Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP councilors from Thiruvur Nagar Panchayat in NTR district met YS Jagan1
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజా­స్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కౌన్సి­లర్లు కలిశారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివా­స­రావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్‌ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Trinamool MPs Team On IndiGo Plane Caught In Storm Srinagar2
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన

శ్రీనగర్‌: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సాగరిక ఘోష్‌ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్‌ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

Heavy Rain Fall In Delhi And Telangana3
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వ‍ర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్‌లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్‌లో వాన బీభత్సంహైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్‌ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్‌, మలక్‌పేట్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025

Nambala Keshava Rao dead in an encounter in Chhattisgarh4
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్‌: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్‌కే) అలియాస్‌ బసవరాజు అలియాస్‌ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్‌ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో (ఇప్పటి నిట్‌) బీటెక్‌ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్‌) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్‌..ఎంటెక్‌ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్‌ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్‌ వార్‌ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్‌ వార్‌ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్‌ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్‌ కీలకపాత్ర పోషించారు.ఎల్‌టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్‌ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్‌ వార్‌ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్‌టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్‌ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్‌ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్‌ విభాగానికి బసవరాజు, బీఆర్‌ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్‌ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్‌ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్‌(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్‌/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్‌ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్‌ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్‌ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్‌ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్‌ మైన్‌ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్‌ నేత నందకుమార్‌ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్‌ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్‌ఎస్‌యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్‌ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.

Amrit Bharat Station Scheme PM Modi to Inaugurate 103 Redeveloped Rrailway Stations5
నేడు ప్రధాని మోదీ ‍ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్‌ భారత్‌ స్టేషన్‌(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్‌గావ్బీహార్‌: పిర్పైంటి, థావే.ఛత్తీస్‌గఢ్‌: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్‌: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్‌: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్‌: శంకర్‌పూర్, రాజమహల్, గోవింద్‌పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్‌: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్‌పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్‌గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్‌లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్‌గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్‌: ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్‌నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్‌: బిజ్నోర్, సహరాన్‌పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్‌రామ్‌పూర్.పశ్చిమ బెంగాల్‌: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..

Hanuman Jayanti 20256
హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం

సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.సమయోచిత వేష భాషలుఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకంనేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. వినయగుణ సంపన్నుడుసముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.సమర్థుడైన కార్యసాధకుడుఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. సంభాషణా చతురుడులంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. – డి.వి.ఆర్‌.

Vijay Sethupathi Comments About Movie Title with Puri Jagannath7
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి

కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఏస్. ఈ మూవీ హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో విజయ్ సేతుపతి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందించారు. ఇంకా మేము టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు. ఏఐతో ఎవరో పోస్టర్‌ చేశారని.. అది మనది కాదని తెలిపారు. పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన సినిమాలు కూడా చూశానని.. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విశాల్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కలవడంపై మాట్లాడారు. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే చర్చించానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్‌ను అడిగానని తెలిపారు. నేను మాత్రం రాజకీయాల్లోకి రానని విజయ్ సేతుపతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.విజయ్ సేతిపతి మాట్లాడుతూ.. 'మేము టైటిల్‌ ఖరారు చేయలేదు. బెగ్గర్‌ అని టైటిల్ మీరే ఫిక్స్ చేశారా? పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన సినిమాలు చాలా చూశా. స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. జూన్‌లో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్‌ కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.

TCS gets Rs 2903 crore order from BSNL8
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్‌

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్‌–ఆన్‌ అడ్వాన్స్‌ పర్చేజ్‌ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 18,685 సైట్లలో 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్‌ మొదలైన సర్వీసులను టీసీఎస్‌ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్‌ ఆర్డర్లను (పీవో) బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ఆర్‌ఏఎన్‌), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్‌ నెట్‌వర్క్స్‌ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్‌ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది.

Rasi Phalalu: Daily Horoscope On 22-05-2025 In Telugu9
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.దశమి రా.8.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,వర్జ్యం: రా.10.54 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు,తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు,అమృత ఘడియలు: ఉ.6.10 నుండి 7.41 వరకు, హనుమజ్జయంతి.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం.... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, మిత్రుల నుండి సమస్యలు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కన్య.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల.... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.వృశ్చికం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.ధనుస్సు... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. లేనిపోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. మీ ఖ్యాతి విస్తరిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.కుంభం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మీనం... ముఖ్య∙కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు, ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

US imposes visa bans on India travel agents for facilitating illegal migration10
ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెంట్లపై ఆంక్షలు! 

వాషింగ్టన్‌: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్‌ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్‌ ఇండియాకు సంబంధించిన కాన్సులర్‌ అఫైర్స్‌ అండ్‌ డిప్లొమాటిక్‌ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్‌ ట్రావెల్‌ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్‌ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది. హెచ్‌–1బీ వీసాలు రద్దు చేయాలి మరోవైపు హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్‌ లూమర్‌ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్‌ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్‌–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్‌ మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్‌–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్‌ లూమర్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘‘హెచ్‌–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్‌ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ చీఫ్‌ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్‌ చేశాడు. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement