చైనా, అమెరికా.. మీ పని మీరు చూసుకోండి! | Mehbooba Mufti comment on third-party intervention in Kashmir | Sakshi

చైనా, అమెరికా.. మీ పని మీరు చూసుకోండి!

Jul 22 2017 7:49 PM | Updated on Aug 24 2018 7:24 PM

చైనా, అమెరికా.. మీ పని మీరు చూసుకోండి! - Sakshi

చైనా, అమెరికా.. మీ పని మీరు చూసుకోండి!

కశ్మీర్‌ అంశంపై పరిష్కారం కోసం మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) జోక్యం అవసరమంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధినేత ఫరుఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై

న్యూఢిల్లీ: కశ్మీర్‌ అంశంపై పరిష్కారం కోసం మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) జోక్యం అవసరమంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధినేత ఫరుఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. కశ్మీర్‌ అంశంపై అమెరికా జోక్యం చేసుకుంటే.. మరో సిరియా, అఫ్ఘానిస్థాన్‌లా కశ్మీర్‌ మారుతుందని ఆమె అన్నారు.

'చైనా, అమెరికా తమ పని తాము చూసుకోవాలి. అఫ్ఘాన్‌నిస్థాన్‌, సిరియా, ఇరాక్‌ ఇలా వారు జోక్యం చోటా ఏమైందా మనందరికీ తెలిసిందే' అని ఆమె పేర్కొన్నారు. అసలు సిరియా, అఫ్ఘన్‌లో పరిస్థితి ఎలా ఉందో ఫరుఖ్‌ అబ్దుల్లాకు తెలుసా? అంటూ ఆమె ప్రశ్నించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దౌత్యచర్చల ద్వారానే కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement