Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India will now use the water for is own interests PM Modi1
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్‌ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

Uday Kotak Buys Rs 400 Crore Mumbai Sea Facing Property2
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

IPL 2025: Mumbai Indians Vs Gujarat Titans Live Updates And Highlights3
MI VS GT Live Updates: .. వర్షం కారణంగా మ్యాచ్‌కు మరోసారి అంతరాయం.. లక్ష్యానికి చేరువగా గుజరాత్‌

మ్యాచ్‌ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.తిరిగి మొదలైన మ్యాచ్‌.. లక్ష్యానికి చేరువగా గుజరాత్‌14 ఓవర్ల తర్వాత వర్షం​ పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్‌ మళ్లీ మొదలైంది.గుజరాత్‌ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం​ ఆ జట్టు స్కోర్‌ 107/2గా ఉంది. గిల్‌ 8, రూథర్‌ఫోర్డ్‌ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయంవర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్‌ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి. 14 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 107/214 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 107/2గా ఉంది. గిల్‌ 8, రూథర్‌ఫోర్డ్‌ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌11.3వ ఓవర్‌- 78 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అశ్వనీ కుమార్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (30) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 68/110 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 68/1గా ఉంది. గిల్‌ 28, బట్లర్‌ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్‌ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 29/1156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్‌ కోల్పోవడంతో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 29/1గా ఉంది. గిల్‌ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్‌ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌1.2వ ఓవర్‌- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 6 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికల్టెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (5) ఔటయ్యాడు. సత్తా చాటిన గుజరాత్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబైటాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన గుజరాత్‌ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్‌ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్‌ బౌలర్లలో సాయికిషోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ తలో వికెట్‌ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్‌ జాక్స్‌ (53), సూర్యకుమార్‌ యాదవ్‌ (35), కార్బిన్‌ బాష్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్‌ బ్యాట్‌ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్‌ కూడా సాధించలేకపోయేది. ఏడో వికెట్‌ కోల్పోయిన ముంబై16.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి నమన్‌ ధిర్‌ (7) ఔటయ్యాడు.ఆరో వికెట్‌ కోల్పోయిన ముంబై13.5వ ఓవర్‌- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్‌ కోల్పోయింది. గెరాల్డ్‌ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి తిలక్‌ వర్మ (7) ఔటయ్యాడు. కష్టాల్లో ముంబై ఇండియన్స్‌12.3వ ఓవర్‌- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి హార్దిక్‌ పాండ్యా (1) ఔటయ్యాడు. నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై11.4వ ఓవర్‌- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్‌ జాక్స్‌ (53) ఔటయ్యాడు. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో సాయి సుదర్శన్‌ క్యాచ్‌ పట్టాడు. మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై10.4వ ఓవర్‌- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సాయి కిషోర్‌ బౌలింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (35) ఔటయ్యాడు.10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 89/210 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 89/2గా ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34), విల్‌ జాక్స్‌ (45) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 56/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 56/2గా ఉంది. విల్‌ జాక్స్‌ 30, సూర్యకుమార్‌ యాదవ్‌ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్‌ లభించాయి. సాయి సుదర్శన్‌, సిరాజ్‌ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌3.3వ ఓవర్‌- ముంబై ఇండియన్స్‌ 26 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ (7) ఔటయ్యాడు. రెండో బంతికే వికెట్‌ తీసిన సిరాజ్‌టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్‌ బౌలింగ్‌లో సాయి సుద​ర్శన్‌ అద్బుతమైన క్యాచ్‌ పట్టడంతో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (2) ఔటయ్యాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం గుజరాత్‌ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్‌ తరఫున వాషింగ్టన్‌ సుందర​్‌ స్థానంలో అర్షద్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్

Sakshi Guest Column On India Pakistan Issues4
ఇది ఐక్యతా సమయం

గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్‌లో నోటిఫికేషన్‌ పింగ్‌ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్‌లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్‌ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్‌ డిగ్రీని సాధించాడు. ఇన్‌ స్టిట్యూట్‌ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్‌ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్‌ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్‌లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్‌ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్‌ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ శ్యామ్‌ మానెక్‌ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్‌ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్‌ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్‌ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్‌ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్‌ 7 – లోక్‌ కల్యాణ్‌ మార్గ్, నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్‌. జనరల్‌ నార్మన్‌ స్క్వార్జ్‌కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్‌ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్‌ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్‌ సిక్స్‌త్‌ ఫ్లీట్‌ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్‌ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్‌ స్ట్రోక్‌ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్‌ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్‌ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్‌ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్‌ యూనియన్‌ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి వ్యాఖ్యలు బీజింగ్‌ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్‌ లేదా పాకిస్థాన్‌ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్‌ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్‌ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్‌ దాడి పట్ల భారత్‌ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్‌ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్‌ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ అయినా, లేదా బాలాకోట్‌ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్‌ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్‌... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్‌ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్‌ అసెంబ్లీ ఏప్రిల్‌ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

