'దేవయాని ఉదంతం ముగిసిన అధ్యాయం కాదు' | India refuses to consider Khobragade episode as closed | Sakshi
Sakshi News home page

'దేవయాని ఉదంతం ముగిసిన అధ్యాయం కాదు'

Apr 6 2014 7:09 PM | Updated on Apr 4 2019 3:25 PM

దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే ఉదంతాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించడానికి భారత్ అంగీకరించలేదు.

న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే ఉదంతాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించడానికి భారత్ అంగీకరించలేదు. ఈ విషయంపై ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయని విదేశాంగ కార్యదర్శి  సుజాతా సింగ్ తెలిపారు.న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానిపై వీసా మోసం, తప్పుడు సమాచారం కింద అమెరికా ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడింది.  అయితే దీన్ని ముగిసిన అధ్యాయంగా అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?అన్న ప్రశ్నకు సుజాతా సింగ్ పై విధంగా బదులిచ్చారు. ఆ అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదని సుజాతా సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement