Bio Charcoal
-
ఎక్కడికైనా సులభంగా చిన్న బయోచార్ యూనిట్
భూసారాన్ని పెంపొందించడంతో పాటు దీర్ఘకాలం పాటు ప్రభావం చూపటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటంలో ఉపయోగపడే బయోచార్ (కట్టెబొగ్గు) ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పత్తి కట్టె, కంది కట్టె, వరి ΄పొట్టు వంటి పంట వ్యర్థాలతో ఒక ప్రత్యేక పద్ధతిలో దగ్ధం చేయటం ద్వారా బయోచార్ను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు ఇప్పటికే అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, న్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండే రొటేటింగ్ డ్రమ్ ఆటోథర్మల్ బయోచార్ యూనిట్‌ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ, భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ఐసిఎఆర్-సిఐఎఇ) రూపొందింంది. పేటెంట్ పొందదిన ఈ యూనిట్ పంట వ్యర్థాలను బయోచార్గా మారుస్తుంది. వంద కిలోల కట్టెను వాడితే 20–35% కట్టె బొగ్గును అందించే సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్నది. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. బయోచార్ను తయారు చేసే ప్రక్రియను పైరోలిసిస్ అంటారు. పైరోలిసిస్ ఛాంబర్‌తోపాటు రెండు సర్క్యులర్ బీమ్‌లు రెండు వైపులా ఉంటాయి. రొటేటింగ్ హేండిల్, చిమ్నీతో కూడిన గ్యాస్ అవుట్లెట్, మూతతోపాటు లోడింగ్ పోర్టు, వీటన్నిటినీ మోసే ఫ్రేమ్ ఉంటాయి. ఈ బయోచార్ ఉత్పత్తి యూనిట్‌ను ఆరుబయట ఉంచి, దాంట్లో పైన ఉండే మూత తీసి పంట వ్యర్థాలను లోపల వెయ్యాలి. ఆ తర్వాత నిప్పంటించాలి. మంట చిన్నగా రగులు కుంటున్నప్పుడు ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని సరఫరా చెయ్యాలి. ఈ ఛాంబర్ పైభాగాన ఉన్న గ్యాస్ అవుట్లెట్ ద్వారా మంట పొగ బయటకు వస్తాయి. బాగా ఎండబెట్టిన (తేమ సుమారు 10–15% ఉండే) పంట వ్యర్థాలను రియాక్టర్‌లోకి వెయ్యాలి. పూర్తిగా నింపెయ్యకుండా 80% వరకు వెయ్యాలి. రియాక్టర్ యూనిట్‌ను 3–4 సార్లు తిప్పటం ద్వారా మంట కట్టెకు అన్ని వైపులా పూర్తిగా మంట వ్యాపించేలా చెయ్యాలి. బయోచార్ 20 శాతం నుంచి 30% మధ్యలో లభిస్తుంది. సామర్థ్యం: 1.2 క్యూబిక్ మీటర్లు (సుమారు 150 కిలోల పంట వ్యర్థాల ముక్కలు) ధర: రూ. లక్ష + 18% జిఎస్టి. వివరాలకు: డాక్టర్ సందీప్ మండల్, సీనియర్ సైంటిస్ట్, ఐసిఎఆర్– సిఐఎఇ, భోపాల్, భారత్. మొబైల్: 97203 23421 -
‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు
మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే శీర్షికతో అనంతపురంలోని పోలిస్ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 22,23 తేదీల్లోబయోచార్పై శిక్షణ వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్ (బొగ్గు పొడి)ని తయారు చేసి పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్కేసర్ సమీపంలోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ (ఎన్ఎఫ్సి నగర్ – అంకుష్పుర్ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు.. 70137 84740 నెంబర్‌ను సంప్రదించవచ్చు. చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
ఇక గ్రీన్ బొగ్గుతో వంట
వ్యవసాయ వ్యర్థాలతో గ్రీన్బొగ్గును తయారు చేసి వాటితో వంట చేసుకునే విధానాన్ని కనుగొంది కార్బన్ రూట్స్ ఇంటర్నేషనల్ సంస్థ. హైతీదేశంలో 93 శాతం ప్రజలకు వంట చేసుకోవడానికి ప్రధాన ఇంధన వనరులు కట్టెల బొగ్గు, కలప. దీంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర ఏ దేశాలతో పోల్చుకున్నా హైతీలో బొగ్గు రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. హైతీ ప్రజలు తమ ఆదాయంలో 50 శాతంపైగా వంట ఇంధనం కోసమే ఖర్చుపెడుతుంటారు. హైతీ ప్రజల సమస్యను తీర్చేందుకు కార్బన్ రూట్స్ ఇంటర్నేషనల్ సంస్థ తక్కువ ఖర్చుతో సంప్రదాయ బొగ్గుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బొగ్గును తయారు చేసింది. ఈ గ్రీన్ బొగ్గును వ్యవసాయ వ్యర్థాలైన చొప్పల్ని కాల్చి తయారు చేస్తారు. సంప్రదాయ బొగ్గును వాడే స్టౌలోనే గ్రీన్బొగ్గును ఉపయోగించి వంట చేసుకోవచ్చు. వంట పద్ధతుల్ని ఏ మాత్రం మార్పు చేసుకోనవసరంలేదు. సంప్రదాయ కట్టెల బొగ్గుతో పోల్చుకుంటే గ్రీన్బొగ్గు ఖర్చు తక్కువ. గ్రీన్ బొగ్గుతో వంట చేసుకోవడానికి హైతీ ప్రజలు ముందుకొస్తున్నారు. గ్రీన్ బొగ్గు ద్వారా డబ్బును ఆదా చేయడమే కాకుండా అడవుల నరికివేతను కూడా అరికట్టవచ్చు. పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చు.