’ అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.అంతర్జాతీయ కంపెనీలకు అనువైన సిబ్బందిని తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా రేపటి తరం ఫార్మా ఉద్యోగుల తయారీకి తగిన శిక్షణ కార్యక్రమాలను తయారు చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను అందించడం, అప్‌స్కిల్లింగ్ కూడా చేపట్టాలని సూచించారు. ఆమ్జెన్ పెద్ద ఎత్తున చేపట్టిన పరిశోధనలు వ్యక్తిగత వైద్యాన్ని మనిషికి మరింత దగ్గర చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.‘‘తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షలకు ఆమ్జెన్ ఇండియా ఒక నిదర్శనం. అలాగే ప్రపంచ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాల దిశగా పడిన మరో ముందడుగు. భారత్‌లోని ప్రపంచస్థాయి బయోటెక్ ఎకోసిస్టమ్‌కు మా వంతు తోడ్పాటు అందించేందుకు మేము సిద్ధం. అలాగే భారత నైపుణ్యానికీ స్వాగతం పలుకుతున్నాం.’’ అని ఆమ్జెన్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ ఛటోపాధ్యాయ అన్నారు. 200 మి.డాలర్ల పెట్టుబడి..ఆమ్జెన్ హైదరాబాద్ జీసీసీ కోసం 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని.. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ బ్రాడ్వే తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 మంది పని చేస్తూండగా.. మరో 300 మంది చేరబోతున్నారని, ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్య రెండు వేలకుపైబడి ఉంటుందని ఆయన వివరించారు. 1980లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఆమ్జెన్ ప్రస్తుతం వంద దేశాలకు విస్తరించింది, మొత్తం 28 వేల మంది ఇందులో పని చేస్తున్నారని రాబర్ట్ తెలిపారు. బయోటెక్‌తోపాటు అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీలు, ఏఐల సాయంతో ఎన్నో వ్యాధులకు మెరుగైన మందులను సృష్టించి తయార చేశామని, సుమారు 36 ఉత్పత్తులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. తాజాగా అరుదైన వ్యాధులకు మందులు కనుక్కునే ప్రయత్నాలూ మొదలుపెట్టామని, హైదరాబాద్ కేంద్రం ఇందుకు ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు.

బీఎండబ్ల్యూ స్టైలిష్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ.. 'బీఎండబ్ల్యూ మోటోరాడ్' కంపెనీ దేశీయ మార్కెట్లో 'ఎఫ్ 450 జీఎస్'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. 2024 ఈఐసీఎమ్ఏ ఎడిషన్‌లో కనిపించిన ఈ బైక్ 2025 చివరి నాటికి రోడ్డు మీదకి రానుంది.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్.. బైక్ 450 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-షాక్ అబ్జార్బర్ వంటివి ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్.. డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెటప్ కలిగి ఉండి, మధ్యలో GS బ్యాడ్జింగ్ పొందుతుంది. 6.5 ఇంచెస్ TFT డిస్ప్లే, క్రాస్-స్పోక్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 175 కేజీల బరువున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?

తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని అభ్యర్థన
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవల తొలగించిన కొందరు శాస్త్రవేత్తలను తమ స్థానాల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతోంది. మాదకద్రవ్యాలు, ఆహార భద్రత, వైద్య పరికరాలు, పొగాకు ఉత్పత్తులను సమీక్షించే ఏజెన్సీలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయా విభాగాల్లో కొంత మందికి లేఆఫ్స్ ప్రకటించారు. అయితే అందులో తిరిగి 300 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరుతోంది.న్యూరాలింక్లోకి శాస్త్రవేత్తలుఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్‌ను సమీక్షించడంలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు ఈ రీహైరింగ్ ప్రయత్నాల్లో భాగంగా తిరిగి సంస్థలో పని చేయబోతున్నట్లు తెలిసింది. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలన్న న్యూరాలింక్ అభ్యర్థనను గతంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎప్డీఏ తిరస్కరించింది. కానీ తర్వాత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజులకు శాస్త్రవేత్తల ఆకస్మిక తొలగింపు నిర్ణయం వెలువడింది. తాజాగా తిరిగి వీరు విధుల్లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రభావం ఇలా..ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ టెక్నాలజీతో మానవుల ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది. మెదడులో చిప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాల వ్యాధులు, పక్షవాతం బాదితులతో సమర్థంగా కమ్యునికేట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విప్లవాత్మక మార్పులో భాగంగా మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూరాలింక్ పనితీరును సమీక్షిస్తున్న శాస్త్రవేత్తలను తిరిగి నియమించాలన్న ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ టెక్నాలజీ పురోగతికి ఆటంకాలు లేకుండా చేసినట్లయింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపుఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజారోగ్యం, భద్రత మిషన్‌లో పని చేసేవారని ఎఫ్‌డీఏ తెలిపింది. వారిని తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. వారివల్ల అమెరికన్ రోగులకు సాయపడే వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. గతంలో అణ్వాయుధ కార్యక్రమాలను, బర్డ్ ఫ్లూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి బాధ్యత వహించిన ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. వీరిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయా ఏజెన్సీలు కోరుతున్నాయి.
ఫ్యామిలీ

దేవభూమిలో వేసవి విహారం..!
హిమాలయ పర్వత శ్రేణులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. హిల్ స్టేషన్ల రాష్ట్రం అనడం కంటే దీనిని హిల్‌స్టేట్ అనడమే కరెక్ట్. మబ్బులు... అన్ని చోట్లా నేలకు నింగికి మధ్యలో పర్యటిస్తుంటాయి. ఇక్కడ మాత్రం... నేల మీదకు దిగి పర్యాటకుల్ని పలకరిస్తుంటాయి. అందుకే దీనిని దేవభూమి అంటారు... ఓసారి వెళ్లి చూసొద్దాం...అడ్వెంచరస్ ఔలిఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏడాదంతా మంచు దుప్పటి కప్పుకునే ప్రదేశం ఔలి. పదివేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది సాహసక్రీడల వేదిక. మంచు మీద స్కీయింగ్ చేయడానికి మనదేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రదేశం ఇది. ఔలి ఎక్కడుంది అని చె΄్పాలంటే దగ్గరలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాన్ని చెప్పాలి. జోషిమఠ్‌కు ఏడు కిలోమీటర్ల దూరాన ఉంది. ఔలి నుంచి హిమాలయ శిఖరాలను చూడవచ్చు. మబ్బుల మధ్య కేబుల్ కార్జోషిమఠ్ నుంచి ఔలికి కేబుల్ కార్లో వెళ్లాలి. నేల మీద విస్తరించిన తెల్లటి మంచు, మంచును చీల్చుకుని ఎదిగిన చెట్లను తాకుతూ మంద్రంగా కదులుతున్న మబ్బుల మధ్య సాగుతుంది విçహారం. ప్రభుత్వ రిసార్టులు, గెస్ట్ హౌస్‌లలో బస చేయడం మంచిది.ఐఏఎస్ బడి ముస్సోరీ..ముస్సోరీ... ఐఏఎస్‌లకు పాఠాలు చెప్తుంది. వింటర్ స్పోర్ట్స్ ఆడిస్తుంది. వేసవిలో చల్లగా అలరిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంది ముస్సోరీ పట్టణం. ఢిల్లీ నుంచి ముస్సోరీకి డెహ్రాడూన్ మీదుగానే వెళ్లాలి. ఇది ఆ రాష్ట్ర శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్ నుంచి 35 కిమీల దూరం.ముస్సోరీ పట్టణానికి చేరడానికి ముందే ముస్సోరీ లేక్ పలకరిస్తుంది. కొండల మీద సరస్సును ఆసక్తిగా చూసి ఒక ఫొటో తీసుకుని ముందుకు సాగాలి. ఈ పట్టణం అంతా కొండవాలులోనే ఉంటుంది. మాల్‌రోడ్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... లైబ్రరీ రోడ్... ఇలా ప్రదేశాల పేర్లన్నీ రోడ్లే. ఇక్కడ హ్యాపీవ్యాలీ కనిపించేటట్లు రోడ్ మీదనే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ మరొక ఫొటో తీసుకుని ముందుకెళ్లడమే. రోప్ వే లో ముస్సోరీ పట్టణం ఏరియల్ వ్యూ చూస్తూ గన్హిల్కి చేరాలి. ఆకాశం నిర్మలంగా ఉంటే ఇక్కడ నుంచి హిమాలయాలు కనిపిస్తాయి. కెంప్టీ వాటర్ ఫాల్, ఝరిపానీ జలపాతం, లాల్తిబ్బ, లాండౌర్లను చుట్టేసిన తర్వాత ఐఏఎస్‌లకు శిక్షణనిచ్చే (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) అకాడమీ తప్పకుండా చూడాలి. మౌంటనియరింగ్ ట్రైనింగ్ అకాడెమీ, దిగంతాల్లో కనిపించే యమునానదిని చూస్తూ తిరుగుప్రయాణం కొనసాగించాలి.