'బాబుకు దమ్ముంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి' | somu veerraju criticised chandrababu ruling and corruption | Sakshi
Sakshi News home page

'బాబుకు దమ్ముంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి'

Feb 5 2018 12:54 PM | Updated on Mar 29 2019 8:30 PM

somu veerraju criticised chandrababu ruling and corruption - Sakshi

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

సాక్షి, రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చెప్పాల్సింది చాలా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. టీడీపీ నేతలు అవినీతికి వారసులంటూ వ్యాఖ్యానించిన సోము వీర్రాజు.. చంద్రబాబు గురించి తాను కేవలం వాస్తవాలే చెప్పినట్లు సమర్థించుకున్నారు. కానీ ఆ వాస్తవాలను కొందరు జీర్ణించుకోలేక ప్లాన్ చేసి నా ఆఫీసు వద్ద ఆందోళన చేయించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు.

రెండెకరాల రైతులను అని చెప్పుకునే చంద్రబాబుకు లక్షల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయన్న సోము వీర్రాజు.. వాటి గురించి అందరికీ తెలుసునన్నారు. ఏదో ఓ సాకుతో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియనివ్వకుండా ఉంచాలని టీడీపీ దుష్ట ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాగా, బీజేపీ నేతలు నిప్పులాంటి వాళ్లని, టీడీపీ నేతలు అవినీతికి వారసులంటూ సోము వీర్రాజు ఇటీవల కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement