నైజీరియాకు చెందిన ఓ మహిళ (35) ఆ దేశం నుంచి కేన్సర్ చికిత్స కోసం భారత దేశానికి వస్తూ మర్గమధ్యంలో ఎబోలా లక్షణాలతో దుబాయ్లో మరణించారు.
నైజీరియాకు చెందిన ఓ మహిళ (35) ఆ దేశం నుంచి కేన్సర్ చికిత్స కోసం భారత దేశానికి వస్తూ మర్గమధ్యంలో ఎబోలా లక్షణాలతో దుబాయ్లో మరణించారు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే సమయంలో ఆమె పరిస్థితి ఉన్నట్లుండి విషమించింది. వెంటనే వైద్య సదుపాయం అందించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ఆ మహిళకు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయని, ప్రయాణంలో ఆమె పక్కనే కూర్చున్న ఆమె భర్త, చికిత్స అందించిన ఐదుగురు వైద్యసిబ్బంది అందరినీ ఐసొలేషన్లో ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్లలో ఎవరికీ ఎబోలా లక్షణాలు మాత్రం కనిపించలేదు. పశ్చిమాఫ్రికా దేశాలలో ప్రస్తుతం ఈ ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.