సంస్కృతంలో పాలించే నైనితాల్..నైనితాల్... మహాపర్వతాలు, వాటి మధ్య విశాలమైన చెరువులు, వాటి తీరాన నివాస ప్రదేశాలు... ఇదీ నైనితాల్ భౌగోళిక స్వరూపం. నైనితాల్ ఆ రాష్ట్రానికి న్యాయ రాజధాని. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది తెలుసా! హిందీతోపాటు సంస్కృతం కూడా అధికారిక భాష. నైనితాల్ జిల్లా కేంద్రం నైనితాల్ పట్టణం. తాల్ అనే పదానికి అర్థం కూడా సరస్సు లేదా చెరువు అని. దీని చుట్టు పక్కల సాత్తాల్, భీమ్తాల్, నౌకుచియాతాల్ ఉన్నాయి. అందుకే దీనిని లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ టూర్లో వరుసగా అన్నింటినీ కవర్ చేయవచ్చు. ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు. బ్రిటిష్ పాలకులు తాము నివసించడానికి అనువైన ప్రదేశాలను వెతుకుతూ ఈ చెరువు తీరాన అధికారిక నివాసాలను కట్టుకున్నారు. వాటిని కూడా ఈ టూర్లో చూడవచ్చు. అల్మోరా కూడా నైనితాల్‌కు దగ్గరలోనే ఉంది. అల్మోరాలో రామకృష్ణ కుటీరం ఉంది. స్వామి వివేకానందుడు కొంతకాలం ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు. మనం మబ్బులను చూడాలంటే తల పైకెత్తాలి, కానీ ఇక్కడ తల దించి చూడాలి. మన పర్యటన మబ్బులకు పైన సాగుతుంటుంది.నాటి రాణివాసం రాణికేత్..ఈ ప్రదేశం సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉంది. రాణికేత్... అల్మోరా పట్టణానికి దగ్గరలో ఉంది. ఇక్కడ జనావాసం కంటే మిలటరీ శిక్షణ కార్యకలాపాలే ఎక్కువ. అందమైన ప్రదేశం అని చెప్పడం అంటే ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తక్కువ చేయడమే. పదాలకందనంతటి మహోన్నతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన కాత్యూరి పాలకుడు సుధార్దేవ్ సతీమణి రాణి పద్మిని ఇక్కడ నివసించేదని, రాణి నివాసం చుట్టూ ఉన్న ప్రదేశానికి రాణీకేత్ (రాణిగారి భూములు) అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ ప్రదేశం కొంతకాలం నేపాల్ రాజుల పాలనలో ఉండేది. బ్రిటిష్ పిలకులు స్వాధీనం చేసుకోవడంతో భారత్‌లో భాగమైంది. నేపాల్ సంస్కృతి కనిపిస్తుంది. రాణి నివాసం మాత్రం కనిపించదు.బహుగుణ పుట్టిన తెహ్రీ..తెహ్రీ పేరు విన్న వెంటనే గుర్తు రాదు, కానీ ఇది మనకు తెలిసిన ప్రదేశమే. తెహ్రీ డ్యామ్ పేరు తెలిసిందే. పర్యావరణ ΄ోరాటయోధుడు సుందర్‌లాల్ బహుగుణ పుట్టిన ఊరు, చి΄్కో ఉద్యమం చేసిన ప్రదేశం ఇది. ఇప్పుడు మనకు కనిపించేది కొత్త తెహ్రీ పట్టణం. అసలు జనావాసం డ్యామ్ నిర్మాణంలో మునిగిపోయింది. భాగీరథి, భిలాంగ్న నదుల కలయిక ఈ ప్రదేశం. ఈ నదులు ఆ తర్వాత గంగ, యమున నదులతో సంగమిస్తాయి.కవుల స్ఫూర్తి చమోలిచమోలి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో సౌకర్యాలు బాగానే ఉంటాయి. అనేక పుణ్యతీర్థాలకు, ప్రకృతి సౌందర్యక్షేత్రాలకు కేంద్రం వంటిది. బదరీనాథ్, కేదార్నాథ్, కర్ణ ప్రయాగ, నంద రయాగ, విష్ణుప్రయాగలు ఇదే రూట్లో కలుస్తాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ తో΄పాటు మన దేశపు ఉత్తరభాగాన చివరి గ్రామం మాణా వరకు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కవులు వచ్చేవారని చెబుతారు. కాళిదాసు వంటి మహాకవుల రచనల్లో ప్రతిబింబించిన వర్ణన ఇక్కడి ప్రకృతి దృశ్యాల ప్రభావమే.ప్రశాంత మున్సియారీఈ ప్రదేశం7, 217 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయ పర్వత శ్రేణులు మధ్యలో విస్తరించిన భూభాగం. ఇక్కడ నిలబడి ఎటు వైపు చూసినా హిమాలయాలే కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలను అదృష్టవంతులనవచ్చా లేక స్థితప్రజ్ఞత సాధించిన తాత్వికవాదులనవచ్చా అనేది అర్థం కాదు. ముఖాల్లో ప్రసన్నత తాండవిస్తుంటుంది. జీవితాన్ని ప్రశాంతంగా గడపడం, సంతృప్తిగా జీవించడం ఎలాగో తెలిసిన వాళ్లు. వాతావరణాన్ని బట్టి పంటలు పండించుకోవడం, ఆవులు, గేదెలను పోషించుకుంటూ ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారు. పరుగులు ఉండవు, అసంతృప్తి ఉండదు, ఆవేదన కనిపించదు. జీవితం విలువ తెలిసిన వాళ్లు, జీవించడం తెలిసిన వాళ్లు అని చెప్పవచ్చు.కిలకిలరవాల ముక్తేశ్వర్..ఇది నైనితాల్ జిల్లాలో చిన్న గ్రామం. 7,500 అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల్లోని కుమావ్ పర్వతశ్రేణిలో ఉంది. (ఢిల్లీ నుంచి 343 కిమీలు). ఇక్కడ ముక్తేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివుడిని దర్శించుకోవడంతో సరిపెట్టుకోకూడదు. దగ్గరలో ఉన్న రుద్రధారి జలపాతాన్ని చూడాలి. రంగురంగుల పక్షులను, మృదువైన కువకులను ఆస్వాదించాలి. వాహనాన్ని ఆపి ఇంజన్ శబ్దం లేకుండా నిశ్శబ్దంలో వినిపించే పిట్టల రెక్కల టపటపలను, సన్నని తీయగా సాగే రాగాల మాధుర్యాన్ని ఆలకించాలి. ఈ అవకాశం నగరంలో దొరకదు. అలాగే 20 కి.మీల దూరాన ఉన్న ఐవీఆర్ఐ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)ని చూడాలి.భానుడి విన్యాసాల చక్రత..ఇది డెహ్రాడూన్ నుంచి వందకిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపిస్తాయి. ఎండాకాలంలో హిమాలయాల వీక్షణంలో దాగిన అద్భుతం ఏమిటంటే... ఒక పర్వతశిఖరం సూర్యుడి కిరణాలు నేరుగా పడుతూ ఎర్రగా ప్రజ్వరిల్లుతున్నట్లు ఉంటుంది. దాని పక్కనే మరొక శిఖరం పక్క శిఖరం నీడ పడి ఇంకా సూర్యోదయాన్ని చూడలేదన్నట్లే కనిపిస్తుంది. సూర్యాస్తమయం సమయంలోనూ ఇలాంటి అద్భుతాలను ఆస్వాదించవచ్చు. వేసవిలో టైగర్ ఫాల్స్ జలపాతం జల్లును ఆస్వాదించవచ్చు. డెహ్రాడూన్ వంటి నగరాల్లో హోటల్ రూమ్ అద్దెతో పోలిస్తే ఇక్కడ అద్దెలు తక్కువ. వెకేషన్‌ని ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయవచ్చు.హానిమూన్ ధనౌల్టీ..ఇది ఇటీవల పర్యాటక రంగం కొత్తగా అభివృద్ధి చేసిన ప్రదేశం. ముస్సోరీ పట్టణం జన సమ్మర్థం అధికం కావడంతో అది టూరిస్ట్ ప్లేస్‌కి పరిమితమైంది. వెకేషన్ కోసం పర్యాటకుల ప్రయాణం ధనౌల్టీ వైపు సాగుతోంది. ముఖ్యంగా హనీమూన్ జంటలకు ఇది బెస్ట్ వెకేషన్. ఢిల్లీ నుంచి 325 కి.మీ.ల దూరం. కారులో తొమ్మిద గంటల ప్రయాణం. ఈ టూర్లో ఢిల్లీ నగరం వదిలి, ఉత్తర ప్రదేశ్ భూభాగాన్ని దాటినప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించిన ఆనవాళ్లు పచ్చదనంతో స్వాగతం పలుకుతాయి. తమిళనాడు దాటి కేరళలో అడుగుపెట్టినప్పుడు కనిపించేటంతటి స్పష్టమైన మార్పును ఇక్కడా చూడవచ్చు. పచ్చదనాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రకృతి కొంత ప్రదేశాన్ని జీవితకాలపు లీజుకు తీసుకున్నట్లు ఉంటాయి ఈ ప్రదేశాలన్నీ. అందుకే ఈ రెండూ దేవుడి రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.ప్యాకేజ్‌లిలా...డెహ్రాడూన్ నుంచి ఔలి మూడు రోజుల టూర్ ప్యాకేజ్ ఒక్కొక్కరికి 32 వేలవుతుంది. ఇందులో డెహ్రాడూన్ – ఔలి రెండువైపులా హెలికాప్టర్ జర్నీ, రెండు రోజులు లగ్జరీ హోటల్లో బస ఉంటాయి. హెలికాప్టర్ రైడ్‌లో హిమాలయాల శిఖరాలను చూడవచ్చు. ఔలిలో స్నో స్పోర్ట్స్ స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో స్లెడ్జింగ్, స్నో ట్యూబింగ్, స్నో బైకింగ్ చేయవచ్చు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్‌లు కూడా సౌకర్యంగా ఉంటాయి. హిల్ స్టేషన్ ప్యాకేజ్‌లు 15 వేల నుంచి 35 వేల వరకు ఉన్నాయి. హనీమూన్ కపుల్ ప్యాకేజ్‌లు, ఏడెనిమిది మంది బృందం వెళ్లాలన్నా అందుకు తగిన ప్యాకేజ్‌లున్నాయి. రైలు ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఎదురైతే గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఉంటుంది. ఫోన్ లేదా ఈ మెయిల్లో సంప్రదించవచ్చు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ పాట్లు..! ఈసారి ఏకంగా..)

ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్‌ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్‌వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ భోజ్‌పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.!

మన గుడి... మన ఉత్సవం: వీరభద్రా... శరణు
గిరిజనులు, గిరజనేతరులు ఉమ్మడిగా కొలిచే దేవుడు కురవి వీరభద్రుడు. వీరన్నా అని శరణు కోరితే కోరికలు నెరవేరతాయని, గండాలు తొల గుతాయని, భూతపిశాచాలు వదులుతాయనీ విశ్వాసం.. ఇక్కడ పూజలు, భక్తుల మొక్కులు చెల్లించడం, వాటిని నెరవేర్చేందుకు చేసే పూజలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రతిఏటా శివరాత్రి నుంచి మొదలుకొని మూడు నెలలపాటు జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు..శైవాగమం...శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదిశైవులు శైవాగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం సంపూర్ణాభిషేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. అన్నపూజా కార్యక్రమం...ప్రతి దేవాలయంలో శివుడికి నైవేద్యం, పండ్లు పెడతారు. కానీ ఇక్కడ పెరుగు, అన్నం కలిపి శివలింగానికి అలంకరణ చేస్తారు. ఇలా చేస్తే వీరభద్రుని కొలిచే భక్తులకు బాగా పంటలు పండుతాయని, అన్నం లోటు లేకుండా చూస్తాడని నమ్మకం. కరువు కాటకాలు వచ్చిన సందర్భాల్లో కూడా కురవి వీరభద్రుని భక్తులు ఏనాడు ఇబ్బందులు పడలేదని, అంతావీరన్న మహిమ అంటారు భక్తులు.భద్రకాళికి బోనం... కోరిన కోర్కెలు తీరడంతో వీరభద్ర స్వామికి ఉపవాసాలు, నియమాలతో పూజలు నిర్వహించిన భక్తులు.. స్వామివారి పూజ ముగియగానే పక్కనే ఉన్న భద్రకాళీ అమ్మవారికి బోనాలను సమర్పించుకుని నైవేద్యం పెడతారు. అలాగే ఏటపోతులు, కోళ్లను బలి ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు. పొర్లుదండాలు, పానసారం...పిల్లలు లేనివారు సంతాన్రపాప్తి కోసం స్నానం చేసి తడిదుస్తులతో ఆలయ ఆవరణలో పానసారం పట్టి స్వామివారిని వేడుకుంటారు. అలాగే పొర్లుదండాలు పెట్టడం, భూత పిశాచాలు పట్టిన వారు, అనారోగ్యానికి గురైన వారు సైతం తడిబట్టలతో పానసారం పట్టి, ధ్వజస్తంభం ఎక్కించి కట్టివేస్తారు. కోరమీసం పెడితే గౌరవం...కోరమీసం సమర్పిస్తే గౌరవం, అధికారం కల్గుతుందనేది నానుడి. అందుకోసమే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు, ఉద్యోగ దరఖాస్తు చేసేటప్పుడు. వ్యాపారులు తమ వ్యాపారప్రారంభించేటప్పుడు, విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు చేసే ప్రయత్నానికి ముందు.. కురవి వీరభద్రునికి కోరమీసం సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరికలు తీరగానే బంగారం లేదా వెండితో కోరమీసాల ఆకృతి తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల వివరాలు ఫిబ్రవరి 25, మంగళవారంఉదయం 9–00 గంటలకు పసుపు కుంకుమలు. ఆలయ పూజారి ఇంటినుంచి పసుపు కుంకుమలు రావడంతో జాతర పనుల ఆరంభం. సా. గం. 7కు గణపతిపూజ, పుణ్యాహవచనం పంచగవ్య్రపాశన, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణం. రాత్రి 10 గంటలకు బసవముద్ద.26 బుధవారం మహాశివరాత్రి. ఉదయం 4–00ల నుండి స్వామివారి దర్శనం. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 వరకు పూర్ణాభిషేకం, సాయంత్రం 4 నుండి శ్రీ స్వామివారు అలంకారంతో దర్శనం, పాదాభిషేకం, శివాలయంలో ఉదయం 5 నుంచి, రాత్రి 12 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకాలు. సాయంత్రం 7కు గ్రామసేవ, ఎదురుకోలు. రాత్రి గం 12–30కు శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం27 గురువారం, 28 శుక్రవారం నిత్యం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ.. సాయంత్రం 6 గంటలకు హోమం, సేవలు, గ్రామసేవమార్చి 1, శనివారం ఉదయం 6 నుంచి 12వరకు అభిషేకాలు సాయంత్రం 6–30 గంటలకు తెప్పొత్సవం (కురవి పెద్ద చెఱువు నందు)3, సోమవారం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, మంగళవారం ఉదయం 10–30కు పూర్ణాహుతి. సాయంత్రం 4గంటలకు బండ్లు తిరుగుట, పారువేట. రాత్రి 10–00 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద. – ఈరగాని భిక్షం సాక్షి, మహబూబాబాద్/కురవి

శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ ఛాయా సోమేశ్వరాలయం
చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఓం నమఃశివాయ స్మరణతో మారుమోగే అద్భుత దేవాలయమే శ్రీ ఛాయా సోమేశ్వరాలయం. సోమవారం వచ్చిందంటే భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం అద్భుత నిర్మాణ శైలికి నిలయం. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ పట్టణానికి సమీపంలోని పానగల్ వద్ద ఉన్న ఛాయా సోమేశ్వరాలయం శివరాత్రి సందర్భంగా మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.ఎక్కడైనా సూర్యకాంతి, విద్యుత్తు దీపాల వెలుతురులో ఏర్పడే ఛాయ (నీడ) గమనాన్ని బట్టి మారడం సహజం. కానీ ఇక్కడ శివలింగంపై పడే ఛాయ సూర్యుని గమనంతో సంబంధం లేకుండా స్తంభాకారంలో నిశ్చలంగా ఉండటం విశేషం. సూర్యరశ్మితో సంబంధం లేకుండా, వర్షం పడినా, ఆకాశం మేఘావృతమైనా ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నివేళలా ఒకేలా ఉంటుంది. అందుకే ఇది ఛాయా సోమేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. రాజసం ఉట్టిపడే అద్భుత శిల్ప కళాసంపద, కాకతీయుల నాటి శిల్ప కళారీతులు శ్రీఛాయాసోమేశ్వర స్వామి సొంతం. ఈ ఆలయంలోని ఎంతో విశేషమైన బ్రహ్మసూత్ర లింగాన్ని భక్తులే స్వయంగా అభిషేకించడం మరోప్రత్యేకత. ఆ శివలింగాన్ని ఒక్కసారి తాకితే వేయి లింగాలను దర్శించిన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.వెయ్యేళ్ల కిందటి అద్భుత కట్టడం...భారతీయ వాస్తు, శిల్పకళా చాతుర్యంలో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం›చేసి ఆలనాటి కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పానగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల సామంత రాజులైన కుందూరు చాళుక్య రాజు ఉదయ భానుడు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తమ ఆరాధ్యదైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో దీంతో పాటు సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం కూడా నిర్మించారు. శివలింగం చుట్టూ పచ్చని వజ్రాలను పొదగడంతో ఆలయం అంతా పచ్చని వెలుతురు వెదజల్లేదని చెబుతారు.మూడు గర్భాలయాలు...చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయంలో మూడు గర్భగుడులు ఉంటాయి. అందుకే దీనిని త్రికూటాలయంగా పేర్కొంటారు. మరోవైపు ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. స్తంభాలపై రామాయణ, మహాభారతాలు...గుడి ఆవరణ మొత్తం 18 స్తంభాలతో ఉంటుంది. అందులో పడమరన ఉన్న సోమేశ్వరుడి ఆలయం ముందు 8 స్తంభాలు ఉంటాయి. వాటిల్లో ఏ స్తంభం నీడ శివలింగంపై పడుతుందన్నది ఇక్కడి రహస్యం. మరోవైపు ఆయా స్తంభాలపై రామాయణ, మహాభారతాలు విగ్రహ రూపంలో ఉండటం విశేషం. నాలుగు స్తంభాలపై ఉండే మండపం పైభాగంలో అష్టదిక్పాలకులు, మూడు గర్భ గుడుల ముందు గజలక్ష్మి కొలువై ఉంటుంది. అయితే సూర్యభగవానుడి భార్య ఛాయాదేవి పరమ శివుని ప్రార్థించి శివుని వరంతో ఛాయగా ఉన్నట్లు భావిస్తారు.ప్రతి సోమవారం, పర్వదినాల్లో ప్రత్యేక పూజలుఆలయంలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు కొనసాగుతాయి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు చేస్తారు. తొలి ఏకాదశితో పాటు నిత్యాభిషేకాలు, కార్తీక పౌర్ణమి, దసరా, మహాశివరాత్రి, ఉగాది వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రోజుల్లోనూ విశేషంగా భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా యజ్ఞాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, శివ పార్వతీ కళ్యాణం, అగ్నిగుండాలు, తెప్పొత్సవాలను నిర్వహిస్తారు.ఉదయ సముద్రం నీరే కోనేరులోకి పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులోని నీరే కోనేరులోకి రావడం ఇక్కడ విశేషం. దానికి ప్రత్యేకంగా పాయ అంటూ లేకపోయినా నీరు కోనేరులోకి రావడం ప్రత్యేకత. ఇప్పటికీ నీటి తడి (చెమ్మ) శివలింగం ఉన్న గర్భగుడిలో ఉంటుంది. – ప్రధాన అర్చకుడు ఉదయ్‌కుమార్.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ
National View all

వివాదంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా?
ఢిల్లీ : సీఎం రేఖా గుప్తా (Delhi cm Rekha Gupt

Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి..

New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం
కర్నాటక ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మహిళలకు నెలకు రూ.2500.. ఢిల్లీ సీఎం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి

Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి,
International View all

యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్‌లు..పాక్ ఇంటెలిజెన్స్ వార్నింగ్
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు సంబంధ

13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది.

Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుత

ట్రంప్ సంచలనం.. రెండు వేల మంది ఉద్యోగులు అవుట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెం
NRI View all

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద

మాట నూతన కార్యవర్గం ఏర్పాటు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్-మాట బోర్డు మీటింగ్ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్

గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్
క్రైమ్

Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లిలకి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలిçంచగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు.

వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
సికింద్రాబాద్: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాదౌర గ్రామానికి చెందిన నీలేశ్ సింగ్ (25) తన సోదరుడు ముఖేశ్ సింగ్ ఇతర స్నేహితులతో కలిసి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. మేడ్చల్ ప్రాంతంలో ఉంటూ రాయల్‌పూర్ క్వారీలో టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలో వీరందరి పని పూర్తవడంతో కడపలోని క్వారీలో పని చూసుకున్నారు. æకడపకు వెళ్లేందుకు నీలేశ్ తన సోదరుడు ముఖేష్, మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ తీసుకున్న వారంతా రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో కూర్చున్నారు. అదే సమయంలో తన పాకెట్లోంచి సెల్‌ఫోన్, పర్సు తీసిన నీలేశ్ తన బ్యాగులో పెట్టి ఇప్పుడే వస్తానని సోదరుడికి చెప్పి బయటకు వెళ్లాడు. రైలు వచ్చే సమయం అవుతున్నా నీలేశ్ రాకపోవడంతో అతడి సోదరుడు, మిత్రులు స్టేషన్ అంతటా గాలించినా ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ యార్డు సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్ డిప్యూటీ మేనేజర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో నీలేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఇదిలా ఉండగా ఇటీవలే నీలేశ్‌కు వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాలతో నెల రోజుల కాపురం అనంతరం వారిద్దరు విడిపోయారని మృతుడి సోదరుడు ముఖేష్ పోలీసులకు వివరించాడు. అప్పటి నుంచి నీలేశ్ ముభావంగా ఉంటన్నాడని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నీలేష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది.

పీఈటీ కొట్టారని విద్యార్థి ఆత్మహత్య
ఉప్పల్ (హైదరాబాద్): నగరంలోని ఓ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పీఈటీ కొట్టడమే కాకుండా తోటి విద్యార్థుల ముందు అవమానించాడంటూ ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ భవనం నాల్గో అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం పొందిన ఘటన శనివారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సిద్ద హంగిర్గా గ్రామానికి చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగారెడ్డి, చిన్న కుమారుడు సంగారెడ్డి(14). వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్ పరిధిలోని ద్వారకా నగర్లో నివాసముంటోంది. తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. సంగారెడ్డి.. ఉప్పల్‌లోని న్యూ భరత్‌నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ సమయంలో సంగారెడ్డి స్కూల్లో సీసీ కెమెరాలను కదిలించాడంటూ క్లాస్ టీచర్.. పీఈటీ ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంజనేయులు కొట్టడంతోపాటు మందలించారు. శనివారం ఉదయాన్నే స్కూల్‌కు వచి్చన సంగారెడ్డిని పీఈటీ పనిష్మెంట్ పేరిట మరోసారి తరగతి గదిలో కొట్టడంతోపాటు అరగంటపాటు నిలబెట్టారు. తల్లిదండ్రులను పిలిపిస్తానని, టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరించారు. తోటి విద్యార్థుల ముందు దీన్ని అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన నోట్ బుక్‌లో ‘సారీ మదర్– ఐ విల్ డై టుడే’అని రాసి వాష్‌రూంకు వెళ్తున్నానని చెప్పి తరగతి బయటకు వచ్చాడు. వస్తూ వస్తూ స్నేహితులకు బైబై అని చెప్పాడు. మూడవ అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి నాల్గో అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి సంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం, పీఈటీ ఆంజనేయులు, క్లాస్ టీచర్‌పై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ డీఈవో పాఠశాలను సీజ్ చేశారు. కన్నీరు మున్నీరైన తల్లి ‘ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నా. ఎంతకష్టమొచి్చనా ఫీజును ఆపే వాళ్లం కాదు. నా కొడుకు ఏ పాపం చేశాడని చంపేశారు? అంటూ సంగారెడ్డి తల్లి కన్నీరు మున్నీరైంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ ఆవరణలో కూర్చుని రోదించడం స్థానికులను కలచివేసింది.