Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Kurnool Siddham: CM Jagan Strong Support reservation for minorities
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్‌

కర్నూలు, సాక్షి:  చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌ ప్రధానంగా స్పందించారు. ‘‘చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు.  ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా?.  ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్‌ మాట. ఇది వైఎస్సార్‌ బిడ్డ మాట’’ అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. ‘‘ మైనారిటీలకు రిజర్వేషన్లపై  మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్‌ నిలదీశారు. మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్‌, సయ్యద్‌, మొగల్స్‌ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు?. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ, సీఏఏ విషయంలో.. ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్‌ ఇమాందార్‌కు మేం మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం,  ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా.  నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

YSRCP Leader Pothina Mahesh Political Counter To Pawan Kalyan
పవన్‌.. నువ్వు తీసిన సినిమాలెన్నీ.. నీ ఆస్తులెంత?: పోతిన మహేష్‌

సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్.. జనసేన పెట్టారని కామెంట్స్‌ చేశారు.కాగా, పోతిన మహేష్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఓ ప్యాకేజీ స్టార్‌. పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్‌ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్‌ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్‌ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  తన ఆస్తులు కూడబెట్టుకునేందుకే జనసేన పార్టీ పెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా అని 2014 పవన్‌ చెప్పాడు. ఒకప్పుడు కార్ ఈఎంఐ కట్టలేనని చెప్పాడు పవన్. ఇప్పుడు 2024 నాటికి 1500 నుండి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలిక్యాప్టర్‌, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పని చేశారు.ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఏతేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ 420. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని? మార్పు సాధ్యం ఎలా?పార్టీ పెట్టింది పవన్ ఆస్తులు సంపాదించటానికి.. మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడు. బినామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోసడపు వెంకటేశ్వరరావు పేరుతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్‌కు వచ్చాడు.డాక్యుమెంట్స్‌లో సరైన సైట్ ఫోటో కూడా పెట్టలేదు. డాక్టర్ బాబు బాలాజీ ప్రకాష్‌తో ఈ వ్యవహారం మొత్తం కుడా నడిపారు. ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కొన్నారు. విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. సినిమాలు కూడా తీయలేదు. ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను.డాక్యుమెంట్స్ అడ్రస్, చెల్లింపులు వేరు వేరు చోట్ల నుండి జరిగాయి. 100 శాతం ఈ ఆస్తి బినామీ పేరుతో పవన్ కొన్నాడు. రంగారెడ్డిలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఇంకా పెంచుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో 14 ఎకరాలు అని పెట్టాడు పవన్. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడు.పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చిరంజీవి, రామ్ చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలి. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు. 28 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. 48 కోట్లు అప్పులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపాడు. హైదరాబాద్‌లో ఒకప్పుడు జనసేన ఆఫీసు అద్దె భవనం, ఇప్పుడు సొంత భవనం. ఇంకా రిజిస్ట్రేషన్‌ అవలేదు. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. చంద్రబాబు నుండి తీసుకున్న డబ్బు కాదా?.పీపుల్స్ మీడియాలో పవన్‌కు వాట ఉంది. రేణు దేశాయ్‌కి ప్రతీ నెల 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు. పవన్‌కు మరో ఆఫర్ వచ్చింది. అసెంబ్లీ , పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటే 150 కోట్లు వచ్చాయి. చంద్రబాబు చెప్పిన వారికి సీట్లు ఇస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు. ఎంపీ బాలశౌరికి 30 కోట్లు తీసుకుని సీటు ఇచ్చారు. క్యాష్ ఇచ్చే వరకు బాలశౌరికి టికెట్ ప్రకటించలేదు. వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇవ్వాలి. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత?.రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడు?. చెవిలో పువ్వులు పెడుతున్నాడు. పవన్‌ ఒక చీడ పురుగు. నాడు చిరంజీవి మోసం చేసి ఇంటికి వెళ్లాడు. నేడు పవన్‌ మళ్లీ వచ్చాడు. మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమే వీరిద్దరి పని’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

vallabhaneni vamsi satires on chandrababu tdp leaders at gannavaram
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ

సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?.  లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా.  నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్‌బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్‌లో పెట్టింది.  పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం.  చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు.

These Foods Are Banned in India
భారతదేశంలో బ్యాన్‌ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!

భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్‌ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్‌ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్‌ చేసింది. అవేంటంటే..చైనీస్‌ పాల ఉత్పత్తులు..చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్‌ఎస్‌ఎస్‌ఏఐ 2008లో చైనీస్‌ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్‌ స్థాయిలన పెంచేలా మెలమైన్‌ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్‌ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. పోటాషియం బ్రోమేట్‌..2016లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్‌ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్‌ కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్‌ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్‌, ఇథిలీన్‌ గ్యాస్‌ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్‌ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్‌ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పోయ్‌ గ్రాస్‌పోయ్‌ గ్రాస్‌ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్‌ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్‌ గ్రాస్‌ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్‌తో ఫీడ్‌ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్‌ కంటెంట్‌ కారణంగా 2006లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్‌ వినియోగం సురక్షితమైన ఈ రెండ్‌బుల్‌ ఎనర్జీ డ్రింక్స్‌ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. సస్సాఫ్రాస్ ఆయిల్‌సాసఫరస్ ఆయిల్‌లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి..2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది.  ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసత​ఆరు.  ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు,  థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. కుందేలు మాంసం..ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్‌.అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు) 

IPL 2024 SRH VS LSG: Sunrisers Created History In Highest Powerplay Totals Difference Category
పిచ్‌ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్‌లో విధ్వంసమా..?

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్‌ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్‌ (28 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్‌ (30 బంతుల్లో 89 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం​ సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్‌ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్‌, హెడ్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఉప్పల్‌ మైదానంలోని పిచ్‌ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్‌ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్‌ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్‌ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్‌, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ పవర్‌ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్‌ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్‌ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ  కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్‌ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్‌ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్‌ పవర్‌ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్‌ (107/0)ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్‌ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్‌ పవర్‌ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్‌ 107/0)లక్నోకు పవర్‌ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్‌ (27/2)ఈ సీజన్‌ బ్యాటింగ్‌ పవర్‌ ప్లేల్లో ట్రవిస్‌ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్‌ పవర్‌ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్‌లో 20 బంతుల్లోపే మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన హెడ్‌. ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌, హెడ్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్‌ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్‌, హెడ్‌ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక​ స్కోర్‌ (సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్‌)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్‌)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్‌ చేసిన సన్‌రైజర్స్‌ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్‌. ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్‌లో సీఎస్‌కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. 

AirIndia terminated 25 employees for their failure to report to work after sick leave
సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్‌ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్‌ లేటర్‌లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

TDP Janasena Key Leaders Leaving In Party
ఒకరి వెంట మరొకరు..

సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జులు డీఎంఆర్‌ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్‌ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు పరమట శ్యామ్‌ రెబల్‌గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థి శ్యామ్‌కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్‌ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్‌బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్‌ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్,  రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్‌ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్‌ అభ్యర్థి 

Aditya Roy Kapur parties with Sara Ali Khan After Breakup with Ananya Panday
హీరోయిన్‌తో బ్రేకప్‌! మరో బ్యూటీతో హీరో పార్టీ!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ అనన్య పాండే- ఆదిత్య రాయ్‌ కపూర్‌ బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్‌తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ మరో హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా అలీ ఖాన్‌తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్‌ ఢిల్లీ అనే సినిమా సెట్స్‌లో డైరెక్టర్‌ అనురాగ్‌ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్‌ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 

Vijay Devarakonda Birthday Special: Hero Cinema Journey
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్‌ ఇండియా హీరో అయ్యాడు!

నువ్వు హీరోవా.. అని చీత్కారాలు పొందిన దగ్గరే నువ్వే అసలైన హీరో అని చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే మజానే వేరు! హీరో విజయ్‌ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు, అవమానాలు పడ్డ విజయ్‌.. ఇవాళ తన సినిమాలను గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్లకు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూసేద్దాం..విజయ్ కాన్ఫిడెన్స్ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.స్టార్‌గా ఎదగడమే కాదుటాక్సీవాలాతో కాస్త డీలా పడ్డా.. గీత గోవిందం ఆయన కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. సినిమా మీద ప్యాషన్, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్‌గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఇతరత్రా సాయం చేశాడు.దేవరశాంటయువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తాడు. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకున్నాడు.చదవండి: వైరల్‌ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all