intermediate Supplementary exams
-
మే 19 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 19 నుంచి 24 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు సప్లిమెంటరీలో భాగంగా అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ(నేటి) నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరింది. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26 నుంచి 30వరకు నిర్వహించనుంది.పరీక్ష ఫీజు ఇలా..పదో తరగతిలో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 చొప్పున నిర్ణీత వ్యవధిలో పరీక్ష ఫీజుగా చెల్లించాలని సూచించింది. ఓపెన్ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు పాసైన సబ్జెక్టులో మాత్రమే బెటర్మెంట్ కోసం థియరీకి రూ.250, ప్రాక్టికల్‌కు రూ.100, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఇంప్రూవ్మెంట్ కోరుకునే అభ్యర్థులు పదో తరగతిలో రూ.200, ఇంటర్మీడియెట్ థియరీకి రూ.300, ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాలని కోరింది. ఈనెల 30 నుంచి మే 2 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.25, మే4 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో, మే 5న తత్కాల్ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. తత్కాల్ రుసుము పదో తరగతికి అయితే రూ.500, ఇంటర్మీడియెట్‌కు రూ.1000గా పేర్కొంది. www.apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించాలని సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.మే 18 వరకు ఫీజు చెల్లింపునకు గడువుపదో తరగతి రెగ్యులర్ ఫలితాల్లో విఫలమైన విద్యార్థులకు మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే పాఠశాలల హెచ్ఎంలు ఆన్లైన్లో ఈనెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. మే 1నుంచి 18 వరకు రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. స్కూల్ లాగిన్ల నుంచి మాత్రమే చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. -
7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకు నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని తెలిపింది. ఇక ప్రాక్టికల్స్ 15వ తేదీ నుంచి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని పేర్కొంది. 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జరగనుందని వెల్లడించింది. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది. కాగా, ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా ఇవే తేదీలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక టైం టేబుల్‌ను జారీ చేయనున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
-
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
* నారాయణ కళాశాలలో వారం రోజులుగా ఉన్న ప్రశ్నపత్రాల బాక్సులు * ఈనెల 22నే ప్రశ్నపత్రాల బాక్సులు తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ * అదనపు ప్రశ్నపత్రాల కోసం బోర్డు అధికారి రావడంతో వెల్లడి * క్రమపద్ధతిలో ఉండాల్సిన తాళాలతో తెరుచుకోని బాక్సులు * ప్రశ్నపత్రాలు లీకై ఉంటాయని బలపడుతున్న అనుమానాలు సాక్షి, హైదరాబాద్/ గుడివాడ (కృష్ణ్లా): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ చేశారనే వార్త కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం సృష్టించింది. పోలీసుస్టేషన్లో ఉన్న ప్రశ్నపత్రాలను వారం ముందే గుడివాడలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తీసుకువెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం మంగళవారం జిల్లా ఇంటర్ బోర్డు అధికారి రావటంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు ప్రమేయమున్న ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. మీడియాకు తెలియడం తో బట్టబయలైంది. ఈ ఏడాది మార్చిలో గుడివాడలో ఐదు సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటిలో నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఒక సెంటర్‌గా ఉంది. పోలీసు స్టేషన్లో ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు పరీక్షలు నిర్వహించే కాలేజీల వారే ఇనుప ట్రంకు పెట్టెలు ఇవ్వాలి. ఇందులో భాగంగా 12ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు నారాయణ జూనియర్ కళాశాల వారు 12 ట్రంకు పెట్టెలను ఇచ్చారు. ఒక్కో ట్రంకుపెట్టెలో మూడు సెట్ల ప్రశ్నపత్రాలను సీలువేసి భద్రపరుస్తారు. పరీక్ష సమయంలో ఇంటర్మీడియెట్ బోర్డువారు జంబ్లింగ్ పద్ధతిలో వాటిలో ఒక సెట్‌ను ఎంపిక చేస్తారు. మిగిలిన రెండుసెట్లును పెట్టెలోనే ఉంచి సీలువేసి పోలీసు స్టేషన్లోనే భద్రపరుస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు బాక్సుల్లో మిగిలిన రెండు సెట్లలో ఒకదాన్ని వాడతారు. ఈనెల 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు గుడివాడ లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుడివాడకు నాలుగు సెంటర్లు మాత్రమే ఇచ్చారు. దీంతో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీకి సెంటర్ లేకుండా పోయింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రి ఈనెల 22న స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ కళాశాలకు పరీక్షా కేంద్రం లేదని తమ ట్రంకు పెట్టెలు ఇవ్వాలని లేఖరాసి తీసుకెళ్లారు. అయితే రెండేసి సెట్లు ప్రశ్నపత్రాలున్న ఆ 12 ట్రంకుపెట్టెలనూ ఖాళీ బాక్సులు పేరుతో కార్పొరేట్ కళాశాలవారు తీసుకెళ్లడం అనుమానాస్పదంగా మారింది. ఇలా బయటకు వచ్చింది: సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలోని ఒక కేంద్రంలో బోటనీ ప్రశ్నపత్రాలు తక్కువయ్యాయి. గుడివాడలోని నారాయణ కాలేజీ సెంటర్ లేకపోవటంతో దానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు పెట్టెల్లోనే ఉంటాయి కాబట్టి తీసుకెళ్లేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంకట్రామారావు గుడివాడ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే ఆ పెట్టెలను నారాయణ కళాశాలవారు 22వ తేదీనే తీసుకెళ్లారని చెప్పటంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను పిలిపించగా 27వతేదీ బాక్సులన్నీ తెచ్చి స్టేషన్లో పెట్టారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలని అధికారులు ప్రయత్నించినా మీడియాకు తెలియటంతో బట్టబయలైంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందనరావు స్పందించి జిల్లా జేసీ మురళీని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలిసిన జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కూడా గుడివాడకు చేరుకున్నారు. గుడివాడ ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ పద్మావతిల సమక్షంలో పెట్టెలు తీసి పరిశీలించారు. తాళాలు తెరుచుకోలేదు: ప్రశ్నపత్రాలు భద్రపరిచే పెట్టెలు తాళాలు తీయటంలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. మొత్తం 12 ట్రంకుపెట్టెల్లో ఒకటో నెంబరు బాక్సు తాళం మాత్రమే బయట ఉంటుంది. ఒకటో నెంబరు బాక్సులో రెండో నెంబరు బాక్సు తాళం, రెండో నెంబరు బాక్సులో మూడో నంబర్ బాక్సు తాళం... ఇలా 12 పెట్టెల తాళాలను భద్రపరుస్తారు. అయితే ఆయా బాక్సుల్లో ఉన్న తాళాలతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోలేదు. దీంతో ఆర్ఐఓ వద్ద ఉన్న డూప్లికేట్ తాళంచెవులు ఉపయోగించి తాళాలు తెరవాల్సివచ్చింది. ట్రంకుపెట్టెలు వారం రోజులపాటు నారాయణ కళాశాలలో ఉండటం, బాక్సుల్లో ఉన్న తాళంచెవులతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోకపోవడంతో ప్రశ్నపత్రాలు లీకయ్యి ఉంటాయనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రంకు పెట్టెల సీళ్లన్నీ బాగానే ఉన్నాయని, అయితే బాక్సులు నిబంధనలకు విరుద్ధంగా బయటకు వెళ్లటం నేరమని జేసీ మురళి, ఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిగాక కారకులపై చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు రుజువైతే, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టనున్నామని వారు పేర్కొన్నారు.