Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Rahul Gandhi Writes To PM Narendra Modi1
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్‌.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్‌ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025

BrahMos Missile Unit Started In Lucknow2
బ్రహ్మోస్‌ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి

లక్నో: భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్‌కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్‌ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్‌ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. ​కేవలం పాక్‌ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రజలను ఎక్కడా టార్గెట్‌ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్‌ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌ను ప్రయోగించాం. బ్రహ్మోస్‌ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి. బ్రహ్మోస్‌ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్‌ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను డిజైన్‌ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్‌, రష్యాల సంయుక్త వెంచర్‌ అయిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ గైడెన్స్‌ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో​ ఇది ప్రయాణించగలదు.

Physicists Turn Lead into Gold For a Fraction of a Second3
సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?

బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. చాలామందికి గోల్డ్ కొనుగోలు చేయడం, ఇకపై సాధ్యమేనా అనే అనుమానులు కూడా పుడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌(సీఈఆర్ఎన్)లోని భౌతిక శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ సాధించారు.CERN విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సీస కేంద్రకాల అధిక శక్తి.. ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా సమీపంలోని సీఈఆర్ఎన్ ప్రయోగశాలలో సీసాన్ని బంగారంగా మార్చారు.మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే అయినప్పటికీ.. కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం.. శక్తి పల్స్‌ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్‌లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు'సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్' అని పిలువబడే మరొక సీఈఆర్ఎన్ యాక్సిలరేటర్.. 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించిందని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్త 'జియాంగ్‌యాంగ్ జియా' చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయి. ఈ విధానంలో బంగారాన్ని మరింత ఎక్కువ సృష్టించవచ్చని ఆయన అన్నారు.ఈ పద్దతిలోనే మరింత గోల్డ్ ఉత్పత్తి చేస్తే.. బంగారం సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. ఇదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గిపోతాయి. అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చేస్తుంది.

Mohammed Shami Selection Doubtful For England Tour4
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌..!

ఐపీఎల్‌-2025 సీజ‌న్ మ‌ధ్య‌లో నిలిచిపోవ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి భారత్‌-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పై మళ్లింది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.అదే రోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ విడ్కోలు పలకడంతో కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్‌​ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. గిల్ ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమావేశమయ్యాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. షమీ వైట్‌బాల్ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేంత ఫిట్‌నెస్ ఇంకా సాధించలేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు షమీ దూరంగా ఉన్నాడు.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్వాలేదన్పించాడు. వికెట్లు పడగొట్టినప్పటికి అంత రిథమ్‌లో మాత్రం షమీ కన్పించలేదు. అదేవిధంగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ.. అక్కడ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో షమీ బాగా అలిసిపోతున్నాడని, తన రన్-అప్‌లను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా చిన్న స్పెల్‌ల తర్వాత డగౌట్‌లకు తిరిగి వస్తున్నాడని, అందుకే ఇంగ్లండ్ టూర్‌కు అతడి ఎంపికయ్యేది అనుమానంగా మారిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. ష‌మీ స్దానంలో ప్ర‌సిద్ద్ కృష్ణను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.చ‌ద‌వండి: IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?

Indian Airforce Key Announcement On Operation Sindoor5
ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సంచలన ప్రకటన

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ ిసిందూర్‌ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. మాకు అప్పగించిన టార్గెట్‌లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాం. విచక్షణ, వివేకంతో ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించాం. ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌పై ఊహాగానాలు, ఫేక్‌ వార్తలు నమ్మవద్దు అని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్‌-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. #OperationSindoor | Indian Air Force tweets, "...Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information." pic.twitter.com/tRSoEEZj8t— ANI (@ANI) May 11, 2025#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025

India And Pakistan Related Live Updates6
Ind Vs Pak: ప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీ

War Related Updates..3:10 PMప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీసమావేశంలో పాల్గొన్న రాజ్‌ నాథ్‌ సింగ్‌, జై శంకర్‌, సీడీఎస్‌కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తాజా పరిస్థితులపై చర్చరేపు భారత్‌, పాక్‌ మధ్య కీలక చర్చలుకాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గింపుపై చర్చలు ఢిల్లీ..ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీసమావేశానికి హాజరైన ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌, నేవీ చీఫ్‌ అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్‌ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్‌ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్‌ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్‌అవుట్‌ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులు?👉గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్‌ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025

21 People Died In Sri Lanka Bus Accident7
ఘోరం..లోయలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులు దుర్మరణం

కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.

TG EAPCET 2025 Results: Check Direct Link8
TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్‌కే వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.ఇంజనీరింగ్‌లో ఏపీకి చెందిన భరత్‌చంద్ర ఫస్ట్‌ ర్యాంక్‌, రామ్‌చరణ్‌రెడ్డి(రంగారెడ్డికి) సెకండ్‌ ర్యాంక్‌ సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్‌ ఫస్ట్‌ ర్యాంక్, లలిత్‌ వరేణ్య(కరీంనగర్‌) రెండో ర్యాంక్‌ సాధించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది.. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది హాజరయ్యారు.విద్యార్థులు తమ ఎప్‌సెట్‌ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్‌ వెబ్‌ సైట్‌లో పొందవచ్చు. 👇👉TG EAPCET 2025 Results Direct Links👉TG EAPCET Engineering Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Engineering-Results-2025.html👉TG EAPCET Agriculture and Pharmacy Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Agriculture-pharmacy-Results-2025.html

Trump Says Will work with India And Pak solution to Kashmir9
భారత్‌, పాక్‌పై ట్రంప్‌ ఆసక్తికర కామెంట్స్‌.. ఈసారి కశ్మీర్‌ అంటూ..

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్‌-పాక్‌ అంశంపై తాజాగా ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్‌ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్‌ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్‌, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్‌, పాక్‌‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్‌.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

Anil Agarwal Vedanta Groups Success Saga Inspired By His Mother10
‘వేద’ మా అమ్మ పేరు.. ‘వేదాంత’ నా కంపెనీ పేరు..

వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్‌ అగర్వాల్‌కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్‌కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్‌హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్‌ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్‌ అగర్వాల్‌. ఈమేరకు ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌ చేశారు.‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్‌లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement