maruthi rao
-
ఏంటీ సుపారీ..? ఏమా కథ..?
తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు దోషులుగా తేలారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు. వారిలో అమృత తండ్రి మారుతీరావు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం 2025 మార్చి 10న తీర్పు ఇచ్చింది. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ను హత్య చేయడానికి మారుతీరావు కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడు. అంటే, అతడికి హత్య చేసిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. సుపారీ అంటే వక్కలు. తాంబూలంలో ఉపయోగించే వక్కలకు, కిరాయి హత్యలకు సంబంధం ఏమిటో, నేర పరిభాషలో ‘సుపారీ’కి వేరే అర్థం ఎలా వచ్చిందో వివరంగా తెలుసుకుందాం.కిరాయి హత్యలకు ‘సుపారీ’ అనే మాట ముంబై మాఫియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారకుడు అక్కడి మహిమ్ ప్రావిన్కు రాజు భీమ్దేవ్. అక్కడి మహేమీ తెగకు అధినేత అయిన భీమ్దేవ్కు ఒక వింత ఆచారం ఉండేది. ఏదైనా కష్టమైన పనిని ఎవరికైనా అప్పగించాలంటే, ఆయన ‘సుపారీ’కి ఆహ్వానించేవాడు. మాహిమ్ కోటలో సమావేశం ఏర్పాటు చేసి, రాజ్యంలోని యోధులను పిలిచి, వారికి విందు భోజనం పెట్టేవాడు. ఆ తర్వాత తమలపాకులు, వక్కలు ఉన్న తాంబూలం పళ్లేన్ని సభ మధ్యలో ఉంచేవాడు. ఆపై తన కోసం చేయాల్సిన పనిని చెప్పి, చేసే సత్తా ఉన్న వాళ్లు ‘సుపారీ’ తీసుకోవాలని కోరేవాడు. ఎవరైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న ఆకులు, వక్కలు తీసుకుంటారో వారికి ఆ పని అప్పగించేవాడు. ఇలా ‘సుపారీ’ పదం మహారాష్ట్రలో ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టడానికి కాంట్రాక్టులు తీసుకోవడాన్ని కూడా సుపారీగానే పిలిచే వాళ్లు. కాంట్రాక్టు తీసుకున్న వాళ్లు నేరుగా పని చేయకుండా, మేస్త్రీలను పెట్టి చేయించేవాళ్లు. ముంబైలో మాఫియా సామ్రాజ్యం విస్తరించాక ‘సుపారీ’ని కిరాయి హత్యలకు వినియోగించడం మొదలుపెట్టారు. మాఫియా ముఠాల ద్వారా ‘సుపారీ’ మాట దాదాపు ఆసియా మొత్తం ప్రాచుర్యం పొందింది. ప్రత్యర్థులను హత్య చేయడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేసుకునే వ్యక్తి ఎక్కడా తెరపైకి కనిపించడు. మధ్యవర్తులపై ఆధారపడి తన పని పూర్తి చేయించుకుంటాడు. ఈ మధ్యవర్తి నేరుగా రంగంలోకి దిగి హత్యలు చేయడు. హిట్‌మెన్‌గా పిలిచే ప్రొఫెషనల్స్‌కు ఆ పని అప్పగిస్తాడు. ప్రణయ్ హత్య విషయాన్నే తీసుకుంటే, ఈ పని చేయడానికి మారుతీరావు అస్ఘర్ అలీకి సుపారీ ఇచ్చాడు. అతడి ద్వారానే బిహార్‌కు చెందిన సుభాష్‌కుమార్ శర్మ రంగంలోకి దిగి ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన రోజు సుభాష్ మినహా మరెవ్వరూ తెరపైన కనిపించలేదు. ‘సుపారీ’ సంస్కృతిలో రేటు అనేది టార్గెట్ చేయాల్సిన వ్యక్తి ప్రొఫైల్, హత్య పథకాన్ని అమలు చేయడంలో ఉన్న కష్టనష్టాలపై ఆధారపడి ఉంటుంది. చెల్లింపులు సైతం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా జరుగుతాయి. ప్రణయ్ విషయంలో మారుతీరావు కులహంకారం వల్లే కోటి రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తమిళనాడుకు చెందిన హాజీ మస్తాన్ 1960ల్లోనే నాటి బొంబాయిలో (నేటి ముంబై) స్థిరపడ్డాడు. అక్కడ ఓ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 ఏళ్లకు పైగా ఏలాడు. అప్పట్లో కరీం లాలా, వరదరాజన్ ముదలియార్ తదితరులు కూడా ముఠాలు నిర్వహించే వాళ్లు. తొలితరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ మహారాష్ట్రతో పాటు గుజరాత్ తీరాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సిండికేట్ నడిపాడు. బాలీవుడ్లో ఫిల్మ్ ఫైనాన్సింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. అతడికి ముంబైలోని మరో డాన్ యూసుఫ్ పటేల్‌తో స్పర్థలు ఏర్పడ్డాయి. పటేల్‌ను అంతం చేయాలనుకున్న హాజీ మస్తాన్ ఆ పని కోసం ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు పదివేల రూపాయలకు సుపారీ ఇచ్చాడు. తన బాడీగార్డులు చాకచక్యంగా వ్యవహరించడంతో యూసుఫ్ పటేల్ వారి దాడి నుంచి తప్పించుకోగలిగాడు. 1969లో హాజీ మస్తాన్ ఇచ్చిన ఈ కాంట్రాక్టే దేశంలో తొలి సుపారీగా ముంబై పోలీసులు చెబుతుంటారు. ముంబై కేంద్రంగా 1997లో జరిగిన టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య, 2008లో జరిగిన మట్కా కింగ్ సురేష్ భగత్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుపారీ కిల్లింగ్స్. దావూద్ ఇబ్రహీం, బడా రాజన్, ఛోటా రాజన్‌లు డాన్లుగా ఎదిగాక సుపారీ సంస్కృతి పెరిగిపోయింది. క్రమంగా కిరాయి హత్యలు దేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కత్తికట్టిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఉన్న సుపారీ గ్యాంగ్స్‌లో కీలకమైన వ్యక్తి. 2024లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ సహా అనేక మందిని చంపించిన ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అక్కడ నుంచే తన దందా నడిపిస్తున్నాడు. ఇతడి కనుసన్నల్లో పని చేసే దాదాపు 700 మంది షార్ప్‌షూటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడి ప్రధాన అనుచరుడు, సుపారీ కిల్లర్ సంపత్ నెహ్రా 2018 జూన్ 7న హరియాణా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్త బృందం మియాపూర్ వచ్చిన అతడిని గోకుల్ ప్లాట్స్‌లో పట్టుకుంది. హైదరాబాద్‌లోని జరిగిన వ్యాపారులు రాజీవ్ సిసోడియా, రామ్ ప్రసాద్లవీ సుపారీ హత్యలే! రియల్ బూమ్ రోజుల్లో సుపారీ హత్యలతో పాటు సుపారీ కిడ్నాప్‌లూ జరిగాయి. -
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు -
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు.