Gunde Jaari Gallanthayyinde
-
హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా..: హర్షవర్ధన్
'అమృతం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు హర్షవర్ధన్. (Harsha Vardhan) నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా ఇతడు హీరో నితిన్‌పై అలిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా (Gunde Jaari Gallanthayyinde) ఈవెంట్లో స్టేజీపైకి వెళ్లి మాట్లాడదామనుకున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాంకర్ అందరి పేర్లు చదువుతోంది. హర్షవర్ధన్ అని పిలిచింది. నన్ను పిలవలేదునేనే అనుకుని లేచా.. ఇంతలో బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె టకటకా స్టేజీపైకి వెళ్లి మాట్లాడాడు. ఓర్నీ.. పిలిచింది మనల్ని కాదా అనుకుని ఎవరూ చూడలేదుగా అని కూర్చున్నాను. రైటర్ అయి ఉండి నిన్ను పిలవలేదేంటి? అని పక్కనవాళ్లు అన్నారు. అంతే.. నేను హర్టయ్యాను. నన్ను పిలుస్తారేమోనని చివరిదాకా చూశాను. కానీ పిలవలేదు. బార్‌కు వెళ్లిపోదామనుకున్నాను. సినిమాలో ఒకే ఒక్క సీన్ మిగిలిపోయి ఉంది. దాన్ని ఈవెంట్ అయ్యాక షూట్ చేద్దామన్నారు. ఈ షూటింగ్‌కు కాస్త లేట్‌గా వస్తానని నితిన్ ఫోన్ చేశాడు. సారీ చెప్తాడని వెళ్లా..అప్పటికే బాధలో ఉన్న నేను నాకేం సంబంధం లేదు, నేనే రావట్లేదు అని చెప్పా. నితిన్ ఆశ్చర్యపోతూ.. ఏమైంది? నువ్వెళ్లకపోతే ఎలా? అని ఆరా తీశాడు. వద్దులే.. ఇప్పటికే అయింది చాలు అని దిగులుగా మాట్లాడాను. అప్పుడు నితిన్‌కు నేను స్టేజీపైకి రాలేదన్న విషయం గుర్తొచ్చి రమ్మని పిలిచాడు. నాకు సారీ చెప్తాడేమో అన్న ఆశతో వెళ్లాను. ప్రాబ్లమేంటి? అన్నాడు. నన్ను పిలవకపోవడం బాధగా అనిపించిందన్నాను. నీ పేరు పిలిచారు కదా.. అంటే హర్షవర్దన్ రాణె స్టేజీ ఎక్కాడు. దానికి నాకు ఏంటి సంబంధం? అన్నాను. చదవండి: రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే డ్యాన్స్ చేస్తావా?: రెచ్చిపోయిన నటుడునీకు బాధ్యత లేదా? క్లాసు పీకిన నితిన్యాంకర్ హర్షవర్ధన్ రాణె అని పిలవలేదు.. హర్షవర్ధన్ అని పిలిచింది. నువ్వెందుకు రాలేదు? పైగా అక్కడున్న 30 మందిలో నువ్వు రాలేదన్న విషయం గుర్తించి యాంకర్‌కు చెప్పలేదనా నీ బాధ. దీనికే షూటింగ్‌కు రాను, నాతో మాట్లాడను అంటున్నావా? పేరు పిలిచింది నేను కాదు, యాంకర్. పోనీ పిలవలేదే అనుకో.. ఇది నీ సినిమా కాదా? నీ బాధ్యత కాదా? నీ అంతటగా నువ్వు స్టేజీపైకి రావాలిగా! నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి!స్టేజీపై ఉన్నవాళ్లందరినీ గుర్తుపెట్టుకుని మాట్లాడటం ఎంత కష్టమో రేపు పొద్దున నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అక్కడంతా యాంత్రికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ పోయాడు. విషయం అర్థమైంది. నేను కదా నితిన్‌కు సారీ చెప్పాలి అనిపించింది. ఇంత తప్పు చేశానేంటనుకున్నాను. ఈ విషయంలో నన్ను నేను ఈ రోజుకూ క్షమించుకోలేను. నితిన్ ఇదంతా ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా నటించాడు.చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది! -
నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గతంలో ఓ సినిమాలో తళుక్కుమని మెరిసింది. నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో డింగ్ డింగ్ డింగ్ డింగ్ అనే ఐటం సాంగ్‌లో ఆడిపాడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.గుత్తా జ్వాల (Jwala Gutta) మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ (Tollywood)లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ నో చెప్పాను. సినిమాల్లోకి రావాలని కలలో కూడా అనుకోలేదు. అయితే సినీ ఇండస్ట్రీలో నాకెందరో స్నేహితులున్నారు. చిత్రపరిశ్రమలో ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిలా నేనుండలేను. అక్కడ ఉండాలంటే మనకు సిగ్గు ఉండకూడదు. చాలా విషయాల్లో సర్దుకుపోతుండాలి.24 గంటలు పనిలోనే..నా భర్త.. హీరో, నిర్మాత విష్ణు విశాల్ (Vishnu Vishal) మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నాడుగా.. 24 గంటలు ఆయనకు ఏదో ఒక పని ఉంటుంది. అవన్నీ చూస్తేనే నాకు తల నొప్పి వచ్చేస్తుంది. మేము 10 గంటలు ఆడిన తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. కానీ వాళ్లకేమో డబ్బుల టెన్షన్, ఆ షాట్స్ సరిగా వచ్చిందా? లేదా? ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. నా భర్త రెడీ అవడానికి 2 గంటలు తీసుకుంటాడు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఇండస్ట్రీలో ఉండేవాళ్లు ఎంతో శ్రమిస్తారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్.. ప్రతిఒక్కరికీ ఏదో ఒక అవార్డు ఇవ్వాల్సిందే!అలా ఐటం సాంగ్ చేశా..ఐటం సాంగ్ విషయానికి వస్తే.. అది తల్చుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. నితిన్ (Nithiin) నాకు ఫ్రెండ్. ఒక పార్టీలో అతడు.. జ్వాల నువ్వు నా సినిమాలో ఓ పాట చేస్తున్నావ్ అన్నాడు. సరేనని తలూపాను. కానీ, సీరియస్‌గా తీసుకోలేదు. మూడు నెలల తర్వాత పాట రెడీ అని నా దగ్గరకు వచ్చాడు. నేను నోరెళ్లబెట్టాను. ఇప్పుడెలా నో చెప్పాలా? అని ఆలోచనలో పడ్డాను. అతడేమో కచ్చితంగా నేను చేయాల్సిందే అని పట్టుబట్టాడు. అలా సెట్లో అడుగుపెట్టాను.ఫ్రీ పబ్లిసిటీమొదటి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్ చిన్నదైపోతూ వచ్చింది. ఏంటిదంతా? అనుకున్నాను. నాలుగురోజుల్లో సరదాగా షూట్ పూర్తి చేశాం. అప్పటికే అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నేను సాంగ్ చేయడం వల్ల ఆ మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. తెలుగు సినిమా జాతీయ మీడియాలో కూడా వస్తుందని నితిన్ సంతోషపడిపోయాడు. నా పాట వల్ల సినిమా ఫ్లాప్ అవకుండా హిట్టయింది. అదొక్కటి నాకు సంతోషంగా అనిపించింది అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చింది.చదవండి: తమన్నా బ్రేకప్.. విడి విడిగా వచ్చారు.. విడిపోయినట్లేనా! -
పోలీసులను ఆశ్రయించిన నితిన్ దర్శకుడు
-
పోలీసులను ఆశ్రయించిన నితిన్ దర్శకుడు
హైదరాబాద్ : నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయిందే’ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రేమ పెళ్లి విషయంలో అతడు పోలీసుల ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ కుమార్ ఈ నెల 1వ తేదీన ప్రసూన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి విజయ్ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చాలాకాలంగా విజయ్ , ప్రసూన ప్రేమించుకున్నట్లు సమాచారం. అయితే ప్రసున కుటుంబసభ్యులకు ఈ వివాహం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తొలి చిత్రం అయినా ’గుండెజారి గల్లంతయిందే’తో విజయ్ కుమార్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తర్వాత నాగచైతన్యతో చేసిన ’ ఒక లైలా కోసం’ నిరాశపరిచింది. త్వరలోనే వరుణ్ తేజ్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు వచ్చినా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. -
తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!
సంభాషణం: ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి గుర్తున్నాడా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఆరాటపడే అమాయకమైన అబ్బాయిగా అందరినీ ఆకట్టుకున్న ఆ అబ్బాయి పేరు... మధునందన్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయిన నందన్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన తపన గురించి ఇలా చెప్పుకొచ్చాడు... నట ప్రయాణం ఎలా మొదలైంది? నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. చిన్నప్పట్నుంచీ నటనంటే పిచ్చి. కానీ మా కుటుంబంలో అప్పటివరకూ ఎవరూ ఈ రంగంలోకి రాలేదు. దాంతో ఇంట్లోవాళ్లు ప్రోత్సహించేవారు కాదు. కానీ నేను పట్టువదల్లేదు. ఇంటర్ పరీక్షలు అయ్యాక తేజగారు కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నారని తెలిసి ఆడిషన్‌కి పరుగెత్తాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అదే... ‘నువ్వు-నేను’. ఆ సినిమా వచ్చి చాలా యేళ్లయ్యింది. కానీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాతేగా మీరు అందరికీ తెలిసింది? అవును. నేనెవరో అందరికీ తెలియడానికి పదమూడేళ్లు పట్టింది. ఇన్నేళ్లలో పది, పదిహేను సినిమాలు చేసి ఉంటానంతే. అవకాశాలు ఎందుకు రాలేదు? మొదట నాకూ తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది. నేనప్పటికి చిన్నవాణ్ని. ఆ వయసు పాత్రలు సినిమాల్లో పెద్దగా ఉండవు. యూత్ సినిమాలు తేజగారు తప్ప ఎవరూ తీసేవారు కాదు. కాబట్టి మిగతా వాళ్లెవరికీ నాతో పని లేదు. మరో కారణం... నేను చదువుకుంటున్నాను. సగం సమయం దానికే కేటాయించేవాడిని. మిగతా సమయంలో ప్రయత్నాలు చేసేవాడిని. పైగా నాకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఈ కారణాలన్నింటి వల్లా నాకు అవకాశాలు రాలేదు. అందుకే ఎంబీయే పూర్తయ్యాక యూఎస్ వెళ్లిపోయాను. మళ్లీ ఇండియాకి ఎందుకొచ్చేశారు? ఏవో ప్రాబ్లెమ్స్ వల్ల సెటిలైపోదామనే ఉద్దేశంతో వెళ్లానే కానీ, మనసంతా నటన చుట్టూనే తిరిగేది. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి ఆరా తీసేవాడిని. అక్కడ నాతోవున్నవాళ్లు కూడా అనేవారు... నీకెందుకురా ఈ ఉద్యోగం, వెళ్లి నీకిష్టమైన నటననే కెరీర్‌గా ఎంచుకో అని. నా అదృష్టంకొద్దీ సాఫ్ట్వేర్ కూడా కుదేలైపోయింది. (నవ్వుతూ) దాంతో చక్కగా వెనక్కి వచ్చేశాను. మళ్లీ అవకాశాలు ఎలా వచ్చాయి? వచ్చీ రాగానే ‘ఇష్క్’ సినిమాలో చాన్స్ వచ్చింది. అయితే అది కేవలం నితిన్వల్లేలెండి. ‘నువ్వు-నేను’కి నితిన్ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్. అప్పటికి నితిన్ హీరో కాలేదు. తను వాళ్ల నాన్నగారితో పాటు షూటింగ్ స్పాట్‌కి వచ్చేవాడు. అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది. నాటి స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే తను ‘ఇష్క్’ చాన్స్ ఇప్పించాడు. అంటే ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కూడా..? అవును... అదీ నితినే ఇప్పించాడు. తనకి మొదట్నుంచీ నా మీద నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది. నన్ను రికమెండ్ చేస్తే ఏదో మంచి పాత్ర అయివుంటుంది అనుకున్నానే కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న రోల్ అని అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చాలామంది డెరైక్టర్స్ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. త్రివిక్రమ్‌గారయితే బన్నీతో చేస్తున్న సినిమాలో కావాలని నాకో పాత్ర ఇచ్చారు. నితిన్ దయో, ధైర్యమో... అంత మంచి పాత్రకు నన్ను తీసుకోవడం వల్లే నా కెరీర్, నా జీవితం మలుపు తిరిగాయి. కొత్తజంట, ప్యార్‌మే పడిపోయానే, గీతాంజలి, ఒక లైలా కోసం... వరుసగా చేస్తూనే ఉన్నాను. ఎలాంటి రోల్స్ కోరుకుంటున్నారు? ఏదో ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోవడం ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావుగారు, ప్రకాశ్‌రాజ్, బోమన్ ఇరానీల మాదిరిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి. అందుకే డిఫరెంట్ పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ‘పటాస్’లో హిజ్రా, ‘చిన్నదానా నీకోసం’లో ‘గే’ పాత్రల్లో నటిస్తున్నాను. హిజ్రా, గే పాత్రలు చేయడానికి గట్స్ కావాలి. వెంటనే ఒప్పుకున్నారా, తటపటాయించారా? హిజ్రా గురించి భయపడలేదు. సినిమాకి ఉపయోగపడే పాత్ర కావడంతో వెంటనే ఓకే అన్నాను. కానీ గే అనగానే కాస్త జంకాను. ఎంత నటనే అయినా ఆ ముద్ర పడుతుందేమోనని తటపటాయించాను. కానీ అది నితిన్ సినిమా. తను ఏం చేయమన్నా కళ్లు మూసుకుని చేసేస్తాను తప్ప ఏంటి, ఎందుకు అని జీవితంలో ఎప్పటికీ అడిగే ప్రసక్తే లేదు. అందుకే సరే అన్నాను. (నవ్వుతూ) అయినా పెళ్లి కాకపోతే భయపడాలి, నాకు పెళ్లై పాప కూడా ఉంది కాబట్టి ధైర్యంగా సరే అనేశాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? నా భార్య హసిత నాకు కొలీగ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ‘ఇష్క్’ చేశాక మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో నా లైఫే మారిపోయింది. అందుకే తను నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది... నేను వచ్చేవరకూ అదృష్టం నీ దగ్గరకు రాలేదు అని. నేను కూడా అది నిజమేనని ఒప్పేసుకుంటా. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘అరుంధతి’లో సోనూ సూద్ చేసిన అఘోరా పాత్ర. ‘గీతాంజలి’లో కాస్త నెగిటివ్ టచ్ ఉన్నది చేశాను కానీ... అఘోరా మాదిరిగా పూర్తిస్థాయిలో చేయాలి. భవిష్యత్ ప్రణాళికలు...? నటన... నటన... నటన. నా ప్రణాళికలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. కనీసం ఇంకో పది, పదిహేనేళ్ల వరకూ చేతినిండా పనితో ఉక్కిరిబిక్కిరైపోవాలి. మంచి నటుడిగా ముద్ర వేసుకోవాలి! - సమీర నేలపూడి -
హ్యాట్రిక్ సినిమా!
నితిన్‌తో శ్రేష్ట్ మూవీస్ తీసిన తొలి సినిమా ‘ఇష్క్’... పెద్ద హిట్టు. ఆ తర్వాత వచ్చిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’... ఇంకా పెద్ద హిట్టు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాస్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ -‘‘మంచి కథ కుదిరింది. నితిన్‌తో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తాం. ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చెప్పారు.