MLA Sabitha On Obulapuram Mining Case5
‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’

హైదరాబాద్‌: 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానన్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఓబులాపురం మైనింగ్‌ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అనంతరం ఆమె మాల్లాడుతూ.. ‘న్యాయస్థానం నన్ను నిర్దోషి గా ప్రకటించింది, న్యాయస్థానంకి ధన్యవాదాలు. ఏ తప్పు చేయకపోయిన కోర్ట్ మెట్లు ఎక్కాను. పన్నెడున్నర సంవత్సరాలు నన్ను రాజకీయంగా అవమానించారు. ఈ కేసులను ముందు పెట్టి నన్ను రాజకీయంగా అణిచివేయాలనుకున్నారు న్యాయస్థానం మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఇవ్వాళ నాకు న్యాయం జరిగింది. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు నా వెంట నిలబడ్డారు’ అని అన్నారు. కేసు నమోదు అయిన తరువాత ఇదే సీబీఐ కోర్ట్ కి నేను కనీళ్లతో కోర్ట్ మెట్లు ఎక్కాను. నాపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారు. ఇన్నాళ్లకు నాకు న్యాయం జరిగింది’ అని అన్నారు సబితా ఇంద్రారెడ్డి.ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

Chandrababu Naidu Government Records In Debt6
అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Pahalgam Incident: BJP Responds M Kharges Big Charge7
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’

రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్‌ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్‌ పార్టీ సంవిధాన్‌ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.

IPL 2025, MI VS GT: Suryakumar Yadav Now Has Most time 500 Plus Runs In An IPL Season For Mumbai Indians8
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్‌

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్‌లో 500 ప్లస్‌ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్‌ పరుగులు చేసిన ఘనత సచిన్‌ టెండూల్కర్‌ (2010, 2011), క్వింటన్‌ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్‌ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.ఈ సీజన్‌లో సూర్య చేసిన స్కోర్లు..29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)ఈ సీజన్‌లో టాప్‌-6 లీడింగ్‌ రన్‌ స్కోరర్లు..సూర్యకుమార్‌ యాదవ్‌-510విరాట్‌ కోహ్లి- 505సాయి సుదర్శన్‌- 504యశస్వి జైస్వాల్‌- 473జోస్‌ బట్లర్‌- 470శుభ్‌మన్‌ గిల్‌- 465మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రికెల్టన్‌ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో రోహిత్‌ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్‌ జాక్స్‌ (53), సూర్యకుమార్‌ యాదవ్‌ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (1), నమన్‌ ధిర్‌ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 123/7గా ఉంది. కార్బిన్‌ బాష్‌ (4), దీపక్‌ చాహర్‌ క్రీజ్‌లో ఉన్నారు. పవర్‌ ప్లేలో గుజరాత్‌ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్‌ బౌలర్లలో సాయికిషోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ తలో వికెట్‌ పడగొట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ మూడు క్యాచ్‌లు పట్టాడు.

Met Gala 2025: Isha Ambani couture Blending Indian craft and global glamour9
Met Gala 2025: స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..

ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్‌లో బాలీవుడ్‌ తారలంతా తమదైన ఫ్యాషన్‌ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్‌ అటెన్షన్‌ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్‌ వేర్‌లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్‌ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్‌ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్‌ గాలా ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్‌(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్‌లో భారతీయ ఫ్యాషన్‌ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్‌ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్‌ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్‌. స్టైలిష్‌ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అనామిక ఖన్నా ఇషా డిజైనర్‌ వేర్‌ని రూపొందించారు. టాప్‌ గోల్డ్‌ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్‌ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్‌ కలర్‌ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్‌ తెల్లటి క్యాప్‌ లుక్‌లో అత్యంత స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్‌ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్‌ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్‌ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్‌ వేర్‌లా డిజైన్‌ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్‌ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్‌లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్‌ వేర్‌కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్‌ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్‌ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్‌. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్‌ వేర్‌ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్‌ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్‌ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్‌ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)

RTC JAC Of Telangana Talks With Govt Successfully Done10
TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యో‍గుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement