songs
-
సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా (Tollywood) పాటల్లో ఈ మధ్య డ్యాన్స్ అసభ్యకరంగా ఉంటున్నాయని మహిళా కమిషన్ (Telangana State Women's Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. అసభ్య స్టెప్పులు ఆపేయండిదీనిపై గురువారం నాడు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ.. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళల్ని అవమానించేలా, అసభ్యంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లతో పాటు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళల్ని చులకన చేసి చూపించే స్టెప్పులను వెనక్కు తీసుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు. (చదవండి: నందమూరి 'తమన్'పై మెగా ఫ్యాన్స్ ఫైర్)స్వీయ నియంత్రణ పాటించండిసినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటమనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చలన చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగించి తగు చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాటపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ పాటలో బాలయ్య.. ఊర్వశి రౌతేలాను కొట్టడం చూడటానికే చండాలంగా ఉందని పలువురూ విమర్శించారు. ఇటీవల రాబిన్‌హుడ్ నుంచి రిలీజైన అదిదా సర్ప్రైజు పాటలోనూ కేతిక శర్మతో అసభ్యకర స్టెప్పులు వేయించారు. ఈ రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం గమనార్హం.చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్ -
డీజే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్‌లో హోలీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పాటలపై హక్కులెవరికి..?
సినిమా పాటల హక్కులు ఎవరివి అనే వివాదం చాలాకాలంగా చిత్ర పరిశ్రమలో నడుస్తోంది. సంగీతదర్శకుడు ఇళయరాజా ‘నా పాటపై హక్కు నాదే’ అంటుంటారు. కొందరు గాయనీగాయకులు తమకు రాయల్టీ రావాలంటున్నారు. కొందరైతే నిర్మాతలకే హక్కు అంటున్నారు. ఈ విషయంపై చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ సహకారంతో క్రియాలా, ఐపీ అండ్ మ్యూజిక్ సంస్థలు శనివారం చెన్నైలో సదస్సు నిర్వహించాయి. ఈ సదస్సులో నిర్మాత ధనుంజయన్, థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా సినిమా పాటలు అనేక మాధ్యమాల ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. అసలు వీటి హక్కులు ఎవరికి చెందుతాయి? అనే విషయం గురించి క్రియాలా సంస్థ నిర్వాహకుడు, న్యాయవాది ఎంఎస్. భరత్ మీడియా సమావేశంలో వివరిస్తూ... ఒక పాట రూపొందాలంటే సంగీత దర్ళకుడు, గీత రచయిత, గాయకుడు, సౌండ్ ఇంజినీర్.. ఇలా పలువురి కృషి ఉంటుందన్నారు. అయితే వీటన్నింటికీ మూలం నిర్మాత అనీ, ఆయన పెట్టుబడితోనే పాట రూపొందుతోందనీ, పాటలకు మొదటి హక్కుదారుడు నిర్మాతనే అని అన్నారు. ఒకవేళ ఒప్పందం ఉంటే, అందులోని నిబంధనల ప్రకారం హక్కులు వర్తిస్తాయన్నారు. ఎలాంటి ఒప్పందం లేకపోతే పాటల హక్కులు నిర్మాతకే ఉంటాయన్నారు. ఒకవేళ చిత్ర నిర్మాత కన్నుమూస్తే, ఆయన కుటుంబ సభ్యులకే హక్కులు చెందుతాయని భరత్ పేర్కొన్నారు. – ‘సాక్షి’ చెన్నై, తమిళ సినిమా -
ఆ పాట రాయడం శివుడి అనుగ్రహంగా భావిస్తున్నా
-
పాప్ సింగర్ ఎడ్ షీరన్తో హిట్ సాంగ్ రీమిక్స్ చేసిన ఏఆర్ రెహమాన్
లండ్‌నుకు చెందిన పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ చెన్నైలో తన పాటలతో మెప్పించారు. చెన్నై నందనం YMCA మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన పాటలతో అభిమానులను మెప్పించారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్‌తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఆయన ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఉన్నారు.చెన్నైలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సంగీత కచేరిలో ఎడ్ షీరాన్ కు సంబంధించిన టాప్ సాంగ్స్ ఆలపించారు. తనకు ప్రపంచ ప్రసిద్ధ గ్రామీ అవార్డు తెచ్చిపెట్టిన 'షేప్ ఆఫ్ యు' పాటను పాడుతూ ఉండగ సడెన్‌గా వేదికపైకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. 1994లో విడుదలైన ప్రేమికుడు చిత్రం నుంచి 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాట పాడుతూ వేదికపైకి రెహమాన్ చేరుకున్నారు. అభిమానుల కేరింతల మధ్య ఆ సమయంలో ఎడ్ షీరాన్ కూడా ఆ పాటకు తన గొంతు కలిపారు. దీన్ని ఊహించని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరూ కొత్త తరహా రీమిక్స్ సంగీతాన్ని ప్రజలకు అందించారు. ఈ రీమిక్స్ సంగీతాన్ని నెటిజన్లు మరికొన్ని రోజులు ఉపయోగించనున్నారు. Thank you, @edsheeran! Hope to see you perform more in Chennai—our city needs more international concerts and collaborations like yours! 🎶🔥 #ChennaiLovesEd https://t.co/uPuUHef7xE— A.R.Rahman (@arrahman) February 6, 2025 -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. కేవలం పాటలకే అన్ని కోట్లా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రం మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కాగా.. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.1000 మంది డ్యాన్సర్లతో..సెకండ్ సింగిల్ రా మచ్చా రా.. అంటూ సాగే రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించింది. ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు.గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ 'నానా హైరానా' కూడా సినీ ప్రియులను అలరించింది. తొలిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ సాంగ్‌ను పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ అయిన న్యూజిలాండ్‌లో తెరకెక్కించారు. దాదాపు ఆరు రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు.ఇటీవల యూఎస్‌లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'దోప్' అనే నాలుగో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం రష్యాకు చెందిన 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ఇండియాకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ఈ పాటను తెరకెక్కించారు.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలతో పోటీ పడనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. RAM CHARAN - KIARA ADVANI: 'GAME CHANGER' FOUR SONGS, ₹ 75 CR *MUSIC BUDGET* - A BREAKDOWN... 10 JAN 2025 RELEASE... #GameChanger - the PAN-India biggie starring #RamCharan and #KiaraAdvani - has unveiled four songs to date.Take a look at the #NewPoster, featuring the stunning… pic.twitter.com/SY49ygs74H— taran adarsh (@taran_adarsh) January 2, 2025 -
కాలానుగుణంగా కోలాటం : ప్రొద్దుటూరు మహిళల విజయం
‘చీరలంటే చీరలు... చీరల మీద చిలకలు/ రైకలంటే రైకలు... రైకల మీద రంగులు’‘జానపదమైనా సరే–‘అబ్బబ్బా దేవుడూ... అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు... శ్రీరామచంద్రుడు’... ఇలా ఆధాత్మికమైనా సరే–ఈ జనరేషన్ ఆ జనరేషన్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలం కోలాటం సంబరాల సందడిలో ఉత్సాహతరంగమై ఎగరాల్సిందే.తెలుగు వారి సాంస్కృతిక చిరునామాలలో ఒకటి... కోలాటం. కళ అనేది పుస్తకాల్లో కాదు ప్రజల మధ్య, ప్రజలతో ఉంటేనే నిత్యనూతనంగా వెలిగిపోతుంది. ఈ ఎరుకతో కోలాటానికి పూర్వ వైభవం తేవడానికి ముందుకు కదిలారు ప్రొద్దుటూరు మహిళలు.కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు కోలాట నృత్యానికి కొత్త హంగులను జోడించి ఆ కళకు మరింత ఆదరణ వచ్చేలా కృషి చేస్తున్నారు. బండి మల్లిక ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మాస్టర్ సాయి భరత్ దగ్గర కోలాటంలో శిక్షణ తీసుకుంది. తనలాగే శిక్షణ తీసుకున్న దాదాపు నాలుగు వందలమందితో ‘సావిత్రి బాయి పూలే అభ్యుదయ మహిళా కోలాట బృందం’ ఏర్పాటు చేసింది. అందరినీ ఒకే తాటి పైకి...కోలాటం సంప్రదాయ స్ఫూర్తిని పదిలంగా కా΄ాడేలా పూలమాలలు, లెజిన్స్, భజన తాళాలు... మొదలైన వాటితో అన్నమాచార్య కీర్తనలతో నృత్యప్రదర్శనలు చేస్తూ కోలాటానికి కొత్త శోభను తీసుకువస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోలాటం నేర్చుకున్న వారు ఎవరికి వారు బృందాలుగా వుండడంతో వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి కొత్తగా ఏదైనా సాధించాలనే ఆలోచన మల్లికకు వచ్చింది.వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి దశావతార కోలాటంపశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల క్షేత్రంలో 222 మంది మహిళలు కోలాటంతో దశావతార జానపద నృత్య ప్రదర్శన చేశారు. ‘గోవిందుడేలరాడే.. గోపాలుడేలరాడే.. మా అయ్య ఏలరాడే..’ అనే పాటతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శన తో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు సాధించారు. కాలంతో పాటు ప్రవహించాలి...ప్రొద్దుటూరుకు మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్, తిరుచానూరు, శ్రీకాళహస్తి, ఒంటిమిట్ట, అరుణాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తిరుమల తిరుపతి ఆలయాల బ్రహ్మోత్సవాలలో తమ కోలాటంతో కనుల పండగ చేస్తున్నారు బృందం సభ్యులు.‘కాలేజీలో పనిచేస్తూనే సాయంత్రం వేళల్లో, సెలవుల్లో కోలాటం నేర్చుకున్నాను. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపకరించే కళ ఇది. ్ర΄ాచీన జానపద కళలకు జీవం పోయాలనే లక్ష్యంతో కోలాటం ఆడుతున్నాం. ఈ కళ నిలువ నీరులా ఉండకూడదు. కాలంతోపాటు ప్రవహించాలి. ప్రతి తరం సొంతం చేసుకోవాలి’ అంటుంది ‘గౌతమి ఇంజినీరింగ్ కాలేజీ’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న భూమిరెడ్డి నాగమణి.ఇక అయోధ్య రాముడి దగ్గరికి... ‘దశావతారం’ కోలాట నృత్య ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ప్రదర్శనల కోసం ఎవరి దగ్గరా డబ్బు తీసుకోకుండా సొంత ఖర్చులతో దేవస్థానాలలో ప్రదర్శనలు చేస్తున్నాం. బయట ఎక్కడా ప్రదర్శనలు చేయం. అయోధ్యలో కోలాటం ప్రదర్శన చేయడానికి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ తరం పిల్లలు కూడా కోలాటానికి దగ్గర కావాలి. ఏ కళా దానికి అదే దూరం కాదు. సంప్రదాయ కళలకు చేరువ కావడం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక్కరిద్దరు కాకుండా కళాకారులందరూ ఐక్యంగా కృషి చేస్తే ఎంత అద్భుతం సృష్టించవచ్చో నిరూపించాం. – బండి మల్లిక అరుణాచల కొండల్లో... అలుపెరగని కోలాటంబండి మల్లిక నేతృత్వంలో తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణ సందర్భంగా ‘సావిత్రి బాయి పూలే కోలాట బృందం’లోని 111 మంది మహిళా కళాకారులు 14 కిలోమీటర్లు కోలాటాన్ని ప్రదర్శించారు. కోలాట కర్రలతో అన్నమయ్య, శివనామస్మరణ కీర్తనలకు లయబద్ధంగా నృత్యం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మొదలైన కోలాట నృత్యం మరుసటి రోజు ఉదయం 3.40 గంటల వరకు కొనసాగింది. ఏకధాటిగా తొమ్మిది గంటల పాటు గిరి నృత్య ప్రదక్షిణలో అలసిపోకుండా కోలాటం పూర్తి చేసిన వీరి ప్రతిభ ఉత్తర అమెరికాలోని ‘తానా బుక్ ఆఫ్ రికార్డు’ లో నమోదైంది. ‘భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లోనూ చోటు సాధించారు. – మోపూరు బాలకృష్ణారెడ్డి సాక్షి ప్రతినిధి, కడపఫొటోలు: షేక్ మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు. -
సీ ఫర్ కలెక్టర్... సీ ఫర్ క్రియేటివిటీ
‘తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పడం సులభం. ‘తీరిక చేసుకోవడం’ మాత్రం కష్టం. అయితే కొన్ని ఇష్టాలు ఆ కష్టాన్ని దాటి కాలాన్ని మనకు అప్పగిస్తాయి. కలెక్టర్‌గా తీరికలేనంత పనుల్లో తలమునకలైప్పటికీ తనలోని క్రియేటివిటీని కాపాడుకుంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోయ, ఉర్దూ భాషలు నేర్చుకుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తోంది. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తోంది.దేశంలో ఏ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లినా ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్’ అని చదువుతారు పిల్లలు. కరీంనగర్లో అలా కాదు. ‘ఏ ఫర్ యాక్టివ్. బీ ఫర్ బ్రైట్. సీ ఫర్ క్రియేటివ్’ అంటూ ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడుతారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ పాట రాశారు. ఐదేళ్ల క్రితం తన కుమారుడు నైతిక్ పుట్టినప్పుడు మదిలో మెదిలిన పాటకు ఆమె అక్షర రూపం ఇచ్చారు. ఇదే పాటను తన కుమారుడికి నేర్పించే క్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి కొత్తగా అనిపించింది. ‘పాట సృజనాత్మకంగా ఉంది. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ పాటని జిల్లాలోని అన్ని అంగన్ వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది’ అని అడిగారు. అందుకు సత్పతి సరే అన్నారు.ఆక్షరాలే ఆట పాటలై...అప్పటికే అంగన్ వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. చిన్నారులకు పోషకాహారం లోపం రాకుండా బలవర్ధ్దక ఆహారంతో పాటు ఆటపాటలతో కూడిన చదువును అందించాలనుకున్నారు. ఇటీవల ‘ఏ ఫర్ యాక్టివ్’ పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. పిల్లలకు ఈ పాట ఎంతో నచ్చి ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు..పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం.బహు భాషలలో శభాష్ అనిపించుకుంటూ...‘ఇది చాలు’ అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలి...అనే తపన ఉన్న వాళ్లు ఎంతో ముందుకు వెళతారు. కలెక్టర్ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపించే జ్ఞానపిపాసీ. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు. బాధలు తెలుసుకోవడానికి కోయ భాష నేర్చుకుంది...భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు...కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలనుప్రాంపోత్సహించి ఎన్నో ఆల్బమ్‌లు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్‌కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడవుగా ట్యూటర్‌ను వెదికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు. ‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ’ నుంచి ఉర్దూలో డిప్లమా చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు. తెలంగాణలో నిజాం రాజుల కాలంలో రాసిన రెవెన్యూ రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. అలాంటి వాటిని చదివి అర్థం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉర్దూ నేర్చుకోవడమే కాదు తెలుగు గొలుసు రాతను అధ్యయనం చేస్తున్నారు పమేలా సత్పతి.‘సృజనాత్మక కళలు, ఉద్యోగ నిర్వాహణ బాధ్యతలు ఒకే ఒరలో ఇమడవు’ అని అపోహ పడేవారికి కలెక్టర్ పమేలా సత్పతి రాసిన పాట....మేలుకొలుపు మాట. ‘కచ్చితంగా సాధ్యమే’’ అని బలంగా చెప్పే మాట.‘సృజన మానసికవికాసానికే కాదు...అభివృద్ధికి కూడా’ అని చెప్పే బంగారు బాట. వారి మనసు చదవాలంటే...నాకు ఏప్రాంపాంతంలో పనిచేసినా ఆప్రాంపాంత ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయల గురించి తెలుసుకోవడం ఇష్టం. వారి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకం అయినప్పుడే వారి హృదయాలను అర్థం చేసుకోగలం. సమస్యలను పరిష్కరించగలం. ప్రతిప్రాంపాంతానికి తనదైన విశిష్ఠత ఉంటుంది. ఆ విశిష్ఠతను అభిమానించడం అంటే ఇష్టం. చాలామంది పేదప్రజలకు మాతృభాష తప్ప వేరే భాష రాకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల సేవ కోసం వచ్చే అధికారులకు బహు భాషలతో పరిచయం అవసరం. వారి భాషను అర్థం చేసుకోగలిగితే వారి సమస్యను లోతుగా అర్థం చేసుకోగలం.– పమేలా సత్పతి, కలెక్టర్, కరీంనగర్– భాషబోయిన అనిల్‌కుమార్‘సాక్షి’ ప్రతినిధి, కరీంనగర్ -
తలిచె తలిచె.. పాట రాసింది మనోడే
నర్సాపూర్: ‘ఏందిరా ఈ పంచాయితి’ సినిమాలో హిట్ కొట్టిన ‘తలిచె తలిచె కొద్దీ గుర్తొస్తున్నా–కురిసే కురిసే వెన్నెల నువ్వె నాన్న’ పాట రాసిన యువకవి మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి. నర్సాపూర్‌కు చెందిన రమావత్ శ్రీకృష్ణ పేదరికంలో పెరిగి ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తూ డిగ్రీ పట్టా పుచ్చుకొని కంప్యూటర్ కోర్సులు చదివినా అనంతరం కుటుంబ పోషణ చేపడుతూనే తనలో ఉన్న పాటలు, కథలు రాయాలన్న కవిత్వానికి జీవం పోశాడు.. ఇంకా పోస్తూనే ఉన్నాడు. స్వతహాగా పాటలు రాయాలన్న తపన..పాటలు, కథలు రాయాలన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వెళ్లిన శ్రీకృష్ణ ఇప్పటి వరకు తెలుగులో 20 పాటలు, హిందీలో 10 పాటల వరకు రాశాడు. సుమారు రెండేళ్ల కిందట ‘సినిమా సోకులు’ పేరిట ఓ పాటతో ప్రైవేటు ఆల్బం తయారు చేశాడు. ఈ ఆల్బంలో శ్రీకృష్ణ రాసిన అరరే మామ పట్నం పోదామా పాటను సింగర్ పెద్దపల్లి రోహిత్ పాడారు. నర్సాపూర్ రత్నాలు, మిర్జాపూర్ ఫాంహౌజ్ తదితర పలు షార్ట్ ఫిలిమ్స్ చేసినా ఆర్థిక ఇబ్బందులతో వాటిని ప్రమోట్ చేయలేకపోతున్నాడు. కంప్యూటర్ కోర్సులు చదివే సమయంలో ఎడిటింగ్, డీఓపీ సైతం నేర్చుకోవడంతో పలు సోషల్ మీడియాకు వీడియోలు తయారు చేయడం, ఇతరత్రా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇండస్ట్రీలో అతన్ని శ్రీకృష్ణ గ్రిల్లర్గా పిలుస్తారు. కుటుంబ నేపథ్యంనర్సాపూర్ మండలంలోని తుల్జారాంపేట తండాకు చెందిన రమావత్ మంగు, జీరిభాయి దంపతులు సుమారు 40 ఏళ్ల కిందట నర్సాపూర్‌కు వచ్చి పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో స్థిర పడ్డారు. వారి సంతానం రమావత్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబం గడవడక పదవ తరగతి ఫెయిల్ కాగానే పట్టణంలోని పలు దుకాణాల్లో పని చేస్తూ కుటుంబపోషణలో తల్లికి అండగా నిలిచాడు. ఓపెన్ యూనివర్శిటీలో చేరి డిగ్రీ పూర్తి చేయడంతోపాటు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశాడు. తల్లి జీరిభాయి, భార్య మనస్విని, ఇద్దరు కూతుర్లు హయాతి, హైందవిశ్రీలతో కలిసి నర్సాపూర్‌లో నివాస ముంటున్నాడు. -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్‌లోని చివరిపాటను మోహన్‌లాల్‌తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
రాఖీ స్పెషల్: ఈ పాటలు స్టేటస్ పెట్టుకోండి..
'అమ్మలో ఉండే సగం అక్షరం నేనే.. నాన్నలో ఉండే సగం లక్షణం నేనే.. అమ్మతోడు.. నాన్న తోడు.. అన్ని నీకు అన్నే చూడు..' పాటలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ ఎంతోమంది అన్నలు చెల్లెళ్లకు తోడుగా, రక్షగా నిలబడతారు. జీవితాంతం అండగా ఉంటామని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.అల్లంత దూరంలో ఉన్నా సరే అన్న/ తమ్ముడికి రాఖీ కట్టాలని పరుగెత్తుకుంటూ పుట్టింటి దగ్గర వాలిపోతారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమను చాటిచెప్పే పాటలు ఎన్నో ఉన్నాయి. రేపు (ఆగస్టు 19న) రాఖీ పండగ దినాన ఇలాంటి సాంగ్స్ ఎన్నో స్టేటస్‌లో మార్మోగనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..అన్నయ్య అన్నావంటే.. ఎదురవనా... (అన్నవరం సినిమా) అన్నాచెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం.. (గోరింటాకు) మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి.. మన్మధుని రాఘవుని కలబోతే బావ.. (లక్ష్మీనరసింహ సినిమా)చామంతి..పూబంతి.. చిన్నారి నా సిరిమల్లి.. (పుట్టింటికి రా చెల్లి సినిమా) సిరిసిరి మువ్వలూ.. ఆ విరిసిన పువ్వులూ.. చిరుచిరు ఆశలూ.. (గణేశ్ సినిమా)అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప.. బజ్జోరా బుజ్జాయి కథలెన్నో.. (చిట్టిచెల్లెలు మూవీ)నా చెల్లి చంద్రమ్మ.. (ఊరుమనదిరా మూవీ) అన్నయ్య నువ్వు పిలిస్తే.. చెల్లిగా జన్మనెత్తాను.. (బ్రో మూవీ) చందురిని మించు అందమొలికించు ముద్దు పాపాయి.. (రక్తసంబంధం మూవీ) -
కృతి రికార్డ్
అస్సాంలోని అభయపురికి చెందిన కృతి శిఖా 41 నిమిషాల 34 సెకన్లలో నిరంతరాయంగా 21 పాటలు పాడి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది. తొమ్మిదేళ్ల కృతి శిఖా పాడిన పాటల్లో అస్సామీతో పాటు హిందీ పాటలు కూడా ఉన్నాయి. చిన్నారి కృతి శిఖా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించడం ఇది రెండోసారి.తల్లిదండ్రులు గాయకులు కావడంతో ఇంటినిండా సంగీత వాతావరణమే కనిపిస్తుంది. చిన్నారి కృతి ‘ఇండియా బుక్ ఆఫ్ ఆప్ రికార్డ్స్’లో చోటు సాధించిన సందర్భంగా గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ‘ఈ రికార్డ్ కృతి ప్రతిభకు మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యానికి కూడా అద్దం పడుతుంది. భాషా సామరస్యత అనే భావనను పెం΄÷ందిస్తుంది’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
అమ్మ ప్రేమను వర్ణించే మధురమైన పాటలు
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..1. నాలో నిను చూసుకోగా.. 2. వంద దేవుళ్లే కలిసొచ్చినా.. 3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా.. 4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. 5. సువ్వి సువ్వాలమ్మా.. 6. ఎదగరా.. ఎదగరా.. 7. అమ్మా అని కొత్తగా.. 8. అమ్మ 9. అమ్మనే అయ్యానురా.. 10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల.. 11.. అమ్మా.. వినమ్మా.. 12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి. -
మంగ్లీ పాట, విజయ్ దేవరకొండ డ్యాన్స్.. హోలీ స్పెషల్ సాంగ్స్ విన్నారా?
సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. వసంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ! ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగుల పండగలో మునిగితేలుతారు. అందరిలో ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ.. నేడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, రంగు నీటిని విసురుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సరికొత్తగా చెబుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా రంగుల పండుగ చేసుకుంటారు. హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. ఇలాంటి సమయంలో అందరిలో జోష్ నింపే పాటులు తోడైతే.. ఆ సంతోషం డబుల్ అవుతుంది. చాలా సినిమాల్లో హోలీ ఆధారంగా ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని పండుగ వైభవాన్ని చెబితే మరికొన్ని రంగుల జోష్‌ను నింపాయి. మీ ఇంట జరిగే హోలీకి ఈ పాటలను కూడా జత చేయండి. నాయకుడు: 1987లో మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. అందులో ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. రాఖీ: ఎన్టీఆర్, ఇలియానా జోడీగా నటించిన సినిమా రాఖీ. ఇందులో 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే' అంటూ హోలీ సాంగ్‌తో తారక్ దుమ్మురేపాడు. అందులో తన డ్యాన్స్‌తో హోలీ సంతోషాన్ని డబుల్ చేశాడు. ప్రతి హోలీ కార్యక్రమంలో ఈ పాట ఉండాల్సిందే. జెమిని: వెంకటేశ్- నమిత జోడీగా నటించి మెప్పించిన సినిమా ‘జెమిని’. ఈ చిత్రంలో ‘దిల్ దివానా.. మై హసీనా..’ పాట నేపథ్యం కూడా హోలీ పండుగ చుట్టే ఉంటుంది. 2017లో హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక పాటను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ నటిస్తే.. ఆ థీమ్‌ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. మాస్: నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్ ఎవర్గ్రీన్ హోలీ పాటగా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది. 2019లో మంగ్లీ హోలీ నేపథ్యంలో ఓ పాటను ఆలపించింది. ‘ఖతర్నాక్ కలర్ జల్లురా’ అనే సాగే ఈ పాటలో పల్లెల్లో హోలీని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చక్కగా చూపించారు. రెండేళ్ల క్రితం హోలీ పండుగకు యాంకర్ వర్షిణీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్‌లో తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఈ పాట ద్వారా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది. సిల్సిలా : బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన 'సిల్సిలా' సినిమాలో రంగ్ బర్సే బీగీ చునర్వాలీ అనే పాట దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పాటకు అప్పడు, ఇప్పుడు అనే తేడా ఉండదు. పాట వింటే చాలు డ్యాన్స్‌తో ఊగిపోతారు. -
కొత్త టాలెంట్‌ను బయటకు తీసిన విజయ్‌సేతుపతి
స్టార్ హీరోలు పాటలు పాడడం పరిపాటిగా మారింది. కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా మరో మల్టీ టాలెంటెండ్ హీరో విజయ్‌సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన 'కరా' అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా. దీని విశేషం ఏమిటంటే మొసలి ఇతి వృత్తంతో రూ పొందడం. ఈ చిత్రం ద్వారా నటి సాహిబా బాసిన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు జీవా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్, సేలం వేంగై కె.అయ్యనార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై రాజేంద్రకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని, గీరీశన్ ఏజీఏ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మొసలి తమిళ పేరు కరా అని చెప్పారు. ఈ చిత్రం కోసం నటుడు విజయ్‌సేతుపతి పాడిన కాదల్ కుమారు వైరల్ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
పాటకు పట్టం
‘పాట’ అనే మాటలో ఎన్ని ఉద్వేగాల ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగిసిపడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జలయంత్రాలో! ప్రతి రాత్రీ వసంతరాత్రిగా, ప్రతి గాలీ పైరగాలిగా, బతుకంతా పాటలా సాగాలంటాడు ఒక కవి. ఏదో ఒక పాట వింటూనే జీవితం గడుపుతాం. చెవులను, మనసును తాకి హాయి గొలిపే పాటల తుంపరలలో తడుస్తూనే జీవన రహదారిలో సాగుతాం. మరి, బతుకే పాటైన మేటి పాటగాళ్ళ సంగతేమిటి! కాలికి గజ్జె కట్టి బుజాన కంబళి వేసుకుని జీవితమే ఆటగా, పాటగా గడిపిన గద్దర్లు; పాటల వియద్గంగలో జీవితాంతం మునకలేసిన వంగపండులు, పలుకే పాటై జీవనదిలా ప్రవహించే అందెశ్రీలు, పాటను పుక్కిటపట్టి రాగమే జీవనరాగంగా బతుకును పండించుకుంటున్న గోరటి వెంకన్నలు... చెప్పుకుంటూ వెడితే ఒకరా ఇద్దరా! ఆపైన, సినీగీతాన్ని వినీలాకాశానికెత్తిన కృష్ణశాస్త్రులు, శ్రీశ్రీలు, ఆత్రేయలు, సినారేలు, ఆరుద్రలు, వేటూరులు..! పేరుకు పాటైనా తీరులు ఎన్నో! కొన్ని పాటలు జాతి మొత్తంలో ఉత్తేజపు విద్యుత్తును నింపి ఉద్వేగాల అంచుల వైపు నడిపిస్తాయి. జనగణమన లాంటి అలాంటివి జనరంజకమై జాతి గళమెత్తి పాడుకునే గీతాలు అవుతాయి. తెలంగాణ ఉద్యమంతోపాటు ఉవ్వెత్తున ఎగసిన ఉద్రేకపు పొంగు పాటగా మారి అందెశ్రీ ఆలపించిన ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రగీతం ప్రతిపత్తిని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది. పాటలో పలికించలేని రసమే లేదు. ప్రజోద్యమాల అగ్నిశిఖలలోంచి నిప్పురవ్వల్లా పుట్టుకొచ్చిన పాటే ప్రేయసీప్రియుల యుగళగీతంగా మారి మోహరాగాలతో విరితావులనీనగలదు. ‘నీవే నేనుగా ఒకటైన చోట’ ‘వలపుల పూదోట’ పూయించగలదు. మనిషైతే మనసుంటే కనులు కరగాలని, కరుణ కురియా లని, జగతి నిండాలని ప్రబోధిస్తూ; ప్రకృతి సమస్తంలో ఇమిడి ఉన్న కారుణ్యాన్ని జాలిజాలిగా కరిగే నీలిమేఘం మీదుగా రూపుగట్టి మనల్ని నిలువునా కదిలించి కరిగించగలదు. తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోని ఉదయరాగానికి చూపుల్ని, హృదయగానానికి చెవుల్ని అప్ప జెబుతూనే కాలగర్భం లోలోతులకు వెళ్లి వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభ వేళను – మలయ మారుతాలతో, పుడమి పలుకు స్వాగతాలతో, తారకలే మాలికలై మలచిన కాంతితోరణాలతో ఉత్సవీకరించి మన కళ్ళముందు నిలపగలదు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్య రారా’ అంటూ; ‘అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్ద కదే... ఒంటరి బతుకైనా ఓపగలుగు తీపికదే’ అంటూ పాట లాలిగా జోలగా మారి వాత్సల్య రసంలో ఓలలాడించగలదు. పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ. నేల పొరలను చీల్చుకుని విత్తనం రెండు ముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్ళల్లో కవలశిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక అంటూ పాటను సృష్ట్యాదిన ప్రతిష్ఠిస్తారు. గగనాంతరసీమ గానసమూహమై పాటందుకుంటే, నేల రంగస్థలమై ఆటందుకుందంటారు. ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్న వేళ జంతుధ్వనుల నుంచి పుట్టిన సప్తస్వరాల అన్వయింపే ఏ పాట అయినా అంటూ పాటల భిన్నత్వంలోనే ఏకత్వాన్ని రూపిస్తారు. పురామానవ పరిణామ కోణం నుంచి గ్రీకు సాహిత్యాన్ని, ఇతర యూరోపియన్ భాషల సాహిత్యంతో బేరీజు వేస్తూ చర్చించిన జార్జి థామ్సన్ అనే పండి తుడు కూడా విచిత్రంగా ఇలాగే పాటను సాహిత్యపు ఆదిమదశలో నిలుపుతాడు. ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికి భిన్నంగా గ్రీకు కవిత్వం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ కవిత్వం మన వాల్మీకి రామాయణంలానే తంత్రీలయ సమన్వితంగా ఉంటుంది. వ్యాసభారతం కూడా వాగ్రూపంలో విస్తరించి చివరికి లిఖితరూపం పొందినదే. అలా చూసినప్పుడు నేటి మన పాటకవులందరూ వ్యాసవాల్మీకి పరంపరలోకే వస్తారు. లిఖితరూపంలోకి వచ్చాక కవిత్వం కాళి దాసాదులతో భిన్నమైన మలుపు తిరిగింది. తెలుగులో ఆధునిక కవిత్వం ఆదిలో పాటకు ప్రతిరూపంగా ఎలా వెలువడిందో వివరిస్తూ, అనంతరకాలంలో తెలుగునాట పాటకు ప్రచురణార్హత, కవితకు శ్రవ్యార్హత లేకుండా చేశారని అంబటి సురేంద్రరాజు ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటితో చదవడం కన్నా, చెవితో వినడమే కవితకు స్వాభావికమంటాడు. నిన్నమొన్నటి వరకు ఐరిష్ కవిత్వం ప్రధానంగా ఆశుసంప్రదాయాన్నే అనుసరించిందని జార్జి థామ్సన్ కూడా చెబుతూ; మొదట అచ్చులో చదివిన కొన్ని ఐరిష్ కవితలను ఆ తర్వాత ఒక రైతుగాయకుని నోట వినడం తనకు అపూర్వమైన అనుభవంగా వర్ణిస్తాడు. నిరక్షరాస్యులైన ఐరిష్ గ్రామీణుల పెదాలపై కవిత్వం నర్తిస్తూ ఉంటుందని, వారు మాట్లాడే మామూలు మాటలు కూడా కవితాత్మకంగా మారిపోతాయని అంటాడు. సామూహిక శ్రమలో భాగంగా పుట్టిన వాక్కు కవితాత్మకంగా మారి శ్రమకు చోదకంగా మారిందనీ, ఆదిమ కాలంలో పనిలో భాగంగా పాట పుట్టింది తప్ప కేవలం తీరిక సమయాల్లో పాడుకునేందుకు కాదంటాడు. పూర్తిగా లిఖిత సంప్రదాయంలో పెరిగిన కవిత్వం ఆలోచనామృతం కావచ్చు కానీ, సద్యస్పందన కలిగించే పాట ఆలోచనామృతమే కాక ఆపాతమధురం కూడా. ప్రజాక్షేత్రంలో, ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో సామాన్యజనం సహా అందరినీ ఉర్రూతలూగించే పాటకు పట్టం కట్టడం ఎంతైనా సముచితమూ, స్వాగతార్హమూ. పాట కవులందరికీ కోటిదండాలు. -
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్‌తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్‌లెస్ మెలోడిస్‌ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్‌తో పాటు ‘సేవ్ ది గర్ల్‌చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్‌లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్‌హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!
అందరూ ఇప్పుడు న్యూ ఇయర్ జోష్‌లో ఉన్నారు. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ప్లాన్స్ వేస్తున్నారు. అయితే డిసెంబరు 31న రాత్రి తెలుగోళ్ల దాదాపు కేక్ కట్ చేయడం లేదంటే పార్టీ చేసుకోవడం లాంటివి చేయడానికి రెడీ అవుతుంటారు. ఈ సెలబ్రేషన్స్‌కి మరింత ఊపు తెచ్చేందుకు కొన్ని సాంగ్స్ ఉండాలి. అలా 2023లో వచ్చిన కొన్ని సాంగ్స్.. ఈ రోజు పార్టీలో ప్లే చేశారనుకోండి. మీ జోష్ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంటుంది. దిగువన ఉన్న పాటల్లో అన్ని కాకపోయినా సరే కొన్నైనా సరే ప్లే చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్‌లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్‌గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
2023లో యూట్యూబ్ ని షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే
-
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సలార్ సాంగ్..!
-
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్‌లెస్ కేక్’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
పేద పిల్లలకు సంగీతం నేర్పిస్తున్న అక్కాచెల్లెళ్లు
‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్ స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్‌తో అప్డెట్ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్ చేశారు. ‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్ కల్లోల కాలంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల. -
చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్‌తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్‌గా..) చంద్రమోహన్‌కు ఇష్టమైన 30 పాటలు. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ లేత చలిగాలులు– మూడు ముళ్లు దాసోహం దాసోహం – పెళ్లి చూపులు సామజవరాగమనా – శంకరాభరణం ఈ తరుణము – ఇంటింటి రామాయణం ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం అటు గంటల మోతల – బాంధవ్యాలు ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం ఏమని పిలవాలి – భువనేశ్వరి మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి నీ తీయని పెదవులు– కాంచనగంగ నీ చూపులు గారడీ– అమాయకురాలు (ఇది చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) వ్యక్తిగత జీవితం.. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. -
ఆటా.. పాట.. అండాదండ
‘‘నడువు నడువు నడువవే రామక్కో.. కలిసి నడుము కట్టవే రామక్కా.. గులాబీల జెండలే రామక్కా..’’ భారత్ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార రథాలు, బహిరంగ సభా వేదికలపై నుంచి మార్మోగుతున్న పాట ఇది. కల్వకుర్తి రైతుకూలీ కొమ్ము లక్ష్మమ్మ గళం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి లక్షలాది ‘వ్యూ’లతో దుమ్ము రేపుతోంది. ఈ తరహా పాటలు, లక్ష్మమ్మ లాంటి వందలాది గొంతులను ఎన్నికల ప్రచార సభలో పదునైన ఆయుధంగా వాడుతున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. వాస్తవానికి రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ‘పాట’ను ముందు భాగంలో నిలిపి తన ఎజెండాను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ‘గళబలం’తో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఉద్యమంలో అగ్రస్థానం..: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో స్థానిక చరిత్ర, సంస్కృతి, అమరుల త్యాగాలు, కరువు దుఃఖాన్ని ప్రతిబించిబే పాటలతో ప్రజల్లో భావ వ్యాప్తి ద్వారా చైతన్యం నింపేందుకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కొన్నిసార్లు తానే స్వయంగా కలం చేతబూని కొత్త పాటలు సృష్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ‘ధూం ధాం’ వంటి వేదికల ద్వారా వందలాది మంది తెలంగాణ కవి గాయకులు తమ ఆట పాటలతో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చారు. ఎన్నికల ప్రచారంలోనూ..: తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పాటను ఆలంబనగా చేసుకుని జన సామాన్యానికి చేరువైంది. ఉద్యమ కాలం నాటి ‘ఎనుకముందు జూసుడేంది రాజన్న.. ఓ రాజన్న .. ఎత్తుర తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న’, ‘మన ఓటు మన తెలంగాణకే అన్నో రామన్నా.. మన ఓటు మన కారు గుర్తుకే అక్కో సీతక్కా..’ అంటూ తెలంగాణ తెగువను, చైతన్యాన్ని గుర్తు చేస్తూ 2014 ఎన్నికల ప్రచారంలో జనంలోకి వెళ్లిన బీఆర్ఎస్ తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘మానవతకు మారు పేరు కేసీఆర్ సారూ.. మళ్లీ గెలిచి రావాలె.. మనసుగల్ల సర్కారు’ అంటూ బీఆర్ఎస్కు మద్దతుగా పాటలు కట్టిన కవులు, గాయకులు పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ విజయాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనం భాషలో వివరిస్తూ కళా బృందాలు ఆడి పాడుతున్నాయి. అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వందలాది కళాలు, గలాలు పుట్టుకొచ్చి తెలంగాణ కరువు, దుఃఖాన్ని కళ్లకు కట్టాయి. ఓ వైపు తెలంగాణ సంస్కృతిని చాటుతూనే మరోవైపు రాష్ట్ర సాధన వైపుగా జనసామాన్యాన్ని చైతన్యవంతులను చేశాయి. కవులు, కళాకారులను కరివేపాకులా తీసేయకుండా వారికి అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌దే. – దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాట బలం తెలిసిన వ్యక్తి కేసీఆర్ పాట బలాన్ని తెలుసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఎన్నికల ప్రచారసభల్లో తెలంగాణ తెచ్చిన వారిని, అభివృద్ధి బాటను చూపిన వారిని గుర్తుంచుకోండి అని ఆట పాటలతో ప్రజలకు చెబుతున్నాం. – పెద్దింటి మధుప్రియ పాటకు గొడుగు పట్టిందే కేసీఆర్ రాజకీయం పాటను ఎప్పుడూ స్వార్ధానికే వాడుకుంది. కానీ పాటను మరిచిపోకుండా అక్కున చేర్చుకుని గౌరవించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఉద్యమ కాలం నాటి కలాలు, గళాలను రాజకీయ అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్‌దే. – మిట్టపల్లి సురేందర్, కవి, గాయకుడు పాటకు పదవులు తమ కలాలు, గళాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కవి గాయకులు పలువురిని.. రాష్ట్రం సాధించి అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తగిన విధంగా అందలమెక్కించారు. 580 మంది కవులు, కళాకారులకు ‘సాంస్కృతిక సారధి’ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో మమేకం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విభాగాన్ని ముందుండి నడిపిన రసమయి బాలకిషన్ ఇప్పటికే రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ వాగ్గేయకారుడిగా పేరొందిన గోరట వెంకన్న గవర్నర్ కోటాలో, ఉద్యమాన్ని తన పాట, మాటతో ఉర్రూతలూగించిన కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రచార వేదికలపై అంతా తానై వ్యవహరించిన గాయకుడు వేద సాయిచంద్‌కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆకస్మిక మరణానంతరం భార్య రజనికి కార్పొరేషన్ పదవి ఇవ్వడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటివి కళాకారుల్లో సరికొత్త ఆత్మ విశ్వాసాన్ని, భరోసాను నింపాయి. సాయిచంద్ మరణం తర్వాత జరుగుతున్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మిట్టపల్లి సురేందర్, పెద్దింటి మధుప్రియ, ఏపూరి సోమన్న తదితరులు బీఆర్ఎస్ ఆటపాటల బాధ్యతను తలకెత్తుకున్నారు. - కల్వల మల్లికార్జున్ రెడ్డి -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!
బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్‌తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్‌లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు. View this post on Instagram A post shared by Ed People (@ed.people) (చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!) -
మెగాస్టార్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్.. లిస్ట్ ఇదిగో!
మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలో అంత క్రేజ్ మరెవరికీ లేదు. అంతలా కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇటీవల రిలీజైన భోళాశంకర్ వరకు ఆయన ప్రయాణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్రవేశారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే సినీ కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్‌కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. 1. చమక్ చమక్ చాం - కొండవీటి దొంగ - విజయంశాంతి 2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా - రంభ 3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి 4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి 6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి 7. ఇందువదన కుందరదన - ఛాలెంజ్- విజయశాంతి 8. సందె పొద్దులకాడ - అభిలాష- రాధిక శరత్‌కుమార్ 9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - రాక్షసుడు- సుహాసిని 10. సిన్ని సిన్ని కోరికలడగ - స్వయంకృషి- విజయశాంతి 11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన 12. జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి 13. చుక్కల్లారా చూపుల్లారా - ఆపద్బాంధవుడు- మీనాక్షి 14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే 15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్ 16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. - ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్ 17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ 19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
సహజ వాగ్గేయకారుడు
జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు,సంత్ రవిదాసు సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ‘జననాట్యమండలి’ సృష్టికర్త. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్ సెల్ నుంచి ‘సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని విని పించి సైనిక కవాతు చేయించిన సైన్యా ధ్యక్షుడు ఆయన. 1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిల బడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అని దళితులకు చైతన్యాన్నీ, ధైర్యాన్నీ, పోరాట శక్తినీ కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయా నికి రాళ్లెత్తాడు. అంబేడ్కర్ కుల నిర్మూ లన ఉద్యమానికి గద్దర్ వెన్ను తట్టాడు. చేతిలో ఎర్ర జెండా ఉన్న ప్పుడు కూడా గుండెల్లో అంబేడ్కర్‌ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘దళిత పులులమ్మ’ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. గద్దర్ కారంచేడులో దళితులు చనిపోయిన ప్రదే శానికి వచ్చినప్పుడు ‘వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేద’ని స్థానిక దళితులు చెప్పారు. అప్పుడు గద్దర్ ఈ పాట రాశాడు. ‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాల సాయిబు వడ్డెర జాతికి మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందె మాడితే ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా అన్న మాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మటై్ట మన్నులో మన్నై – పండించిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.’ ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్ దళిత బిడ్డ. ఆయన అంబే డ్కర్ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు. తరువాత జన నాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా జన నాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. అది ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్‌పై దళిత ఉద్యమ ప్రభావం పడింది. దాని ఫలితమే ఈ పాట. మొదటి సారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిప త్యాన్ని జోడించి పాడటం ప్రారంభమైంది గద్దర్‌తోనే! ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్ 1న ‘చలో చీరాల’ మహాసభలో గద్దర్ పాడాడు. ఈ పాట ఒక ఉజ్జ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు 3 లక్షల మంది దళితులు ‘దళిత మహాసభ’ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్‌లో హాజరయ్యారు. ఈ వ్యాస రచయితే అధ్యక్షత వహించాడు. గద్దర్ నిజానికి ఒక తాత్త్వికుడు. నీకిష్టమైన పాటేదంటే ‘ఏలరో ఈ మాదిగ బతుకు’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్: ‘ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే మంచినీళ్లు కరువాయే’ అని గద్దర్ సామా జిక తత్త్వాన్నీ, సామాజిక సమస్యనూ దళిత జాతీయ దృక్పథంతో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు. దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్నీ అవి ఏ పేరుతో ఉన్నా గద్దర్, మాష్టార్జీ ప్రభావంతోనే పాటలు పాడుతూ వచ్చాయి. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్ ప్రభావం సాంస్కృతికంగా బలంగా ఉందనక తప్పదు. మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత భేదాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన పాట లతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత ‘ 98497 41695 -
మన ‘పాల్ రాబ్సన్’!
‘గద్దరమ్మ నోటికి దండం’ అనేవాళ్లు, ఇప్పుడు ‘గద్దర్’ నోటికి దండాలు పెట్టే రోజులొచ్చాయి! ఒక ఉద్యోగిగా సరి పెట్టుకుని, పెరుగుతున్న ధరలతోనే రాజీపడి బతుకు భారాన్ని చిరునవ్వుతో మోసుకుంటూ కాలక్షేపం చేయలేక, కళారంగాన్ని కదనరంగంగా మార్చిన విప్లవ కవితా ఉద్యమ వారసుడు, కవి, మధుర గాయకుడు అయిన గుమ్మడి విఠల్ రావు (గద్దర్) కాకతీయ మహాయుగానికి, తెలంగాణ విప్లవోద్యమానికి కారణమయిన తెలంగాణలో పుట్టి పెరిగిన వాడు. సామాజిక అసమానతలపైన, అన్యాయాలపైన అతని విమర్శ వ్యక్తిగతమైనది కాదు, వ్యవస్థాగతమైనది. నిత్య హత్యా సత్యమైన ఆస్తిహక్కుకు బద్ధవిరోధి. అది రద్దు కానంత వరకు ఈ కుల వ్యవస్థ, ఈ మత దురహంకార వర్గ సమాజం మారదనీ, మానవుడు మారడనీ నమ్ముతున్నవాడు. సరికొత్త బాణీలతో, సొంత గొంతుతో అట్టడుగు ప్రజల యాసలో, మాండలిక భాషలో కళారంగాన్ని విప్లవీకరించిన వ్యక్తిగా గద్దర్‌కు ఈ దేశంలోనే కాదు, ఖండాంతరాలలో కూడా పోలిక – నీగ్రో బానిసల బతుకులకు అర్థం చెప్పి వాళ్ళ బాధల గాథలే పల్లవిగా, అను పల్లవిగా, వీధి వీధినీ గానం చేసి అజ్ఞాత జీవితాలకూ, అస్థిరమైన ప్రవాస జీవితాలకూ నాద బ్రహ్మగా నిలిచిన పాల్ రాబ్సన్ ఒక్కడే! ఆ బానిసల గర్భశోకానికి శ్రుతిగా సంగీతం వెలయించిన పాల్ రాబ్సన్ 1950లలో ‘ఫిస్క్ జూబ్లీ గాయకుల’కు ప్రత్యక్ష వారసుడు. స్పానిష్ అంతర్ యుద్ధంలో సమర గీతాలు ఆలపించాడు. ఈ సమర కళాయాత్రను సహించలేని అమెరికా పాల కులు రాబ్సన్ నోరు నొక్కబోయారు. అతని గాన సభలను దేశ మంతటా నిషేధించారు. విదేశాలకు వెళ్ళకుండా పాస్‌పోర్ట్ నిరా కరించారు. అయినా జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ దేశంలోనూ, దేశాంతరాలలోనూ ప్రభుత్వాలూ, అధికారులూ, సంస్థలూ, జీవన రంగంలో సర్వ విభాగాలకు చెందిన మేధావులూ రాబ్స న్ను తలకెత్తుకున్నారు. అలాంటివాడు మన గద్దర్. ‘ఫెస్క్ జూబ్లీ’ గాయకులకు రాబ్సన్ వారసుడైనట్లే, నూతన ఫక్కీలో శ్రీకాకుళ గిరిజనోద్య మానికి అక్షర రూపమిచ్చిన జముకుల కథకు జనకుడు, గాయ కుడూ అయిన పాణిగ్రాహి జానపద కళాసృష్టికీ ప్రత్యక్ష వార సుడు గద్దర్. పాణిగ్రాహి జముకుల కథలోని కథకుడైన చిన బాబు వయస్సు ఆనాటికి 14 ఏళ్ళే అయినా బుద్ధిలేని ప్రభుత్వం రైల్వే స్టేషన్లో జనం మధ్యనే అరెస్ట్ చేసి అర్ధరాత్రి అడవులలో ‘ఎన్కౌంటర్’ జరిపి ఆ ‘అభిమన్యుడి’ని పొట్టన పెట్టుకుంది! నాటి ఆంధ్ర కళారంగంలో విప్లవానికి అదే నాంది. రచ యితలను, కళాకారులను నిర్బంధించడం ఏ ప్రభుత్వ పతనా నికైనా తొలి మెట్టు అవుతుంది. అప్పుడు ఎవరికి వారే ఆలోచించుకుని కాంగో కవి ‘లెవెన్ ట్రీ’ అన్నట్టుగా ‘తన విముక్తికి తానే నడుం కడతాడు.’ కనుకనే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంత కల్లోలానికి కలం, గళం సారథ్యం వహించిన పాణిగ్రాహి గానీ, తెలంగాణలో గిరిజన ప్రాంతాలలో దోపిడీ వ్యవస్థపై గజ్జె కట్టి గుండె చప్పుళ్ళు విన్పించిన గద్దర్ గానీ లక్షలాది జనాన్ని కదిలించారు. గద్దర్ బాణీ విప్లవ రచయితల సంఘానికి ‘పారాణి’గా అమరింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి చేతుల మీదుగా, ఒకనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పునరుద్ధరణ పొందిన ఎన్నో జానపద కళారూపాలు ఆనాటి వాతావరణాన్ని పుణికి పుచ్చుకోగా ఇటీవల పాణిగ్రాహి, గద్దర్ చేపట్టిన కళా రూపాలు సరికొత్త ఫక్కీలో తెలుగు భారతి నొసట వీర రస గంగాధర తిలకాలు దిద్దాయి! అందుకే తెలుగు బుర్రకథను రమ్యమైన కళాఖండంగా తీర్చిదిద్ది దేశాన్ని ఊపివేసిన నాజర్ కూడా పాణిగ్రాహి, గద్దర్ ప్రయోగాలను కళ్ళ కద్దుకున్నాడు. కథకు, వర్ణనకు, హాస్యా నికి, గంభీరతకు, రౌద్రానికి, కరుణకు, కాఠిన్యానికి, బీభత్సానికి, రమ్యతకు, సభ్యతకు – ఒకటేమిటి, నవరసాలకు మించిన నవ్య పోషణకు నగలు తొడిగే సామాన్యుని నాగరికతా సంస్కృతుల నట్టింటి మాణిక్యంగా గద్దర్ బృందం దిద్ది తీర్చినదే జన నాట్యమండలి! అమరవీరులను తలచుకుంటూ అతను రాసిన ‘పాదాపాదాల పరిపరి దండాలు’, ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలామ్’ పాటలు, ఖవాలీ,సంగీత నృత్య రూపకాలు మరపురాని కళాస్మృతులు. గద్దర్, వంగపండు ప్రసాద్ (విశాఖ బాణీలో) ‘జజ్జనక జనారే’ అనే పాట విన్నప్పుడు ఈ జోస్టాలే 'Rumba' పాట గుర్తుకొస్తుంది! గద్దర్ అంగోలా కవి అగస్తినో నేటో లాంటివాడు. గద్దర్ రాష్ట్ర సరి హద్దులు దాటి, దండకారణ్యంలో దూకి, రాముడికి బదులు పరశు రాముడై సంచరించి, మణిపూర్, అస్సాం ఉద్యమాల ఊపిరిని కూడా పొదుగుకొని, భాషల అక్షరాభ్యాసం చేసి హైదరాబాద్‌లో మళ్ళీ పొద్దుపొడుపై వాలాడు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు – రచనా కాలం ఫిబ్రవరి 25, 1990 abkprasad2006@yahoo.co.in -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని
కరీంనగర్: డీజే పాటలు.. స్నేహితులతో డ్యాన్సులు.. చుట్టూ కేరింతలు.. ఆనందంతో ఆడిపాడుతున్న ఓ బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. అధ్యాపకులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుతో మరణించింది. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో విషాదం నెలకొంది. శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ విద్యార్థిని గుండు ప్రదీప్తి(16) గుండెపోటుతో మృతి చెందింది. గంగాధర మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య–శారదల కూతురు ప్రదీప్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలింది. ఉపాధ్యాయులు వెంటనే సీపీఆర్ చేస్తూ.. గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా.. మార్గంమధ్యలో చనిపోయింది. ప్రదీప్తి చిన్నప్పుడే గుండెకు రంధ్రం ఉండగా.. మందులు వాడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
జవ సత్వాలున్న జన గళం
ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ఆయన ఆలోచన, రచనలు... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. ఆయన భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తుపాకీ తూటా సహా ‘మహాబోధి’ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ... విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనంలో ఉండిపోతాయి. న్యాయం కోసం తనకు తానుగా ఒక ప్రజా గీతంగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా అవతరించిన గద్దర్ (75) – గుమ్మడి విఠల్ – ఆగస్టు 6న కన్నుమూశారు. ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ప్రజా గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో 1970లలో గద్దర్ రాసిన పాట తెలుగునాట మోతెత్తిపోయింది. సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా / నీవు సినబోయి గూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు మళ్లి, తర్వాత ఒక జాతీయ బ్యాంకులో క్లర్కుగా చేసి, కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలి, తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత, నక్సలైట్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పూర్తి సమయం గాయ కుడిగా మారారు. చిన్న చిన్న సభల్లో, కొన్నిసార్లు వీధుల్లో పాటలు పడుతూ, జనాన్ని సమీకరిస్తూ సీపీఐ–ఎంఎల్ (పీపుల్స్ వార్)లో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యారు. పీడిత వ్యవసాయ ఉత్పాదక రంగ ప్రజానీకం మీద; భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాల మీద తనదైన శైలిలో పాటలు రాసి, పాడి, భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కదం తొక్కించారు. సాయుధ విప్లవం మాత్రమే ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యా మ్నాయాన్ని నిర్మించగలదని చాలాకాలం పాటు నమ్మికతో ఉన్నారు. గద్దర్ అనే తన పేరును ఆయన అమెరికా గదర్ ఉద్యమం నుంచి తీసుకున్నారు. చివరికి ఆ పేరు మావోయిస్టు పోరాటాలకు భారతీయ చిహ్నంగా మారింది. 1997లో గద్దర్ అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఆయనపై జరిగిన కాల్పులలో ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దిగబడ్డాయి. వైద్యులు నాలుగు తూటా లను బయటికి తీయగలిగారు. మిగతా ఒక తూటా మొన్నటి రోజున ఆయన అంతిమ శ్వాస తీసుకునే వరకు పాతికేళ్లకు పైగా ఆయన శరీరం లోపలే ఉండిపోయింది. ధైర్యం, దృఢచిత్తం, వివేకం, వినయం... అదే సమయంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇవీ గద్దర్‌లోని గుణాలు. క్రమంగా ఆయనకు తెలిసి వచ్చినదేమంటే... మావోయిస్టు విప్లవం ఎక్కడికీ దారి తీయడం లేదని. దాంతో దళిత ఉద్యమం వైపు మళ్లి, ప్రజాదరణ పొందే విధంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టాడు. 1985లో కారంచేడు కమ్మ భూస్వాములు ఎనిమిది మంది దళితులను దారుణంగా హత్య చేసినప్పుడు ఆయన రాసిన పాట ఇది: కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ దళితులను ఏకం చేసేందుకు ఈ పాట ఆయుధంగా మారింది. అక్కడి నుంచి ఆయన అంటరాని తనం, అంబేడ్కరిజం, రాజ్యాంగవాదంపై పాటలు రాయడం ప్రారంభించారు. 1990లో మండల్ వ్యతిరేక ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. సామాజిక న్యాయం, ప్రతిభ అన్నవి మండల్ అనుకూల,మండల్ వ్యతిరేక శక్తుల సైద్ధాంతిక లంగర్లు అయ్యాయి. కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ అగ్రవర్ణ నాయకుల నేతృత్వంలో స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అప్పటి ఎడిటర్ అరుణ్‌శౌరీ మేధోపరమైన మండల్ వ్యతిరేక ఉద్య మానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో గద్దర్ రాసిన పాట మండల్ అనుకూల శక్తులకు ఆయుధంగా మారింది. అరుణ్శౌరిగో నీకు ఆకలి బాధేమెరుక నెయ్యి కాడ నువ్వుంటే పియ్యికాడ మేముంటం ఈ పాట చాలామంది అగ్రవర్ణ విప్లవకారులకు నచ్చలేదు. కానీ మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్న ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలకు స్ఫూర్తినిచ్చేందుకు గద్దర్ ఆ పాటను బహిరంగ సభలలో పాడుతూనే ఉన్నారు. 1990వ దశకం చివరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మెల్లిగా గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల శక్తిగా మారారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా... బలే.. బలే.. బలే... ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. గద్దర్ ఎప్పుడూ టీఆర్ఎస్కు బహిరంగ మద్దతుదారు కానప్పటికీ మావోయి స్టుల మద్దతుతో సమాంతర రాడికల్ తెలంగాణ అనుకూల గ్రూపు లను నడిపించారు. ఈ క్రమంలో మావోయిస్టు భావజాలంతో గద్దర్ వ్యతిరేకించారు. వర్గపోరు మాత్రమే సరిపోదు, కులపోరాటాన్ని చేపట్టాలని భావించారు. అనేక విముక్తి బలాలను కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని గుర్తించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని మావోయిస్టులను ఒప్పించేందుకు పార్టీతో అంతర్గతపోరును సాగించారు. అయితే సహజంగానే వారు తమ పాత వర్గ పోరాట పంథాను మార్చుకోడానికి నిరాకరించారు. దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చి నేటి భారత రాజ్యాంగాన్ని సమర్థించిన, సమర్థిస్తున్న అనేక ఇతర శక్తులతో కలిసి పని చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రాజకీయ, సైద్ధాంతిక శక్తులతో సన్నిహితంగా మెలిగారు. అప్పటికే గద్దర్‌పై ఆయన మావోయిస్టుగా ఉన్నప్పటి కేసులు అనేకం ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే కొంత కాలం గద్దర్, నేను... సీపీఎం మద్దతు ఉన్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌లో కలిసి పని చేశాం. మరోవైపు ఆయన కాంగ్రెస్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రసంగించిన కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్‌ను, సోనియాగాంధీని కలిశారు. గద్దర్ జీవితం వీరోచిత పోరాటాల అవిశ్రాంత గాథ. ఒక్క రెండు పాటలు తప్ప మిగతా ముఖ్యమైన పాటలన్నీ తనే రాసి, పాడినవి. గద్దర్ పాడటంతో ప్రాచుర్యం పొందిన ‘బండెనక బండి కట్టి’ పాట 1940లలో నిజాంకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో యాదగిరి రాసినది. రెండో పాట: ఈ ఊరు మనదిర, ఈ వాడ మనదిర / దొర ఏందిరో, వాని పీకుడేందిరో. ఈ పాటను మరో ప్రముఖ దళిత గాయకుడు, రచయిత గూడ అంజయ్య రాశారు. గద్దర్ తన గళంతో ఆ పాటను ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పల్లెకు తీసుకెళ్లారు. గద్దర్ ఆలోచన, రచన... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. వంటపని, వీధుల పారిశుధ్యం,ఇంటిని శుభ్రంగా ఉంచే హింసాత్మక శ్రమలలోని నొప్పిని పాటలుగా మలిచారు. ఇంటికి చీపురు చేసే సేవలోని గొప్పతనంపై ఆయన రాసి, పాడిన పాట అత్యంత తాత్వికమైనది. అంబేడ్కర్ అడుగుజాడల్లో గద్దర్ తన పూర్వపు కమ్యూనిస్టు నాస్తికత్వాన్ని పక్కనపెట్టి సరైన బౌద్ధేయుడు అయ్యారు. గద్దర్ భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తూటా సహా ‘మహాబోధి’ (పేద పిల్లల కోసం ఆయనే స్థాపించిన పాఠశాల) ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ, మానవ సమానత్వంపై ఆయన ప్రేమ, విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనం జీవనంలో ఉండిపోతాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కాదు.. కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు... -
యూట్యూబ్ స్టార్‌గా ఎదగాలనుకుంటున్నారా? సెజల్ సక్సెస్ మంత్ర ఇదే
ఆరోగ్యం నుంచి బాలీవుడ్ వరకు రకరకాల వీడియోలు చేస్తూ డిజిటల్ క్రియేటర్‌గా దూసుకుపోతుంది దిల్లీకి చెందిన సెజల్ కుమార్. ‘ఫ్యాషన్–పాట–డ్యాన్స్’ ఆమె బలం. మన దేశంలోని టాప్ యూట్యూబ్ స్టార్లలో సెజల్ ఒకరు. దిల్లీలోని ‘ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదువుకున్న సెజల్ కుమార్‌కు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. తండ్రి ఆర్మీ మేజర్. దిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. టర్కీకి వెళ్లినప్పుడు ‘సమ్మర్ స్టైల్’ పేరుతో తొలి వీడియో అప్లోడ్ చేసింది. ఆ తరువాత సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది.చానల్ కోసం చేసిన అయిదు వందలకు పైగా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ‘ఇండియన్ గర్ల్ బ్యాక్‌ప్యాకింగ్ ఇన్ యూరప్’ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. సెజల్ తల్లి గైనకాలజిస్ట్. ‘ఒక గైనకాలజిస్ట్‌ను అమ్మాయిలు అడగాలనుకునే సందేహాలపై వీడియోలు చేయవచ్చు కదా’ అని చానల్ ప్రేక్షకులలో ఒకరు అడిగారు. ఆమె కోరిక మేరకు సెజల్ తల్లితో కలిసి చేసిన ‘మామ్ అండ్ మీ’ సిరీస్ బాగా పాపులర్ అయింది. ఎలాంటి ప్రశ్న అయినా స్వేచ్ఛగా, నిస్సంకోచంగా అడిగే వాతావరణాన్ని ‘మామ్ అండ్ మీ’ కల్పించింది. సెజల్‌కు బాగా నచ్చే సబ్జెక్ట్‌లలో ఫ్యాషన్ ఒకటి. స్ట్రీట్ స్టైల్, స్ట్రీట్ వీడియోలపై మంచి పట్టు ఉంది. తన చానల్ 1 మిలియన్ ఫాలోవర్ మార్క్‌ను చేరుకున్నప్పుడు ‘ఓ మై గాడ్’ అనుకుంది ఆనందంగా. ‘ఇదంతా నేను సొంతంగా సాధించాను’ అనే ఆనందం సెజల్‌కు మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. తన గొంతులోని ఛార్మింగ్ క్వాలిటీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబర్‌గా సెజల్ విజయరహస్యం ఏమిటి? ఆమె మాటల్లో...‘మొదటి సూత్రం...గుడ్క్వాలిటీ కంటెంట్. గత వీడియో కంటే తాజా వీడియో ఎంతో కొంత బాగుండాలి. రెండో సూత్రం...ఎప్పుడో ఒకప్పుడు కాకుండా నిరంతరం ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుండాలి. మూడో సూత్రం...ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. వారికి ఎలాంటి వీడియోలు కావాలో తెలుసుకోవాలి’ సెజల్ యూట్యూబ్ చానల్ ప్రేక్షకులలో మహిళలు ఎక్కువ. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఉంటారు. ‘ఒక కాలేజీ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి మీ పేరుతో కనిపించే వీడియో కనిపిస్తే చాలు క్షణం ఆలస్యం చేయకుండా చూస్తాను అని చెప్పింది. ఆమె మాటలు విన్న తరువాత మరింత కష్టపడాలి అనిపించింది’ అంటుంది సెజల్. ‘కాళీ కాళీ’ మ్యూజిక్ ట్రాక్ సింగర్‌గా ఆమె ప్రతిభకు అద్దం పట్టింది. ఎన్నో వ్యాపారప్రకటనల లో నటించిన సెజల్...‘కలలను నిజం చేసుకునే విషయంలో అధైర్యం వద్దు. మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి’ అంటుంది. జైపూర్‌లోని మణిపాల్ యూనివర్శిటీలో ‘హౌ టు మేక్ యూట్యూబ్ ఏ కెరీర్?’ అనే అంశంపై సెజల్ చేసిన ప్రసంగం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపించింది. -
ఆమెపాటకు అరవై ఏళ్లు
వరలక్ష్మికి గాత్రం దేవుడిచ్చిన వరం. గురువులు లేరు... శిక్షణ లేదు. రేడియో ఆమెకుపాటలు నేర్పింది. రేడియో ఆమెచేతపాడించుకుంది. ఆలయాలు ఆమెపాటలకు వేదికనిచ్చాయి. ఇప్పుడామె ముంబయిలో తెలుగు స్వరం. వరలక్ష్మి నారాయణమ్ పుట్టిల్లు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. రేడియోలో వచ్చినపాటలు వింటూపాడడం నేర్చుకున్నారు. అందుకే కాబోలుపాటపాడాలనే అభిలాష ఉన్న వాళ్లను ఏర్చికూర్చి, వాళ్లకుపాడడంలో మెళకువలు నేర్పించి, వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చిపాడించారు. ఘంటసాల జయంతి రోజున ఘంటసాలపాటలుపాడడానికి మహామహులైన గాయకులు పో టీ పడుతుంటారు. కరతాళ ధ్వనులలో ఉ΄÷్పంగిపో తుంటారు. జనం వారినే చూస్తారు, వారికే హారతులు పడుతుంటారు. కానీ...పాడాలనే తపన ఉన్న అనేక మంది ఆశావహుల ముఖాలను చూశారామె. వారిలో గృహిణులున్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు కూడా ఉన్నారు. ఇలాంటి గానాభిలాషులతో ఘంటసాల జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేవారు వరలక్ష్మి. బీఈడీ చేసిన వరలక్ష్మిపాఠాలు చెప్పడంలో స్వరం మాధుర్యం కోల్పోతుందేమోనన్న భయంతోపాటల కోసంపాఠాల ఉద్యోగానికి దూరమయ్యారు.పాటపాడక పో తే తోచదు. ఇప్పుడు ముంబయిలో నివసిస్తున్నప్పటికీ అక్కడి తెలుగు వారిని ఒక చోటకు చేర్చడానికిపాటనే మాధ్యమంగా చేసుకున్నారామె. అరవై ఐదేళ్ల వరలక్ష్మి అరవై ఏళ్ల తనపాటల ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ► పాట చాలా ఇచ్చింది! ‘‘నేనుపాట కోసం జీవితాన్ని అంకితం చేశాననే ప్రశంస సంతోషంగా ఉంటుంది. కానీపాటకు నేను చేసిన సేవకంటేపాట నాకిచ్చిన గుర్తింపు, గౌరవమే పెద్దది.పాట నాకెంతో ఇచ్చింది. ఐదేళ్ల వయసులో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘంటసాల గారితో కలిసి ‘ఆకాశవీథిలో అందాల జాబిలి’పాడాను. నాలో గాయని ఉందని గుర్తించిన స్కూల్ టీచర్లు ఏ కార్యక్రమం అయినా నాతోపాడించేవారు. ఇక కాలేజ్‌లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్‌గా తీసుకున్నాను. మా సరోజిని మేడమ్ ఎక్కడ పో టీలు జరిగినా నన్ను పంపేవారు. సినీనటి సుమలత మ్యూజిక్‌లో నా క్లాస్మేట్. ఆ పరిచయం ఉన్నప్పటికీ నేను సినిమా గానం వైపు వెళ్లలేదు. రేడియోలో ‘బి గ్రేడ్’ సింగర్‌గా సెలెక్ట్ అయ్యాను. ‘ఈ మాసపుపాట, లలిత గీతాలు’ లెక్కలేనన్నిపాడాను. టీవీలో తరిగొండ వెంగమాట కీర్తనలు, సమస్త దేవతా కీర్తనలనుపాడడంతోపాటు బాణీలు కూడా కట్టాను. ఆరు సొంత ఆల్బమ్‌లు చేశాను. మా రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాల్లేవు. చాలా మంది మహిళలకు తమపాటలను రికార్డు చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఇంట్లో సహకారం లేక ఆశను చంపేసుకునేవారు. అలా నా దృష్టికి వచ్చిన వారందరి చేత సొంత ఆల్బమ్‌లు చేయించగలిగాను. పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నంత కాలం నాపాటయానం ఇన్నర్ వీల్ సర్వీస్‌తో కలగలిసిపో యి సాగింది. మా అబ్బాయి చదువు కోసం తిరుపతికి మారాం. అప్పుడు మరో మలుపు తీసుకుంది. తిరుపతిలో ఉన్నంత కాలం ‘ఘంటసాల స్వరాభిషేకం’ కార్యక్రమంలో వందల మందితో అన్నమాచార్య కీర్తనలు, సాధారణపాటలుపాడించాను. వీటన్నింటిలో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన తిరుమలలో జరిగింది. ► గిరులు ప్రతిధ్వనించాయి తిరుమల రేడియో స్టేషన్ ్రపారంభోత్సవానికి ఆహ్వానించారు. వామన చరిత్రపారాయణం చేశాను. తిరుమలలోనే మరో సంఘటన వేదపాఠశాలలో జరిగింది. మా వదిన తిరుప్పావైపాటలను తెలుగులో రాశారు. ఆపాటలకు నేను ట్యూన్ కట్టాను. ముప్పైవపాట ట్యూన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలోనే ఉన్నాను. వేదపాఠశాల నుంచి ఆహ్వానం వచ్చింది. గోవిందనామాలతో మొదలుపెట్టి తిరుప్పావైపాశురాలన్నీపాడాను. అప్పుడు వేదపాఠశాల గురువులు, ఐదు వందల మంది విద్యార్థులు గొంతుకల్లో పలికిన ఆశీర్వచనం తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించింది.పాటను కమర్షియల్‌గా మార్చకుండా కళగా గౌరవిస్తే భగవంతుడు తనవంతుగా ఇనుమిక్కిలిగా ఇస్తాడని నమ్ముతాను. రెమ్యూనరేషన్ ఇవ్వలేని వాళ్ల కోసం సొంత ఖర్చులతో వెళ్లిపాడిన సందర్భాలున్నాయి. అందుకే నాకు ఆహ్వానాలు కూడా ఎక్కువే వస్తుంటాయి. తెలుగు నేల మీద ఆలయాలన్నీ నాపాటను ఆహ్వానం పలికాయనే చెప్పాలి. ఆర్కెస్ట్రాతో వెళ్తే తప్పనిసరిగా ఖర్చులుంటాయి. అందుకే చెన్నైకి వెళ్లి ట్రాక్‌లు రికార్డు చేయించుకున్నాను. నేను, నా ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లిపాడతాను. దేశవిదేశాల్లోనూ నా స్వరం వినిపించే అవకాశం వచ్చింది. ► మెండైన ప్రోత్సాహం పాట కోసం నేను టీచర్ ఉద్యోగాన్ని వదులుకుంటానంటే మా వారు రెండోమాటకు తావులేకుండా ్రపో త్సహించారు. ఆయన కెమిస్ట్రీ ప్రోఫెసర్‌గా రిటైరయ్యారు. మా అబ్బాయికి రిలయెన్స్‌లో ఉద్యోగం. తనుపాడతాడు కానీ వృత్తిగా కాదు. మనుమరాళ్లిద్దరికీ మంచి గొంతు ఉంది. వాళ్లకు నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నా దగ్గర క్రమశిక్షణగా కూర్చునిపాడలేకపో తున్నారు. రెండుపాటలుపాడి ‘ఇక ఆడుకుంటాం నానమ్మా’ అని వెళ్లిపో తారు’’ అన్నారామె నవ్వుతూ. అరవై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. ‘పాట కోసం గొంతు సవరించుకోని రోజు నాకు అనారోగ్యం వచ్చినట్లు. ఇంత వరకు ఒక్కరోజు కూడా ముసుగుపెట్టి పడుకున్నది లేదు.పాటలోనే నా ఆరోగ్యం,పాటతోనే నా జీవితం’ అన్నారు వరలక్ష్మి నారాయణమ్. – వాకా మంజులారెడ్డి -
నాన్న పాటలు మాటలు
అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్‌ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్‌టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్‌హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు. తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్‌లు పెట్టారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు. నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ. – సోనాల్ కపూర్ నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం. – సోనాక్షి సిన్హా స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం. – సుహానా ఖాన్ బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు చెప్పేవారు. – అనన్య పాండే నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్! – కరీనా కపూర్ మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్‌లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!! – ఆలియా భట్ -
నేను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలంటే?
-
మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా?
అమ్మ...ఆ పదం పలకడానికి పెదాలు కమ్మగా కదులుతాయి. అలా పిలవడానికి మనసు నిలువెల్లా పులకరించి గొంతులో ఏకమవుతుంది. అమ్మ గర్భంనుంచి బయటకొచ్చిన బిడ్డ కూడా ఈ ప్రపంచంకంటే ముందు అమ్మనే చూస్తుంది. అమ్మనే పిలుస్తుంది. అమ్మా అనే ఏడుస్తుంది. అమ్మ చుట్టూనే ప్రపంచం.. అమ్మ ఉంది కాబట్టే ప్రపంచం. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మను కీర్తిస్తూ అలరించిన గీతాలపై ఓ లుక్కేద్దాం. అమ్మంటే ప్రేమకి పర్యాయపదం. అమ్మ మనసు అనురాగ నిలయం. అమ్మ కమ్మని కథలు చెబుతూ.. నమ్మలేని లోకాల్ని కళ్లముందు చూపెడుతుంది. అంతే కాదు.. అమ్మ ధైర్యాన్ని నూరిపోస్తుంది. కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దుతుంది. ఐనా కొడుకెప్పుడా ఆ మమతల తల్లి మదిలో చిన్నిపిల్లవాడే. జన్మనిచ్చేదే అమ్మ అయినపుడు... ఆ అమ్మకు జన్మనిచ్చింది కూడా అమ్మే అయినపుడు అమ్మను మించిన దైవమేముంటుంది.. ఆ మాట మనుషులే కాదు.. ఆ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకే అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే అన్నారు. అమ్మ గురించి వింటుంటే.. అమ్మను చూస్తుంటే.. అమ్మ ఒడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే.. ప్రతిదీ మనసు ఫలకంపై అక్షరాలు దిద్దినంత గట్టిగా తాకుతుంది. అమ్మ ప్రేమకన్నా విలువైన సంపద ఈ సృష్టిలో లేనేలేదు. అమ్మ ఆప్యాయత ముందు ఏదీ నిలవదు. వందమంది దేవుళ్లు ఎదురుగా వచ్చి నిలబడినా.. ఆమ్మ అందించే ప్రేమ ముందు తక్కువే అవుతారు. కంటికి వెలుగునిచ్చే అమ్మ కదిలే దేవతే కదా. అమ్మా అని తొలిపలుకు పలికే అదృష్టం పెదాలకు దక్కిన అదృష్టమే కదా! సృష్టిలో ఒక మనిషికే కాదు.. ఏ జీవికైనా అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మలోని కమ్మదనం.. అమ్మప్రేమలోని మధురం ఒక్కటే. జన్మనిచ్చే తల్లే ఎవరికైనా తొలిదైవం... ఏ జీవికైనా అమ్మే ఒక వరం. బిడ్డ అలిగితే తల్లి బుజ్జగిస్తుంది. బ్రతిమిలాడో, బామాడో అన్నం తినిపిస్తుంది. అప్పుడే తన కడుపు నిండినట్టు భావిస్తుంది. ఐతే.. కొన్ని సందర్భాల్లో అమ్మ కూడా అలకబూనుతుంది. అప్పుడు కొడుకు పడే వేదన హృదయాన్ని తాకుతుంది. అమ్మ మీద ప్రేమని చెప్పకనే చెబుతుంది. అమ్మ అనే రెండక్షరాల పదం కంటే గొప్పది ఎవరు మాత్రం రాస్తారు. అసలు అంతకంతే గొప్పమాట.. అమ్మగురించి పాడటంకంటే గొప్ప పాట ఏముంటాయి? రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతున్నా... తనును నడిరోడ్డుమీద వదిలేసినా.. ఏ తల్లీ బిడ్డను శపించదు.. ఆకలికడుపుతో అలమటిస్తూనే నవ్వుతూ బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది. అమ్మా అని ప్రేమగా పిలిస్తే చాలనుకుంటుంది. మనిషైనా.. మాకైనా.. అమ్మకు.. అమ్మ మనసుకు ఆ భేదాలేమీ ఉండవు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది.. పాలిస్తుంది.. లాలిస్తుంది. ప్రాణంకంటే మిన్నగా కాపాడుకుంటుంది. జాబిల్లిని పిలిచినా... బూచోడని భయపెట్టినా ఊరుకోని బిడ్డ... అమ్మ చేతి స్పర్శ తగిలితే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే అమ్మ పిల్లల ప్రాణాలను తన అరచేతుల్లో పెట్టుకుని బతుకుతుంది. మన జీవితంలో అమ్మ లేని చోటుండదు.. అమ్మను స్మరించుకోని క్షణాలుండవు. మనకు తెలిసినా.. తెలియకపోయినా.. తమకు మాటలు నేర్పిన అమ్మను పిలవడానికి, తలవడానికి పెదాలెప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. బాధకలిగితే అమ్మా.. అలసిపోయేంతగా నవ్వితే అమ్మ.. దెబ్బ తాకితే అమ్మ.. కన్నీళ్లొస్తే అమ్మ.. కడుపు మాడితే అమ్మ.. కడుపు నిండినా అమ్మే.. అమ్మ తలపురాని చోటుండదు. ఎందుకంటే తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లలతోనే ఉంటుంది. అమ్మ బంధం కంటే వరమేముంటుంది... ఇలలో అంతకంటే సంతోషాల ఆనందం ఏముంటుంది. అందుకే అమ్మగురించి రాయని వాళ్లులేరు. అమ్మ జోలపాట గుర్తొచ్చి పాడనివాళ్లూ లేరు. అసలు ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు కూడా అమ్మే. అది అమ్మకు మాత్రమే సొంతమయ్యే ఘనత. బిడ్డకు ఎలాంటి హాని జరిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. దగ్గరుండి మనసు గాయాల్ని మాన్పుతుంది. మరి అమ్మకే తీరని కష్ణమొస్తే.. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ?కనిపెంచిన అమ్మకు ఏమైనా జరిగితే.. తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి కష్టకాలంలో ఆమ్మ జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది. వయసంతా వెనక్కి మళ్లి అమ్మ ఒడిలోకే పారిపోతుంది. నిజమే కదా... ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా.. బిడ్డను గుండెలకు హత్తుకుని.. ఆకశంలో విరిసే హరివిల్లును బిడ్డ బోసినవ్వుల్లోనే చూసుకునే అమ్మ మెరిసే మేఘం.. కురిసే వాన. అమ్మ గురించి పాడినా.. అమ్మగురించి రాసినా.. అమ్మగురించి మాట్లాడినా... అమ్మ గురించి చదివినా జన్మ గుర్తొస్తుంది. జన్మజన్మలకు అమ్మకు మొక్కుతూనే ఉండాలనిపిస్తుంది. కడుపున పుట్టకపోయినా... ఒక పసిబిడ్డ అమ్మకు కన్నబిడ్డలాగే కనిపిస్తుంది. ఒక అనాదను తీసుకొచ్చి పెంచుకున్నా..నిజమైన తల్లిమనసుకు ఎప్పుడూ పరాయి అనే భావమే ఉండదు. ఉంటే అమ్మ అనిపించుకోదు. ఇప్పుడు ఎంతో మంది తల్లులు అనాథపిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ప్రేమించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మకు సాటి పోటీ ఏమీ లేదు. ఏమన్నా ఉంటే అది మళ్లే అమ్మే అవుతుంది.. అక్కడకూడా అమ్మే ఉంటుంది. బిడ్డ కంటికి రెప్ప అమ్మ. ప్రేమైక శక్తి అమ్మ. ప్రపంచమంతా అమ్మను ఈరోజు విష్ చేయొచ్చు.. కానీ ఆ ప్రపంచాన్ని అమ్మ ఎప్పుడూ విష్ చేస్తూనే ఉంటుంది. అమ్మను ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రేమిద్దాం. ప్రేమగా పలకరిద్దాం. -
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్‌షీట్‌లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్‌కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్‌లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్‌షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్‌ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
'పడిపోతున్నా నిన్ను చూస్తూ..' సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్ ) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'పడిపోతున్న' అనే సెకండ్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. 'గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ చక్కని సంగీతం అందించారు. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రానికి టైటిల్ సాంగ్‌కి పనిచేశారు. అంత బిజీగా ఉన్నా అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమా చెయ్యడం విశేషం. చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.' అని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. 'రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. ట్విస్టులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నా. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా పని చేస్తున్నాం. ఈ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.' అని అన్నారు. -
పుతిన్‌ని పాటలతో విమర్శించే సంగీత కళాకారుడు అనూహ్యంగా మృతి
పుతిన్‌ని తన పాటలతో విమర్శించే ఒక సంగీత కళాకారుడు అనూహ్యంగా మృతి చెందాడు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అతడి పాటలు మరింత పేరుగాంచాయి. ఈ మేరకు సంగీత కళాకారుడు 35 ఏళ్ల డిమా నోవా తన ముగ్గురు స్నేహితులు, సోదరుడితో కలిసి గడ్డకట్టిన వోల్గా నదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు మంచులో పడి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది రష్యా. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు బయటపడగా, మరోక స్నేహితుడు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డిమా సోదరుడు రోమా, మరో ఇద్దరు స్నేహితులు మాత్రమే ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఐతే ఆ సంగీత కళాకారుడి పూర్తి పేరు డిమిత్రి స్విర్గునోవ్, పైగా అతను ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్రూప్ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. అతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని తరుచుగా విమర్శిస్తు పాటలు పాడేవాడు. అతను పాడిన పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిని వివాదాస్పదమైన పాట ఆక్వా డిస్కో ఉక్రెయిన్‌పై మాస్కో చేస్తున్న దాడికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలో ఉపయోగించారు రష్యా ప్రజలు. దీంతో ఆ నిరసనలు కాస్త చివరికి డిస్కో పార్టీలుగా మారిపోయాయి. అంతేగాదు ఆ గాయకుడు తన పాటలో పుతిన్‌కి సంబంధించిన పదివేల కోట్ల విలాసవంతమైన భవనాన్ని కూడా విమర్శించారు. పైగా ఈ పాట 'పుతిన్ ప్యాలెస్' పాటగా పేరుగాంచడమే గాక దీని గురించి ఒక రష్యన్ కమెడియన్ అలెగ్జాండర్ గుడ్కోవ్ సరదాగ కాసేపు మాట్లాడటంతో ఈ పాట మరింత విశేష ప్రజాదరణ పొందింది. View this post on Instagram A post shared by CREAM SODA (@creamsodamusic) (చదవండి: ఇన్స్టంట్ కర్మ అంటే ఇదేనేమో!.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి) -
క్యాపిటల్ దాడులకు సపోర్ట్ చేస్తూ..'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ ట్రంప్ పాట
అమెరికాలోని జనవరి 6న క్యాపిటల్‌పై జరిగిన దాడులకు మాజీ అధ్యోడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. నాటి అల్లర్లకు పాల్పడిన దోషులుకు సపోర్ట్ చేస్తూ 'జస్టీస్ ఫర్ ఆల్' అంటూ పాటను ఆలాపించారు. దీన్ని స్పూటీఫై,యాపిల్ మ్యూజిక్, యూట్యూబ్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ పాటగా అందుబాటులో ఉంచారు. దీంతో ట్రంప్‌కి ఈ పాటను స్వరపరిచిన ఘనతను కూడా లభించింది. వాస్తవానికి ఇది క్యాపిటల్ దాడులకు సంబంధించిన ఆరోపణలపై జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారుల కుటుంబాలను ఆదుకోవాడనికి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటను రికార్డు చేశారు. ఈ మేరకు ట్రంప్ నాటి అల్లర్లుకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బృందం స్వచ్ఛంద సంస్థకు సహకరించారు. ఆ పాట చివర్లో ఖైదీలు యూఎస్ఏ అని ఉంటుంది. ఈ పాట విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. ఐతే నేఈ పథ్య పాట ఖైదు చేయబడిన వారి కుటుంబాల కోసం డబ్బును సేకరించడానికి ఉద్దేశించిందే కావచ్చు గానీ పోలీసు అధికారిపై దాడి చేసిన కుటుంబాలకు మాత్రం ప్రయోజనం చేకూరదని అని ఫోర్బ్స్ మ్యాగ్జైన్ పేర్కొంది. అంతేగాదు ట్రంప్ ఈ పాటను ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రికార్డ్ చేశారు. ఖైదీలు తమ పాటలను జైలు ఫోన్లో రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా, నాటి దాడిలో ట్రంప్ మద్దతుదారుల అల్లర్లలో గాయపడిన పోలీసులు, ఇతరులు ఆయనపై దావా వేయవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. అతేగాదు ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయలుదేరడానికి రెండు వారాల ముందే ఈ అల్లర్లు జరిగాయి. (చదవండి: స్కిన్ క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడ్డ బైడెన్..ఇక ఎలాంటి..) -
'విజిల్ విలేజ్'! అక్కడ శిశువు పుట్టిన వెంటనే..కొత్త రాగం పుట్టుకొస్తోంది!
ఇంతవరకు ఎన్నో గ్రామాలు గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలో లేక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు గురించో విని ఉంటాం. కానీ ఇలాంటి విచిత్రమైన గ్రామం పేరు ఇప్పుడూ దాక విని ఉండే అవకాశమే లేదు. పైగా ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డును కూడా గెలుచుకుంది. వివరాల్లోకెళ్తే.. మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో కాంగ్‌థాంగ్ అనే గ్రామం ఉంది. దీన్ని 'విజిల్ విలేజ్'గా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు తమ తోటి గ్రామస్తులను పేర్లతో పిలవరు. ఒక ట్యూన్(రాగం) పేరుతో పిలుచుకోవడమే ఇక్కడ ప్రత్యేకత. తమ సందేశాలను తెలియజేయడానికి ఈలలు వేయడం వంటివి చేస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు, మరోకటి పాట పేరు. షార్ట్ ట్యూన్లో ఇంటిలో పిలుచుకుంటే ఊరిలో ఉన్నప్పుడూ లాంగ్ ట్యూన్‌తో పిలుచుకుంటారు. ఈ గ్రామంలో సుమారుగా 700 మంది గ్రామస్తులు ఉన్నారు. అందరికీ విభిన్న రాగాల ట్యూన్లు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్‌థాంగ్ గ్రామ నివాసి ఫివ్‌స్టార్ ఖోంగ్సిట్ మాట్లాడుతూ...ఒక వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ట్యూన్‌ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అలాగే అక్కడ గ్రామస్తుడు ఎవరైన చనిపోతే అతనితో పాటే అతడిని పిలిచే ట్యూన్ కూడా చనిపోతుందట. అక్కడ ఉండే ప్రతి ఒక్క గ్రామస్తుడికి ఒకో రాగం పేరుతో పిలుచుకుంటారు. ఈ రాగాలతోటే వాళ్లు ఒకరితో ఒకరు సంభాషించుకుంటామని చెబుతున్నారు. ఇది వారికి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు స్థానికులు. గతేడాది పర్యాటక మంత్రిత్వశాఖ కాంగ్‌థాంగ్ ఉత్తమ పర్యాట గ్రామంగా ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసింది. అంతేగాదు 2019లె బిహార్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని యూనెస్కో ట్యాగ్ ఇవ్వాల్సిందిగా సూచించారు కూడా. (చదవండి: యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్) -
మహాశివరాత్రి స్పెషల్.. శివుని ప్రత్యేక గీతాలు
మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం. ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001) ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాదం -శ్రీ మంజునాథ (2001) శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు. ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్ జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు. ఎట్టాగయ్యా శివా శివా మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. భ్రమ అని తెలుసు సాంగ్ బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది. మాయేరా అంతా మాయేరా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది ఓ మహాదేవా సాంగ్ 1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు. లింగాష్టకం సాంగ్ లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది. -
హైదరాబాద్ టు వైజాగ్ వయా కర్నూలు
దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు విజువల్ ట్రీట్‌లా ఉంటాయి. భారీ ఖర్చుతో పాటలు చిత్రీకరించడం శంకర్ స్టయిల్. పైగా ఒకే పాటను వివిధ రకాల లొకేషన్స్‌లో తీస్తుంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ అలానే జరుగుతోంది. ఈ చిత్రం కోసం రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో న్యూజిల్యాండ్‌లో ఓ పాటను చిత్రీకరించారు. ఇప్పుడు మరో పాట చిత్రీకరణలో ఉన్నారు. ఈ పాటను తెలుగు రాష్ట్రాల్లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్ లొకేషన్లో ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత కర్నూలులోని కొండారెడ్డి బురుజు లొకేషన్లో, ఆ నెక్ట్స్ వైజాగ్‌లోని జగదాంబ సెంటర్లో చిత్రీకరణను ప్లాన్ చేశాను. కొండారెడ్డి బురుజు దగ్గర కొంత భాగం చిత్రీకరించి, వైజాగ్ షిఫ్ట్ అయింది యూనిట్. ఈ పాటను దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారని టాక్. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు
మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్‌కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే! మ్యాథ్స్ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఫలితం ఇప్పుడా టీచర్ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్‌కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబర్చి, టీచర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు. చార్పత్తర్తో.. విద్యార్థులు ఆడుకునే చార్ పత్తర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. డయల్ యువర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. పాటలతో ఎక్కాలు బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్ డిజిటిల్స్ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. నాన్న స్పూర్తితోనే! మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. టూర్లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్‌ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్ పర్సంటెజ్ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజ్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాను. – పెందోట రూపారాణి జాతీయ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్ బోధించే విధానాన్ని జాయ్ ఫూల్ లెర్నింగ్ మ్యాథ్స్ బై గేమ్స్ యూజింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పేరుతో ఎగ్జిబిట్లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్ కుమార్ -
ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి: నాగ చైతన్య
సాయి రామ్ శంకర్ , యాశ శివ కుమార్ జంటగా నటించిన చిత్రం 'వెయ్ దరువెయ్'. సునీల్ , కాశి విశ్వనాథ్ , పోసాని కృష్ణ మురళి , పృథ్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దేవరాజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో నాగచైతన్య చేతులమీదుగా విడుదల చేశారు. నాగ చైతన్య మాట్లాడుతూ..' ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సినిమా చూడాలన్న కూతుహలాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవ్వాలి.సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది.'అని అన్నారు. హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ.. 'నాగచైతన్య చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది రెండో సాంగ్. మొదట రిలీజైన మంజుల మంజుల సాంగ్‌కు చాల మంచి విశేష స్పందన వచ్చింది. ఈ సాంగ్ మరింత బాగా సక్సెస్ సాధిస్తుంది.' అని అన్నారు. దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ ఒప్పుకున్నారు హీరో సాయి. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాననే అనుకుంటున్నా. నా మీద నమ్మకం తో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు థాంక్స్'.అని అన్నారు. ప్రొడ్యూసర్ దేవరాజ్ మాట్లాడుతూ.. 'నవీన్ నాకు కథ చెప్పగానే ఎంతో నచ్చింది. కథ మీద నమ్మకంతో ముందుకు వచ్చా. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా. సాయి కెరీర్లో మరొ మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. baraju_SuperHit: #Veydharuvey Title Song lyrical Video Released by Yuva Samrat @chay_akkinenihttps://t.co/ltnmKw3784@sairaamshankar @YashaShivakumar@dirnaveenreddy@actordevaraj 🎼@Bheems1 🎙️@Rahulsipligunj ✍️@lyricistsuri @ntrsarath9999 @Moviepro… pic.twitter.com/lk53qwGaUU — daily film news (@jagadishpichika) January 24, 2023 -
రంజితమే సాంగ్.. కాలు కదిపిన కడుపులో బిడ్డ
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సినిమా వారసుడు(వారిసు). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలోని రంజితమే రంజితమే అంటూ సాగే సాంగ్ విజయ్ ఫ్యాన్స్‌తో పాటు థియేటర్లను ఓ రేంజ్లో ఊపేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను సైతం షేక్ చేసింది. అయితే ఈ పాటకు తాజాగా ఓ మహిళ కడుపులోని బిడ్డ సైతం కదలడం వైరల్‌గా మారింది. రంజితమే సాంగ్ ప్లే చేస్తున్నప్పడు ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న కదలడం కనిపించింది. దీంతో ఆ మహిళ ఆనందంతో మురిసిపోయింది. తన బిడ్డ డ్యాన్స్ చేయడాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది. ఈ వీడియోను చూసిన సంగీత దర్శకుడు తమన్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ వీడియో చూస్తుంటే చాలా మధురానుభూతికి లోనవుతున్నా.. ఇది నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసింది.' అని పోస్ట్ చేశారు. Such a divine feel How Cute this is made my day 🥹❤️ #Ranjithame 💃🤍🍭 https://t.co/3eRNztekDP — thaman S (@MusicThaman) January 14, 2023 -
తెలుగు తెరపై సంక్రాంతి సరిగమల సందడి
-
స్వరరాగ గంగా ప్రవాహం
-
దటీజ్ సీఎం.. మరోమారు మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి పాట సీఎం జగన్ వ్యక్తిత్వం పట్టి చూపేదే
-
2022 టాప్ టెన్ సాంగ్స్
-
పాటలు పాడే ఫ్లాస్కు.. ఓ సారి వింటే మైమరిచిపోవాల్సిందే!
ఫ్లాస్కు చాలాకాలంగా అందరికీ తెలిసిన వస్తువే! పానీయాల ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడానికి ఫ్లాస్కులను ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రయాణాల్లో ఫ్లాస్కులు ఎక్కువగా అవసరమవుతాయి. సుదూర ప్రయాణాల్లో బోరు కొట్టకుండా ఉండటానికి చాలామంది సంగీతం వింటుంటారు. ప్రయాణంలో సంగీతం వినడానికి మరో సాధనం అవసరమవుతుంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ ఫ్లాస్కు వెంట ఉంటే, దీనితోనే సంగీతం కూడా వినొచ్చు. ఇందులో కోరుకున్న పానీయాన్ని నింపుకొని తీసుకుపోవచ్చు. అలాగే, దీనిలో అమర్చి ఉన్న బ్లూటూత్ స్పీకర్ ద్వారా కోరుకున్న పాటలు కూడా దారిపొడవునా వింటూ ప్రయాణాన్ని ఆహ్లాదభరితంగా సాగించవచ్చు. ఇందులోనే అమర్చి ఉన్న ఫ్లాష్ లైట్ మరో ఆకర్షణ. అమెరికన్ కంపెనీ ‘వీఎస్ఎస్ఎల్’ ఇటీవల ఈ ఫ్లాస్కును మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 115 డాలర్లు (రూ.9,390) మాత్రమే! చదవండి: సేల్స్ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెకను లాభం రూ. 1.48 లక్షలు! -
యూత్‌ని రాక్ చేస్తున్న మాషప్ మ్యానియా
-
‘బిట్ బోర్డ్’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!
ఎలక్ట్రానిక్ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్ డిజైనర్ చెన్ సిన్ ఈ పరికరాన్ని ‘బిట్ బోర్డ్’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్స్’ పోటీల్లో ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అవార్డును కూడా సాధించారు. ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్‌ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి
వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి జయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి వినాయకుడికి తెలుగు సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంది. విఘ్నేశ్వరుడి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి, విజయాలు సాధించాయి. మరెన్నో చిత్రాల్లో స్వామిని కీర్తిస్తూ వచ్చిన సన్నివేశాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. గణనాథుడి నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు, పాటలపై ఓ లుక్కేద్దాం.. వినాయక చవితి వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ చదువుకుని, పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఈ కథ ఆధారంగా సముద్రాల రాఘవాచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల తదితరులు నటించారు. కె. గోపాలరావు నిర్మించిన ఈ సినిమా 1957 ఆగస్టు 22న విడుదలైంది. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే.. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటంవల్ల సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకుంటాడు. ఆ తర్వాత వినాయక వ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకుని బయటపడతాడు. అందరూ చవితి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే, ఆ గజానుని ఆశీస్సులతో ఎలాంటి నీలాప నిందలపాలు కాకుండా ఉంటారనే కథతో ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలై 65 ఏళ్లు అయింది. భూ కైలాస్ పరమశివుని భక్తుడైన రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. ఆత్మలింగం సాధించి, అమరత్వం పొందాలన్నది రావణాసురుడి కోరిక. ఆయన తపస్సును మెచ్చుకున్న శివుడు ఆత్మలింగం ఇస్తూ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని షరతు విధిస్తాడు. రావణాసురుడికి అమరత్వం వస్తే భూ మండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించిన నారదుడు ఆత్మలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు. రావణాసురుడు సంధ్యా వందనం చేసే సమయంలో శివుడి ఆత్మలింగం రావణుడి పాలు కాకుండా చేస్తాడు వినాయకుడు. చివరకు ఆత్మార్పణకు సిద్ధపడిన రావణాసురుణ్ణి కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహించడంతో కథ ముగుస్తుంది. ఎన్టీఆర్ రావణునిగా, ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్’ చిత్రకథ ఇది. కె. శంకర్ దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమా 1958 మార్చి 20న రిలీజైంది. శ్రీ వినాయక విజయం వినాయకుడి జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం ‘శ్రీ వినాయక విజయం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, వాణిశ్రీ శివపార్వతులుగా నటించారు. శివదీక్షా వ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి, దానికి ప్రాణం పోసి, కాపలాగా ఉంచుతుంది పార్వతీదేవి. అప్పుడు వచ్చిన శివుణ్ణి లోనికి అనుమతించడు ఆ బాలుడు. ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండిస్తాడు శివుడు. దీంతో పార్వతి తన బిడ్డను ఎలాగైనా బతికించమని శివుణ్ణి కోరుతుంది. ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు శివుడు. ఆ బాలుడు మూషికాసురున్ని సంహరించిన తీరు, మూషికాసురుని జన్మ వృత్తాంతం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. 1979 డిసెంబరు 22న ఈ చిత్రం విడుదలైంది. జై జై గణేశా... తెలుగు సినిమాల్లో గణనాథుణ్ణి కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో సాగుతుంది. వెంకటేష్ నటించిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా..’ పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవ’ సినిమాలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా..’ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డిక్టేటర్’ మూవీలోని ‘గం గం గణేశా..’ అనే పాట కూడా ఆకట్టుకుంది. ‘దేవుళ్లు’ సినిమాలోని ‘జయ జయ శుభకర వినాయక..’ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు. మహేశ్‌బాబు ‘పోకిరి’ సినిమాలోని జగడమే పాటలో ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ వచ్చే బిట్ సూపర్‌గా ఉంటుంది. రామ్ ‘గణేష్’ మూవీలో వినాయకుడిపై ఒక పాట ఉంది. ‘దేవదాస్’ సినిమాలో నాగార్జున, నాని వినాయకుణ్ణి కీర్తిస్తూ పాడే పాట పాపులర్ అయింది. నాని ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ ‘పవర్’ సినిమాల్లో వినాయక చవితి ప్రస్తావన ఉంది. ఇవే కాదు.. మరికొన్ని సినిమాల్లోనూ గణేశుణ్ణి కీర్తిస్తూ పాటలున్నాయి. -
చిరంజీవి పాటలకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ..
-
అట్లుంటది మనతోని.. షూటింగ్ ముందే పూర్తి చేస్తా..
తమిళసినిమా: తన సినిమాలను షూటింగ్‌కు ముందే సంగీతాన్ని అందిస్తానని.. యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ తెలిపారు. తొలి చిత్రం అంబులితోనే గుర్తింపు పొందిన శ్యామ్ విక్రమ్ వేదా చిత్రంతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపు పడేలా చేసుకున్నారు. తాజాగా సుళల్ వెబ్ సిరీస్‌కు, మాధవన్ దర్శక, నిర్మాణంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటించిన రాకెట్రీ చిత్రానికి ఈయన అందించిన సంగీతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శనివారం ఆయన మాట్లాడుతూ తెలుగులో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Anasuya Bharadwaj: వెబ్ సిరీస్‌లో వేశ్యగా యాంకర్ అనసూయ ? -
International Dance Day: కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు..
సినిమా పాటలే కాదు.. ఈమధ్య లోకల్ బీట్స్ కూడా హుషారుగా జనాలతో గంతులేయిస్తున్నాయి. అందుకు సోషల్ మీడియా కారణం అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్.. ఇలా షార్ట్ వీడియో యాప్స్ ద్వారా ఆ బీట్లు దేశం దాటి విదేశాలకు చేరిపోతున్నాయి. ప్రత్యేకించి స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే(ఏప్రిల్ 29). ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో అలా వైరల్ అయిన కొన్ని పాటలపై లుక్కేద్దాం. అరబిక్ కుతు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలోని సాంగ్. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డులతో పాటు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు లిరిక్స్ హీరో శివకార్తికేయన్ రాయగా, అనిరుధ్-జోనితా గాంధీ కలిసి పాడారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు మాత్రం ఉర్రుతలూగించాయనే చెప్పాలి. నాటు నాటు దేశంలోని యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్, మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని అందుకుంటూ దాదాపు అన్ని భాషలలో భారీ విజయమే అందుకుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్.. కీరవాణి కంపోజిషన్‌కి కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్‌లు గాత్రం అందించారు. ప్రేమ రక్షిత్ కంపోజ్ చేసిన నాటు స్టెప్పులకు తారక్, రామ్ చరణ్‌ల అడుగులు తోడై.. ఆడియొన్స్తో ఈలలు వేయించాయి. ఇది కూడా చదవండి: ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్, ఆచార్య బయటపడేనా? శ్రీవల్లి సాంగ్ తగ్గేదే లే అంటూ దేశం మొత్తం పుష్పమేనియాతో ఊగిపోయింది చాలాకాలం. రగ్గుడ్ లుక్‌లో బన్నీ స్టయిల్, ముఖ్యంగా డైలాగులు పుష్ప కు భారీ విజయాన్ని కట్టబెట్టాయి. ఇంకోవైపు ఈ సినిమాలోని పాటలు కూడా భాషలకతీతంగా ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన శ్రీవల్లి సాంగ్‌లో పుష్పరాజ్ వేసిన స్టెప్పులు ఖండాంతరాలు దాటి.. క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలు అనుకరించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడిపోలి.. మ్యూజికల్ ఆర్టిస్ట్ సిద్ధూ కుమార్ కంపోజ్ చేసి.. డైరెక్ట్ చేసిన మలయాళం సాంగ్ ‘అడిపోలి’. వినీత్ శ్రీనివాసన్, శివాంగి అందించిన గాత్రం.. ట్రెడిషనల్ సెట్స్‌లో అదిరిపోయే బీట్స్‌తో కిందటి ఏడాదిలోనే రిలీజ్ అయిన ఈ సాంగ్ బాగా ఫేమ్ అయ్యింది. కచ్చాబాదామ్ .. పచ్చి పల్లీలు అమ్ముకునే పశ్చిమ బెంగాల్ వాసి ‘భూబన్ బద్యాకర్’ కచ్చా బాదామ్ అంటూ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాట రీమిక్స్ దెబ్బకు భూబన్ జీవితం మారిపోవడంతో పాటు ఆ పాట ఇవాళ్టికి క్రేజ్ తగ్గట్లేదు.. ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. పైగా ఇన్ఫ్లూయెన్సర్ అంజలీ అరోరా హాట్ స్టెప్పులనే ప్రతీ ఒక్కరూ ఫాలో అయిపోతున్నారు. మోడ్రన్ బ్యాలె డ్యాన్స్ సృష్టికర్త జీన్ జార్జెస్ నోవెర్రే జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. యూనెస్కో సహకారం, డాన్స్ కమిటీ ఆఫ్ ది ఇంటర్నేషన్ థియేటర్ ఇనిస్టిట్యూట్ ‘ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే’ను ఘనంగా నిర్వహిస్తుంటుంది. నృత్యంలో పాల్గొనడం, నృత్య విద్యను ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం. నృత్యాన్ని ఒక కళ రూపంగా గుర్తించడంతో పాటు అందులోని వైవిధ్యాన్ని, అందాన్ని మరింత ప్రదర్శించేలా డ్యాన్స్ డేను నిర్వహిస్తుంటారు. చదవండి: కన్నడలో లక్ పరీక్షించుకోనున్న కమెడియన్ -
శ్రీవల్లి సాంగ్‌తో అదరగొట్టిన ముంబై పోలీసులు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. చదవండి: 'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్లో అందులో ముఖ్యంగా 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్‌పై కవర్ సాంగ్స్ చేస్తూ అనేకమంది నెటిజన్స్ అలరించారు. 'తగ్గేదే లే..' అంటూ శ్రీవల్లి సాంగ్‌లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ వేస్తూ అదరగొట్టారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ఇప్పుడు తాజాగా ఈ పాటను సంగీత వాయిద్యాలతో ట్యూన్ చేశారు ముంబై పోలీసులు. ఎప్పుడూ ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసులు తమలోని మరో కళను బయటపెట్టారు. బ్యాండ్‌తో శ్రీవల్లి సాంగ్‌ను కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇవే కాకుండా సినిమాల్లోని పలు హిట్ సాంగ్స్‌ను ట్యూన్ చేస్తున్నారు ఈ పోలీసులు. అలాగే మహిళల రక్షణ కోసం పలు వీడియోలు చేసి తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తున్నారు. చదవండి: శ్రీవల్లి పాటకు 100 మిలియన్ల వ్యూస్ -
'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ సాంగ్.. పూర్తి పాట వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. సినిమా విడుదల తేది సమీపిస్తుండటంతో మూవీ ప్రమోషన్స్‌ను పెంచేసింది జక్కన్న టీం. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎత్తర జెండా' అనే సెలబ్రేషన్ యాంథమ్ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది. పూర్తి పాటను సోమవారం (మార్చి 14) విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సాంగ్ రిలీజ్‌ను తొలుత వాయిదా వేస్తున్నట్లు చెప్పి సోమవారమే విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ 'పరాయి పాలనపై.. కాలు దువ్వి.. కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ' అంటూ జక్కన్న చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. తర్వాత 'నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా' అంటూ తారక్, చెర్రీ, ఆలియా కలర్ఫుల్గా కనిపించారు. ఈ మూవీ నుంచి ఇదివరకూ రిలీజైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్, టీజర్, ట్రైలర్, పాటలు రికార్డ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సాంగ్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రౌద్రం.. రణం.. రుధిరం' సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. -
ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్ మేనియా.. ఖాతాలో మరో రికార్డు
Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్, మేకింగ్ వీడియోస్, పోస్టర్లతో అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వ్యూస్‌తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. -
మూవీ మ్యాటర్స్ 06 February 2022
-
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
మల్టీట్రాక్
-
సంక్రాంతి రాగం
-
ఈ ఏడాది మారుమోగిన టాప్ 5 సాంగ్స్ ఇవే
2021 చార్ట్ బస్టర్స్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినిమాల సంఖ్య తగ్గినా ప్రతి చిత్రంలోనూ ఒక పాట యూట్యూబ్ రికార్డ్స్ ను టార్గెట్ చేసింది. ఏడాది అంతా రిపీట్ మోడ్ లో పెట్టుకుని విన్నారు ఆడియెన్స్. ఆ సాంగ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి ‘సారంగ దరియా’ యూట్యూబ్ లో సాయి పల్లవి సాంగ్స్ అంటే రికార్డ్స్ కు కేరాఫ్ అడ్రస్ అనే మాట స్థిరపడిపోయింది. ఈ ఏడాది సారంగ దరియాతో అలాంటి సెన్సేషన్ సృష్టించింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన లవ్ స్టోరీలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో 4.5 కోట్లకు పైగా వ్యూస్ అందుకుంది. అదరగొట్టిన ‘బుల్లెట్ బండి’ సినిమా సాంగ్స్ కు తెలంగాణ ఫోక్ సాంగ్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. వ్యూస్ విషయంలో స్టార్ హీరోస్ సాంగ్స్ ను మించిపోతున్నాయి. బుల్లెట్ బండి అలాంటి రేర్ రికార్డ్ నెలకొల్పింది. మ్యారేజ్ ఈవెంట్ లో తప్పక వినిపించే పాటగా మారింది. మోహనా భోగరాజు సింగింగ్ సెన్సేషన్ గా మారింది. లవర్స్ ఫేవరేట్ సాంగ్‌గా ‘ఒకే ఒక లోకం నువ్వే’ శ్రీనివాస నాయుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా శశి. మార్చిలో థియేటర్స్ లో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఏకంగా 150 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. మనసు దోచిన ‘శ్రీవల్లీ’ పుష్ప తెలుగు వర్షన్ సాంగ్స్ లో శ్రీవల్లీ ఎక్కువగా వ్యూస్ అందుకుంది. ఈ పాట 100 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అలాగే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’కూడా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ‘లాహే లాహే’ చిరు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య. ఈ మూవీ నుంచి ఇప్పటికీ రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటిల్లో లాహే లాహే రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంది. 2021లో యూట్యూబ్ ను షేక్ చేసింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. హారిక నారాయన్, సాహితీ చాగంటి కలసి పాడారు. యూట్యూబ్ లెక్కల ప్రకారం ఈ సాంగ్ వ్యూస్ 100 మిలియన్ దాటాయి. -
భీమ్లా నాయక్‌కు డీజే మిక్స్.. న్యూ ఇయిర్కు న్యూ వెర్షన్
Bheemla Nayak Song DJ Version Released On New Year: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. అయితే ఇటీవలే ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం విడుదల తేదిని వాయిదా వేసేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకోగా పోస్ట్‌పోన్ అయింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పాటలు, గ్లింప్స్ సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు. సినిమాలోని లాలా భీమ్లా నాయక్ పాట ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ పాటకు తమన్ కొత్త వెర్షన్‌ను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే అలరిస్తోన్న ఈ పాటకు డీజే సాంగ్‌గా మలిచాడు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న డీజే సాంగ్స్ సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఈ డీజే సాంగ్స్ నెట్టింట కూడా రకరకాల రీల్స్, స్పూఫ్స్తో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ డీజే మిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ లాలా భీమ్లా నాయక్ సాంగ్ డీజే మిక్స్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న రాత్రి 7 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డిసెంబర్ 31కు స్పీకర్స్‌ను సిద్దం చేసుకోండి అని తమన్ ట్వీట్ చేశాడు. అంటే ఈ డీజే మిక్స్డ్ సాంగ్‌తో న్యూ ఇయర్ మోత మోగిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీజే మిక్స్ పాట సినిమాలో ఉండకపోవచ్చు. #LalabheemlaDJ !! Get Ready Speakers 🎵 Time to get them kept serviced !! Let’s get #Lalafied ON 31st NIGHT !! #LalabheemlaDjVersion 🎹🥁 pic.twitter.com/nf34xhoYoT — thaman S (@MusicThaman) December 29, 2021 -
సినిమా 2021
-
ఇండియన్ సినీ హిస్టరీలోనే తొలిసారి.. రాధేశ్యామ్ పాట టీజర్‌కు విశేష స్పందన
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇచ్చేందుకు బాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. చదవండి: సమంత ఐటెం సాంగ్‌కి చిందేసిన బోల్డ్ బ్యూటీ అరియానా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సంచారి సాంగ్ టీజర్ విడుదలయింది. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. కాగా పూర్తి పాట డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన పాట టీజ్‌లో అద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వెర్షన్లో రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో కొత్త భామల సందడి.. అందాలతో కట్టిపడేసిన భామలు వీరే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది. -
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు. ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ మహర్షి - సాహసం నా పథం రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా క్రిమినల్ - తెలుసా మనసా పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రముఖ గాయనీ గీతా దత్ జయంతి.. ఆమె ఆలపించిన 5 బెస్ట్ సాంగ్స్
Singer Geeta Dutt Birth Anniversary And Her Top 5 Best Songs: వినసొంపైన సంగీతమంటే ఇష్టపడనివారుండరూ. చక్కని సంగీతం వింటే ఎంత బాధ ఉన్న అప్పటివరకైతే ఒకరకమైన స్వాంతన కలుగుతుంది. నిజంగానే మ్యూజిక్‌లో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేసే సింగర్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది. అయినా ఎవరి ప్రత్యేకత వారిదే. అలాంటి గొప్ప గాయనీల్లో ఒకరు గీతా దత్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆమె గానం చేసిన 'బాబూజీ ధీరే చల్నా', 'వక్త్ నే కియా' వంటి మెలోడీలను విననివారుండరు. గీతా దత్ పాడిన పాటలు ఎంత పాతవైన వాటిలోని మాధుర్యం ఇప్పటికీ అలాగే ఉంటుంది. గీతా దత్ నవంబర్ 23, 1930న మదరిపూర్ జిల్లా బంగ్లాదేశ్‌లో జన్మించారు. ఆమెకు ముగ్గురు సంతానం. ఈ గాయనీ తన పలు బలీయమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. అల్లకల్లోలమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. తన బాధలను మర్చిపోయేందుకు మద్యానికి బానిసయ్యారు. అనంతరం 42 ఏళ్ల (జూలై 20, 1972) వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. గీతా దత్ జయంతి సందర్భంగా ఆమె ఆలపించిన మధురగానాలు ఓసారి విందామా. 1. బాబూజీ ధీరే చల్నా (ఆర్ పార్, 1954) 2. జానే కహా మేరా జిగర్ గయా (మిస్టర్ అండ్ మిస్సెస్ 55, 1955) 3. ఏ దిల్ హై ముష్కిల్ జీనా జరా హట్కే జరా బచ్కే (సీఐడీ, 1956) 4. మేరా నామ్ చిన్ చిన్ చూ (హౌరా బ్రిడ్జ్, 1958) 5. కోయీ చుప్కే సే ఆకే (అనుభవ్, 1971) -
విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి
వచ్చీరాని మాటల వయసది.. బోసి నవ్వులతో ఆలిపించిన వంద దేవుళ్లే కలిసొచ్చినా (బిచ్చగాడు చిత్రం) పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే ఒక్కసారిగా ఆ చిన్నారి వాగ్దేవి ఫేమస్ అయింది. తల్లి శాంతమ్మ పర్యవేక్షణలో ఆలపించిన ఈ గీతం టాలీవుడ్ మ్యూజిక్ మెజిషియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆరేళ్ల ప్రాయంలో జీ తెలుగు లిటిల్ ఛాంప్ సరిగమప విన్నర్‌గా నిలిచి బుల్లితెర లతా మంగేష్కర్‌గా శభాష్ అనిపించుకుంది. – మద్దిలపాలెం (విశాఖ తూర్పు) ‘వెయ్యి జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేనమ్మ’కు 60 లక్షల వ్యూస్ శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేత పల్లి నాగభూషణ్‌రావు రచించిన వెయ్యి జన్మలేత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా.. గీతాన్ని వాగ్దేవి తండ్రి వేణుమాధవ్ సంగీతం అందించారు. ఈ పాటను వాగ్దేవి ఆలపించింది. యూట్యూబ్ అప్లోడ్ చేయగా అనూహ్య రీతిలో 60 లక్షల వ్యూస్ లభించాయి. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి కేరాఫ్ కంచరపాలెం ఫేం సంగీతం దర్శకుడు స్వీకర్ ఆగస్తీ మెయిల్ చిత్రంలో వాగ్దేవికి అవకాశం కల్పించారు. ప్రియాంకదత్ నిర్మాతగా ప్రియదర్శి íహీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వాగ్దేవి టిపిరి..టిపిరి గీతాన్ని ఆలపించింది. హీరో విశ్వక్సేన్ చిత్రం పాయల్లో, జాతిరత్నలు చిత్ర సంగీత దర్శకుడు రథన్ కంపోజ్ చేసిన సిద్ శ్రీరామ్‌తో కలిసి అమ్మా అమ్మా నీ వెన్నెల.. నిత్యం నాపై ఉండాలి ఇలా...అనే గీతాన్ని ఆలపించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అటు పాటలు..ఇటు డబ్బింగ్ వాగ్ధేవి ఓ వైపు పాటలతో అలరిస్తూనే..మరో వైపు బుల్లితెర చిన్నారి నటులకు డబ్బింగ్ చెబుతోంది. రామసక్కని సీత, జెమినిలో వస్తున్న భాగ్యరేఖ సీరియల్స్‌కు డబ్బింగ్ చెబుతోంది. కీరవాణి ఫిదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్లో వాగ్దేవి ఆలపించిన అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం.కీరవాణి ఫిదా అయ్యారు. వ్యాఖ్యాతగా ఉన్న గాయకురాలు సునీతను సైతం వరెవ్వా అనిపించింది. దీంతో బుల్లితెరపై అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. సాధించిన విజయాలు ►2007 లిటిల్ ఛాంప్ విన్నర్ సాయిదేవ హర్షతో వాగ్దేవి బుల్లితెరపై పాడడం ప్రారంభించింది ►ఐదేళ్ల ప్రాయంలో లవ్ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొంది ►ఐదేళ్ల ప్రాయంలో హిందీ పాటాలు పాడేందుకు వాగ్దేవి ముంబై కేంద్రంగా లవ్మీ ఇండియా నేషనల్ సింగింగ్ రియాల్టీ షోకు ఎంపికైంది. ఈ షో హిమేష్ రేషి్మయా, నేహా బాసిన్ను తన గానంతో మైమరపించింది. ►జీ తెలుగు లిటిల్ చాంప్ సరిగమప విన్నర్ ( 2019 )గా నిలిచింది. దీంతో స్వర్ణభూమి సంస్థ రూ.35 లక్షల విలువైన విల్లా బçహూకరించారు. మ్యూజిక్ ఫ్యామిలీ వాగ్దేవి తల్లిదండ్రులు మాధవధారలో నివాసముంటున్నారు. తండ్రి సుదర్శనం వేణుమాధవ్ సంగీతం మాస్టర్‌గా, తల్లి శాంతి గాయని..అన్నయ్య సాయిదేవ హర్ష జీ లిటిల్ ఛాంప్ 2007 విన్నర్‌గా సుపరిచితులు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో... అరుణగిరి ప్రొడక్షన్లో య్యూట్యూబ్ చానల్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో 14 పాటల వాగ్దేవి ఆలపించే అవకాశం రావడం గొప్ప అవకాశమని ఆమె తల్లి శాంతి పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ సౌండ్‌తో పాటలు వింటున్నారా? ఇకపై జాగ్రత్త!
బెంగళూరు: బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి మొబైల్లో పాటలు వినడం, సినిమాలు చూడటం అలవాటు ఉంటుంది. జర్నీ బోర్ కొట్టకుండా ఈజీగా టైమ్ గడిచిపోయేందుకు ఇది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది లౌడ్ స్పీకర్‌తో పక్కన వారిని పట్టించుకోకుండా బయటకు వినపడేలా వింటున్నారు. ఈ సౌండ్స్ వల్ల బస్సుల్లోని ఇతర ప్రయాణికులకు అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. చదవండి: అమెరికా వెళ్తున్నారా ? మోత మోగుతున్న విమాన ఛార్జీలు! ఈ క్రమంలో కర్ణాటక ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఎవరైతే రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో.. వారు మొబైల్ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఈ యంత్రంతో ఢిల్లీ వాయుకాలుష్యం పరార్!! మామూలోడు కాదు.. గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్టు నిషేధం విధించాలని నిర్ణయించింది. బస్సులో అనవసర శబ్ధాల అంతరాయంపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. మొబైల్లో ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు, వీడియోలను ప్లే చేసే వినియోగాన్ని పరిమితం చేయాలని పిటిషనర్ కోరారు. చదవండి: వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు.. అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని అధికారులు (డ్రైవర్, కండక్టర్) ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది. -
పాఠం చెప్పమంటే పాట పాడుతున్న మాష్టారూ..!
యడ్లపాడు(గుంటూరు): ఆ మాష్టారూ ఎక్కడ ఉన్నా..విద్యార్థులు స్కూల్‌కు డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఆ బడిలో పుస్తకాలు తెరిచి పాఠాలు చెప్పరు..కాని అక్కడి పిల్లలకు ఆ పుస్తకాల్లోని పాఠాలన్నీ కంఠోపాఠం అవుతాయి. ప్రాథమిక విద్యాబోధనను కొందరు పిల్లల వేలుపట్టి రాయించి నేర్పిస్తారు. మరికొందరు బట్టీ పట్టిస్తారు. ఇంకొందరు బొమ్మలతో బోధన చేస్తారు. ఆయన వీటన్నింటికీ భిన్నం. అదేమని ప్రశ్నిస్తే..పాఠం ఎలా బోధించామన్నది కాదు వాటిని ఎంత శ్రద్ధగా విని పిల్లలు గుర్తుంచుకున్నరన్నదే ప్రధానమంటారు. బడి అంటే భయం..పాఠం రాలేదనే టెన్షన్ లేకుండా చెప్పడమే తన లక్ష్యం అంటారు. పాఠం పాటయితే.. ఆయన తరగతి గదికి పాఠ్యపుస్తకం బదులుగా పాటల పుస్తకం తీసుకువస్తారు. అతని చేతిలో చాక్‌పీస్‌కు మారుగా స్మాల్‌మైక్ ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన గొంతునుంచి ట్రాక్‌మ్యూజిక్ సౌండ్‌తో కమ్మని పాటలు వినిపిస్తాయి. ఆయన గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉందికదూ.. ఆయన స్వరబోధనే అక్కడ సమ్‌థింగ్ స్పెషల్ అన్నమాట. ఈ వినూత్న బోధకుడు గుంటూరు జిల్లాకు చెందిన పరావస్తు హనుమాసూరి. ఆలోచన అలా అంకురించింది... ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మాస్టారు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం అలవాటు. గుళ్లో ఓ సాయంత్రాన ఏర్పాటైన కార్యక్రమంలో భజన బృందం రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పరిస్థితిని అర్థం చేసుకుని జేబులోని సెల్‌ఫోన్ తీసి ట్రాక్‌మ్యూజిక్ ఆన్‌చేసి తనకు వచ్చిన భక్తిగీతాలను ఆలపించారు. ట్రాక్‌మ్యూజిక్‌తో పాడిన ఆయన పాటలకు అర్చకుడితో పాటు భక్తులంతా ఫిదా అయ్యారు. పెద్దవాళ్లనే ఆకర్షించిన ట్రాక్‌మ్యూజిక్ విధానం గుడితో పాటు బడిలోనూ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన అంకురించింది. పాటలతో పాఠాలబోధన ప్రస్థానం ఇక్కడి నుంచే... సూరి మాష్టారు పాటల ద్వారా పాఠాలను బోధించే స్వర ప్రస్థానాన్ని యడ్లపాడు మండలం నుంచే ప్రారంభించారు. కొండవీడు హెచ్‌డబ్ల్యూ స్కూల్‌కు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చారు. కాలనీ వాసుల్లో అత్యధికశాతం నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు కావడంతో పట్టించుకునే వారులేక పిల్లలు బడికి రావడం కష్టమైంది. పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లల్ని బడిబాట పట్టించాలనే ఆలోచన, అవ్వేషణలోనే గుడిపాట బడికి చేరింది. మైండ్‌ట్యూనింగ్ ఇదుగో ఇలా.. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వివిధ సినిమా పాటలుగా మార్చుచేసి గానం చేస్తారు. స్కూల్ ప్రారంభ దశలో పేరడీ పాటలు పాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఆకర్షిస్తారు. తర్వాత పాఠాలను వాడుక భాషలో బాగా అర్ధమయ్యేలా చిన్నచిన్న పదాలుగా తర్జుమా చేసి పాడేస్తారు. రోజు పాఠశాలకు వస్తూ తన సెల్ఫోన్లో ఏదోఒక సినిమా పాటకు సంబంధించిన మ్యూజిక్‌ట్రాన్‌ను ఎంచుకుని రావడం, ఆరోజు చెప్పాల్సిన పాఠాన్ని ఆ ట్రాక్‌లో పాడటం, పిల్లలచే పదేపదే పాడించడంతో విద్యార్థులకు కంఠోపాఠం అవుతాయి. దీంతో పాఠం శాశ్వతంగా గుర్తుండమే కాదు, తరచు అందరితో కలిసి పాడటంతో స్టేజీఫియర్ కూడా పోతుంది. అన్నింటికి మించి పిల్లల్లో ఉత్సుకత, ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిపాఠం పదమై, చిన్నగొంతులో స్వరమై వారి పెదాలపై లయబద్ధంగా నాట్యం చేస్తుంది. 500లకు పైగా పేరడీ పాటలు... మాట గుండెల్లో దూసుకెళ్లే తూటా అయితే.. ఆ గుండెగాయాన్ని మాయం చేసే పాట అమృతమే కదా. సూరి మాష్టారూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై రూపొందించిన పాటలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక పేరడీ పాటల్ని రాసి పాడించి నవ్విస్తారు. భక్తి, దేశభక్తి, అభ్యుదయం, మానవీయం కోణాల్లోనూ పాటల్ని నేర్పించి వారిని మంచి క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. సినీ గీతాలను మార్పు చేసి తనకు అనుగుణంగాఇప్పటికీ 500పైగా పాటలు రచించారు. ప్రముఖ కవి పరావస్తు చిన్నయసూరి వంశీయుడే.. నీతి చంద్రిక, బాలవ్యాకరణం, మిత్రలాభం వంటి రచించిన ప్రముఖ కవి పరవస్తు చిన్నయసూరి వంశీయులు హనుమసూరి కావడం విశేషం. మద్రాసులోనిపెరంబుదుర్ స్వస్థలం కాగా వీరి తాతగారు జీయర్‌సూరి శతాబ్ధాకాలం కిందట బతుకుదెరువు కోసం ఆంధ్రరాష్ట్రానికి కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుకు నలుగురి సంతానంలో సూరి చివరిసంతానం. పెద్దవారు ముగ్గురు కుమార్తెలే. మొదట రెంటచింతల మండలంలోని తుమ్మురుకోటలో ఉన్న వీరి కుటుంబం, ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రానికి మారారు. ఏంఏ బీఈడీ పూర్తిచేసిన సూరి ప్రస్తుతం ఇదే మండలంలోని డోకిపర్రు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలా సేవలు చేస్తున్నారు.. నాన్‌వెజ్‌తో వచ్చే ఇబ్బందులు–ఆకుకూరలతో చేకూరే ఆరోగ్యం, స్నేహం విలువ, భారతీయ సంప్రదాయాలు, తల్లిదండ్రులు, గురువులను పూజించడం, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం వంటి అనేక కోణాల్లో సూరి పేరడీ రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతిపాట సినీబాణీ అయినా..సమాజ హితాన్ని కోరే భావం అందులో దాగుంటుంది. తన పాటలు బడి,గుడిలోనే కాదు బంధుమిత్రుల శుభకార్యాలలోనూ పాడుతుంటారు. తన పేరడీ పాటలకు మెచ్చి వారిచ్చే కానుకలు, నగదును అనాధ, వృద్ధాశ్రమాలకు ఇవ్వడం సూరి సేవాగుణానికి నిదర్శనం. అదే తృప్తి..పరవస్తు హనుమాసూరి, ఎస్జీటీ చిన్ననాటి నుంచి సాహీత్యం అంటే ఇష్టం. బహుశ కవి వంశీయులు కావడమే కావొచ్చు. పేరడీ అంటే ఇష్టపడని వారుండరు. కాని అది రాయడం ఒకింత కష్టమే. సాహిత్యంలో విభిన్నం ఉండాలని, అవి భావితరాలకు, సమాజానికి ఉపయోగపడేలా ఉండలన్నదే ఆకాంక్ష. -
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
‘సంస్కారానికి నిలువెత్తు రూపం’
బాలు నిర్వహించిన ఒక పాటల రియాలిటీ షోలో పాల్గొని మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. సంగీత ప్రపంచంలో స్థానం దక్కించుని, తన సంగీత దర్శకత్వంలో బాలు పాడే స్థాయికి ఎదగాలనుకున్నారు. తన కలను నెరవేర్చుకున్నారు. బాలుతో సుమారు 15 పాటలు పాడించుకున్నారు. బాలు నుంచి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. తన ఎదుగుదలకు పరోక్షంగా బాలు ప్రేరణ అయిన విధానం తలచుకుంటూ బాలు ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కె. ఎం. రాధాకృష్ణ బాలు పాటతో పెరిగాను.. నా ఐదవ ఏట నుంచే శాస్త్రీయం సంగీతం నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి లలిత సంగీతం పాడేవాడిని. అప్పట్లో ప్రతిరోజూ రేడియోలో సినిమా పాటలు వినేవాడిని. బాలుగారి పాటలు ట్రెండీగా, కమర్షియల్‌గా అనిపించేవి. అందరూ బాలు గారి గురించి మాట్లాడుకోవటం, బాలుగారిలా పాడాలి అనుకోవటం వింటూ పెరిగాను. అందరిలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. బాలుగారికి సన్నిహితులైన కొందరి ద్వారా ఆయనను స్వయంగా చూసే అదృష్టం కలిగింది. 1998లో ఒక ప్రముఖ టీవీ చానల్లో పాటలకు సంబంధించి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోయాను. అలా మొదటి రౌండ్లోనే ఎలిమినేట్ అవ్వటం వల్ల నేను సంగీత దర్శకుడిగా మారాలనే కసి, పట్టుదల పెరిగాయి. సంగీత సాధన చేయటం ప్రారంభించాను. గాయకుడిగా కంటె, సంగీత దర్శకుడిగా స్థిరపడటం మంచిదని భావించి, దాని మీద దృష్టి పెట్టాను. ఉప్పొంగెలే గోదావరి... 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న పిల్లల కోసం తీసిన హీరో సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తొలి అడుగు పెట్టాను. అప్పటికే నేను చేసిన ఆల్బమ్స్ నా స్నేహితులు.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు వినిపించారు. ఆయనకు నచ్చటంతో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ చిత్రానికి స్వరపరిచే అవకాశం వచ్చింది. అందులో బాలు గారి చేత పాడించుకోలేకపోయాననే వెలితి నాలో ఉండిపోయింది. ఆ తరవాత ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ద్వారా ఆ వెలితి పోయింది. ఆయన ఆ పాట విని ఎంతో పరవశించారు. ఆయనతో పాడించుకోవటం వల్ల ఆ పాటకు ఎంతో అందం వచ్చింది. ఈ పాట బాలు గారు పాడితే ప్రపంచవ్యాప్తం అవుతుంది అనుకున్నాను. అదే జరిగింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్’ చిత్రంలో ‘సరోజ దళ నేత్రీ’ పాట వింటూనే బాలు గారు ‘ఈ పాట చాలా హాయిగా, అద్భుతంగా ఉంది. ఈ పాటను నేను మరింత అందం తీసుకురావటానికి ప్రయత్నిస్తాను’ అంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడారు. ఆ రాత్రి నాకు ఆనందంతో నిద్ర పట్టలేదు. అప్పుడు అనుకున్నాను, ఆ రోజు పోటీలో ఓడిపోవటం మంచిదైందని. ఆనాటి నుంచి ఈ రోజు వరకు సంగీతం మీదే నిలబడ్డాను. ఉదయం తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కష్టపడటం అలవాటైంది. విపరీతమైన అలసట, తిండి కూడా సరిగ్గా తినే సమయం దొరకనంత బిజీగా ఉన్నాను. ‘గోదావరి’ చిత్రం వల్ల చిత్ర పరిశ్రమలో నాకు గౌరవం మరింత పెరిగింది. నిర్విరామంగా, నిరంతరం కష్టపడ్డాను, పడుతూనే ఉన్నాను. ఆయనది బేస్ వాయిస్... బాలుగారిది చాలా బేస్ వాయిస్. అందువల్ల ఏ పాటనైనా సులువుగా పాడేయగలుగుతారు. ఆయన నలభై ఏభై వేల పాటలు పాడటం పూర్తిగా దైవకృప. ఆయన ఒక నిరంతర సైనికుడిలా పాడుతూనే ఉన్నారు. ఆయనను చూసి.. ‘నేను కూడా బాలుగారిలాగ పాడాలి, హెలికాప్టర్లో తిరగాలి, ఆకాశవాణి, దూరదర్శన్లలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి’ అని కలలు కనేవాడిని. నా కలలు వాస్తవం అయ్యాయి. బాలు, శంకర్ మహదేవన్, హరిహరన్, శ్రేయోఘోషల్, ఆషాభోంశ్లే వంటి వారితో పాడించే స్థాయికి ఎదగటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో చనువుగా అనేవారు... నేను స్వరపరచిన కొన్ని పాటలు విని,‘నాతో ఎందుకు పాడించలేదు’ అని చనువుగా నన్ను కోప్పడేవారు. పాటలో ఉన్న జీవాన్ని తన గొంతులో పలికించేవారు. బాలు నిరంతర శ్రమజీవి. ఆయనకు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. సహనంగా ఎన్నిటినో తట్టుకోవటం వల్లే ఈ స్థాయికి ఎదిగారు. బాలుకి ఎంతోమంది ప్రత్యామ్నాయంగా ఉన్నా, ఆయనది ‘యంగ్ వాయిస్’ కావటం వల్ల అందరూ ఆయననే కోరుకున్నారు. యువతరంలోకి కూడా పరకాయ ప్రవేశం చేసి, వాళ్ల గొంతులో దూరి ఈయన పాడటం వల్ల పాటలు బాగా హిట్ అయ్యాయి. నేను ఒక పాట ట్రాక్ రికార్డు చేసి, బాలుగారికి పంపి, ‘సర్! నాకు యంగ్ వాయిస్‌లో కావాలి’ అన్నాను. ఆయన తన గొంతుని కంట్రోల్ చేస్తూ, యంగ్ హీరోలాగే పాడారు. డబ్బింగ్ అనుభవం, టైమింగ్ తెలిసి ఉండటం వల్ల ఆయన ఎవరికి పాడితే వారు పాడినట్లే అనిపించేది. అలా ఆయన తన గొంతును మార్చేవారు. మంద్ర స్థాయిలో పాడటం బాలు చేసిన మంచి పని. చాలామందికి నమ్మకాన్ని, స్ఫూర్తిని ఇచ్చారు. బాలుగారి నిరంతర శ్రమ వల్ల ఎంతోమంది పైకి వచ్చారు. నమ్మకాన్ని పెంచింది... నాకు శాస్త్రీయ సంగీతం రాదని చెబితే, బాలుగారు, ‘శాస్త్రీయంగా పాడుతున్నావు, సంగీతం రాదంటే ఎవరు నమ్ముతారు’ అన్నారు. ఆ తరవాత నుంచి శాస్త్రీయ సంగీతం బాగా సాధన చేశాను. ఆ సంగీత సాధనే నాకు మనోబలాన్ని ఇచ్చింది. నా పాటలు విన్న బాలుగారు, ‘కమర్షియల్‌గా చేయకపోయినా పరవాలేదు, శాస్త్రీయంగానే చేయాలిరా’ అన్నారు. చాలా వేదికల మీద నా పేరు ప్రస్తావించేవారు. ఏ షోలో ఎవరు నా పాట పాడినా, నన్ను బాగా ప్రశంసించేవారు. వెంటనే నాకు మెసేజ్ కూడా పంపేవారు. అదీ ఆయన సంస్కారం. కె. ఎం. రాధాకృష్ణ, సంగీత దర్శకులు సంపూర్ణ సుగుణాల కలబోత 1996లో ఒక రియాలిటీ షోలో పాల్గొన్న కార్యక్రమం ద్వారా బాలుగారితో 60 వారాల పాటు ప్రయాణం చేశాను. కేవలం బాలుగారిని చూడటానికే ఆ రియాలిటీ షోలో పాల్గొన్నాను. ఆ తరవాత నుంచి ఆ రియాలిటీ షోలో సెలక్షన్స్ ప్రక్రియను నాకే అప్పచెప్పారు. ఒక షోలో గెలుపొంది, ఆ షో సెలక్షన్స్‌తో పాటు, అదే కార్యక్రమానికి జడ్జిగా కూడా రావటం కేవలం బాలుగారి వల్లే జరిగింది. అలా ఆయనతో ప్రారంభమైన ప్రయాణం బాలుగారి తుది శ్వాస వరకు కొనసాగింది. ఆయన నన్ను ‘కొడుకు’ అనేవారు. నాకు ఆయన పితృ సమానులు. నన్ను బాలుగారే స్వయంగా ప్రముఖ దర్శకులు బాపు గారికి పరిచయం చేశారు. నన్ను మొట్టమొదటగా అమెరికాకు తీసుకు వెళ్లింది కూడా బాలు గారే. 2001లో నా స్టూడియోని బాలు గారే ప్రారంభించారు. నా స్టూడియోలోనే సుమారు నాలుగు వేల పాటలు పాడారు. అది నా అదృష్టం. ఆయన ప్రేమను పంచే మనిషి. చాలా ఆల్బమ్స్‌లో బాలుగారితో పాడించుకున్నాను. ఆయన రూపొందించిన ఒక కార్యక్రమంలో నేను సుమారు 80 పాటలు పాడాను. దేనికీ ఒక్క పైసా పుచ్చుకోలేదు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆయన నన్ను పొగిడారు. అప్పుడు నేను ఆయనతో, ‘‘మీరు మాకు పాడే అవకాశం ఇస్తే అది మాకు అవకాశం దొరికినట్లు, అదే మేం మీతో పాడించుకుంటే అది మా అదృష్టం’’ అని చెప్పాను. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘స్వరాభిషేకం’ చిత్రంలోని ‘కుడి కన్ను అదిరెనే’ పాటను నేనే స్వరపరిచాను. చిత్రంలో టైటిల్స్‌లో నా పేరు రాదు. కాని బాలు గారు ప్రపంచానికి ఈ విషయాన్ని పదేపదే చెప్పటం వల్లే నేను ఆ పాట చేశాననే విషయం అందరికీ తెలిసింది. తండ్రిలా ఉండేవారు... నాకు బాగా ఊబ కాయం రావటంతో, ఆయనే దగ్గరుండి నాకు బేరియాటిక్ సర్జరీ చేయించారు. ఆయనకు నా మీద ఉన్న పుత్రవాత్సల్యంతో చేసినందుకు నాకు ఆనందం అనిపించింది. చిన్న పిల్లలతో తూము నరసింహదాసు కీర్తనలు పాడించాను. అందులో ప్రతి ఎపిసోడ్‌కి ఆయన ముందు మాట చెప్పారు. నేను నిర్వహించిన ‘భాగవతం పద్యాలు’ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఏ కార్యక్రమానికీ నా దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. అంతటి మహానుభావుడు. ప్రతి దశలోనూ అడుగడుగునా చెయ్యి పట్టుకుని నడిపించిన పెద్ద మనిషి. నేను ఆయనను వ్యక్తిగతంగా పోగొట్టుకున్నాను. ‘‘నేను పార్థు అడిగితే ఏదీ కాదనలేను’’ అనేవారు. ఆయనకు నేను చేసే కార్యక్రమాలంటే అంత ఇష్టం. మానవత్వానికి నిలువెత్తు రూపం.. బాలుగారు తుది శ్వాస విడిచాక, సెప్టెంబరు 25వ తేదీ చెన్నై వెళ్లాను. నేను గోపిక పూర్ణిమ.. ఇద్దరం కలిసి ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.30 వరకు పాటలు పాడాం. ‘ఉరై రారా! నాతో గడుపు’ అన్నట్లుగా అనిపించింది. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చారు. ఆయనకు నా పాటలు ఏవి నచ్చినా, కళ్లతో ఆనందం వ్యక్తం చేసేవారు. భుజం మీద చెయ్యి వేసి తట్టేవారు. సంపూర్ణమైన మానవత్వానికి ప్రతీక. ఆయనను అతి దగ్గరగా చూసినవారిలో నేనూ ఒకడిని. ఆయనతో నేను ‘‘మీ వ్యక్తిత్వం నేర్చుకుంటే వస్తుంది, కాని మీ విద్య, ప్రతిభ నేర్చుకుంటే వచ్చేది కాదు’’ అనేవాడిని. అందరి గురించి అడిగేవారు.. ఆయన స్టూడియోకి వస్తూనే ఆఫీస్ బాయ్స్ క్షేమసమాచారాలు స్వయంగా అడిగి తెలుసుకునేవారు. ‘ఆయన గొప్ప కళాకారుడు’ అని చెప్పడానికి పార్థసారథి అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఉంటారు. మనిషిని గౌరవించటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన గురించి ఎన్నని చెప్పగలను. ఎన్నో గుప్తదానాలు చేశారు. ఎవరో తెలిసినవారు ఆసుపత్రిలో ఉంటే, నా ద్వారా డబ్బు పంపారు. ‘మానవత్వం, మంచితనం, సమాజసేవ, కళాకారుడు, వ్యక్తిత్వం... ఇన్ని సుగుణాలు ఉన్న ఇంత గొప్ప వ్యక్తి ఇక మీదట రాడు. తన లోని లోపాలను గుర్తించి, తానే స్వయంగా సరిచేసుకునేవారు ఒక్కరు కూడా లేరు. గొప్ప సంగీత దర్శకుడైనా సరే, ఊరుపేరు లేని సంగీత దర్శకులైనా సరే ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పాడేవారు. అనుకున్న సమయానికి రికార్డింగుకి వస్తారు. ఏదైనా కారణం చేత ఆలస్యమైతే, క్షమాపణ అడుగుతారు. సంపూర్ణమైన సుగుణాల కలబోత బాలు. - డా. పురాణపండ వైజయంతి చదవండి: సోషల్ హల్చల్: క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన -
30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వజ్రోత్సవ భారతం
భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్, వేగేశ్న పౌండేషన్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు రాజ్ కమల్ చారిటీస్లు సంయుక్తంగా ఐదు ఖండాలలోని ముప్పై దేశాల తెలుగు సంస్థల సహకారంతో వజ్రోత్సవ భారతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పన్నెండు గంటలపాటు జరిగిన కార్యక్రమాన్ని జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. సురేఖ దివాకర్ల ఆధ్వర్యంలో పది మంది గాయనీమణులు 75 దేశ భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, సాయి కుమార్, మాధవపెద్ది సురేష్, ప్రసాద్ తోటకూర, జి వి నరసింహం, డా వంగూరి చిట్టెన్ రాజు, రత్న కుమార్ కవుటూరు, సరోజ కొమరవోలు, శ్రీలత మగతల, కల్నల్ కె ఆర్ కె మోహన్ రావు, లెఫ్టినెంట్ కల్నల్ భాస్కర్ రెడ్డి, విజయ తంగిరాల, జయ పీసపాటి, తాతాజీ ఉసిరికల, దీపిక రావి, విక్రమ్, అనిల్ కుమార్ కందించర్ల, శివ ఎల్లపు, ఎమ్ వి వి సత్యనారాయణ, పృథ్వీరాజ్, వెంకట సురేష్, వేదమూర్తి, ఎస్ డి సుబ్బారావు, వెంకప్ప భాగవతుల, వెంకటేశ్వరరావు తోటకూర, నూనె శ్రీనివాస్, సారథి మోటమర్రి, డాక్టర్ శ్రీదేవి, డోగిపర్తి శంకర్రావు, మధు, సుధామ-రెడ్డి, పార్థసారథి, ధన్‌రాజ్ జనార్ధన్, డాక్టర్ కె ఆర్ సురేష్ కుమార్, డాక్టర్ వెంకటపతి తరిగొప్పుల, వేణుగోపాల్ రెడ్డి బోయపల్లి, డాక్టర్ వ్యాస కృష్ణ బూరుగుపల్లి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, ఉపేంద్ర చివుకుల, శారద సింగిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, డాక్టర్ శ్రీ రామ్ సొంటి, లక్ష్మీ రాయవరపు, గుణ ఎస్ కొమ్మారెడ్డి, లలితా రామ్, శ్రీదేవి జాగర్లమూడి, రమ వనమా, శారద కాశీవజ్ఝుల, డాక్టర్ హరి ఇప్పనపల్లి, రాజేష్ ఎక్కల, మల్లిక్ పుచ్చా, జయరామ్ ఎర్రమిల్లి, డాక్టర్ వెంకటా చారి, రాధిక మంగిపూడి, కళ్యాణి, సింగింగ్ స్టార్ విజయలక్ష్మి, హేమవతి, బి వి ఎల్ ఎన్ పద్మావతి, వి కె దుర్గ, మాధవీ రావూరు, సుజా రమణ, సుందరి టి, లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకరపల్లి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యిందని వంశీ రామరాజు తెలిపారు. -
75వ స్వాతంత్య్ర దినోత్సవం.. పాడవోయి భారతీయుడా
పాటకు పదిమందిని కూడగట్టే శక్తి ఉంది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’... పాటతోనే గాంధీజీ ప్రజలను ఒక చోటకు చేర్చారు. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’... వందేమాతర గేయం రేపిన స్వేచ్ఛాకాంక్ష సామాన్యం కాదు. ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితా హమారా’ లక్షలాది మంది ముక్తకంఠంతో గానం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాట యుద్ధభేరి. స్వాతంత్య్రం సిద్ధించాక అదే విజయనాదం. ఆ పాట కొనసాగింది. సినిమా ఆ స్ఫూర్తిని కొనసాగించింది. సినీ దేశభక్తి గేయం జాతిని ఉత్సాహపరుస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది. ఆసేతు హిమాచలం పులకరించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు... వీరందరినీ సమాయత్తపరిచిన నాయకులు... త్యాగాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు, చెరసాలలు, ఉరికొయ్యలు... ఓహ్... ఒక గొప్ప పోరాటంతో భరతజాతి తనకు కావలసింది పొందింది. తెల్లవాళ్లు నిష్క్రమించారు. జనులెల్ల కొలుచువారు పాలనను అందుకున్నారు. ఇప్పుడు మన దేశాన్ని మనం కీర్తించుకోవాల్సిన సమయం. మన దేశాన్ని మనం స్తుతించుకోవాల్సిన సమయం. నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నేడే ఆనందం... ‘పాడవోయి భారతీయుడా... ఆడిపాడవోయి విజయగీతిక’ అని శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’లో రాసి తెలుగువారిని ఉత్తేజపరిచారు. ఇప్పుడు మన పాలన మనం చేసుకుంటున్నాం కనుక శ్రీశ్రీయే ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా’ అని ‘రాముడు భీముడు’లో సామాన్యుణ్ణి రాజును చేసే భవిష్యత్తును కాంక్షించారు. ఆ సమయంలో సినిమావారికి బాధ్యత ఎలా ఉండేదంటే కథకు సంబంధం లేకపోయినా ఒక నృత్యప్రదర్శన పెట్టి స్టేజ్ మీద దేశభక్తి గీతాన్ని చిత్రించేవారు. ‘అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలిచే’ విధంగా ఈ దేశం ఉండాలని హితబోధ చేసేవారు. హీరోలూ దేశం గొప్పతనాన్ని పాడుకోవడాన్ని ఒక ఆదర్శంగా భావించేవారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ‘సిపాయి చిన్నయ్య’లో అక్కినేని, ‘నేను నా దేశం పవిత్ర భారతదేశం’ అంటూ ‘నేను నా దేశం’లో రామకృష్ణ, ‘మన జన్మభూమి బంగారు భూమి’ అని ‘పాడిపంటలు’లో కృష్ణ, ‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ ‘బొబ్బిలిపులి’లో ఎన్.టి.ఆర్... పాడుతూ దేశభక్తిని కలిగి ఉండటం ఒక ధీరోదాత్త లక్షణంగా చూపించారు. ఎన్.టి.ఆర్ తన చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’లో కూడా ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అంటూ ఉర్రూతలూగించారు. భారతమాతకు జేజేలు అయితే పిల్లలే కదా భవిష్యత్ నిర్మాతలు. దేశభక్తి పాదుకొనాల్సింది వారిలోనే. దేశం కోసం పని చేయాలనే లక్ష్యం ఏర్పడాల్సింది వారికే. అందుకే తెలుగు సినిమా పిల్లల కోసం ప్రత్యేకం పాటలు చేసింది. ‘భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ అని ఆత్రేయ ‘బడిపంతులు’ కోసం, ‘భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ’ అని సీనియర్ సముద్రాల ‘దొంగరాముడు’లో ‘చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు... ఇది బాపూజీ పిలుపు’ అని ‘మేలుకొలుపు’లో సి.నారాయణ రెడ్డి పిల్లలు పాడుకునే పాటలు రాశారు. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘నీ సంఘం నీ ధర్మం మరువద్దు’ (కోడలు దిద్దిన కాపురం) పాటలు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇక ప్రయివేటు గేయాలుగా ఉన్న కృష్ణశాస్త్రి ‘జయజయహే ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి’ (రాక్షసుడు), శంకరంబాడి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ (బుల్లెట్, లీడర్), రాయప్రోలు సుబ్బారావు ‘శ్రీలు పొంగిన జీవగడ్డయి’ (లీడర్)... సినిమాల్లో కూడా వినిపించాయి. తెలుగువీర లేవరా దేశం అంటే మట్టి కాదు. మనుషులు. ఆ మనుషులు ప్రాదేశిక జాతులుగా కూడా తమను తాము కూడదీసుకోవాల్సిన సమయం అది. భరతజాతి, తెలుగుజాతి రెండూ వెలగాల్సిందే. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అని ‘తల్లా పెళ్లామా’లో సినారె రాశారు. నేడు ‘తెలుగుజాతి మనది రెండుగ వెలుగుజాతి మనది’ అని రెండు రాష్ట్రాల ప్రగతిని ఆశించేలా ఆ పాట మారింది. శ్రీశ్రీ ‘తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా’ అని ‘అల్లూరి సీతారామరాజు’లో ఉత్తేజం నింపుతారు. ‘కలసి పాడుదాం తెలుగుపాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అదే శ్రీశ్రీ ‘బలిపీఠం’లో వెలుగుబాటను చూపిస్తారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ రాయప్రోలు గీతాన్ని పల్లవిగా తీసుకొని ‘అమెరికా అబ్బాయి’ లో సినారె తెలుగువారు నిలబెట్టుకోవాల్సిన నిండు గౌరవం గురించి మాట్లాడారు. తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అయితే స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే తెల్ల పాలకులకు తీసి పోని రీతిలో మన పాలకులు కూడా తయారయ్యారన్న ఆశాభంగం ప్రజలకు కలిగింది. సినిమా ఆ నిరసనను పట్టుకుంది. ‘గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది’ (పవిత్ర బంధం), ‘భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను’ (నేటి భారతం), ‘వందేమాతర గీతం వరస మారుతున్నది’ (వందే మాతరం)..లాంటి పాటలు వచ్చాయి. కుర్రాళ్లు ‘సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్’ అని నిరుద్యోగ దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజులను చూపాయి. చివరకు ‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’ అని విప్లవ మార్గాన్ని ఎంచుకునే వరకూ తీసుకెళ్లాయి. వినరా వినరా దేశం మనదేరా అయితే ఆ రోజులను దేశం దాట గలిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిలో సాగింది. విద్య, ఉపాధి, అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగింది. లోపాలు, కొరతలు ఎన్ని ఉన్నా ఇది మన దేశం. దీని తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగాలనే సంకల్పం కొత్తతరంలో ఏర్పడింది. ‘దేశమ్ము మారిందిరోయ్... కాలమ్ము మారిందిరోయ్’ అని గతంలో కవి రాస్తే ‘ఏ మేరా జహా ఏ మేరా ఆషియా’ అని ఇప్పటి కవి రాశాడు. కొత్తతరం దర్శకులు, నిర్మాతలు కూడా దేశభక్తి గీతాలను సినిమాల్లో కొనసాగిస్తూనే వచ్చారు. ‘దేశం మనదే తేజం మనదే’ (జై), ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్’ (ఖడ్గం), ‘ఈ జెండా పసిబోసి నవ్వురా’ (బాబీ), ‘వందేమాతరం గాంధీ ఓంకారం’ (శంకర్‌దాదా జిందాబాద్), ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ (పరదేశి), ‘దేశమంటే మట్టికాదోయ్’ (ఝుమ్మంది నాదం).... ఇలా ఎన్నో పాటలు ఆగస్టు 15 వచ్చిన ప్రతిసారీ చౌరాస్తాలో మార్మోగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. తెలుగు సినిమా మరి కొన్నేళ్లలో 100 ఏళ్ల వయసుకు చేరనుంది. స్వాతంత్య్రం కంటే సీనియర్ అయిన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీగా దేశ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటూనే దేశాన్ని, యువతను ఉత్తేజపరిచే సినిమాలను, గీతాలను అందిస్తూనే ఉంటుందని, ఉండాలని కోరుకుందాం. ఎక్కువమందికి తెలియని పేరు కనక్లత బారువా. అస్సాంకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధురాలిని ‘బీర్బలా’ (గుండెధైర్యం ఉన్న మహిళ) అని పిలుచుకునేవారు. పదిహేడు సంవత్సరాల వయసులో పోలీసు కాల్పుల్లో మరణించింది. ఆమె మరణం అస్సాంను అట్టుడికించింది. బారువా పై 2017లో ‘పూరబ్ కి అవాజ్’ అని హిందీలో ఒక సినిమా వచ్చింది. బాలీవుడ్ హీరో మనోజ్‌కుమార్ షాహీద్ (1965) సినిమా క్లాసిక్. ఈ సినిమా తీయడానికి ముందు మనోజ్‌కుమార్ నిర్మాత కెవల్ కశ్యప్‌తో కలిసి చండీఘడ్‌లోని ఒక ఆస్పత్రిలో ఉన్న భగత్‌సింగ్ తల్లి విద్యావతిని కలుసుకున్నాడు. మనోజ్ కుమార్‌ను ఆమె పరిశీలించడం ప్రారంభించింది. ‘ఒప్పుకుంటారో లేదో’ అనే సందేహం మనోజ్‌కుమార్‌కు కలిగింది. విద్యావతి నిర్మాత కశ్యప్‌ను దగ్గరకు పిలిచి ‘ఈయన మా అబ్బాయిలాగే ఉన్నాడు’ అని మనోజ్‌కుమార్‌ను ఉద్దేశించి చెప్పింది. బెంగాలి నాటకరంగ దిగ్గజం గిరిష్చంద్రఘోష్ చారిత్రక నేపథ్యం ఉన్న నాటకాలు రాసేవారు. అయితే అవి పేరుకు చారిత్రక నాటకాలే అయినప్పటికీ అంతర్లీనంగా వాటిలో బ్రిటీష్ వారి దుర్మార్గాలను చీల్చిచెండాడే పదునైన డైలాగులు ఉండేవి. గిరీష్ రాసిన ‘సిరాజ్–వుద్–దౌలా’ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1945లో వచ్చిన హిందీ సినిమా ‘హమ్రహీ’ లో ‘జనగణమన’ కోరస్సాంగ్గా వినిపిస్తుంది. బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాయ్‌చంద్ బరోల్ సంగీతం సమకూర్చారు. పట్నా(బిహార్)లో షాహీద్ పీర్ అలీ ఖాన్ పార్క్ చాలా ఫేమస్. ఎవరీ పీర్ అలీ? సామాన్య బుక్‌బైండర్ అయిన పీర్ అలీ కరపత్రాలు పంచడం, కోడ్ మెసేజ్‌లు ఇవ్వడంలాంటి పనులతో స్వాతంత్య్ర సమరయోధులకు సహాయపడేవాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పీర్ ఆలిఖాన్ను బ్రిటిష్‌వారు బహిరంగంగా ఉరి తీశారు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భావజాల ప్రచారం లో అండర్‌గ్రౌండ్ కాంగ్రెస్ రేడియో బలమైన పాత్ర నిర్వహించింది. బ్రిటీష్ కంట్రోల్డ్ ఏఐఆర్‌కు కౌంటర్‌గా వచ్చిన ఈ రేడియోను 22 సంవత్సరాల ఉషా మెహతా నిర్వహించేవారు. ‘ఆజాద్’గా ప్రసిద్ధుడైన చంద్రశేఖర్ తివారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. అప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు. ‘నీ పేరు ఏమిటి?’ అని జడ్జి అడిగితే ‘ఆజాద్’ అని; ‘తండ్రి పేరు ఏమిటి?’ అని అడిగితే ‘స్వతంత్రత’ అని చెప్పాడు. -
KS Chitra: చిత్ర ఆలపించిన ఈ పాటలు విన్నారా?
ఆమె గొంతు కోకిలలనే సవాల్ చేస్తుంది. ఆమె పాట స్వర‘చిత్ర’విన్యాసంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాటలు పాడుతున్నా, తరగని మాధుర్యం ఆమె సంగీతానిది. ప్రత్యే క శైలితో పాటలు పాడుతూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని చిత్ర పుట్టిన రోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆమె పాడిన కొన్ని మధుర గీతాలు మీకోసం. -
వాడిపోయిన పువ్వులా పాటలు కనుమరుగైపోతున్నాయి
Ilaiyaraaja: పాట వికసిస్తున్న పువ్వులా ఉండాలని సంగీత జ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. మనసుకు వయసుతో పనిలేదు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఈ మాస్ట్రో. ఇళయరాజా వయసు (78). మనసు మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలా సంగీతంలో పరవళ్లు తొక్కుతుంది. శతాధిక చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా నేటికీ బిజీ సంగీత దర్శకుడే. ఈయన ఇటీవల టీ.నగర్లో సొంత రికార్డింగ్ థియేటర్ నిర్మించుకోవడం తెలిసిందే. గురువారం ఉదయం ఆ స్టూడి యోలో మీడియాతో ముచ్చటించారు. ఇళయరాజా సంగీతం అందించిన 16 వయదినిలే చిత్రం విడుదలై 40 వసంతాలను, ముందానై ముడిచ్చి 38 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన ఆయన ఇళయరాజా పాట ఇప్పుడే వికసిస్తున్న పువ్వులా ఉండాలి. అయితే పాటలు ఒకటి, రెండు రోజుల్లోనే వాడిపోయిన పువ్వులా కనుమరుగైపోతున్నాయి. నేను రూపొందించిన 20 ఏళ్ల నాటి పాటల్ని కూడా ప్రేక్షకులు వినడానికి ఆసక్తి చూపుతున్నారంటే అవి వికసిస్తున్న పువ్వులా నిత్య నూతనంగా ఉండడమే. అదేవిధంగా నా పాటలు కొత్తదనం అనేది ఇకపై కూడా కొనసాగుతుందని ఇళయరాజా పేర్కొన్నారు. -
అమెరికాలో బాలు పాటకు పట్టాభిషేకం
హ్యుస్టన్ (టెక్సాస్): గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం 75 వ జయంతి సందర్భంగా 75 పాటలతో ప్రవాస భారతీయులు అలరించారు. పది మంది గాయకులు నాటి నుంచి నేటి వరకు బాలు పాడిన పాటలను మనసారా ఆలపించి ఆ మహనీయుడి పాటకు పట్టాభిషేకం చేశారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా - తెలుగు కళాసమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ - శారద ఆకునూరి అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021 జూన్ 13 ఆదివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:00 గంటలకు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ గాయని, అమెరికా గాన కోకిల శారద ఆకునూరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోష్ ఫిలిం న్యూస్., TRINET , తెలుగు కళాసమితి ఒమన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.వీనుల విందైన ఈ కార్యక్రమానికి అతిధులుగా, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు,మాధవ పెద్ది సురేష్, వీణాపాణి, సినీ గీత రచయతలు భువన చంద్ర, రవిప్రకాష్, యూకే నుంచి డా నగేష్ చెన్నుపాటి , సురేష్ కొండేటి, ఒమన్ నుంచి హరి వేణుగోపాల్, వంశీ రామరాజులు హాజరయ్యారు. ఈ పాటల పట్టాభిషేకంలో గాయకులు రామాచారి, వినోద్ బాబు, రాము, ప్రవీణ్ కుమార్, వేణు శ్రీరంగం, శ్రీ సాందీప్. పవన్ చరణ్, హరి గుంట , విపంచి శశిధర్, ధనుంజయ్‌లు పాలు పంచుకున్నారు. బాలు గొంతు నుంచి జాలువారిన అద్భుతమైన 75 పాటలను వీనులవిందుగా వినిపించారు. -
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్‌ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్‌ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్‌లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్‌లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్‌లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్‌ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్‌ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్‌తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్‌లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్‌గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
లైవ్‌లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్..
సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా ప్రతిరోజూ ఓ అరగంట పాటు పాటలు పాడుతున్నారు. ఇన్‌స్టా లైవ్‌లో ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్ పొందుతున్నామని అంటున్నారని, అందుకే ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. మదర్స్ డే సందర్భంగా ఓ పాట పాడమని నెటిజన్ అడగ్గా అమ్మ అనగానే కంట్లోంచి నీళ్లు వస్తాయని, ఈ లోకంలో స్వచ్ఛత అనే దానికి పర్యాయపదమే అమ్మ అని చెబుతూ సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఎంతోమందిని వైద్య సిబ్బంది బిడ్డలా చూసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సునీత పాటలు పాడుతుండగానే మరో నెటిజన్..వాట్సాప్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. తాను కూడా కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అత్యవసరం అయితే తప్పా ఎవరూ బయట తిరగొద్దని సూచించారు. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : ఆ డైరెక్టర్ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత యాంకర్ శ్యామల, క్రికెటర్ భువనేశ్వర్ అక్కాతమ్ముళ్లా? -
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ...
‘జానకి కలగన లేదు రాముడి సతి కాగలనని ఏనాడు’... తెలుగు సినిమా పాటలో సీత ఉంది. ‘సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం’ తెలుగు సినిమా పాటలో రాముడు ఉన్నాడు. ‘కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కల్యాణమే’... వెండి తెర ఆ ఇరువురి కల్యాణానికి పాట కట్టింది. ‘జానకి రాముల కల్యాణానికి జగమే ఊయల లూగెనులే’ అంటూ పరవశించింది. సీతను, రాముణ్ణి ప్రస్తావిస్తూ తెలుగు పాట కొనసాగుతూనే ఉంది. సీతను రాముణ్ణి పోలికకై తేకుండా కళ ఎలా మనగలుగుతుంది? శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ‘సీతారాముల పాటలు’. తెలుగువారికి పెళ్లి అంటే అది సీతారాముల పాటతోనే మొదలవ్వాలి. ఆ దివ్యజంట వివాహం ఎంత వైభోగంగా జరిగిందో అంత వైభోగంగా తమదీ జరగాలని లేదంటే ఆ జంట దివ్యాశీస్సు తమపైనా ఉండాలని కాంక్షించని వధూవరులు ఉండరు. అందుకే పచ్చని పందిరి కట్టగానే గతంలో గ్రామ్‌ఫోన్ రికార్డు మోగించేవారు. ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ’... ఎన్.టి.ఆర్ది ఎంత గొప్పతనమో. తాను తీసే సినిమాలో రాముడిగా తాను ఉండగలిగినా ఉండకుండా, అంతమంచి పాటను తన కోసం రిజర్వ్ చేసుకోకుండా హరనాథ్, గీతాంజలిలపై చిత్రీకరణ చేశారు. ‘సీతారామ కల్యాణం’ సినిమా రెండోసారి చూడని వారు చాలామంది ఉంటారు. కాని వందసార్లయినా ఈ పాట వినని వారు ఉండరు. రాముడు ఆది పురుషుడు హైందవ విశ్వాసాలలో. సీత మహాసాధ్వి. వీరి కథ వేల సంవత్సరాలుగా జనవాళికి తీపిని పంచుతూనే ఉంది. జంట అంటే సీతారాముల జంటే. ఆమె కోసం అతను విల్లు విరిచాడు. అతని కోసం ఆమె వనవాసానికి బయలుదేరింది. ఇరువురూ తమ వియోగానికి ఎంతగా అలమటించారో నేటికీ వారి భక్తులు ఆ సందర్భాన్ని వింటూ కంటూ అంతగా అలమటిస్తారు. వారికి సీతారాములు పటం కట్టినట్టు సదా పక్కపక్కనే ఉండాలి. కాంతులీనుతూ ఉండాలి. వారిని పాట కట్టుకుని తాము పరవశిస్తూ ఉండాలి. తాము ఏదైనా మొరపెట్టుకోవాలంటే సీతమ్మ ద్వారా ఆయనకు మొర పెట్టుకోవాలి. భక్త రామదాసు నుంచి నేటి భక్తుని వరకూ పాడేది అదే. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’... ఆ తల్లి చెబితే ఆయన వినకుండా ఉంటాడా? చిత్తూరు నాగయ్య గారి నుంచి నాగార్జున వరకు ఆ పాటతో సీతను వేడుకున్నవారిలో ఉన్నారు. ‘లవకుశ’లో సీతకూ రాముడికీ కలిపి పాటలు లేవు. కాని వారు నగర ప్రవేశం చేయనున్నారన్న వార్త వినగానే ప్రజలు సంభ్రమం చెందుతారు. ఆడిపాడుతారు. ‘విరిసే చల్లని వెన్నెల’ పాట ప్రేక్షకుల మదిలో పిండారబోస్తుంది. దర్శకుడు బాపు రామభక్తులు. ఆయన ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతా కల్యాణం’ సినిమాలు తీశారు. ఆయన చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ కావడం రాముడు ఆయనకు ఇచ్చిన కానుక అనుకోవచ్చు అభిమానులు. ‘శ్రీరామరాజ్యం’లో సీతాసమేతుడైన రాముడు అయోధ్యకు తిరిగి వస్తుండగా ఇళయరాజా చేసిన ‘జగదానంద కారకా’... పాట రామభక్తులకు కన్నులపండువ. సోషల్ సినిమాలు వచ్చాక ఆధునిక హీరో హీరోయిన్లు తెర మీదకు వచ్చినా ఆ ఇరువురిని తలవకుండా లేరు. రెండు పెళ్లిచూపుల పాటలు సీతారాముల ప్రస్తావనతో హిట్ అయ్యాయి. ‘మగమహారాజు’లో ‘సీతే రాముడి కట్నం’ పాట వాణి జయరామ్ పాడగా నటి తులసి అభినయించారు. ‘అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం’ అనే లైను ఈ పాటలో ఎంతో లోతైనది. నిజమే కదా అనిపించేది. ఇక ‘సంసారం ఒక చదరంగం’లో కూడా ‘జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే’ పాట పెళ్లిచూపుల సందర్భంగా వస్తుంది. ఆ పాటను ఆ సినిమాలోని అన్నపూర్ణ, సుహాసిని, కల్పనల మీద విడివిడిగా చిత్రీకరించడం చిన్న సరదా. ఇళయరాజా తెలుగువారికి మరో అందమైన సీతారాముల పాట ఇచ్చారు ‘రాజ్‌కుమార్’ సినిమా లో. శోభన్‌బాబు, జయసుధ నటించిన ఆ పాట ‘జానకి కలగన లేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’... ఈ పాటలో వేటూరి ‘తొలి చుక్కవు నీవే... చుక్కానివి నీవే’ అని రాస్తారు రాముడు సీతతో అన్నట్టు. రాముడికి సీత చుక్కాని కావడం ఒక మంచి భావన. ‘సాగర సంగమం’ తర్వాత వేటూరి కొన్నాళ్లు అలిగి కె.విశ్వనాథ్‌తో కలిసి పని చేయలేదు. ఆ సమయంలో విశ్వనాథ్ సినారె, సిరివెన్నెలలతో పాటలు రాయించారు. కాని ఎస్.పి. బాలు నిర్మాత కావడం వల్ల ‘శుభ సంకల్పం’లో పాట రాశారు. సీతారాముల తలంపు కావచ్చు. అందుకే ‘సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు’ వంటి అందమైన పాట పుట్టింది. జంధ్యాల తీసిన ‘సీతారామ కల్యాణం’లో కెవి మహదేవన్ చేసిన ‘కల్యాణ వైభోగమే శ్రీసీతారాముల కల్యాణమే’... పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. అందులో భద్రాద్రి కల్యాణం రియల్ ఫుటేజ్ వాడటం ఆ రోజుల్లో విశేషమనే చెప్పాలి. ఆ తర్వాతి రోజుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన వచ్చిన అవకాశాలలో సీతారాముల జంట ప్రస్తావనను సుందరంగా తెస్తూ వచ్చారు. ‘స్వయంకృషి’లో ‘సిగ్గూపూబంతి యిసిరే సీతామాలచ్చి’ మనోహరంగా ఉంటుంది. ‘రాముడి సిత్తంలో కాముడు చింతలు రేపంగా’ అని బహుశా మొదటిసారి రాముని శృంగార తలపులను జానపదుల శైలిలో ప్రస్తావనకు తెచ్చారాయన. ‘మురారి’లో ‘అలనాటి రామచంద్రుడికన్నింట సాటి’ పాట ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి’కి సరిసాటిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. రాముడిని ఎల్లవేళలా తలిచేవారు ఉంటారు. కాని శ్రీరామ నవమి అంటే సీతారాములను కలిపి తలుస్తారు. ఆ జంట సుందర చరితను స్మరించుకుంటారు. వారి ప్రస్తావన ఉన్న పాటలు రేడియోల్లో మారుమోగుతాయి. రాముడి పాటలో తప్పక భక్తి ఉంటుంది. కాని సీతారాముల పాటలో బాంధవ్యం ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమే అని ఈ సందర్భంగా వారి పాటలన్నీ మనకు చెబుతూ ఉంటాయి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు. - సాక్షి ఫ్యామిలీ -
సింగపూర్‌లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం..
సింగపూర్: సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఆన్లైన్లో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గరికపాటి వెంకట ప్రభాకర్ ‘రాగావధానం’కార్యక్రమం జరిగింది. ఇది సుమారు అయిదు గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని గరికిపాటి వెంకట ప్రభాకర్, శ్రీమతి పద్మ లలిత దంపతులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. దీనికి అమెరికా నుండి చిట్టెన్ రాజు, భారతదేశం నుండి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు శ్రీ జి ఆనంద్, ప్రఖ్యాత గాయని శ్రీమతి సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా హజరయ్యారు. దీనిలో సాహిత్య అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ అనే ఏడుగురు గాయనీ గాయకులు ప్రశ్నలు వేసేవారిలా వ్యవహరించారు. రాధిక మంగిపూడి మాట్లాడుతున్నారు. ప్రశ్నలు అడిగిన పాటలకు అవధాని అప్పటికప్పుడు , అడిగిన రాగాన్ని మార్చాడం, అడిగిన తాళంలో మార్చి పాడటం, రాగమాలికలు, పద్యాలలోని అడిగిన స్వర స్థానాలలో పాడడం, కొన్ని పదాలను విడిచిపెట్టడం, మొత్తానికి ఆసక్తి కరంగా సాగింది. కాగా, అమెరికా, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. కార్యాక్రమ నిర్వాహకులు శ్రీ కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ. జీవి ప్రభాకర్ గారు కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేశారని అన్నారు. ఎలాంటి ప్రశ్నలు వేసిన హుందాగా సమాధానం చెప్పారని తెలిపారు. ఇది మొదటి నుంచి ఎంతో వినోదాత్మాకంగా కొనసాగింది. కేవలం అయిదు గంటల్లోనే 2500 మందికిపైగా ప్రజలు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా చూశారని తెలియజేశారు. మొదటి రెండు ఆవృతాలలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలతోపాటు సినిమా పాటలు, జానపదాలు, లలిత సంగీతం, దేశభక్తి గీతాలు, పద్యాలు మొదలైన వైవిధ్యభరితమైన అంశాలలో పాటలను ఎంచుకుని ప్రశ్నించేవారు వేరువేరు రాగ తాళాలలో ప్రశ్నలు కురిపించారు. మూడవ ఆవృతంలో రాగ వ్యూహం మరియు తాళ వ్యూహం అనే ప్రక్రియతో అవధాని పాడుతున్న ఒకే పాటకు అందరూ అప్పటికప్పుడు ఒక్కసారిగా వివిధ రాగాలలో తాళాలలో పాడమని ప్రశ్నలు సంధించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అతిథిగా విచ్చేసిన సురేఖ మూర్తి అప్పటికప్పుడు ఒక కొత్త పాటను ఇచ్చి చంద్రకౌంసు రాగంలో స్వర పరచమని అడుగగా అవధాని వెంటనే ఆ పాటను ఆ రాగంలో స్వరకల్పన చేసి వినిపించారు. శ్రీ జీవి ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం చేయగలగడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని పలికి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. ఈ రిమిట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా, దీనికి ఈక్షణం, సింగపూర్ తెలుగు టీవి వారు మీడియా పార్టనర్ గా సహకారం అందించారు . -
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి...
విద్యాసాగర్ పేరు చెప్పగానే ‘ఏ అంటే అమల బి అంటే భానుప్రియ’ వంటి అల్లరి పాటలు వినిపిస్తాయి. ‘చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా’ అనే కమర్షియల్ హిట్స్ గుర్తుకొస్తాయి. ‘చుక్కా చుక్కా కన్నీటి చుక్కా బుగ్గన జారొద్దు’ వంటి సెంటిమెంట్ పాటలు కదిలిస్తాయి. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ వంటి మెలొడీలు చుట్టుముడతాయి. విద్యాసాగర్ మరో ఇళయరాజాగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు. విజయనగరం నుంచి వచ్చిన తెలుగు గీతమే అయినా తమిళంలో, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందాడు. మార్చి 2 ఆయన పుట్టినరోజు. బొబ్బిలి సంస్థానం నుంచి... విద్యాసాగర్ తాత తండ్రులది బొబ్బిలి సంస్థానం. వాళ్లది సంగీత కుటుంబం. విద్యాసాగర్ తండ్రి రామచందర్ సినిమాల్లో పని చేయాలని 1950లలోనే మద్రాసు వచ్చారు. విద్యాసాగర్ అక్కడే పెరిగారు. తండ్రి వద్ద తొలి సంగీత విద్యలు నేర్చుకుని 11 ఏళ్ల వయసులో లండన్ ట్రినిటి కాలేజ్‌లో సంగీతం నేర్చుకున్నారు. విద్యాసాగర్ మొదట రీరికార్డింగ్‌లో గుర్తింపు పొందారు. వందలాది సినిమాలకు రీరికార్డింగ్ చేశారు. ఆ తర్వాత తమిళంలో మొదట... తర్వాత తెలుగులో సంగీత దర్శకుల య్యారు. రెండు చోట్లా కొన్ని అపజయాల తర్వాత మలయాళంలో హిట్ కొట్టి తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హిట్స్ ఇచ్చారు. మెలొడీస్ ఇష్టం విద్యాసాగర్‌కు మెలొడీలు ఇష్టం. ‘ఓ చినదానా’లో ‘తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే’ అలాంటి మెలొడీనే. ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంట’ కూడా అదే మెలొడీ. రాజశేఖర్ నటించిన ‘విలన్’లో ‘నా గుండె గుడి లో నువు శిలవా దేవతవా’ పెద్ద హిట్. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన మెలొడీలు కూడా హిట్టే. అర్జున్ నటించిన ‘కర్ణ’ సినిమాలో ‘పలికే మౌనమా’ చాలా పెద్ద హిట్. అన్నింటికి మించి ‘చంద్రముఖి’ కోసం చేసిన ‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి’ క్లాసిక్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ విద్యాసాగర్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిపింది. అందులోని ‘చిలకా పద పదా’, ‘రారా సరసకు రారా’ అద్భుతంగా అమరాయి. విద్యాసాగర్ కె.విశ్వనాథ్ ‘స్వరాభిషేకం’కు, బాపు ‘సుందరకాండ’కు పనిచేశారు. పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాకు ‘రా..రా.. రారా బంగారం’ మాస్ హిట్ ఇచ్చారు. విద్యాసాగర్ మరెన్నో మంచి పాటలు అందించాలని కోరుకుందాం. -
కిస్ డే స్పెషల్.. ‘ముద్దు’పాటలు మీకోసం
ముద్దు కు ఓ రోజు ఉంది. ఆ రోజు ఈ రోజే( ఫిబ్రవరి 13). వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా కిస్ డే జరుపుకుంటారు.ఈ రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగితేలిపోతారు. కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. ఒక్క కిస్‌తో మనసులో ఉన్న ప్రేమనంతా వ్యక్తం చేయ్యొచ్చు. ఈ విషయం తెలుగు గేయ రచయితలకు బాగా తెలుసు. అందుకే తెలుగులో ‘ముద్దు’పై ఎన్నో పాటలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. కిస్‌డే సందర్భంగా తెలుగు ‘ముద్దు’పాటల్లో కొన్ని మీకోసం. -
పూజా హెగ్డే వెంట పడ్డ హీరో ఎవరు?
సినిమాల్లో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా విడుదలకు ముందే కోట్ల కొద్దీ వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసి, ఆయా సినిమాపై జనాల్లో మరింత ఆసక్తి పెంచుతున్నాయి పాటలు. ఈ మధ్య శ్రోతల్ని ఉర్రూతలూగించిన కొన్ని పాటలపై క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం!
బాబ్ డిలాన్ ఆరువందలకు పైగా పాటల హక్కులను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ అగ్రిమెంట్ ద్వారా మూడువందల మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందట. వాళ్లెవరో సొంతం చేసుకోవడం ఏమిటి? ఆ పాటలను ప్రపంచంలో ఆబాలగోపాలం ఎప్పుడో సొంతం చేసుకుంది అనుకుంటే అది కూడా అక్షరాల నిజమే! బాబ్ పాట మీద హక్కు సాంకేతిక విషయం మాత్రమే. అది అందరి పాట. ఎందుకంటే.. మాస్టర్స్ ఆఫ్ వార్ (1963) ఇప్పుడు యుద్దాలు ఆత్మరక్షణ కోసం జరగడం లేదు, ప్రజల దృష్టిని మళ్లించి పాలనను సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్దం అంటే హింస మాత్రమే కాదు అనేక కుట్రసిద్దాంతాల సమహారం. అందుకే ఒక కళాకారుడిగా బాబ్ డిలాన్ గళం విప్పాడు. యుద్దోన్మాదాన్ని నడివీధిలో నగ్నంగా నిలబెట్టాడు. ప్రపంచాన్ని ఆటబొమ్మగా చేసుకుని ఆడుకునే మాస్టర్స్ ఆఫ్ వార్ని ఇలా నిలదీశాడు... ‘యూ ప్లే విత్ మై వరల్డ్ లైక్ ఇట్స్ యువర్ లిటిల్ టాయ్ యూ పుట్ ఏ గన్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ హైడ్ ఫ్రమ్ మై ఐస్’ న్యూ మార్నింగ్ (1970) స్వప్నించే హృదయం ఉండాలేగానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది. ‘ఆ..ఏముంది లే. అన్ని రోజుల్లాగే ఈరోజు కూడా’ అనుకునే నిత్య నిరాసక్తవాదులకు ఈ పాట సరికొత్త మేలుకొలుపు. సింప్లీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ విలువ ఏమిటో చెబుతుంది. ‘సో హ్యాపీ జస్ట్ టు బీ అలైవ్’ ‘సో హ్యాపీ జస్ట్ టు సీ యువర్ స్మైల్’ సేవ్డ్ (1980) భగవంతుడు మన కోసం ఎన్నో చేశాడు. అతడి కోసం ఏం చేయగలం? రుణాన్ని ఎలా తీర్చుకోగలం? కనిపించని భగవంతుడు నిత్యం మనకు కనిపించే మనుషుల్లో దానం, ధర్మం, త్యాగం...రకరకాల రూపాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాడు. ‘యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యూ హ్యావ్ గివెన్ మీ ఐస్ టు సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’ అండర్ ది రెడ్ స్కై (1990) గబ్బీ గూగూ (ముద్దుపేరు) అనే అమ్మాయికి అంకితం ఇచ్చిన ఈ పాట సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాగుతుంది. పిల్లలకు నచ్చే జానపదకథలాంటి పాట ఇది. కాల్పనిక ప్రపంచంలో మనల్ని ఊరేగించే పిల్లల పెద్దల పాట. అంతేనా! కానే కాదు అంటారు విశ్లేషకులు. పర్యావరణానికి మన చేటును గురించి హెచ్చరించి పాట అంటారు. ‘లెట్ ది బర్డ్ సింగ్...లెట్ ది బర్డ్ ఫ్లై’ షాడోస్ ఇన్ ది నైట్ (2015) నిన్ను చూడడం తప్పేమో తెలియదు. చూస్తూనే ఉంటాను. నిన్ను పలకరించడం తప్పేమో తెలియదు. పలకరిస్తూనే ఉంటాను. నిన్ను ధ్యానించడం తప్పేమో తెలియదు. ధ్యానిస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమించడం తప్పేమో తెలియదు. ప్రేమిస్తూనే ఉంటాను.... ‘ఐ లవ్ యూ ఐ నీడ్ యూ...ఐ నో ఇట్స్ రాంగ్...ఇట్ మస్ట్ బీ రాంగ్ బట్ రైట్ ఆర్ రాంగ్ ఐ కాంట్ గెట్ ఎలాంగ్ విత్ఔట్ యూ’ -
బాబ్ డిలాన్ పాటలన్ని కొనేసిన యూజీ
న్యూయార్క్: ప్రఖ్యాత రచయిత బాబ్ డిలాన్ పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ తన సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఆయన పాటలపై పూర్తి హక్కులన్ని తమకే ఉంటుందని సదరు మ్యూజిక్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా ముగిసినట్లు యూఎంపీజీ తెలిపింది. ఇందుకోసం యూఎంపీజీ ఆయనకు ఎంత మొత్తం చెల్లించిందనేది మాత్రం పేర్కొనలేదు. అయితే ఆయన పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంతో తెలిసిన విషయయే. ఇందుకోసం యూఎంపీజీ ఆయనతో భారీగానే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. ఆయన పాడిన పాటల క్యాట్‌లాగ్‌ను విలువను బట్టి కనీసం రూ. 100 మిలియన్ డాలర్లు ఉండోచ్చని స్థానికి మీడియా అంచనాలు. (చదవండి: బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?) అయితే యూఎంపీజీ తన ప్రకటనలో బాబ్ డిలాస్ 1962 నుంచి ఇప్పటి వరకు పాడిన మొత్తం క్యాట్‌లాగ్ పాటల జాబితాను తమ సంస్థ కనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలోని డిలాస్ మ్యూజిక్ కంపెనీతో పాటు సోనీ, ఏటీవి మ్యూజిక్ పబ్లిసింగ్ నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ ఒప్పందం ముగిసే వరకు అమెరికా వెలుపల జరిగే పలు మ్యూజిక్ షోలను యూఎంపీజీనే నిర్వహిస్తుందని సోనీ, ఏటీవీ అధికారులు స్పష్టం చేశారు. కాగా బాబ్ డిలాన్ 2016లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయితగా ఆయన రికార్డు సృష్టించారు. -
శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం
శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. 1940లో విడుదలైన కాలచక్రంలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం కొన్ని మార్పులతో ఉపయోగించబడినా, దాన్ని ఆయన తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. 1950లో ఆర్.ఎస్.జునార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆహుతి డబ్బింగ్ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. సినిమా కోసం శ్రీశ్రీ యెక్కువ పాటలు రాసిన మొదటి చిత్రం 1952లో విడుదలైన మరదలు పెళ్లి. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్ చిత్రాలకు, 80 డబ్బింగ్ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసినా, సంఖ్యాపరంగా డబ్బింగ్ పాటలే యెక్కువ కావడం విచిత్రం! బహుముఖంగా చిత్రగీతాలు రాసిన శ్రీశ్రీ ఆ రంగంలో అనేక ధోరణులకు ఆద్యులూ అగ్రగణ్యులూ అయ్యారు. మాతృకకు మక్కికి మక్కి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ‘లిప్‌సింక్’ను పాటించి, తెలుగు నుడికారంతో డబ్బింగ్ రచనలు చేసి, దానికొక ఒరవడి ప్రవేశపెట్టారు. వామపక్ష భావజాలంతో సామ్యవాద గీతాలను రాసి సినీ పరిశ్రమలో చైతన్య గీతాలకు అంకురార్పణ చేశారు. తెలుగు సినిమాల్లో యెక్కువ దేశభక్తి గీతాలను రచించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనాల్లో ముందుగా వెలువడి, ఆ తరువాత పాటలుగా సినిమాలకెక్కినవి పాతికకుపైనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా అగ్రతాంబూలం శ్రీశ్రీదే. ఆకలిరాజ్యం, మహానది సినిమాల్లో కథనాయకుడు(కమల్‌హాసన్) మహోద్రేకంగా శ్రీశ్రీ కవితల్ని ఉటంకించడం తెలుగు సినీకవుల్లో ఆయనకు మాత్రమే దక్కిన ఘనత. కవిత్వంలో ఛందోబందోబస్తులను ఛట్‌ఫట్ చెయ్యమన్న శ్రీశ్రీ అనేక సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించారు. బొబ్బిలి యుద్ధంలో మధురాతి మధురమైన జావళీని రాసి తనకు చేతకాని ప్రక్రియ లేదని నిరూపించారు. తన పాటల్లో తనకు నచ్చినది మాత్రం ‘పంతాలు పట్టింపులు’లోని ‘ఇనుకోరా, ఇనుకోరా, ఈ మల్లన్న మాటే ఇనుకోరా’గా ప్రకటించారు. ఆరాధనలోని ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ప్రేమగీతంలో ఆ చెలి యెవరని ఓ విమర్శకుడు ప్రశ్నిస్తే , ఆ చెలి కమ్యూనిజమని చమత్కరించారు. శ్రీశ్రీ పేరు చెప్పగానే మూడు ముఖ్యమైన పాటలు గుర్తొస్తాయి. అవి– తెలుగు సినిమా పాటకు మొదటి జాతీయ పురస్కార గౌరవాన్ని దక్కించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’. బతుకు మీద విరక్తితో ఆత్మహత్యకు పూనుకొన్న ఓ వ్యక్తిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి పూర్ణాయువును పోసిన వెలుగు నీడలు చిత్రంలోని ‘కలకానిది విలువైనది’. ఓ కన్నడ ప్రేక్షకుణ్ని సైతం కేవలం ఆ పాట కోసం ఇరవై సార్లు ఆ సినిమా చూసేలా చేసిన పునర్జన్మ చిత్రంలోని ఓ సజీవ శిల్పసుందరీ. శ్రీశ్రీ నిజాయితీ, నిబద్ధత గల సహృదయ కవి. తెలుగు వీర లేవరా పాటలో సింహాలై గర్జించాలి అనే చోట వ్యాకరణ దోషం వుందని తనే చెప్పి ఆ తర్వాత సవరించుకున్నారు. కలకానిది పాటలోని రెండు పంక్తుల భావం ఆ పాట తమిళ వెర్షన్ రాసిన నారాయణ కవిదనీ ఆ ఘనత తనకు చెందదనీ ప్రకటించారు. దేవత చిత్రంలోని బొమ్మను చేసి ప్రాణము పోసి పల్లవి వీటూరిదని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 30 ఏప్రిల్ 1910న జన్మించిన శ్రీశ్రీ 15 జూన్ 1983న అస్తమించారు. ఆయన అవసాన దశలో రాసిన నేటిభారతంలోని అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అనే విప్లవ గీతం ఆయనకు ప్రభుత్వమిచ్చిన ఏకైక నంది పురస్కారం– అది ఆ తర్వాత వచ్చిన అనేక స్వాతంత్య్ర సంబంధిత గీతాలకు స్ఫూర్తినిచ్చింది. -పైడిపాల -
మహేశ్‌వారి పాటలు!
మహేశ్‌వారి పాటల సందడి మొదలైనట్లుంది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
బెజవాడ విద్యార్థికి ‘గిన్నిస్’లో స్థానం
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 2018 జనవరి 6వ తేదీన గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురంలో దాదాపు 8 గంటలపాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడి రికార్డ్ సృష్టించాడు. (వివిధ భాషల్లో 76 పాటలు పాడిన గజల్ శ్రీనివాస్ పేరిట గత రికార్డు ఉండేది). అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్›లో రాహత్ పేరు నమోదు చేసి ‘మోస్ట్ లాంగ్వేజెస్ సంగ్ ఇన్ కాన్సర్ట్’ బిరుదుకు ఎంపిక చేసినట్లు గురువారం సమాచారం అందించారు. రాహత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సాక్షి దినపత్రిక నిర్వహించిన పోటీలో వండర్ కిడ్ అవార్డు అందుకున్నాడు. పలు సాంస్కృతిక సంస్థలు ఉగాది పురస్కారాలతో సత్కరించాయి. బాలల చిత్రం దాన వీర శూర కర్ణ చిత్రంలో శకునిగా నటించడంతోపాటు ఇతర పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, నారదుడు, శ్రీ మహావిష్ణువు పాత్రలలో నటించి మెప్పించాడు. గతేడాది నంది నాటకోత్సవాల్లో పౌరాణిక నాటక విభాగంలో నంది అవార్డ్ గెలుచుకున్నాడు. రాహత్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం పట్ల నగరానికి చెందిన పలు కళా సంస్థలు, రాహత్ చదువుతున్న పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. -
కరోనా ; నీ సుఖమే నే కోరుకున్నా..
ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారం వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా... గతంలో ఈ పాట వేదనకు గుర్తు. ఇప్పుడు ఆరోగ్యానికి చిహ్నం. ‘కరోనా’ కాలంలో, మనిషికి మనిషి ఎడం పాటించాలని చెబుతున్న కాలంలో, ‘సామాజిక ఎడం’ అవలంబించాలని ప్రచారం చేస్తున్న సమయంలో అది సూచించే తెలుగు సినీ పాటలు సరదాగా తలుచుకోవడం తప్పు కాదు. రోజులు అలా వచ్చి పడ్డాయి. ఎవరైనా సరే దూరంగా ఉండి ఒకరి బాగు ఒకరు కోరుకోవడం ఇప్పుడు తప్పనిసరి. కరోనా మీద అదే అసలైన గురి. ‘విరహమో దాహమో విడలేని మోహమో... వినిపించు నా చెలికి మేఘసందేశం... మేఘసందేశం’ అని శానిటైజర్‌తో శుభ్రపరుచుకున్న చేతుల్లో ముఖాన్ని కప్పుకుని మేఘంతో బాధ చెప్పుకోవాలే తప్ప ప్రేయసి ప్రియులు దగ్గరగా వెళ్లడం, దగ్గరగా కూడటం తప్పు అని ఈ సన్నివేశంలో అర్థం చేసుకోవాలి. ఏ పార్కులోనో కలిసినా ‘వస్తా.. వెళ్లొస్తా... రేపు సందేళకొస్తా’ అని జారుకోవాలి. అలిగితివా సఖీ.. అలక మానవా.. శుభ్రత పాటించనప్పుడు ప్రేయసీ ప్రేమికుల్లో, భార్యభర్తల్లో ఒకరిని మరొకరు దూరం ఉండమంటే కొందరు వినకపోవచ్చు. హటం చేయవచ్చు. వారి కోసం దొంగ కోపం చూపించాలి. కిలాడీ అలక ప్రదర్శించాలి. వారు అలకకు జడిసి దూరం నిలబడి పాట పాడుతుంటే వినాలి. ‘నేలతో నీడ అన్నది నను తాక రాదని పగటితో రేయి అన్నది నను తాక రాదని’ అని భర్తలు పాడుకోవచ్చు గాక. కాని వైరస్లు వ్యాప్తి చెందకుండా అదొక చక్కటి నివారణోపాయం అనుకోవాలి. నీట్నెస్ ఫస్ట్ అని వారికి చెప్పగలగాలి. భర్తలు కూడా ఈ సమయంలో తగ్గకూడదు. ఇంటి శుభ్రతకు, ఒంటి శుభ్రతకు బద్దకించే భార్యలపై కావాలనే చిరాకు చూపించి కంగు తినిపించాలి. ‘నేడు శ్రీవారికి నేనంటే పరాకా... తగని భలే చిరాకా’ అని వారు బిత్తర పోతుంటే ఇదంతా నీ మంచికే అని మనసులో కన్నీళ్లు తుడుచుకోవాలి. ఎవ్వరి కోసం ఎవరుంటారు పొండిరా పోండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి.. పిల్లల మీద తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ. కాని ఇటువంటి కాలంలో వారిని దూరంగా పెట్టే ప్రేమ చూపాలి. సురక్షితం కాని ప్రదేశాలలో వారు తిరిగి ఉంటే ‘సెల్ఫ్ క్వారంటైన్’ అయిపోమ్మని చెప్పాలి. మనం తిరిగి ఉంటే గదిలోకి వెళ్లి తలుపేసుకోవాలి. ఆ కరోనా బురోనా బై చెప్పాక కలవక తప్పదని ఒకరికి మరొకరు చెప్పుకోవాలి. టాటా... వీడుకోలు.. గుడ్ బై... ఇంక సెలవు తొలినాటి స్నేహితులారా... చెలరేగే కోరికలారా.. ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండాలి. కాని ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ దూరంగా ఉండాలి. ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, ఒకరి సిగరెట్లు మరొకరు పంచుకోవడం, ఒకరి బైక్ హ్యాండిల్‌ను మరొకరు పట్టుకోవడం ఇప్పుడు అవసరం లేదు. అందుకే వాళ్లను నేరుగా కలవడానికి తాత్కాలికంగా వీడ్కోలు చెప్పాలి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అందరూ సుఖపడాలి నందనందానా’ అని రాబోయే మంచి కోసం ఎదురు చూడాలి. ఇక పిల్లలు గడుగ్గాయిలు. వారు ఇంటి పట్టున ఉండమంటే వినరు. ఆడటానికి వెళతారు. పాడుకోవడానికి వెళతారు. గంతులు వేస్తారు. ఈ వేసవి కాలం వారికి ఆటవిడుపు. కాని ఇది మాయదారి కరోనా కాలం అయిపోయింది. అందుకే వారికి బుద్ధి చెప్పాలి. బాగు చెప్పాలి. నలుగురినీ కలవడం తప్పు అని చెప్పాలి. విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాటా... అని చెప్తే వారు వినకుండా పోరు. అయితే ఇది సంఘం మొత్తం చైతన్యవంతం కావాల్సిన సమయం. అందరూ కలిసి ఆపత్కాలాన్ని దాటాల్సిన సమయం. వారికి పిలుపునివ్వాలి. ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా’ అని కరోనా వంటి విష క్రిమి వ్యాప్తి చెందకుండా ఎంతటి దీక్ష వహించాలో చెప్పాలి. ‘ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన కరోనావాడు’ అని గర్జించేలా చేయాలి. అలాగే ఇది మనందరికి కష్టకాలం. పరీక్షా కాలం. దానిని దాటాలంటే ఇప్పుడు గొప్ప క్రమశిక్షణ కావాలి. బాధ్యత ఉండాలి. దాంతోపాటు నిరాశలో కూరుకుపోకుండా ఆశ కూడా ఉండాలి. ఆ ఆశను నింపే పాట పాడుకుంటూ ఉండాలి.– సాక్షి ఫ్యామిలీ -
ఆందోళనకు ఊపిరి పోస్తున్న ‘పాటలు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ మీరు అన్ని పుష్పాలను తుంచి వేయవచ్చు. కానీ రానున్న వసంతాన్ని మాత్రం ఆపలేవు’ ఈ కవిత గానమై ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో మారుమ్రోగిపోతోంది. పాబ్లో నెరుడా రాసిన ఈ కవిత నాడు చిలీలో జరిగిన విద్యార్థి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. నాడు ఆయన దేశంలో నియంతత్వ పాలనకు వ్యతిరేకంగా 20కిపైగా కవితలు రాశారు. కవితలు, పాటలు ఉద్యమాలు, విప్లవాల నుంచి పుడతాయి. మళ్లీ అలాంటి ఉద్యమాలకే ఊపరిపోస్తాయి. అందుకే ‘పాట ఉద్యమం అవుతుంది. ఉద్యమం పాట అవుతుంది’ అంటూ గొంతెత్తిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా పాటే ఆయుధమైంది. నేడు ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో ఆయా ప్రాంతాలకు చెందిన పాటలు, కవితలు ఆయా ప్రాంతాల్లో మారుమ్రోగుతున్నాయి. ఆందోళనకు కొత్త ఊపునిస్తున్నాయి. వరుణ్ గోవర్ హిందీలో రాసిన తిరుగుబాటు కవిత ‘హమ్ కాగజ్ నహీ దిఖాయింగే’కు మంచి స్పందన కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో లక్షలసార్లు చెక్కర్లు కొడుతోంది. అస్సాంలో ‘ఐయామ్ మియా, మై ఎన్ఆర్సీ నెంబర్ సో అండ్ సో, ఐ గాట్ టూ చిల్డ్రన్, అనదర్ ఈజ్ కమింగ్ నెక్స్›్ట సమ్మర్, విల్ యు హేట్ హిమ్ యాజ్ యూ హేట్ మీ’ కవిత కూడా పాటై ప్రజలను ఆందోళన బాటలో నడిపిస్తోంది. 2017లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం ‘న్యూటన్’లోని ‘చల్ తూ అప్నా కామ్ కర్’ అనే పాట కూడా ఆందోళనకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. నక్సలైట్ల బెడద ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని ఓ మారుమూల పర్వత ప్రాంతంలో ముగ్గురు ఓటర్ల కోసం ఆరుగురు ఎన్నికల సిబ్బంది అడవుల గుండా కాలి నడకన కిలీమీటర్ల దూరం నడిచి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇతివృత్తంగా ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఎవరి పని వారు కచ్చితంగా చేయాల్సిందే అనే అర్థమిచ్చే ఈ పాటను ఆ చిత్రంలో నటుడు రఘుబీర్ యాదవ్ పాడారు. -
పాటల మ్యాజిక్: వింటూ మైమరిచిపోదాం..
కొన్ని పాటలు వింటుంటే మనల్ని మనమే మైమరిచిపోతాం.. తెలీకుండానే తల, చేతులు ఆడిస్తుంటాం.. లైన్ తెలిస్తే బాత్రూం సింగర్ కంటే మెరుగ్గా పాట కూడా పాడేస్తాం. ఇక ఈ ఏడాది ఎన్నో పాటలు ఓ ప్రవాహంలా వస్తే చాలా పాటలు ఒడ్డుకు నిలబడి విజయాన్ని అందుకున్నాయి. కొన్ని ప్రేమ గీతాలను ఆలపిస్తే, మరికొన్ని తీన్మార్ స్టెప్పులతో ఊరమాస్ అనిపించాయి. అలా 2019 మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మరి ఈ ఏడాది టాప్ టెన్ తెలుగు పాటలు ఏంటో పాడేద్దాం... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇందులోని ప్రతీ పాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలనా అనే పాట యూట్యూబ్‌లో ఆగకుండా దూసుకుపోతోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు తమన్ సంగీతమందించగా సీతారామశాస్త్రి లిరిక్స్ అందించాడు. బాహుబలి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చేశాడు. ఇది ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని పాటలే జనాలకు క్లిక్ అయ్యాయి. కానీ ఒక పాటకు మాత్రం జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అదే ‘ఆగదిక సయ్యా సైకో..’’ ఈ పాట క్యాచీగా ఉండటంతో పాటు మిక్స్డ్ భాషలు ఉపయోగించి అందరి నోట పాడించేలా చేశారు గేయ రచయిత శ్రీజో. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో ఓ సైరా అనే పాట ఆయన గొప్పతనాన్ని తెలుపుతూ సాగుతుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన పాట కాగా ఇది జనంలో మార్మోగిపోయింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మహర్షి సినిమా అంచనాలను దాటి వసూళ్లను సాధించింది. మహర్షి పేరుకు తగ్గట్టుగా పాట ‘ఇదే కదా ఇదే కదా..’ పాట ఉత్తేజాన్ని నింపింది. మహేశ్‌బాబు ‘నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. ‘మహర్షి’తో మరో హిట్ అందించారు దేవీశ్రీప్రసాద్. ఇది నీ కథ అని చెప్తూ ఈ పాట అందరి మనసులకు చేరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట జనాలను ఇప్పటికీ వదలట్లేదు. మణిశర్మ సంగీతమందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటకు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇరగదీసే స్టెప్పులు వేయగా హీరోయిన్ డ్యాన్యులతో ‘ఇస్మార్ట్ పాట’ అని ముద్ర వేసుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ ఆలపించారు. ‘ప్రియతమా.. ప్రియతమా..’ ఈ పదంలోనే ఏదో మత్తు ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల లిస్టులో ఈ పాట కూడా చేరిపోయింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ‘మజిలీ’ సినిమాలోని ఈ పాటలో అక్కినేని నాగచైతన్య, సమంత వారి హావభావాలతో పాటను మరింత రక్తికట్టించారు. చిత్రలహరి సినిమాలో ‘ప్రేమ వెన్నెల..’ పాట తెలియనవారు లేరంటే నమ్మండి. అందులోని ఈ పాటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సుదర్శన్ అశోక్ రచించిన ఈ పాటకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. శ్రీమాన్ అద్భుతంగా పాడాడు. నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఒకటి ‘జెర్సీ’ కాగా మరోటి ‘గ్యాంగ్ లీడర్’. రెండింటిలోనూ మంచి పాటలకు కొదువే లేదు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలోని ‘హొయినా హొయినా’ పాట అందరినీ ఉర్రూతలూగించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా, ఈ పాటను ఆలపించిన ఇన్నో జెంగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘ఓ బావా.. మా అక్కను సక్కగ సూస్తావా..’ సాంగ్‌తో మరో హిట్ అందుకున్నాడు. కేకే రాసిన పాటను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ దానికి తగ్గట్టుగా ఆలపించారు. ప్రతిరోజు పండగే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ అందరి ఫోన్లలో మోగుతూనే ఉంది. బావను ఆట పట్టించడానికి మరదళ్లు ఈ పాటతో ఓ ఆట ఆడేసుకుంటున్నారనుకోండి. క్రికెట్ చుట్టూ తిరిగే కథ ‘జెర్సీ’. ఇందులో ‘అదేంటో గానీ ఉన్నపాటుగా..’ పాట ఎంత హిట్టో మనందరికీ తెలిసిందే. దీనికి సంగీతాన్ని అందించిన అనిరుధ్ తనే స్వయంగా ఆలపించాడు. క్రిష్ణ కాంత్ మెలోడీకి తగ్గట్టుగా పాట రచించాడు. పెళ్లి తర్వాత ప్రేమ మరింత పెరుగుతుందని నిరూపిస్తుందీ పాట. -
వరల్డ్ ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్
-
ఆ రెండు పాటలతో బన్నీ డబుల్ సెంచరీ
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో ప్రీ రిలీజ్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకు వదిలిన రెండు పాటలు సామజవరగమన, రాములో రాములా రికార్డ్ వ్యూస్‌ను సాధించగా ఈ రెండు పాటలూ కలిపి యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ రాబట్టాయి. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఈ రికార్డుకు వేదికైంది. సెప్టెంబర్ 27న అలవైకుంఠపురములో తొలి పాట సామజవరగమన ఇలా బయటకు రాగానే కేవలం 65 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 కోట్ల మందికి పైగా వీక్షించగా 11 లక్షల మంది లైక్ చేశారు. ఇక సరిగ్గా నెలరోజుల పాటు ఈ పాట యూట్యూబ్‌ను ఊపేసిన అనంతరం ఇదే సినిమాలోని రెండవ పాట రాములో రాముల అక్టోబర్ 27న విడుదలై 54 రోజుల్లోనే 100 మిలియన్ మార్క్‌ను దాటేసింది. అలవైకుంఠపురములో మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన థమన్ ఎస్ తన పాటలకు భారీ విజయం దక్కడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీతో బన్నీ, త్రివిక్రమ్‌లు మరెన్ని మ్యాజిక్‌లు క్రియేట్ చేస్తారో చూడాలి. -
కాదలన్ కాదలిక్కుమ్ రీమిక్సింగ్ పాట
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట మాధుర్యాన ప్రాణాలు విడుతునే’ అనడంలోనే పాట గొప్పతనం తెలుస్తోంది. సంగీత, సాహిత్యాల మేళవింపుతోనే పాటకు ఆ మాధుర్యం అబ్బుతుంది. కచేరి పాటలకన్నా సినిమా పాటలు ఎవరైనా ఎక్కువగా వింటారు. నాటి సినిమాల్లో పాట సాహిత్యానికి సంగీతం సమకూర్చగా నేటి రోజుల్లో సంగీత బాణికి పాటను కూరుస్తున్నారు. ఏదైనా శ్రోతలకు కావాల్సింది పాట మాధుర్యం. కొందరికి పాత పాటలు బాగా నచ్చవచ్చు. కొందరికి కొత్తవే నచ్చవచ్చు. మరికొందరికి పాత, కొత్త రెండూనూ. అది వారి వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఏ పాట నచ్చినా అందులో మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆ పాట కూర్చిన రికార్డింగ్ రూమ్‌లో అది ఎలా వినిపిస్తుందో మన శ్రవణానికి అలాగే వినిపించాలి. పాట ప్రసారంలో కొంత నష్టం జరగొచ్చు. ఎక్కువ జరిగితే మాత్రం పాట మాధుర్యాన్ని కోల్పోతాం. ఒకప్పుడు ఎల్పీ రికార్డులు, పూల్ టేపులు, క్యాసెట్లు, తర్వాత సీడీలు, డీవీడీల, ఎంపీ 3ల రూపాల్లో మనకు పాటలు చేరాయి. రికార్డులు దెబ్బతిన్న, టేపులు నలిగినా, సీడీ, డీవీడీలు, గీతలు పడిన పాట వినసొంపులు పోయేవి. మళ్లీ మళ్లీ రికార్డులు చేయడానికి అప్పుడు మాస్టర్ కాపీలను భద్రంగా ల్యాబ్‌లో దాచేవారు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, ఐ ఇయర్ రేడియో, ట్యూన్ ఇన్ రేడియో, స్పాటిఫై, డీజర్, పండోరా, సౌండ్ క్లౌడ్ లాంటి ‘మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్’ చాలా వచ్చాయి. వీటి ద్వారా పాట ప్రసారంలో ‘నష్టం’ చాలా తక్కువ. తాజాగా టైడల్ అనే మరో యాప్ వస్తోంది. అందులో నష్టం మరీ, మరీ తక్కువ. అయితే వారు తీసుకునే సోర్స్‌ను బట్టి పాట నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పాత పాటలు చాలా దెబ్బతిని ఉన్నాయి. ఇక్కడకే మనకు పాటలను మరమ్మతు చేసే మాంత్రికుడు సౌండ్ ఇంజనీర్ శ్రీజేష్ నాయర్ సేవలు అవసరం. పాత, కొత్త తేడా లేకుండా ఏ పాటనైనా ఆయన మునుపటిలా మరమ్మతు చేసి ఇవ్వగలరు. ‘జోధా అక్బర్, కామినీ, గ్యాంగ్స్ ఆఫ్ వాసేయ్‌పూర్ –2 సినిమాలకు ఆయన రీ రికార్డింగ్ మిక్సర్గా పనిచేశారు. వాసేయ్‌పూర్ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన పాత పాటలను మరమ్మతు చేసి వాటిని వినిపించడం కోసం 2017లో ‘ది మాస్టరింగ్ ప్రాజెక్ట్’ పేరిట ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టారు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య వచ్చిన హిందీ, తమిళ్, మలయాళం పాటలలో తనకు నచ్చిన పాటలను మరమ్మతు చేసి, వాటిని తన చానెల్ ద్వారా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చానెల్‌కు దాదాపు 50 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1994లో విడుదలైన ‘కాదలన్’ చిత్రంలో ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన పాటలను ఆయన మొదట మరమ్మతు చేశారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఉదిత్ నారాయణన్ పాడిన ‘కాదలన్ కాదలిక్కుమ్’ అనే పాటను ఇప్పుడు వింటుంటే నిన్ననే రికార్డు చేసినట్లు ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు 430 పాటలను మరమ్మతుచేసి రీలోడ్ చేయగా, వాటిలో 169 పాటలు రెహమాన్ సమకూర్చినవి, 38 పాటలు ఇళయరాజా సమకూర్చినవి ఉన్నాయి. శ్రీజేష్ నాయర్ మరమ్మతు చేసిన వాటిలో ‘జియా జలే, దిల్ సే రే, తాల్ సే తాల్ మిలా, హే కాలీ కాలీ హాంకే, ముష్కిల్ బడా ఏ ప్యార్ హై లాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ఉదయం ‘చిత్రహార్’ కార్యక్రమం పేరిట వచ్చే పాటలను వింటున్నప్పుడు వాటిలో చాల దెబ్బతిన్న పాటలు నాయర్‌కు కనిపించాయట. అప్పటికి ‘డాల్బీ నాయిస్ రిడక్షన్’ వ్యవస్థ స్పీకర్లలలో ఉన్నప్పటికీ ఎక్కువ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ దిశగా తాను కషి చేయాలని నాయర్ నిర్ణయానికి వచ్చాడట. అప్పటి నుంచి పాటలలోని సంగీతపరంగా చోటు చేసుకున్న లోపాలను గుర్తించి రీమిక్సింగ్ మొదలు పెట్టారు. అందుకోసం ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘అవిడ్ ప్రో టూల్స్, ఏడిఎక్స్ ట్రాక్స్‌లతోపాటు ఇతర సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. నాయర్ మరమ్మతు చేసిన కొన్ని పాటలు అస్సలు వాటికన్నా బాగున్నాయని ఆయన చానెల్ సబ్స్క్రైబర్లు ప్రశంసిస్తుంటే, ఆయన ఒరిజనల్ పాటలో లేకున్నా కొన్ని చోట్ల బాస్ (మంద్ర ధ్వని), మరి కొన్ని చోట్ల ట్రెబుల్ (మూడింతల పిచ్) పెంచుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఒరిజనల్ పాటలో లేకపోయినా అక్కడ సంగీత దర్శకుడు రాబట్టాలనుకున్న పరిపూర్ణతను దష్టిలో పెట్టుకొని తాను మరమ్మతు చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
దీపావళికే వెలుగులద్దిన పాటలు..
దీపావళి.. తెలుగు వారి గుమ్మం ముంగిట ఆనంద తోరణాలుగా ప్రమిదలు వెలుగులు కురిపిస్తుంటాయి. ఇంటి ముందు పేల్చే చిచ్చుబుడ్లు వారి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా నిలుస్తాయి. రాకెట్లు వారు అందుకోవాల్సిన గమ్యాలను గుర్తు చేస్తాయి. భూచక్రం మన మనసు చేసే పరిపరి ఆలోచనలకు ప్రతిబింబంగా మారుతాయి. ఇలా ఎన్నో పరమార్థాలు దాచుకున్న పండగే దీపావళి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. ఇక దీపావళి ప్రత్యేకతను, దాని విశిష్టతను చెప్పడానికి మాటలు సరిపోవనుకున్నారో ఏమో కానీ సినీ కవులు పాటల్లో దాని పరమార్థాన్ని ఇనుమడింపజేశారు. తెలుగునాట దీపావళిపై వచ్చిన పాటలు తక్కువే అయినప్పటికీ వాటి మహత్యం మాత్రం చిన్నపాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో వచ్చిన పాటల వైభవం ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ.. విచిత్రబంధం సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి.. చీకటి వెలుగుల రంగేళీ’. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దీపావళి పాట ఇది. తరాలు మారుతున్నా ఆదరణ తగ్గని పాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీపావళిని ఇముడ్చుకున్న మరిన్ని పాటలు.. దీపావళి - వచ్చింది నేడు దీపావళి.. పరమానంద మంగళ శోభావళి షావుకారు - దీపావళి.. దీపావళి... ఇంటింట ఆనంద దీపావళి అంటూ సంతోషంలో పాడుకోగా.. దీపావళి, మా ఇంట శోకాంధ తిమిరావళి అంటూ ఇదే సినిమాలో బాధలోనూ పాడుకున్నారు. భలే రాముడు - ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా రుణానుబంధం - దీపాల పండుగ.. ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ.. ఆ తరం నుంచి ముందుకు వస్తే.. మామగారు - వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి.. ఏనాడూ వెళ్లిపోని దీపావళి.. ఇయ్యాలె అచ్చమైన దీపావళి పెళ్లికానుక - ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ.. ఆనందం పొంగేనోయి దీపావళి.. అని సంతోషంలో పాడుకోగా, ఆడేపాడే పసివాడ.. అమ్మా లేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి అంటూ బాధలోనూ మార్చి పాడుకున్నారు. విజయదశమి - దీపావళి.. రెబల్ - చెప్పలేని ఆనందం.. దివాళీ దడ - దీవాళీ.. దీపాళీ.. ఇవే కాకుండా దీపావళి పండగపై ప్రత్యేక ఆల్బమ్స్ కూడా ఉన్నాయి. అదీగాక 'దివ్వి దివ్వి దీపావళి.. దిబ్బు దిబ్బు దీపావళి..' అంటూ పాడుకునే జానపద పాటలు మరెన్నో.. సినిమాల్లో దీపావళి.. ‘దీపావళి’ టైటిల్తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది 1960లోఎన్టీఆర్,సావిత్రిలు కృష్ణుడు సత్యభామలుగా నటించిన చిత్రం ‘దీపావళి’. ఇది పండగ ప్రాశస్త్యాన్ని చెప్పే పురాణ కథ .మరొకటి 2008లో వేణు హీరోగా వచ్చిన దీపావళి. దీపావళి సీన్లతో గట్టెక్కిన సినిమాలు ఉన్నాయి. కథను మలుపు తిప్పడానికి దీవాళిని వాడుకున్న చిత్రాలూ ఉన్నాయి. జనతా గ్యారేజ్‌లోనూ దీపావళిని పర్యావరణహితంగా ఎలా జరుపుకోవాలో హీరో సందేశాన్నిస్తాడు. పసి పిల్లోడు నుంచి పడుచు పిల్ల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి పండగకు ప్రాణం పోసే పాటలు, చిత్రాలు మరెన్నో రావాలని ఆశిద్దాం. -
లాహిరి.. లాహిరి..
-
సుస్వనతో విజయదశమి
-
ఎండకు పూచిన పాటలు
వెలుతురు సోకని చీకటి గుహల్లో నలిగింది చాలు... ఇరుక్కుని బతుకుతున్నది చాలు... అలా ప్రకృతిలో పడండి... ఎండను తినండి...సూర్యుణ్ణి తుంచి బుగ్గన భగ్గున పెట్టుకోండి... అని జూ.ఎన్టీఆర్ ‘ప్రణామంప్రణామం ప్రణామం... ప్రభాత సూర్యుడికి ప్రణామం’ అని పాడాడు ‘జనతా గ్యారేజ్’ సినిమాలో. పైన సూర్యుడు ముచ్చటపడి చూస్తూ ఉండగా,బుల్లెట్ బండ్ల మీద ఉడుకు నెత్తురు కుర్రకారు వాగుల్ని వంకల్ని డొంకల్ని దాటి,కొండ కొసల్ని ఎక్కి, పచ్చదనాన్ని కావలించుకోవడం చూస్తే శక్తి వస్తుంది. సూర్యుడి నుంచి సుషుప్తిని విదిల్చికొట్టే చురుకు అందుతుంది. సినిమా కవులకు, సినీ సందర్భాలకు ఎండ దొరికేది తక్కువ. వెన్నెల, పున్నమి, జాబిలి, కలువ అనగానే కవులు చెలరేగిపోతారు. అదే ఎండ అనగానే బండబారిపోతారు. ఎండలో అంత భావుకత ఏముంటుందని వారి అభిప్రాయం. కాని ఎండ కూడా వేడుక వంటిదే. భళ్లున వెలిగే పండుగలాంటిదే. ఎండ నడిపే కథ ఉంటుంది. ఎండ నడిపే సన్నివేశం ఉంటుంది. ఎండ లేపి కూర్చోబెట్టే కూసుదనం ఉంటుంది. తెలుగు సినిమాల్లో అలాంటి కవి సమయాలు కూడా ఉన్నాయి. అల్లాంటి పాటలు మరపునకు రాకుండా ఉండిపోయాయి. అసలు సూర్యుణ్ణి కొలిచే తొలి ఛాన్సు ఏ ఎన్టీఆరో ఏఎన్నారో కాకుండా గుమ్మడి దక్కించుకోవడం ఆయన నటజీవితంలో తొలిపొద్దు వంటి అనుభవం. ‘దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార’ అని ‘వినాయక చవితి’ సినిమాలో ఆయన పాడిన పాట ఆయననూ ఘంటసాలనూ రాసిన సముద్రాలను తెలుగు నేలన ప్రభాతాలు ఉన్నంత కాలం ఉంచేలా చేశాయి. అయితే సోషల్ సినిమాలు వచ్చేసరికి సూర్యుణ్ణి చూసే పద్ధతి మారింది. శ్రీశ్రీని పూనకం తెచ్చుకున్న ఆత్రేయ ‘తోడి కోడళ్లు’ సినిమాలో సిగరెట్ పొగలు వదులుతున్న అక్కినేని చేత ‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో’ అని ‘కారులో షికారుకెళ్లే’ ఒక పాలబుగ్గల అమ్మాయిని ఎద్దేవా చేస్తాడు. అయితే ‘లేత మనసుల’తో హిట్ అయిన రామ్మోహన్ ‘కన్నెమనసులు’ సినిమాలో గుర్రం మీద షికారు చేస్తూ ఉదయాన్ని, తొలి ఎండనీ మైదానాల్లో స్పర్శ చెందుతూ ‘ఈ ఉదయం నా హృదయం కురులు విరిసి ఆడింది పలకరించి పాడింది’ అని పాడటం జనానికి నచ్చింది. అదే రామ్మోహన్‌తో ఇంట్రడ్యూస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ ఖాతాలో వేరొక వేకువపాట ఉంది. ‘ఇద్దరు మిత్రులు’ సినిమా కోసం శోభన్‌బాబుతో కలిసి ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి’ ఆయన పాడిన పాట ఘంటసాల, బాలుల జుగల్బందీని బూందీ కంటే తియ్యగా గ్రామ్‌ఫోన్ రికార్డు మీద రికార్డు చేసింది. కాని సాధారణంగా తెలుగు సినిమాల్లో ఉదయాలంటే ఆడవాళ్లవి. వాళ్లు వేకువజామునే లేవడం, పశువులకు ఇంత గ్రాసం పడేయడం, తల స్నానం చేసి సిగను టవల్‌తో పాటు చుట్టి పెట్టడం, ఇంటి ముందు ముగ్గు వేయడం, తులసి కోటకు ప్రదక్షిణాలు పూర్తి చేయడం, భర్తకు బెడ్ కాఫీ... ఇవన్నీ తప్పని పల్లవులు చూపే ప్రియచర్యలు. బాపు ఏ ముహూర్తాన ‘ముత్యాలముగ్గు’ కోసం ఆరుద్రతో ‘ముత్యమంతా పసుపు ముఖమెంత చాయ’ అని రాయించారో ఆ రోజు నుంచి అది తెలుగు వాకిళ్ల ఉదయాలకు ఒక íఫిక్స్డ్ ఫార్మాట్ ఇచ్చినట్టయ్యింది. పారాణి పాదాలపైన వెండి పట్టీలు ధరించిన సంగీత– ఇంటి ముంగిట నీళ్లు చల్లి, చుక్కలు కలిపి ముగ్గువేయడం తెలుగు కళకు, సినిమా కలానికి విలువ పెంచింది. అయితే ఆరుద్ర అలా రాస్తే కృష్ణశాస్త్రి మరోలా రాశారు. ఉదయాన్నే పూజకు పూలేరేందుకు తోటకు వచ్చిన హీరోయిన్ చేత ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యం ప్రకటింపచేశారు. ఆ సినిమా ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’. నిజమే. కొమ్మకు పూలిమ్మను ఎవరు చెప్పారు? కిరణానికి వేడిమి ఇమ్మని ఎవరు ఆదేశించారు? అందుకే కృష్ణశాస్త్రి కలం నుంచి ‘సీతారాములు’ నుంచి వచ్చిన మరో సూరీడు పాట కూడా గుర్తుండిపోతుంది. ప్రభాత వేళ సముద్రానికి ఆ కొసన పైకి లేచే నారింజ పండును చూస్తూ ‘తొలి సంజె వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సిందూరం’ అని ఆయన రాస్తే ఆ ఉదయం హృదయానికి తాకింది. ‘ఎగిరే ప్రతి కెరటం అంటదు ఆకాశం’ అని ఆ పాటలో ఆయనన్న మాట గెలుపు ఓటముల సమభావనను, ఉదయాస్తమాల ఎరుకనూ ఇస్తుంది. ఇక కె.బాలచందర్‌కు సంకేతాలతో కథ చెప్పడం వచ్చు. ‘కోకిలమ్మ’ సినిమాను అలాంటి సంకేతాలతోనే చెప్తారు. అందులో హీరోయిన్ చెవిటిది. కాని ఆమె హృదయం నిండా శబ్దం ఉంది. నిరాశ అనే చీకటిని తరిమికొట్టే వెలుతురు ఉంది. చెట్ల మీద చిగుర్లను చివురింప చేసే చేవ ఉంది. ఆ శక్తిని పొందిన హీరో గాయకుడు అవుతాడు. ‘ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై’ అని పాడతాడు. పాడిన వాడు కృతజ్ఞత ప్రకటించడు. తాను ముందుకు నడిచిపోతాడు– అమెను శూన్యంలో వదిలి. అదే తమిళ సీమ నుంచి వచ్చిన భారతీరాజా కొలనులో వేయి సూర్యుళ్లను వికసింప చేశాడు ‘సీతాకోకచిలుక’ సినిమాలో. వేటూరి రాయగా, ఇళయారాజా తబలాను చరచగా ఎండ చర్రుమన్నట్టు ‘మిన్నెటి సూరీడు వచ్చెను మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా’ పాట ఎంత మధురం. అది ఎండ కంటే తెల్లన. అది ఎండ కంటే ఎర్రన. మరి అదే ద్రవిడ నేల నుంచి వచ్చిన దర్శకుడు మహేంద్రన్ ‘మౌనగీతం’ సినిమాలో తెల్లవారుజాము జాగింగ్‌ను సౌందర్యభరితం చేశాడు. పొగమంచులో అమ్మాయి, అబ్బాయిలు వేసే అడుగుల చప్పుడులో సంగీతం విన్నాడు. సుహాసిని, మోహన్ కలిసి ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ అని పాడుకునే పాటతో పాటు మనమూ పరిగెత్తి పోమూ? ఉషోదయాలను కెమెరాలో కాప్చర్ చేయాలంటే యూనిట్ నాలుగ్గంటలకంతా లొకేషన్లో ఉండాలి. సూర్యోదయం కోసం ఎదురుచూడాలి. ఉదయిస్తున్న సూర్యుణ్ణి వేళ దాటేలోపల పాటలో పట్టి బంధించాలి. ఇక్కడైతే సరే. నేపాల్ వంటి పరాయి దేశంలో హడావిడిలో అంత ఎర్లీ మార్నింగ్ లేచి షాట్ తీయాలంటే ఎన్టీఆర్, వాణిశ్రీ వంటి సూపర్స్టార్ల క్రమశిక్షణ వల్లే సాధ్యం. ‘సాహసవంతుడు’ సినిమాలో ‘సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను’ పాట సినిమా రిజల్టు ఎలా ఉన్నా ఇప్పటికీ నిలిచి ఉంది. కాని అన్నీ సినిమాలకూ ఇలా నేపాల్ దొరకదు. చెన్నై వి.జి.పి గార్డెన్స్తోనే సర్దుకోవాలి. ఆ గార్డెన్స్‌లో చాలా కమర్షియల్ పాటలు పిక్చరైజ్ అయి ఉండొచ్చు. కాని ‘గోరువెచ్చని సూరీడమ్మా పొద్దుపొడుపులా వచ్చాడమ్మా’ వంటి లలితమైన భావన ఉన్న పాట కూడా పిక్చరైజ్ అయ్యింది ‘జయసుధ’ సినిమా కోసం. కవులు మారారు. కొత్త కవులు వచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వచ్చి ‘తెల్లారింది లెగండో కొక్కరొక్కో మంచాలింక దిగండో కొక్కొరొక్కో’ అని బద్దకాన్ని, అలక్ష్యాన్ని, అర్థరహితమైన జీవితాన్ని వదిలి ఒక పరమార్థపు దారి వైపు నడవమని అలారం మోగించాడు ‘కళ్లు’ సినిమాలో. కాని ఆయనే సూర్యోదయపు పులకరింతలో దైవాన్ని చూశాడు. మానవ నిమిత్తమాత్రతను కూడా చూశాడు. ‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వొణికింది పిలుపునియ్యనా ప్రభూ’ అని ‘స్వాతి కిరణం’ కోసం రాశాడు. అయితే ఈ సమయంలోనే పాటకు విరామం ఇచ్చిన ఒక మేటి కోయిల (భానుమతి) మళ్లీ గొంతు సవరించుకుని ‘మంగమ్మ గారి మనవడు’ కోసం ‘శ్రీ సూర్య నారాయణా మేలుకో’ అని పాడటం ఓ ముచ్చట. అయితే సూర్యుణ్ణి ఉదయానికి, శక్తికి, ఉత్తేజానికే ప్రతీకగా కాకుండా వీడ్కోలుకు కూడా ప్రతీకగా తీసుకుని కవులు సమర్థంగా ఉపయోగించారు. ‘స్టాలిన్’లో చిరంజీవి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ రాసిన పాట భిన్న సందర్భాలలో గొప్ప వ్యక్తుల నిష్క్రమణ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా వినిపించింది. ‘సూర్యుడే సెలవని అలసి పోయేనా... కాలమే శిల వలే నిలిచిపోయేనా... మహాశయా విధి బలై తరిమెనా’... ఈ పాట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎక్స్‌ప్రెసివ్ గానం వల్ల, మణిశర్మ రసాత్మకమైన సంగీతం వల్ల నిలబడింది. కాని ‘బాహుబలి’లోని పాట కూడా ఇందుకు తక్కువ కాదు. వంచనకు గురైన బాహుబలి మాహిష్మతిని విడిచి వెళ్లేప్పుడు వినవచ్చే పాట ‘పడమర కొండల్లో వాలిన సూరీడా’ భాష తెలియనివారి చేత కూడా పాడించింది. గాయకుడు కాలభైరవకు మధ్యాహ్న మార్తాండుడంతటి ఫోకస్‌ను ఇచ్చిందా పాట.సూర్యుడంటే ఎండాకాలం అంటే ఏసీలు కూలర్లు ఇష్షోలు బుష్షోలు మాత్రమే కాదు. మామిడి పండ్లు, సోడాబుడ్లు, మల్లెచెండులు మాత్రమే కాదు. తాటి ముంజెలు, పుచ్చచలువలు కూడా కాదు. కొన్ని కవి సమయాలు కూడా. కొన్ని సినిమా పాటలు కూడా. ఎలక్షన్లు ముగిశాయి. పరీక్షలు ముగిశాయి. హాయిగా కొన్ని ఎండ పాటల్ని, ప్రభాత గీతాల్ని ఎంజాయ్ చేయండి. – కె -
రామ గానం
-
కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప?
కొత్తరాగమున కుహూకుహూమని మత్తిలి కోయిల కూయగా... కొమ్మలో కోయిలా కూయంటదే...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...గున్నమామిడి కొమ్మమీద గూళ్లురెండున్నాయి... ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోని కోయిలుంది... కోయిల పాట బాగుందా... కొమ్మల సిరి బాగుందా... ఏవమ్మోయ్ కోయిలమ్మా! నీ మీద వచ్చిన పాటలు వింటూ కూర్చున్నావు. యేమంత మిడిసిపాటుతో నెల రోజుల ముందు నుంచే పాడటం ప్రారంభించావు. అంత గొప్పలు ఎందుకు నీకు? నువ్వు పాడటానికి ఓ సమయం సందర్భం లేదా...అంటూ మావి చిగురు కోకిలను ఎకసెక్కాలాడటం ప్రారంభించింది.బాగానే ఉంది నువ్వు చెప్పేది. నీ చిగుళ్లు ముందుగా రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిని, గొంతు సవరించి, కుహూకుహూ అని కూయటం ప్రారంభించాను... అని గడుసుగా సమాధానం చెప్పింది కోకిల.నా చిగుళ్లు తింటేనేగా నీకు గొంతు అంత తియ్యగా స్వరం పలికేది. నేను చిగురించకపోతే నీ పాటకు తావెక్కడ. నా గొంతు తియ్యగా ఉందా. నీ చిగుళ్లు తియ్యగా ఉంటాయని ఎవరో చెప్పడంతో తిన్నాను. ఆ వగరుకి నాకు గొంతులో దురద వచ్చి, ఆ దురద పోగొట్టుకోవడానికి ఇలా అరుస్తున్నాను. అదే మీరంతా తీయని పాట అంటున్నారు. అంతేఅయితే ఆ ఘనత అంతా నాదే. నా వగరు చిగుళ్ల వల్లే నీకు తీయని కంఠస్వరం వచ్చింది. నీకు దురద పెడితే మాకెందుకు, దురద పెట్టకపోతే మాకెందుకు. ఇంతకీ మా సంగతి పక్కన పెట్టు, నువ్వు అంత ముందుగానే ఎందుకు పూత పూశావు. నీ అవసరం ఉన్న రోజు వచ్చేసరికి పూత కాస్తా పిందెలు అయిపోతావు. మమ్మల్ని అనే ముందు నిన్ను నువ్వు ఓ సారి చూసుకుని మమ్మల్ని వేపుకు తినకమ్మా వేప తల్లీ!నా సంగతి సరే. ఆ గున్నమామిడి సంగతి చూడండి... మిమ్మల్ని అనే హక్కు నాకు లేదు. అందుకే మౌనంగా ఉంటున్నాను. పిందెగా ఉండవలసిన నేను అప్పుడే కాయలు, పండ్ల రూపంలోకి మారిపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటావు చెరుకు తల్లీ!కాలమహిమ! ఋతువులకు అనుగుణంగా పంటలు పండే రోజులు మారిపోయాయి. పోనీలే... ముందు నుంచే మనల్ని రుచి చూస్తారు కదా. వాళ్లకి ఆనందం కలిగిస్తున్నాం కదా. కానీ ఈసారి నేను ఎందుకో అంత తియ్యగా ఉండేలా కనిపించట్లేదు. మన మల్లి తల్లి మాత్రం అప్పుడే పరిమళాలను ఘుమాయించేస్తోంది. గుభాళించి ఏం లాభం. ఒకప్పుడు నా పూలతో జడలు కుట్టించుకుని, అద్దం ముందు నిలబడి, ఫొటోలు తీయించుకోవడం చిన్నపిల్లలందరికీ ఒక సరదా. మరి ఇప్పుడో! అందరూ జుట్లు విరబోసుకునేవాళ్లు, పూలు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్లూనూ. నాకు మాత్రం తాచుపాము జడలలో చుట్టలా చుట్టుకుని నల్లటి కురులలో తెల్లగా మెరవడం చాలా ఇష్టం. కనీసం కొందరైనా నన్ను అక్కున చేర్చుకుంటున్నారులే. అంతటితో తృప్తి చెందుతున్నాను.సరే మనలో మనం మాట్లాడుకుంటూ అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు మనందరం కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవాలి. మన తెలుగువారి కొత్త సంవత్సరాదికి ఉగాది అని ఎందుకు పేరు పెట్టాలి. మనతోటే కదా ఉగాది వచ్చేది. కోయిల కూస్తేనే కదా వసంతం వచ్చేది. మామిడి, చెరకు, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం కలిస్తేనే కదా పచ్చడి. మరి మనలో ఎవరో ఒకరి పేరు మీద ఈ పండుగను పిలుచుకోవచ్చుగా. ఆమని అంటారేకాని, కోమని అనచ్చుగా. కనీసం అందులో మన కోయిల పేరులోని మొదటి అక్షరమైనా ఉంటుంది. లేకపోతే ఆమిడి అనొచ్చు, వేపని అనొచ్చు, మల్లిమ అనొచ్చు. ఏదో ఒక పేరు పెట్టి మనల్ని గౌరవించుకోవచ్చు కదా. ఏదీ కాకుండా ఉగాది అని పేరు పెట్టారు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. అందరి కంటె పెద్దదయిన మామిడి...మిత్రులారా! మీకొక విషయం చెబుతాను వినండి. ఈ పండుగకు కోయిల పేరు పెట్టామనుకోండి. మిగతా వారికి కోపం వస్తుంది. మనమందరం ప్రకృతి మాత సంతానం. మనలో ఏ ఒక్కరు అలిగినా ఆ తల్లికి బాధే కదా మరి. అందుకే ఆలోచించి, మనమెవ్వరం బాధపడకుండా ఈ పేరు పెట్టి ఉంటారు. అయినా ఉగాది అనే పేరు ఎంత బాగుందో కదా! ఇంకో విషయం కూడా ఆలోచించు. ఈ పండుగ ఆరు రుచులతో పాటు కోయిల, మల్లెల సమ్మేళనం. ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కదా. అందుకే ఉగాది అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
గుక్క తిప్పుకోకుండా..
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తిగాన రసం ఫణి.. అనే నానుడికి ఆయన ఈల పాట సరిగ్గా అతుకుతుంది. చిన్నారులనే కాకుండా మూగజీవాలను, చివరికి పాములను సైతం అలరింపజేసే గుణం గానానికి ఉంది. సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు బాత్రూంలోనో మరేదైన ఆనంద సమయంలోనో నోటితో పాటలు పాడటం అందరూ చేస్తుంటారు. కానీ ఈల పాట అంత సులువుగా రాదు. నగరానికి చెందిన కర్రా శేషశాయి మాత్రం విజిల్ సాంగ్‌లో తనదైన ప్రత్యేకత చాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హిమాయత్‌నగర్: విద్యానగర్‌కు చెందిన సుబ్రహ్మణ్య కుమార్, పద్మ దంపతుల కుమారుడు శేషశాయి. ప్రస్తుతం డీసీబీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్. చిన్నప్పుడు తండ్రి విజిల్‌తో పాటలు పాడుతూ ఇంట్లో వారిని అలరించేవారు. ఆయనను అనుసరిస్తూ శేషశాయి కూడా విజిల్‌తో పాడటం మొదలుపెట్టారు. కొన్ని ఫంక్షన్లలో సరదాగా విజిల్ పాటలు పాడుతూండేవారు. చాలా బాగా పాడుతున్నావు. కొనసాగించు అని పలువురు ప్రోత్సహించడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు శేషశాయి. గురువు అడుగుజాడల్లో.. ప్రముఖ సంగీత విద్వాంసులు, విజిల్‌తో పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న కొమరవోలు శివప్రసాద్ సమక్షంలో శేషశాయి ఓనమాలు దిద్దుకుంటున్నారు. ఆయన తర్ఫీదులో సరిగమలు, కృతులు, అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. గురువు శివప్రసాద్‌తో కలిసి శేషశాయి ఇప్పటి వరకు 50కిపైగా స్టేజీషోల్లో పాల్గొన్నారు. గుక్క తిప్పుకోకుండా.. మహా అయితే మనం ఒక్క నిమిషం పాటు గుక్కతిప్పుకోకుండా పెదాలతో విజిల్ వేస్తూ పాడతాం. అంతకంటే ఎక్కువ సేపు పాడలేం.. ఆయాసం వస్తుంటుంది. కానీ.. శేషశాయి తన టాలెంట్‌తో 15 నిమిషాల పాటు గుక్కతిప్పుకోకుండా విజిల్‌తో పాటలు పాడతారు. 2014లో సింగర్ రోహిత్‌తో కలిసి విజిల్‌తో పాటలు పాడి అలరించారుఆయన. ప్రముఖులెందరో నచ్చారు.. రంగస్థలం సినిమాలోని ‘రంగా రంగా రంగస్థలాన’ అనే పాటను విజిల్‌తో పాడి ట్విట్టర్లో పోస్ట్ చేశారు శేషశాయి. ఈ పాటను చూసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైక్ కొట్టారు. దీంతో ఒక్కరోజులోనే ఆ పాటకు 15వేల లైకులు వచ్చాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎదుట ఆయనకు నచ్చిన పాట ‘కురే ఉండ్రు మిళై’ తమిళ పాటను పాడి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటి వరకు వంద పాటలను ప్రత్యేకంగా పాడి వాటిని ఫేస్బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్, ట్విట్టర్లలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలకు వేలల్లో లైకులు వచ్చాయి. రెహమాన్ ఎదుట పాడాలి.. స్టేజీషోల్లో అవకాశమిస్తే నా సత్తా నిరూపిస్తాను. విజిల్‌తో పాట పాడటం నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఓ కోరిక ఉండేది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎదుట కొన్ని పాటలను విజిల్‌తో పాడాలని, ఆయన కాంప్లిమెంట్స్ అందుకోవాలని. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. – కర్రా శేషశాయి, ఈల పాట గాయకుడు -
అక్కడ సినిమా పాటలపై నిషేధం
బెంగళూరు: విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించే దిశగా కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వార్షికోత్సవాల్లో సినిమా పాటల డ్యాన్సులపై నిషేధం విధించింది. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొన్ని సినిమా పాటల నృత్యాలు అశ్లీలంగా ఉంటున్నాయన్న తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పాఠశాల వార్షికోత్సవాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఇకపై ముందుగా విద్యాశాఖకు తెలియచేయాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి ఒకవేళ సినిమా నృత్యాలకు అవకాశం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా... సినీ వర్గాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తీసుకురావాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది. వయసుకు, ఆలోచనలకు సంబంధంలేని పాటలు ఈ విషయమై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ‘‘ఈ మధ్యే నేను ఓ స్కూలులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రదర్శన కోసం విద్యార్థులు ఎంచుకున్న పాటల్ని విని ఆశ్చర్యపోయాను. అన్ని సినిమా పాటలే ఉన్నాయి. అది కూడా వారి వయసుకు, ఆలోచనలకు సంబంధం లేని పాటలు. ఇలాంటి పాటల వల్ల వారికి చాలా ప్రమాదముందని భావించాను’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఈ నెల 20న హైదరాబాద్‌లో ఏసుదాస్ పాటల కార్యక్రమం
-
తెలుగువారి తొలి కంఠం
గురువుకు కృతజ్ఞతగా ఉండలేని వాడి కంఠాన సరస్వతి ఉండదు. ఘంటసాలకు గురుభక్తి ఎక్కువ. తన గురువు పట్రాయని సీతారామశాస్త్రి అంటే చాలా గౌరవం. భక్తితో మసలేవారు. అంతేనా? వారి అబ్బాయి సంగీతరావును తనసహాయకులుగా నియమించుకున్నారు. ఇరవై ఏళ్ల పాటు ఘంటసాల దగ్గర సన్నిహితంగా మెలిగిన సంగీతరావు దగ్గర ఘంటసాల జ్ఞాపకాల రాశి ఉంది. ఘంటసాల జయంతి సందర్భంగా వాటిలో కొన్ని పల్లవులు పద్యాలు వరుస కట్టిన జ్ఞాపకాలు... ఘంటసాల కంఠం ఒక మంత్రదండం. అందులో మంద్ర, మధ్యమ, తారస్థాయులు అలవోకగా పలుకుతాయి. ఆయనతో పని చేసేవారే ఆయన ప్రతిభ చూసి అప్రతిభులు అయ్యేవారు. ఒకరోజు ఏదో పని ఉండి వాహిని స్టూడియోకి వెళ్లాను. ‘కృష్ణా ముకుందా మురారీ’ పాట రికార్డింగ్ జరుగుతోంది. అక్కడున్న వాద్యబృందం, టెక్నీషియన్లు ఘంటసాల పాడుతున్న విధానానికి మంత్రముగ్ధులవుతున్నారు. ఆ రోజు ఆర్కెస్ట్రాలో సన్నాయి సత్యం ఉన్నారు. ఘంటసాల పాడిన అనేక పాటలకు సత్యం పని చేశారు. అయినప్పటికీ పాటచివర ‘హే కృష్ణా! ముకుందా! మురారీ!’ అనే సాకీ తారస్థాయిని చే రే సందర్భంలో ఆ కంఠంలోని సామర్థ్యం, దైవత్వం చూసి సన్నాయి సత్యం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమవడం నాకు గుర్తుంది... లవకుశ సినిమాకు సంగీతం ఘంటసాల అందించారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగా కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడింది. కాని అప్పటికే కొన్ని పాటలను ఘంటసాల రికార్డు చేశారు. ఆ పాటలు బాగా వచ్చాయి. అవి జనానికి చేరువ కావడంలో జాప్యం అవుతుండటంతో, కనీసం తన సంగీత దైవానికైనా వినిపిద్దామనుకుని, తిరువయ్యూరు వెళ్లి త్యాగయ్యగారి సమాధి దగ్గర ఆ పాటలను గానం చేసి వచ్చారు. ఎంత మంచి విషయం, విశేషం అది... ‘రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. అది నిజమైన తత్త్వం వింటున్నంత తన్మయత్వం కలిగించింది నాకు. ఏ పాట చేసినా సంపూర్ణంగా దాని మూలాన్ననుసరించి చేయాలనే దృష్టి ఆయనది. స్త్రీల పాటలు – మంగళ హారతులు కూడా అలాగే చేసేవారు... శాస్త్రీయ సంగీత రచనలేవీ లేని స్కేల్స్‌లో కూడా ఆయన చాలా పాటలు చేశారు. బందిపోటు చిత్రంలోని ‘ఊహలు గుసగుసలాడే’ పాట ఇటువంటిదే. సగమపనిస – సనిపమగస... ఈ మూర్ఛన అమృతవర్షిణి, శుద్ధ ధన్యాసి, ఉదయ రవిచంద్రిక వంటి అనేక రాగాలకు సమానమే కాని సరిగ్గా ఏ రాగమో తెలియలేదు. పరిశీలిస్తే సౌదామిని రాగం అని తెలిసింది. అంతలోనే ‘సుమనేశ రంజని’ రాగ లక్షణాలు కూడా ఉన్నాయని తేలింది. ఇలా రాగాలను సంలీనం చేసి అపూర్వ ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్నమాచార్యులను గురించి ఎక్కువగా ప్రస్తావించని రోజుల్లోనే అన్నమయ్య కృతుల్ని రాగబద్ధం చేసి పాడారు ఘంటసాల. ‘కృష్ణకుచేల’ సినిమాలో రాజసూయ యాగ ఘట్టంలో పద్యాలన్నీ వేషధారులే పాడారు – అద్దంకి శ్రీరామ్మూర్తి, సియస్సార్ మొదలైనవాళ్లు. అద్దంకి శ్రీరామ్మూర్తి తన పద్యాన్ని పాడేశారుగాని ‘నిలుపంజాలను నెమ్మనంబు’ పద్యాన్ని వయసు కారణంగా సియస్సార్ సరిగా పాడలేకపోవడంతో ఘంటసాల పాడారు. అయితే ఆ తర్వాత సియస్సార్‌ని కలిసినప్పుడు ‘మాస్టారూ! మీరు పాడిన పద్యం నేను తిరిగి పాడవలసి వచ్చింది. కానీ మీరు పాడిందే ఎంతో భావయుక్తంగా ఉంది. నేను కేవలం పద్యం పాడానంతే’ అంటూ మనఃపూర్వకంగా చెప్పారు. ఆ నిజాయితీయే ఆయనను అపూర్వ వ్యక్తిని చేసింది. ‘‘ఘంటసాల గారికి సాహిత్యంలో వస్తున్న గీతాలు, ప్రజాజీవితంలో పాటలంటే చాలా ఇష్టం. ఆయన వాటిని వెతుక్కుంటూ శ్రీకాకుళం దాకా వెళ్లారు. ‘రావయాన రావయాన రాజా నామాలుకి (నా మహలుకి)’ అంటూ జముకు వాయిస్తూ జానపదులు పాడిన పాటను ఆయన ఇలాంటి అన్వేషణలో జానపదుల నుంచి విని సినిమాకు వాడారు. ఆయన వల్ల ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా’ లాంటి పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్ గ్రామఫోను రికార్డులు కూడా చేశారు. కరుణశ్రీ రచించిన ‘పుష్పవిలాపం’, ‘కుంతీకుమారి’ రసజ్ఞుల హృదయాలను దోచుకున్నాయి. శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, గురజాడ వారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆరోజుల్లో రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు ఘంటసాల. ‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’, ‘తూరుపు దిక్కున అదిగో చూడు’, ‘బహుదూరపు బాటసారి’ వంటి పాటలెన్నో. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర గానం వంటి ఆంధ్రమాతను ప్రస్తుతించే పాటలు, ‘ఆంధ్రుల చరితం అతిరసభరితం’ వంటి పాటలు ఎంతో ఉత్తేజకరంగా గానం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరుని మీద పాడిన భక్తిగీతాలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. తిరుమల గిరులు ఘంటసాల గారి భక్తిగీతాలతో ప్రతిధ్వనించాయి.ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేసినది భగవద్గీత. ఇది రాగబద్ధం చేస్తున్నప్పుడే చాలా ఆసక్తికరంగా ఉండేది. భగవద్గీత సంగీత ప్రధానమైన రచన కాదు. ప్రధానంగా తాత్త్విక చర్చ వంటిది. అటువంటి రచనను సంగీతానికి అనుకూలంగా చేయడంలో కృతకృత్యులయ్యారు ఘంటసాల. ఘంటసాల స్వర్గస్థులై, అమరగాయకుడై నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పాడిన పాటల్ని వర్ధమాన గాయకులు ఇంకా పాడుతూండడం తెలుగువారికి ఆయనపట్ల గల అపారప్రేమకు, అభిమానానికీ నిదర్శనం. నేటికీ అనేక తెలుగు కుటుంబాలలో ఘంటసాల ప్రాతఃస్మరణీయుడు. రహస్యం’ సినిమాలో మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఓ తత్త్వం ఉంది. ‘‘దీని భావము నీకే తెలియునురా ఆనందకృష్ణా. దీని మర్మము నీకే తెలియునురా’’ అని ప్రారంభం అవుతుంది ఈ తత్త్వం. ‘ఈ తత్త్వానికి పల్లవి ఎలా చేస్తారు’ అనుకున్నాను. మొదటి రెండు లైన్లూ చతురస్ర గతిలోను, తరవాత ఖండగతిలోను చాలా చిత్రంగా చేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కేళీ గోపాలంలో రాసిన నృత్యనాటకం తరవాతి రోజుల్లో ‘రహస్యం’ సినిమాలో ‘గిరిజాకల్యాణం’గా ఉపయోగించారు. అది ఎంత ప్రసిద్ధి చెందిందో తెలిసిందే. – పట్రాయని సంగీతరావు, చెన్నై (ఘంటసాల గురువులైన పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడు) -
భలే మంచి రోజు
చందమామ నవ్విన రోజు పల్లవి పులకించిన రోజు చరణం చకితమైన రోజు గానం పరవశించిన రోజు పాట గుండెకందిన రోజు అనుభూతి అనుభూతించిన రోజు మన కోసం అదృష్టం పుట్టిన రోజు జీవితానికి ఒక తోడు వచ్చిన రోజు ఘంటసాల పుట్టిన రోజు పాట చిరయశస్సు పొందిన రోజు నిట్టా జనార్దన్ సుప్రసిద్ధ సితార్ విద్వాంసులు. ఘంటసాలతో పని చేశారు. ఆయన పాటలకు సితార్ సహకారం అందించారు. ఘంటసాల జయంతి సందర్భంగా జనార్దన్ పంచుకున్న జ్ఞాపకాలు. 1958, జూన్ 6న ‘భాగ్యదేవత’ సినిమా కోసం మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, సుశీల పాడిన పాటకు మొట్టమొదట సితార్ అందించాను. నేను వాయించడం అంత దూరం నుంచి చూసిన ఘంటసాల ‘ఎంత హాయిగా ఉంది బాబూ నీ రాగం’ అని ఆలింగనం చేసుకున్నారు. అలా ఆయనతో నా సినిమా సంగీత ప్రయాణం ప్రారంభమైంది. ఒకప్పుడు గుడికి వెళ్లే సందర్భం, ఆనంద సంబరం, శోభన సన్నివేశాలలో మాత్రమే సితార్ ఉపయోగించేవారు. ఒకసారి ఒక సినిమా విషాద సన్నివేశంలో ‘సరోద్, సారంగి వాయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడెలా?’ అన్నారు ఘంటసాల. అప్పుడు నేను సితార్ మీద వాయిస్తానని చెప్పి మంద్రస్థాయిలో ‘బిలాస్‌ఖాన్ తోడి రాగం’ లో వాయించేశాను. ఘంటసాల పరుగుపరుగున నా దగ్గరకు వచ్చి నన్ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తాన్సేన్ కుమారుడు బిలాస్‌ఖాన్. తాన్సేన్ మరణించినప్పుడు బిలాస్‌ఖాన్ ఏడవకుండా ఒక రాగాన్ని పలికించాడు. అది బిలాన్‌ఖాన్ తోడి రాగంగా స్థిరపడిపోయింది. దానిని ఆ సందర్భానికి ఉపయోగించడం మంచి జ్ఞాపకం. డా.చక్రవర్తి సినిమాలో ‘మనసున మనసై... బతుకున బతుకై’ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఆ పాట కోసం జయజయంతి రాగం వాయించమన్నారు ఘంటసాల. ఆయన మేధావితనం వల్లే ఆ పాట నిలబడింది. ఆయన స్వరపరచిన ‘లవకుశ’ సినిమాలో అన్ని సీన్స్‌కి నేను సితార్ వాయించాను. పునర్జన్మ చిత్రంలో ‘ఎవరివో నీవెవరివో’ పాటలో ఘంటసాల గొంతు, నా సితార్ పోటాపోటీగా వినపడతాయి. ‘‘ఘంటసాల ‘పయనించే ఓ చిలుకా’ ‘బంగరు బొమ్మా సీతమ్మా’ పాడుతుంటే నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఆయన పాటలో ఉండే అనుభూతి, స్పష్టతల వల్ల ఆయన పాటలో నిమగ్నమైపోతాం. అలాగే ఘంటసాల ఆలపించిన ‘జయదేవుడి అష్టపదులకు’ సితారు అందించడం నేను నా జీవితంలో మరచిపోలేను. ఒకసారి ఘంటసాల భార్య సావిత్రమ్మ... ‘మీరు జనార్దన్ గారు ఎలా వాయించినా విని ఊరుకుంటారేంటి’ అన్నారు. అందుకు ఆయన ‘జనార్దన్ విద్వాంసుడు. మనం చెప్పక్కర్లేదు’ అని నా మీద ఉన్న నమ్మకాన్ని వివరించారు. ఘంటసాల తనకు మూడు కోరికలున్నాయని చెప్పేవారు. భగవద్గీత స్వరపరచుకుని గానం చేయడం, విదేశీ పర్యటన, తన పేరుతో ఒక సంగీత పాఠశాల ప్రారంభించడం. ఆయన బతికుండగా మొదటి రెండు జరిగాయి. గతించాక మూడోది కూడా జరిగింది. ఘంటసాలగారికి విదేశీ పర్యటన చేయాలనే కోరిక 1971లో నెరవేరింది. యునైటెడ్ నేషన్స్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి అక్కడ పాటలు పాడి అందరినీ అలరించారు. ఆయన వెంట నన్ను కూడా తీసుకువెళ్లారు. నేను ముందుగా ఒక పావుగంట సేపు శాస్త్రీయ సంగీతకచేరీ చేశాక, ఆర్కెస్ట్రాలో వాయిస్తానని చెప్పాను. ఆయన నిండు మనసుతో అంగీకరించారు. ఆఖరి రోజుల్లో స్వరపరచిన భగవద్గీతకు ‘జనార్దనే సితార్ వాయించాలి’ అని పట్టుబట్టారు ఘంటసాల. ఒక్కో శ్లోకం ఒక్కో రాగంలో రూపొందించారు. ముందరి రాగాల నుంచి తరవాత రాగానికి చేరుకోవాలి. అంటే అది ఇంటర్‌లింక్ చేయాలి, అలాగే చేశాను. ఘంటసాల తుదిశ్వాస వరకు ఆయన పాటలకు సితార్ వాయిస్తూనే ఉన్నాను. ‘ఘంటసాల గానగంధర్వుడు’. అలాంటివాళ్లు మళ్లీ పుట్టరు. – నిట్టా జనార్దన్, సితార్ విద్వాంసులు ఘంటసాల పాడిన ఈ పాటలకు సితార్ నేనే వాయించాను మనసున మనసై (డా. చక్రవర్తి), దివి నుంచి భువికి దిగి వచ్చే (తేనె మనసులు), చెలికాడు నిన్నే రమ్మని పిలువ (కులగోత్రాలు), విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు), విన్నానులే ప్రియా (బందిపోటు దొంగలు), మల్లియలారా మాలికలారా (నిర్దోషి), (మౌనముగానే మనసు పాడిన వేణు గానములు వింటిలే (గుండమ్మ కథ), మురిపించే అందాలే అవి నన్నే చెందాలే (బొబ్బిలియుద్ధం), పూవై విరిసిన (తిరుపతమ్మ కథ), ఊహలు గుసగుసలాడే (బందిపోటు), నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ), ప్రియురాల సిగ్గేలనే (శ్రీకృష్ణార్జున యుద్ధం), హిమగిరి సొగసులు (పాండవ వనవాసం), తొలివలపే పదే పదే (దేవత), విన్నారా అలనాటి వేణుగానం (దేవుడు చేసిన మనుషులు), జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశ ద్రోహులు), కిలకిల నవ్వులు చిలికిన (ఇద్దరు మిత్రులు). - నిట్టా జనార్దన్ సంభాషణ డా.వైజయంతి పురాణపండ -
ఘంటసాల పాటల్లోని కొన్ని...
∙భలే మంచి రోజు పసందైన రోజు (జరిగిన కథ) ∙ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో (మూగమనసులు) ∙కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి గాథలలోనే బలి సేయకు (వెలుగు నీడలు) ∙ఆకాశవీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం) ∙హాయి హాయిగా ఆమని సాగే (సువర్ణ సుందరి) ∙చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు) ∙నా హృదయంలో నిదురించే చెలీ (ఆరాధన) ∙శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు) ∙తేటతేట తెలుగులా (ప్రేమ్‌నగర్) ∙పగడాల జాబిలి నీవు గగనాన దాగెను నేడు (మూగనోము) ∙పల్లెకు పోదాం పారును చూద్దాం చలోచలో (దేవదాసు) ∙పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి (మల్లీశ్వరి) ∙పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ (పెళ్లి చేసి చూడు) ∙రసికరాజ తగువారము గామా (జయభేరి) ∙కలవరమాయె మదిలో నా మదిలో (పాతాళ భైరవి) ∙ప్రేమ యాత్రలకు బృందావనము (గుండమ్మకథ) ∙చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం) ∙తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు) ∙ఓహో బస్తీ దొరసాని (అభిమానం) ∙వాడిన పూలే వికసించెలే (మాంగల్య బలం) ∙బాబూ వినరా అన్నదమ్ముల కథ ఒకటి (పండంటి కాపురం) ∙ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకును జడను చుట్టి (కలసి ఉంటే కలదు సుఖం) ∙కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన (తోటికోడళ్లు) ∙చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు) ∙నా జన్మ భూమి ఎంత అందమైన దేశము (జై జవాన్) ∙తెలుగు వీర లేవరా (అల్లూరి సీతారామరాజు) ∙అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం (బావామరదళ్లు) ∙కొంటె చూపు చెప్తోంది కొంటె నవ్వు చెప్తోంది (జీవిత చక్రం) ∙ప్రతి రాత్రి వసంత రాత్రి (ఏకవీర) ∙ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే (మంచిమిత్రులు) ∙నీ సుఖమే నే కోరుతున్నా (మురళీకృష్ణ) ∙జన్మమెత్తితిరా అనుభవించితిరా (గుడి గంటలు) ∙ఈ జీవన తరంగాలలో (జీవన తరంగాలు) ∙కనుపాప కరవైన కనులెందుకు (చిరంజీవులు) ∙బొమ్మను చేసి ప్రాణం పోసి (దేవత) ∙ఏ నిమిషానికి ఏమి జరుగునో (లవకుశ) ∙దినకరా శుభకరా (వినాయకచవితి) ∙శేషశైలావాసా (శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం) ∙నడిరేయి ఏజాములో (రంగుల రాట్నం) ∙నీ మధు మురళీ గాన లీలా (భక్త జయదేవ) ∙ఘనాఘన సుందరా (భక్త తుకారాం) ∙అమ్మా అని పిలచినా ఆలకించవేమమ్మా (పాండురంగ మహాత్మ్యం) ∙రామయ తండ్రీ ఓ రామయతండ్రీ (సంపూర్ణ రామాయణం) ∙శివశంకరీ శివానందలహరి (జగదేకవీరుని కథ) -
టీఆర్ఎస్.. పాటలకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రచార పాటల్లోని కొన్ని అభ్యంతరకర పదాలను తొలగించిన తర్వాత ఎన్నికల సంఘం వాటికి అనుమతించింది. సాహితీ ప్రేమికుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రాసిన రెండు పాటలతో పాటు, ఇతర ప్రముఖ రచయితలు రాసిన మరో ఆరు పాటలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్ నేతృత్వంలోని సర్టిఫికేషన్ కమిటీ ఈ పాటలను పరిశీలించి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్న పదాలను తొలగించాలని సూచించింది. గత నాలుగున్నరేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ...‘మా ప్రభుత్వం/ప్రభుత్వం’అని పాటల్లో పలుమార్లు వచ్చిన పదాలతో పాటు గొర్లు, బర్రెలు, చేపల పంపిణీ వంటి కార్యక్రమాలతో లబ్ధిపొందిన గొర్ల కురుమ/గంగ పుత్రులు/గౌడ తదితర కులాల ప్రస్తావనలను పాటల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం కోరింది. వ్యక్తిగత విమర్శలకు ఆస్కారమిచ్చే పదాలను సైతం తొలగించాలని కోరినట్లు తెలిసింది.ఎన్నికల ప్రచార వీడియోల్లో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు, సచివాలయం తదితర ప్రభుత్వ ఆస్తుల దృశ్యాలను తొలగించాలని కోరింది. ఈ మార్పులకు టీఆర్ఎస్ నాయకత్వం అంగీకరించడంతో అన్ని పాటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ సోమవారం అనుమతులు జారీ చేశారు. కాగా రాజకీయపార్టీలు, అభ్యర్థులు తమ ప్రచార ప్రకటనలు, ఆడియో, వీడియోలను ఎన్నికల సంఘం పరిశీలన కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచార ప్రకటనల్లోని సమాచారంతో పాటు ప్రచార వీడియో, ఆడియోల్లోని అంశాలను సైతం ఎన్నికల సంఘం పరిశీలన జరిపి అనుమతిస్తోంది. వార్తా పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా ద్వారా జారీ చేసే ఎన్నికల ప్రచార ప్రకటనలు, ఆడియో, వీడియోలు ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా ఉంటేనే అనుమతి లభించనుంది. -
భళిరా.. దలేర్!
తునక్ తునక్ తున్..తునక్ తునక్ తున్..'ఎక్కడో విన్నట్లుండదు.ఇప్పుడే విన్నట్లుంటుంది!ఇరవై ఏళ్ల తర్వాత కూడా వాయిస్‌లో అదే ఎనర్జీ.'చెప్పానే చెప్పొద్దు వంక..'- చెప్పడానికేం ఉందని ?'నువ్వంటే పడీ పడీ...' పడేస్కున్నాడలా పాడి.'భళి రా భళి..'- బంగ్రాలో దలేరా బాహుబలి.లేటెస్ట్గా ఇప్పుడు రెడ్డీ ఇక్కడ సూడు..'(అరవింద)ఈ బిహారీ గొంతు తెలుగులో ఇంతగా..స్వర విహారం చేస్తోంది ఎందుకని?జోష్ ఉంటుంది. అదే జోష్‌లో సాక్షి ఫ్యామిలీకి దలేర్ మెహందీ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ‘రెడ్డీ ఇక్కడ సూడు...’ అంటూ మీ వాయిస్‌తో తెలుగు ఆడియన్స్‌ని మరోసారి మెస్మరైజ్ చేశారు.. ఎన్టీఆర్‌కి మీరు మూడోసారి పాడారు కదా? దలేర్ మెహందీ: అవును. ‘యమదొంగ’లో ‘నువ్వంటే పడి పడి చస్తానే..’ పాట పాడాను. ఆ పాట సూపర్ హిట్. ఆ తర్వాత ‘బాద్షా’ సినిమాలో ‘బంతిపూల జానకీ జానకీ..’ పాడాను. అది కూడా మంచి మాస్ హిట్. ఇప్పుడు ‘అరవింద సమేత..’లో పాడిన ‘రెడ్డీ ఇక్కడ..’ సాంగ్‌కి కూడా మంచి అప్లాజ్ వస్తోంది. నిజానికి నార్త్ నుంచి సౌత్ వరకూ నా వాయిస్ వస్తుందని ఊహించలేదు. సౌత్‌లో దొరుకుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఏర్పడటానికి కారణమైన సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, తమన్లకు ధన్యవాదాలు. తెలుగు పాటలు పాడుతున్నప్పుడు ఆ పదాలు పలకడం, ఉచ్చారణ ఇబ్బందిగా అనిపించదా? పాట లిరిక్స్‌ను పంజాబీలో రాసుకుంటాను. తెలుగు పదాలు పలుకుతుంటే ఉర్దూ, పర్షియన్ భాషల కలయికలా ఉంటుంది. పంజాబీ ఫోనటిక్స్ తెలుగు లైన్స్ సిమిలర్‌గా ఉంటాయి. అందుకని మరీ కొత్త భాషలా అనిపించదు. పంజాబీ పాటలు పాడుతున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తానో ఇవి కూడా అలానే ఎంజాయ్ చేస్తాను. (‘మగధీర’లో రామ్‌చరణ్) మీ పాటలు ఫుల్ జోష్‌తో నిండి ఉంటాయి. మీ ఎనర్జీని స్క్రీన్ మీద హీరోలు తమ డ్యాన్స్‌తో మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను పాడుతున్నప్పుడే ఈ పాటకు హీరో ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు? అని ఆలోచిస్తా. నా వాయిస్ పీక్స్‌లో ఉండి.. హీరో స్టెప్పులు సాదాసీదాగా ఉంటే సాంగ్ పేలవంగా అయిపోతుంది. అందుకే నా వాయిస్‌లోని ఎనర్జీని హీరో స్టెప్స్ మ్యాచ్ చేస్తే సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ యాక్టర్స్ ఎనర్జీ లెవల్స్ సూపర్. అందరూ మంచి డ్యాన్సర్స్. అందుకే ఇప్పటివరకూ ఏదీ ‘మిస్ మ్యాచ్’ కాలేదు. ఎక్కువ పాటలు ఎన్టీఆర్కే పాడారు.. కారణం? వేరే వాళ్లకు పాడకూడదని కాదు. కానీ ఎన్టీఆర్కే మూడుసార్లు పాడటం కుదిరింది. ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్‌లు ఇష్టపడతాను. తనకోసం పాడిన మూడు పాటలూ హిట్టయి, హ్యాట్రిక్ కొట్టడం సంతోషంగా ఉంది. నిజానికి నాకు సౌత్ యాక్టర్స్ అందరికీ పాడాలని ఉంది. సాంగ్ సౌండింగ్ బావుండి, నాకు నచ్చితే ఎవ్వరికైనా పాడతాను. పరభాషల్లో పాడేటప్పుడు అర్థం తెలుసుకుంటారా? ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది, పాట ఉద్దేశం ఏంటి? అని సంగీత దర్శకుడిని అడిగి తెలుసుకుంటాను. అప్పుడే ఆ పాట మూడ్‌కు కావాల్సినట్టు ఎనర్జీతో పాడగలం. ‘బాహుబలి’(భళి భళిరా భళి పాట)కి పాడాను. సూపర్ హిట్ అయింది. ఆ పాట ఏంటి అని అర్థం చేసుకుంటేనే మన బెస్ట్ ఇవ్వగలం అని నమ్ముతాను. సంగీతానికి భాష లేదు. భాష అడ్డు కాదు కూడా. నా పాటలు సౌత్ కొరియా, పోలండ్‌లో కూడా పాపులర్. అక్కడివాళ్లకు తెలుగు, హిందీ, పంజాబీ తెలిసే అవకాశం తక్కువ. అయినా ఎంజాయ్ చేస్తున్నారంటే సౌండ్ బాగుండబట్టే కదా. వాయిస్ ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తుంటారు? నా వాయిస్ ఫ్రెష్‌గా ఉండటానికి కారణం దేవుణ్ణి ఆరాధించడమే. రియాజ్ (సంగీతాన్ని సాధన చేయడం) అన్నింటికన్నా ముఖ్యం. మన వాయిస్‌కి తిరుగులేదు అని సాధన మానేసిన రోజున బయట మన పాట వినిపించదు. (‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డే ) మీ ఫస్ట్ స్టేజి పెర్ఫార్మెన్స్ గురించి? నా ఫస్ట్ స్టేజి పెర్ఫార్మెన్స్ అప్పుడు నాకు 13ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఆ షో జరిగింది. ఎదురుగా దాదాపు 20 వేల మంది శ్రోతలు. నాకేం భయం అనిపించలేదు. తడబడలేదు. ఎందుకంటే అంతమందిని చూడగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. మ్యూజిక్ అంటే నాకు ప్రేమ. ప్రూవ్ చేసుకోవాలనే తపనతో బాగా పాడాను. అందరూ మెచ్చుకున్నారు. అసలు మ్యూజిక్ అంటే ఎప్పుడు ఇంట్రస్ట్ మొదలైంది? మా అమ్మగారికి సంగీతం అంటే ఇష్టం. నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఎవరూ పాడలేనంత అద్భుతంగా పాడే బిడ్డను ఇవ్వమని ఆ దేవుడ్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారట. ఆమె సంకల్పం బలమైనది. అమ్మ కోరిక తగ్గట్టుగానే నన్ను పుట్టించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాలో మ్యూజిక్ పుట్టిందని భావిస్తాను. కొందరు సింగర్స్ వాయిస్ కేర్‌లో భాగంగా వేడి నీళ్లు తాగుతారు. ఐస్‌క్రీమ్‌లు తినరు. అలాంటివి ఏవైనా చేస్తారా? సరైన ఆహారం తీసుకుంటాను. నాకు సంతోషాన్ని ఇచ్చే పనులే చేస్తాను. మనం సంతోషంగా ఉంటే అది మన వాయిస్‌లోనూ ప్రతిబింబిస్తుంది. ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నేను మందు జోలికి వెళ్లను. సంగీతం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే... మద్యం జోలికి వెళ్లకండి. ఒక మంచి సింగర్ అవ్వాలంటే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధూమపానమూ గొంతును పాడు చేస్తుంది కదా? అవును.. స్మోకింగ్ ప్రభావం వాయిస్ మీద చాలా ఉంటుంది. వీటితో పాటు మనసులో నెగటివిటీ కూడా గొంతుపై ప్రభావం చూపుతుందని నమ్ముతాను. వేరే వాళ్ల పట్ల ఈర్ష్య, దేవుడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండకపోవడం.. ఇవన్నీ మన గొంతుపై ప్రభావం చూపుతాయి. గొంతులో నుంచి మాట రావడమంటే గాలే కదా. దేవుడి పట్ల కృతజ్ఞతా భావంతో లేకపోతే దాన్ని తీసేసుకోవడం ఆయనకు ఎంతసేపు? బావుంటే ఆన్ ది నోట్ లేదంటే ఆఫ్ ది నోట్ అయిపోతుంది. వాయిస్‌కి వయసు ఉంటుందా? సాధారణంగా కొంత వయసు వచ్చాక గొంతులో మార్పు కనిపిస్తుంది కదా? దేవుడి ఆశీస్సులు మన మీద ఉంటే గొంతుకి ఏజ్ అయిపోవడం లాంటివి ఉండవు. అప్పుడు గొంతు ఏజ్‌లెస్ అవుతుంది. మీ వాయిస్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీ సక్సెస్‌కి కారణం అదేనంటారా? ఒక్కో ఆర్టిస్ట్‌కి ఒక్కో శైలి ఉంటుంది. ఆర్టిస్ట్ శైలిలో ఇదొకటి అని అనుకుంటాను. పుట్టేటప్పుడు నా వాయిస్ ఇది కాదు. కానీ రాను రాను నా వాయిస్‌ని ట్రైన్ చేసుకున్నాను. రియాజ్ చేసి చేసి ఇలాంటి వాయిస్‌ని సంపాదించగలిగాను. పెద్దలు అంటుంటారు కదా ‘ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్’ అని. సింగర్‌గా మీరు పాపులర్. అయితే కొన్ని విమర్శలూ ఉన్నాయి. మ్యూజికల్ షోస్ పేరుతో ఇక్కడినుంచి విదేశాలకు సింగర్స్‌ని తీసుకెళ్లారని ‘హ్యూమన్ ట్రాఫికింగ్’ అభియోగం ఎదుర్కొంటున్నారు. దాని గురించి? అవన్నీ అసత్యపు ప్రచారాలు. దాని మీద ఫైట్ చేస్తున్నాం కూడా. త్వరలోనే అందులో నుంచి బయటకు వస్తాను కూడా. ఈ ఆరోపణలు నా మీద బురద జల్లే ప్రయత్నం. అంత అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరైనా ఇంకొకరి మీద అనవసరంగా ఎందుకు నిందలు వేస్తారు? కేవలం అత్యాశ వల్లే. అత్యాశే అన్ని తప్పుడు పనులు చేసేలా చేస్తుంది. నాలా ఉన్నత స్థాయికి ఎదగలేదనే ఈర్ష్య ఉండొచ్చు. ప్రతిభ లేకపోయినా నా అంత పాపులార్టీ రావాలనుకునే అత్యాశ అయ్యుండొచ్చు. ఎంతో పేరు, ప్రఖ్యాతులతో దూసుకెళుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు మీ ‘వాయిస్’ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే అవి నిజం కాదని నాకు తెలుసు. నేను గురునానక్ని నమ్ముతాను. ఏది జరిగినా ఒక కచ్చితమైన కారణాలతోనే జరుగుతుంది. నాకు ఈ పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చింది దేవుడే. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటన సృష్టించాడంటే ఏదో జరగాలనే కదా. ఇలా జరిగిందని ఎవర్నీ నిందించను. ఇలాంటి సమస్యల మధ్యలో పడేసిన ఆ దేవుడే మళ్లీ ఇందులో నుంచి బయటకు తీస్తాడనే నమ్మకం ఉంది. (‘బాహుబలి’లో ప్రభాస్) అవకాశాలు రావాలంటే ‘అడ్జస్ట్ అవ్వాలి’ అంటుంటారు అని కొందరు నటీమణులు ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి బయటపెడుతున్నారు. మ్యూజిక్ ఫీల్డ్‌లో కూడా అది జరుగుతుందా? నేను సంగీత దర్శకుడిని కాదు. ఎవరికీ అవకాశాలు ఇచ్చే చాన్స్ కూడా నాకు లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను కరెక్ట్ కాదేమో. ఒకవేళ నా ప్రెజెన్స్‌లో ఇలాంటివి జరిగి ఉంటే చెప్పేవాణ్ణి. మరి.. ఇండస్ట్రీలో సింగర్స్‌కి ఉండే కష్టాలే ంటి? కేవలం సింగర్‌కి అనే కాదు ఇంజనీర్, డాక్టర్.. ఎవ్వరైనా ఏ ఫీల్డ్ వాళ్లకైనా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. సమస్య ఎదురైంది అని వెనక్కి తిరగకూడదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు. ఓకే.. రియాలిటీ షోలు రియల్ టాలెంట్‌ని తీసుకొస్తాయి అంటారా? కచ్చితంగా. ప్రస్తుతం నేను ‘సూఫీ సుల్తాన్’ అనే పెద్ద రియాలిటీ షో కోసం ప్రిపేర్ అవుతున్నాను. సూఫీలో సరికొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీకు పరిచయం చేయాలన్నది ఆ షో ఉద్దేశం. మీ డ్రెస్సింగ్ స్టైల్ యునిక్‌గా ఉంటుంది. దాని వెనకాల మార్కెటింగ్ స్ట్రాటెజీ ఏదైనా ఉందా? నా దృష్టిలో ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక యునిక్ స్టైల్ ఉండాలి. నేనెలా ఉండాలో 1991లోనే నిశ్చయించుకున్నాను. డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంటే బాగుంటుందనుకున్నాను. అప్పటికి నా ఫస్ట్ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఏర్పాటు చేసుకోలేదు. అందరూ మీ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరి సంగీతం ఎంజాయ్ చేస్తారు? హిందుస్తానీ క్లాసికల్ సింగర్ బడే గులామ్ అలీ సాబ్, పాకిస్తానీ సంగీతకారుడు నస్రత్ ఫతే అలీలకు వీరాభిమానిని. గాయకులు సుఖ్వీందర్ సింగ్, సోనూ నిగమ్ పాటలనూ ఎక్కువగా ఇష్టపడతాను. మీ కుటుంబం గురించి? నా భార్య తరణ్‌ప్రీత్. తనూ పంజాబీ సింగరే. నాకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయికి పంజాబీ సింగర్ నవరాజ్ హాన్స్‌తో వివాహం అయింది. మరో పాప సైకాలజీ చదువుతోంది. మా అబ్బాయి గుర్దీప్ సింగర్ అనే విషయం తెలిసిందే. మేమంతా మ్యూజిక్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. బహుశా సంగీతం మా జీన్స్‌లోనే ఉందేమో. ఫైనల్లీ.. సింగర్ కాకపోతే ఏమై ఉండేవారు? నాకు 70 ఆవులు, 80 మేకలు ఉన్నాయి. సింగర్ కాకపోయి ఉంటే అవన్నీ చూస్తూ ఫార్మింగ్‌లోకి వెళ్లిపోయి ఆ పని చేసుకుంటూ ఉండేవాణ్ణి అనుకుంటా. దలేర్ పాడిన పాటల్లో కొన్ని మగధీర – చెప్పనే చెప్పొద్దు వంక యమదొంగ – రబ్బరు గాజులు.. రబ్బరు గాజులు... శ్రీమన్నారాయణ – చలాకీ చూపులతో.. యమలీల – ఓ తాయారు.. బాహుబలి – 2 – భళి భళి రా భళి.. పైసా వసూల్ – పైసా వసూల్.. అరవింద సమేత – రెడ్డీ ఇక్కడ సూడు.. – డి.జి.భవాని -
రాయల్టీపై గళమెత్తిన తెలుగు సినీ గాయని గాయకులు
-
ఎప్పుడో రిటైర్ అయ్యేవాడిని: ఎస్పీ బాలు
సాక్షి, హైదరాబాద్ : రాయల్టీ చట్టంపై గాయనీ గాయకులంతా అవగాహన కలిగివుండాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోరారు. పాటలపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్ మాత్రమే ఒప్పందంలో రాయల్టీ కుదుర్చుకునేవారని వివరించారు. కానీ, 2012లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులు అందరికీ పాటలపై హక్కులు కల్పిస్తోందని వెల్లడించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. అనంతరం ఎస్పీ బాలు మీడియాతో మాట్లాడారు. గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. సినిమా పాటలకు సంబంధించి నాకు ఒక్క రూపాయి రాయల్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ట్ అయ్యేవాడినని అన్నారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకుల నాణ్యమైన వాటా చెల్లించాలని చెప్పారు. రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని వివరించారు. దాదాపు 410 మంది సింగర్లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందని వెల్లడించారు. ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్ నుంచి పర్మిషన్ తీసుకోని చేయాలని తెలిపారు. లేకపోతే దానిపై లీగల్‌గా ముందుకెళ్తామని పేర్కొన్నారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని తెలిపారు. అయితే, ఇందుకు సదరు సింగర్ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు. -
నాన్నకు ప్రేమతో....
ఇవ్వాళ ఫాదర్స్‌డే. నాన్నకు... ప్రేమతో మనమేం ఇవ్వగలం? అసలు నాన్నకు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? ఆయన మన నుంచి ఇష్టంగా కోరుకునేది ఏదైనా ఉంటుందా? ఆయనైతే మనకు ధైర్యాన్నిచ్చాడు. అండగా నిలబడ్డాడు. ఒక దారి చూపించాడు. అన్నింటికీ మించి ‘నాన్న’ అనే బంధం పిల్లలకిచ్చే అన్ని సౌకర్యాలను, ఆనందాలను ఇచ్చాడు. అలాంటి నాన్నను ప్రేమగా పలకరించడానికి ఒక్క రోజు చాలుతుందా? చాలదు కదూ! కానీ ఆయన మనకు చేసినవన్నీ ఇవ్వాళ గుర్తు చేసుకుంటే ? 2000 –2018 మధ్య కాలంలో వచ్చిన కొన్ని నాన్న పాటలు.. ఆయనకు మనమీదున్న ప్రేమను ఇలా చూపిస్తున్నాయి.. పాడుకోండి! గుమ్మాడీ గుమ్మాడీ.. చిత్రం: డాడీ సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్ గానం: హరిహరన్ రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి / చిందాడీ చిందాడీ తుళ్లిందంటే చిన్నారి / మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి / వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి / ముదై్దనా తినదే పరిగెత్తే పైడిలేడి / చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి / పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి / గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడిఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో (2) / నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో / నా తల్లివి నువ్వో.. నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో / చిత్రంగా చూస్తుందే నీ కన్నతల్లి..పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి / గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడివర్షంలో తడిసొచ్చీ హాయ్ రే హాయ్ అనుకుందామా (2) / రేపుదయం జలుబొచ్చి హచ్చిహచ్చి అందామా / ఓ వంకే నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ / హైపిచ్‌లో మ్యూజికల్లే తిడుతుంటుందే / మన తుమ్ములు డ్యుయెటల్లే వినపడుతుంటే గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ / డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి / వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి / ముదై్దనా తినదే పరిగెత్తే పైడిలేడి / చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి / పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి ఆటల పాటల చిత్రం: ఆకాశమంత సంగీతం: విద్యాసాగర్ గానం: మధు బాలకృష్ణన్ రచన: అనంత శ్రీరామ్ ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రాఅడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే / మధురమౌ భావాలేవో ఊగే లోలోన / పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే / పదులై, వేలై పొంగే నాలోన / లాలిపాటే నేనై, లాలపోసేవాణ్నై / లాలనే నింపనా లేత హృదయాన / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రాఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం / ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం / అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు / అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం / క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా / పాపవే పాపవే నాన్న నయనానమేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా నాన్నకు ప్రేమతో.. చిత్రం: నాన్నకు ప్రేమతో సంగీతం, రచన: దేవిశ్రీ ప్రసాద్ గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్ ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. / ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..నేనేదారిలో వెళ్లినా / ఏ అడ్డు నన్నాపినా / నీవెంట నేనున్నానని నను నడిపించిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..ఏ తప్పు నే చేసినా / తప్పటడుగులే వేసినా / ఓ చిన్ని చిరునవ్వుతోనే.. నను మన్నించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. ఏ ఊసునే చెప్పినా.. ఏ పాటనే పాడినా.. / భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..ఈ అందమైన.. రంగుల లోకాన.. / ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమనందించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. / ఈ పాటతో.. ఈ పాటతో.. / నాన్నకు ప్రేమతో వందనం / ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో.. -
‘ఇళయరాజా.. మణిరత్నా’ల్లాంటి పాటలు
దక్షిణాది సినీ ప్రపంచానికి ధృవతారలు వాళ్లు. ఒకరు దర్శకదిగ్గజమైతే, మరొకరు స్వరచక్రవర్తి. అందుకే వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యంగా మిగిలిపోయింది. ప్రతీ సినిమా.. అందులోని పాటలు ‘మణిరత్నం’లా నిలిచిపోయాయి. ఈ తరానికి ఒకరు దర్శకత్వానికి మార్గదర్శకంగా మారారు. మరొకరు స్వరాల కొత్త అందాలు చూపారు. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరు ఒకే రోజు జన్మించడం వల్ల వీరిద్దరి భావాలు కలిసిపోయాయేమో. ఈ దర్శకుడి ఆలోచనలకు తన సంగీతంతో ప్రాణం పోశారు రాజా. సినీ ప్రపంచంలో వీరిద్దరు ఎప్పటికీ నిలిచిపోతారు. భారతీయ సినీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న లెజెండ్స్ మణిరత్నం, ఇళయారాజాల పుట్టినరోజు నేడు. సమాజాన్ని ప్రతిభింబించే సినిమాలను చేయడం మణిరత్నం వంతు. ఆ సమాజాన్ని సైతం తన సంగీతంతో మాయ చేయడం ఇళయరాజా వంతు. మణిరత్నం తీసిన ప్రతీ సినిమా ఈ తరానికి ఒక దిక్సూచి లాంటిదే. అంజలి, గీతాంజలి, నాయకుడు, బొంబాయి, రోజా, ఇద్దరు, సఖి ఇలా ఎన్నో మరుపు రాని చిత్రాలను అందించారు. రోజా సినిమాకు ముందుకు వరకు మణిరత్నం సినిమాలకు ఇళయరాజానే సంగీతం సమకూర్చేవారు. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో గుర్తుండిపోవడానికి ఇళయరాజా సంగీతం కూడా ఓ కారణమే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలోని పాటలన్నీ సంగీత ప్రియులకు ప్రియమైనవే. ‘సింగారాల పైరుల్లోనా బంగారాలే పండించాలన్నా’.. ‘అరె చిలకమ్మా చిటికేయంటా... నువ్వు రాగాలే తీయాలంటా’ అంటూ హుషారెత్తించే పాటలను అందించాలన్నా... ‘ఆడజన్మకు ఎన్ని శోకాలో..’, ‘నీ గూడు చెదిరింది.. నీ గుండె పగిలింది.. ఓ చిట్టి పావురమా...’ అంటూ కంటతడిపెట్టించగలరు. వీరిద్దరు ఎన్నో మధుర గీతాలకు ప్రాణం పోశారు. ‘నిన్నుకోరి వర్ణం వర్ణం.. సరి సరి కలిసేనే నయనం నయనం’, ‘ఒక బృందావనం సోయగం’ అంటూ సంగీత ప్రియులు ఎన్నటికీ గుర్తుంచుకునే గీతాల్ని అందించారు. ఇలా ఎన్నెన్నో పాటలకు ప్రాణం పోశారు వీరిద్దరు. ఇవన్నీ కూడా శ్రవణానందానికే కాకుండా, దృశ్యకావ్యం గానూ మలిచారు మణిరత్నం. ఇక తెలుగులో నేరుగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా గీతాంజలి. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమాల్లో గీతాంజలిది ప్రత్యేకస్థానం. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన ప్రతి పాట ఒక అద్భుతం. సినీ ప్రముఖులెందరో సోషల్ మీడియా ద్వారా ఈ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ప్రాణం తీసిన పాటల మోజు
పుల్కల్(అందోల్) : చార్జింగ్ అవుతున్న సెల్‌కు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయిన యువకుడు షార్ట్ సర్క్యూట్‌తో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం సింగూర్ గ్రామానికి చెందిన పోతగోని శ్రీనివాస్ (30) మంగళవారం రాత్రి తన సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ అవుతున్న సెల్‌కు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయాడు. ఈ క్రమంలో చార్జింగ్ అవుతున్న సెల్ ద్వారా షార్ట్ సర్క్యూటై ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్న శ్రీనివాస్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. -
నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
పాత్రల నేపథ్యాన్నీ, స్వభావాన్నీ పాటలోకి తెస్తూనే దాన్ని కవిత్వంగా పలికించడం గీత రచయితలకు సవాల్ లాంటిది. ఆరాధన చిత్రంలోని ‘అరె ఏమైందీ/ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ’ పాట కోసం ఆచార్య ఆత్రేయ ఈ పని అనాయాసంగా చేయగలిగారు. ‘నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది’ అన్నప్పుడు నాయికానాయకుల అంతరాలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయి. దాన్నే కొనసాగిస్తూ వచ్చే మరో చరణం పూర్తిగా ఉటంకించదగినది. ‘బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు మనిషౌతాడు’. ఇళయరాజా అద్భుతంగా సంగీతం సమకూర్చిన ఈ పాటను ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. చిరంజీవి, సుహాసిని అభినయించారు. తమిళ దర్శకుడు భారతీరాజానే ఈ 1987 నాటి రీమేక్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. -
రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేదే.. పాట
కవాడిగూడ: రాజును, రాజ్యాన్నిప్రశ్నించేదే పాట అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఫెస్ట్‌లో సృజన స్వరం వేదికపై పాట అనే అంశంపై గద్దర్ మాట్లాడారు. శబ్దం ఉత్పత్తి, శబ్దం జానపదం.. జ్ఞానపదం, అభ్యుదయ పదం, విప్లవపథం అక్షరాల సమూహమే పాట అవుతుందని అన్నారు. భావం భౌతికంగా మారినప్పుడే పాటకు రూపం వస్తుందన్నారు. అనంతరం నిస్సార్, దేవేందర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమంలో, నగ్జల్బరీ ఉద్యమంలో పాట గొప్ప పాత్ర పోషించిందన్నారు. పాట నిండు చందమామ అని కొనియాడారు. కార్యక్రమంలో స్ఫూర్తి, నేర్నాల కిశోర్, జగన్ పాల్గొన్నారు. బాలోత్సవ్‌లో.. బాలోత్సవ్‌లో పిల్లలకు చిత్రలేఖనం, బొమ్మల తయారీ, కథ చెప్పడం, రాయడం లాంటి అంశాలపై విశ్లేషించారు. ఇవేదికపై ‘చిన్నారుల మానవీయత’ అంశంపై సంఘ సేవకురాలు డాక్టర్ లీక్ , రచయిత సోనియా శాండిల్య పాల్గొని మాట్లాడారు. మహిళా వేదికపై.. హైదరాబాద్ ఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన మహిళ వేదికపై సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంశంపై మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించారు. మాయా లేదు.. మర్మం లేదు.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విద్యార్థులు అసక్తి చూపుతున్నారు. మాయా లేదు.. మర్మం లేదు అంతా సైన్స్ పరిజ్ఞానమే అంటూ చంద్రయ్య మనోహర్ మ్యాజిక్ షో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది. సుద్దాల హనుమంతు వేదికపై.. సుద్దాల హనుమంతు వేదికపై సినీ దర్శకుడు కాశీ విశ్వనాథ్, ఏపీఎఫ్ చైర్పర్సన్ విమల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సూర్యాపేటకు చెందిన కళాకారుల జడ కోలాటం, పృథ్వీరాజ్ క్లాసికల్ శాస్త్రీయ నృత్యం, భూదేవి బృందం సోలో సాంగ్, విక్టరీ బృందం బోనాల డాన్స్, కృష్ణా జిల్లా కళాకారుల వీధి నాటకం, పల్లె సుద్దులు, అభ్యుదయ అకాడమీ పూలే నాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గాయకురాలు విమల ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఫెస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
నేను పెద్ద రౌడీనైనప్పటికీ...
కిన్నెరసాని పాటలు రాశాక వాటిని ఇతరులకు చేర్చడానికి ఉబలాటపడేవారు విశ్వనాథ సత్యనారాయణ. ఒకసారి బందరులో ప్రత్యేకంగా చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి శిష్యుల కవితాగానం ఏర్పాటు చేశారు. చాలామంది కవులు వచ్చి తమ ఛందోబద్ధ పద్యాలు చదివారు. చెళ్లపిళ్ల ఎంతో సంబరపడ్డారు. తర్వాత విశ్వనాథ వంతు రాగానే, కిన్నెరసాని పాటలు పాడి వినిపించారు. అయితే, అవి ఎందుకో చెళ్లపిళ్లకు అంతగా నచ్చలేదు. అదే సమయంలో టేబుల్ మీద పెట్టిన గ్లాసు ఒలికిపోయింది. దాన్నే ఆశువుగా చెళ్లపిళ్ల– ఒలికింది ఒలికింది కలికి కిన్నెరసాని తడిసింది తడిసింది పొడిది మేజాగుడ్డ – అని చదివారు. దీనికి ఉడుక్కున్న విశ్వనాథ, ఒక రౌడీ కథ చెప్పారు. ‘ఒక ఊరికి అతడు ఎంత పెద్ద రౌడీ అయినా కావొచ్చు. ఆ రౌడీకి గురువు ఆ ఊరు వచ్చాడంటే తన మొత్తం రౌడీతనాన్ని ప్రదర్శించలేడు; ఏదో రెండు కుప్పిగంతులు, ఒక లంఘనం ప్రదర్శిస్తాడు. నేనూ అంతే’ అని కూర్చున్నారు తనదైన గడుసుతనంతో. (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
ఈ పాటలకు ట్యూన్ కట్టుకుందాం!
పుట్టుకతోనే ఒక బంధాన్ని మోసుకొని వచ్చేస్తాడు మనిషి. అదెప్పుడూ బరువనిపించని బంధం. చెప్పాలంటే ఆ బంధం మనిషిని మరింత తేలికపరుస్తుంది. కాబట్టే జీవితంలోని ప్రతిదశలో తనను తేలికపరిచే బంధాలను మోస్తూనే ఉంటాడు. ఆ బంధాలకు పేర్లేవైనా, ఆ బంధంతో మాట్లాడటానికి మాటలు కనిపెట్టుకున్నాడు. ఇష్టాల్ని మరింత ఇష్టంగా చెప్పేందుకు పాటలు కట్టుకున్నాడు. తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్లు కావొస్తోంది. ఈ తొంభై ఏళ్లలో వేలల్లో పాటలు ఈ బంధాలను చుట్టుకొని పుట్టాయి. మనచుట్టూ, మన ఇంట్లో రోజూ కనిపించే రకరకాల పేర్లతో ఉన్న ఆ బంధాలను తలచుకుంటూ, ఈ పాటలకు ట్యూన్ కట్టుకుందాం! అనుబంధాలను అలా ట్యూన్ చేసుకుందాం!! అమ్మ. తెలుగులో ‘అమ్మ’ పేరుతో వచ్చినన్ని పాటలు మరింకే బంధం పేరుతోనూ వచ్చి ఉండవు. అలాంటి అమ్మ పాటలు కొన్ని.. అమ్మ అన్నది ఒక కమ్మని మాట చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు సంగీతం: సత్యం రచన: దాశరథి గానం: బాలు, బెంగళూరు లత అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూట / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా.. మమతల మూటా / దేవుడే లేడని మనిషున్నాడు / అమ్మే లేదనువాడు అసలే లేడు (2) తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు(2) / ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు /అమ్మ అన్నది ఒక కమ్మని మాటఅది ఎన్నెన్నో తెలియని మమతల మూటా / మమతల మూట..అమ్మంటే అంతులేని సొమ్మురా / అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా / అమ్మ మనసు అమృతమే చిందురా (2) / అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా.. మమతల మూటఅంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే/అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే(2) / అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది(2) / అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా... మమతల మూట కనిపెంచినా మా అమ్మకే.. చిత్రం: మనం సంగీతం: అనూప్ రూబెన్స్ గానం: భరత్ రచన: చంద్రబోస్ కనిపెంచినా మా అమ్మకే, అమ్మయ్యానుగా/నడిపించినా మా నాన్నకే, నాన్నయ్యానుగాఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు/ ఒకరిది మాటా, ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ... హా.. అ../ అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా / అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా / కన్నోళ్లతో నేను చిన్నోడిలా, కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ... కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా / కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా.. /జోలలు నాకే పాడారుగ, ఆ జాలిని మరచి పోలేనుగ / మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా... / ఇది ప్రేమా ప్రేమా.. / ఎదురొచ్చె హాయిగా... / ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ.. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా చిత్రం: రఘువరన్ బీటెక్ సంగీతం: అనిరు«ద్ రవిచందర్ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: యస్. జానకి, దీపు అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా / మాటే లేకుండా నువ్వే మాయం / కన్నీరవుతోంది ఎదలో గాయం / అయ్యో వెళ్లిపోయావే / నన్నొదిలేసి ఎటు పోయావే / అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట / నే పాడే జోలకు నువు కన్నెత్తి చూశావో అంతే చాలంట / అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా / నువ్వే లేక వసివాడానమ్మా..చెరిగింది దీపం.. కరిగింది రూపం.. అమ్మా నాపై ఏమంత కోపం.. / కొండంత శోకం.. నేనున్న లోకం.. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం.. / నాకే ఎందుకు శాపం.. జన్మల గతమే చేసిన పాపం / పగలే దిగులైన నడిరేయి ముసిరింది.. / కలవరపెడుతోంది పెను చీకటి / ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయింది.. / బ్రతికి సుఖమేమిటి / ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా..విడలేక నిన్ను.. విడిపోయి వున్నా.. కలిసే లేనా నీ శ్వాసలోన / మరణాన్ని మరచి.. జీవించి వున్నా.. ఏ చోట వున్నా నీ ధ్యాసలోన / నిజమై నే లేకున్నా.. కన్నా నిన్నే కలగంటున్నా / కాలం కలకాలం ఒకలాగే నడిచేనా.. కలతను రానీకు కన్నంచున / కసిరే శిశిరాన్ని వెలి వేసి త్వరలోన.. చిగురై నిను చేరనా అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా.. / అడుగై నీతోనే నడిచొస్తున్నా.. / అద్దంలో నువ్వై కనిపిస్తున్నా.. / అయ్యో వెళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే / అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట / వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా నీవే నీవే నీవే నేనంటా... చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సంగీతం, గానం: చక్రి రచన: పెద్దాడ మూర్తి నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటా నా కలలని కన్నది నీవే / నా మెలకువ వేకువ నీవే / ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా / నా కష్టం ఇష్టం నీవే /చిరునవ్వు దిగులు నీవే / ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా / కనిపించకపోతే బెంగై వెతికావే / కన్నీరే వస్తే కొంగై తుడిచావే / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటా నే గెలిచిన విజయం నీదే / నే ఓడిన క్షణం ఓదార్పే / నా అలసట తీరే దారే నీవేగా / అడుగడుగున నడిపిన దీపమ / ఇరువురికే తెలిసిన స్నేహమ / మది మురిసే ఆనందాలే నీవేగా / జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే / ధన్యోస్మి అంటూ దణ్ణం పెడతాలే / నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం పెదవే పలికిన మాటల్లోనే చిత్రం: నాని రచన: చంద్రబోస్ గానం: ఉన్నికృష్ణన్, సాధన సర్గమ్ సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. / కదిలే దేవత అమ్మా / కంటికి వెలుగమ్మా / తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా / తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ (2) మనలోని ప్రాణం అమ్మ / మనదైన లోకం అమ్మ / ఎనలేని జాలి గుణమే అమ్మ / నడిపించే దీపం అమ్మ / కరుణించే కోపం అమ్మ / వరమిచ్చే తీపి శాపం అమ్మ / నా ఆలి అమ్మగా అవుతుండగా / జోలాలి పాడనా కమ్మగా...కమ్మగాపొత్తిళ్లలో ఎదిగే బాబు / నా ఒళ్లో ఒదిగే బాబు / ఇరువురికి నేను అమ్మవనా / నా కొంగు పట్టేవాడు / నా కడుపున పుట్టేవాడు / ఇద్దరికీ ప్రేమ అందించనా / నా చిన్ని నాన్ననీ వాడి నాన్నని / నూరేళ్లు సాకనా / చల్లగా చల్లగా ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో...జో / బంగరు తండ్రీ జోజో / బజ్జో లాలీ జో / పలికే పదమే వినకా / కనులారా నిదురపో / కలలోకి నేను చేరి / తదుపరి పంచుతాను ప్రేమ మాధురి నాన్న అంటే మనకెంత భయమో, అంతే ఇష్టం కూడా! అలాంటి నాన్నను ఇష్టంగా పిలుచుకుంటూ పాడుకునే కొన్ని పాటలు.. నాన్నకు ప్రేమతో.. చిత్రం: నాన్నకు ప్రేమతో సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్ రచన: దేవిశ్రీ ప్రసాద్ ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. / ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం.. నేనేదారిలో వెళ్లినా / ఏ అడ్డు నన్నాపినా / నీవెంట నేనున్నానని నను నడిపించిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..\ ఏ తప్పు నే చేసినా / తప్పటడుగులే వేసినా / ఓ చిన్ని చిరునవ్వుతోనే.. నను మన్నించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. ఏ ఊసునే చెప్పినా.. ఏ పాటనే పాడినా.. / భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం.. ఈ అందమైన.. రంగుల లోకాన.. / ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమనందించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. / ఈ పాటతో.. ఈ పాటతో.. / నాన్నకు ప్రేమతో వందనం / ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో.. పచ్చని చెట్టు ఒకటి.. చిత్రం: రాము సంగీతం: ఆర్. గోవర్ధనమ్ గానం: పి. సుశీల, ఘంటసాల (హ్యాపీ వెర్షన్) రచన: ఆరుద్ర పచ్చని చెట్టూ ఒకటి... / వెచ్చని చిలకలు రెండూ.. / పాటలు పాడి జో కొట్టాలి జో జో / చల్లని తలపుల తల్లీ.. / చక్కని నవ్వుల తండ్రీ.. / కమ్మని నోముల పంట నేనే సుమా.. / ఇద్దరి బుగ్గల మీద.. ముద్దుల మూటలు కడితే.. / ఇంపుగ నిదుర పోవాలీ జో జో జో.. పచ్చని చెట్టూ ఒకటి.. / వెచ్చని చిలకలు రెండూ.. / పాటలు పాడీ జో కొట్టాలి జో జో జో.. చిట్టీ చిలకా పలకా / చిలకా తల్లీ కులకా / చిలకా రాజు చెట్ల చాటున వెతకాలి / చల్లగ మురిసే వేళ / చాటుగ మసలే వేళ / ఎల్లరు కళకళæలాడాలి జో జో జో.. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. చిత్రం: సుస్వాగతం సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్ గానం: నాగూర్‌బాబు, మణికిరణ్, జయచంద్రన్ రచన: సామవేదం షణ్ముఖశర్మ హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. / మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా / ఆపలేని స్వేచ్ఛ ఉంది.. అందినంత చాన్స్ ఉంది.. / అందుకోరా పుత్ర రత్నమా.. నేస్తమా.. జీవితానికే అర్థం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే../ ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతున్నదే మా అనుభవమే.. / చిలిపి వయసు వరుస తమకు తెలియదా.. హ్యాపీ హ్యాపీ.. / హ్యాపీ హ్యాపీ బర్త్‌డే../ మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా.. తెలియకడుగుతున్నాలే.. కంప్యూటరేమంటోంది / పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైందీ / బోధపడని కంప్యూటర్.. బదులన్నదే లేదందీ / విసుగురాని నా మనసే.. ఎదురే చూస్తోందీ.. ప్రేమకథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్ / ఆచితూచి ముందుకెళ్లు ఓ మై ఫ్రెండ్ / అప్టుడేట్ ట్రెండు మాది టోటల్ ఛేంజ్ / పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్.. ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే / శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే / కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో / హ్యాపీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా.. మ్యూజిక్కా మ్యాజిక్కా మజా కాదు చాలెంజి / బాపూజీ బాపూజీ బడే గులాం ఆలీజీ / నింగిలోని చుక్కలనే.. చిటికేసి రమ్మనలేమా / తలచుకుంటే ఏదైనా ఎదురే లేదనమా / నేల విడిచి సామైతే.. టైమ్ వేస్టురా ఈ ధీమా / ముందు వెనక గమనిస్తే.. విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా / తాకకుండా ఊరుకుంటే తప్పు కదా / నవ్వు కింద పొంచి ఉన్న ముల్లు కదా / చూడకుండ చెయ్యివేస్తే ముప్పు కదా / ముల్లు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా / లక్ష్యమందకుండ లైఫుకి అర్థమంటు ఉండునా / తెగువ తెలుపు గెలుపు మనకు దొరకగ.. ఆటల పాటల చిత్రం: ఆకాశమంత సంగీతం: విద్యాసాగర్ గానం: మధు బాలకృష్ణన్ రచన: అనంత శ్రీరామ్ ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే / మధురమౌ భావాలేవో ఊగే లోలోన / పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే / పదులై, వేలై పొంగే నాలోన / లాలిపాటే నేనై, లాలపోసేవాణ్నై / లాలనే నింపనా లేత హృదయాన / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం / ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం / అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు / అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం / క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా / పాపవే పాపవే నాన్న నయనాన మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా ఓ.. నాన్నా చిత్రం: ధర్మదాత సంగీతం: టి.చలపతిరావు గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్ రచన: సి.నారాయణరెడ్డి ఓ....నాన్నా / నీ మనసే వెన్నా / అమృతం కన్నా / అది ఎంతో మిన్నా ముళ్లబాటలో నీవు నడిచావు / పూలతోటలో మమ్ము నడిపావు / ఏ పూట తిన్నావు / ఎన్ని పస్తులు ఉన్నావూ / పరమాన్నం మాకు దాచి ఉంచావు పుట్టింది అమ్మ కడుపులోనైనా / పాలు పట్టింది నీ చేతిలోనా / ఊగింది ఉయ్యాలలోనైనా / నేను దాగింది నీ చల్లని ఒడిలోనాఉన్ననాడు ఏమి దాచుకున్నావు / లేని నాడు చేయి చాచనన్నావు / నీ రాచగుణమే / మా మూలధనమూ / నీవే మా పాలి దైవమూ.. /నేను దాగింది నీ చల్లని ఒడిలోన... చల్లని ఒడిలోన... ఓ.. నాన్నా చిత్రం: ధర్మదాత సంగీతం: టి.చలపతిరావు గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్ రచన: సి.నారాయణరెడ్డి ఓ....నాన్నా / నీ మనసే వెన్నా / అమృతం కన్నా / అది ఎంతో మిన్నా ముళ్లబాటలో నీవు నడిచావు / పూలతోటలో మమ్ము నడిపావు / ఏ పూట తిన్నావు / ఎన్ని పస్తులు ఉన్నావూ / పరమాన్నం మాకు దాచి ఉంచావు పుట్టింది అమ్మ కడుపులోనైనా / పాలు పట్టింది నీ చేతిలోనా / ఊగింది ఉయ్యాలలోనైనా / నేను దాగింది నీ చల్లని ఒడిలోనా ఉన్ననాడు ఏమి దాచుకున్నావు / లేని నాడు చేయి చాచనన్నావు / నీ రాచగుణమే / మా మూలధనమూ / నీవే మా పాలి దైవమూ.. /నేను దాగింది నీ చల్లని ఒడిలోన... చల్లని ఒడిలోన... జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఏదో ఒక కారణం చేత ఒక తోడుంటే బాగుంటుందనుకుంటాం. ఆ తోడుతో కబుర్లు చెప్పుకుంటాం. ఆడతాం. పాడతాం. ఆ తోడు అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో అయి ఉంటారు, ఇంట్లో చిన్నప్పట్నుంచీ. అలాంటి తోడు కోసం కొన్ని పాటలు.. అందాల చిన్ని దేవత.. చిత్రం: శివరామరాజు సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్ గానం: శంకర్ మహదేవన్, బృందం రచన: చిర్రావూరి విజయకుమార్ సంతోష పడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు.. /శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు.. (2)/ అందాలా చిన్ని దేవత../ ఆలయమే చేసి మా ఎద../ అమృతమే మాకు పంచగా../ అంతా ఆనందమే కదా../ అనురాగం కంటి చూపులై../ అభిమానం ఇంటి దీపమై../ బతుకంతా నిండు పున్నమై../ ముడివేసే పూర్వ పుణ్యమే../ కలకాలం అన్నలకు ప్రాణమై../ మమకారం పంచవే అమ్మవై.. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు../ శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..(2)/ పువ్వులెన్నొ పూచే.. నువ్వు నవ్వగానే / ఎండ వెన్నెలాయె.. నిన్ను చూడగానే / నీడ పడితే.. బీడు పండాలీ / అడుగుపెడితే.. సిరులు పొంగాలి / కల్మషాలు లేని.. కోవెలంటి ఇల్లు మాది / స్వచ్ఛమైన ప్రేమే.. పందిరల్లె అల్లుకుంది / స్వార్థమన్నమాటే మనసులోంచి తుడిచిపెట్టి / స్నేహబాటలోనే సాగుదాము జట్టుకట్టి / వెన్నెకన్న మెత్తనైన.. గంగకన్న స్వచ్ఛమైన ప్రేమ బంధమంటే మాదిలే.. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు../ శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..(2) / అందాలా చిన్ని దేవత../ ఆలయమే చేసి మా ఎద../ అమృతమే మాకు పంచగా../ అంతా ఆనందమే కదా../ అనురాగం కంటి చూపులై.. అభిమానం ఇంటి దీపమై../ బతుకంతా నిండు పున్నమై../ ముడివేసే పూర్వ పుణ్యమే../ కలకాలం అన్నలకు ప్రాణమై../ మమకారం పంచవే అమ్మవై.. స్వాతిముత్యమల్లె.. పెరిగినట్టి చెల్లి / కల్పవృక్షమల్లె.. కరుణచూపు తల్లి / నలకపడితే.. కంటిలో నీకు / కలత పెరుగు.. గుండెలో మాకు / అమృతాన్ని మించె మమత మాకు తోడు ఉంది / మాటమీద నిలిచే అన్నమనసు అండ ఉంది / రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది / కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది / నేలమీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమంటే మాదిలే / సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు / శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..శ్రీలక్ష్మీ దేవిరూపము / శ్రీ గౌరీ దేవితేజము / కలిసి మా చెల్లి రూపమై / వెలిసే మా ఇంటి దేవతై / సహనంలో సీత పోలిక / సుగుణంలో స్వర్ణ మేనిక / దొరికింది సిరుల కానుక / గత జన్మల పుణ్య ఫలముగా / కలకాలం అన్నలకు ప్రాణమై / మమకారం పంచవే అమ్మవై.. కన్నీళ్లకే కన్నీరొచ్చే.. చిత్రం: హిట్లర్ సంగీతం: కోటి గానం: బాలు, చిత్ర, అనుపమ, రేణుక రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే../ కన్నా ఇలా నిన్నే చూడగా../ అన్నీ నువ్వై భారం మోయగా.. ఈ బరువే.. నీ చదువై.. ఎదిగిన పసికూనా.. (2) అమ్మలోని లాలన.. నాన్నలోని పాలన.. అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో.. / కొమ్మచాటు పువ్వులై.. కంచె చాటు పైరులై../ చిన్నిపాపలందరూ ఎదుగువేళలో../ ముసిరే నిశిలో.. నడిచే దిశలో../ నెత్తురుతో నిలిపావే.. ఆరని దీపాన్ని..జాలి చూపు సూర్యుడా.. జోల పాడు చంద్రుడా.. నీవు కంట నీరు పెడితే నిలవలేమురా../ నీరు కాదే అమ్మలూ../ తీరుతున్న ఆశలు../ ఇన్నినాళ్ల భారమంతా కడుగుతున్నవే../ ఒడిలో ఒదిగి.. ఋణమై ఎదిగి../ మరుజన్మానికి నిను కనిపించే అమ్మవు కామయ్యా../ నీ నవ్వే.. వెన్నెల వెలుగమ్మా../ నా ఎదలో కాంతుల కొలువమ్మా.. ఏ దైవమో దీవించాడు.. మా అన్నగా దిగివచ్చాడు../ ఏ జన్మలో ఋణమో తీర్చగా../ మాకోసమే ప్రాణం పంచగా../ ఏ పుణ్యం.. మాకోసం.. దీవెనలిచ్చిందో../ నీ నవ్వే.. వెన్నెల వెలుగమ్మా../ నా ఎదలో కాంతుల కొలువమ్మా.. అన్నయ్యా అన్నావంటే చిత్రం: అన్నవరం సంగీతం: రమణ గోగుల గానం: మనో, గంగ రచన: చంద్రబోస్ అన్నయ్యా అన్నావంటే ఎదురవనా / అలుపై ఉన్నావంటే నిదరవనా / కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా / కలతై ఉన్నావంటే కథనవనా / అమ్మలో ఉండే సగం అక్షరం నేనే / నాన్నలో రెండో సగం లక్షణం నేనే / అమ్మ తోడు.. నాన్న తోడు.. అన్నీ నీకు అన్నే చూడు / చెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి.. నవ్వులోన రంగోళి / పండుగలు నీతో రావాలి.. నా గుండెలోన వేడుక కావాలి / రూపులోన బంగారు తల్లి.. మాట మరుమల్లి / రాముడింట ప్రేమను పంచాలి.. ఆ సీత లాగా పేరుకు రావాలి / నీలాంటి.. అన్నగారు ఉండే ఉంటే.. తోడూనీడాఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగుండేవాచెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మాకాలి కింది నేలను నేనే.. నీలి నింగి నేనే / కన్నులోని నీరే నేనమ్మా.. నన్ను నువ్వు జారనీకమ్మా / ఇంటి చుట్టు గాలిని నేనే.. తోరణాన్ని నేనే / తులసిచెట్టు కోటని నేనమ్మా... నీ.. కాపలాగా మారనీవమ్మా / ముక్కోటి దేవతలా అందే వరం అన్నవరం / ఇట్టాంటి అన్న తోడు... అందరికుంటే భూమే స్వర్గం / చెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మా..అన్నయ్యా అన్నావంటే ఎదురవనా / అలుపై ఉన్నావంటే నిదరవనా / కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా / కలతై ఉన్నావంటే కథనవనా / అమ్మలో ఉండే సగం అక్షరం నేనే / నాన్నలో రెండో సగం లక్షణం నేనే / అమ్మ తోడు.. నాన్న తోడు..అన్నీ నీకు అన్నే చూడు అన్నా చెల్లెలి అనుబంధం చిత్రం: గోరింటాకు సంగీతం: యస్.ఎ.రాజ్‌కుమార్ రచన: అభినయ శ్రీనివాస్ గానం: ఎస్పీ బాలు, చిత్ర అన్నా చెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం / అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోన హరివిల్లై / గోరింట పండగా.. మా ఇంట పండగా.. అన్నాచెల్లెలి అనుబంధం / అంతులేనిది ఆనందం / జాబిలమ్మకిది జన్మదినం / కోటితారకల కోలాహలం / అన్నయ్య ప్రేమే అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే / గోరింట పండగా.. మా ఇంట పండగా.. విరిసినది వెన్నెల్లే ఇలా అచ్చు నా చెల్లి నవ్వులా / స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా / కురిసినది ప్రేమ చినుకులా / అదే మా అన్న చూపులా / కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా / నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే / నీ గుండెకు ఊపిరి నేనై / ఎప్పుడూ ఉంటాలే / అందుకే నువ్వులేక నే లేనులే / ప్రతిజన్మలోనా నీ చెల్లినై వరమివ్వు నాకు చాలంట / దేవతలా మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ / అన్నాచెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం బుడిబుడి నడకలు ఎన్నో నేర్పిన కన్నతండ్రిలా / పాదమే కందనీ ఓ పూల దారిలా / చిరుచిరు గోరుముద్దలే తినిపించు కన్నతల్లిలా / తులసివై వెలసినా ఈ ఇంటి దేవత / అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం / చెల్లీ నువ్వు పుట్టినరోజే ప్రేమకు శ్రీకారం / మా ఇల్లు అనురాగ గుడి గోపురం / సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్నినవ్వులకు / నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవ అన్నా చెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం / అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోన హరివిల్లై / గోరింట పండగా.. మా ఇంట పండగా.. అన్నయ్య సన్నిధి చిత్రం: బంగారు గాజులు రచన: సినారె గానం: పి.సుశీల సంగీతం: టి.చలపతిరావు అన్నయ్య సన్నిధి / అదే నాకు పెన్నిధి / కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది / ఒకే తీగ పువ్వులమై / ఒకే గూటి దివ్వెలమై / చీకటిలో వేకువలో / చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము / కలిమి మనకు కరువైనా / కాలమెంత ఎదురైనా / ఈ బంధం విడిపోదన్నా / ఎన్నెన్ని యుగాలైన / ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్నా.. అన్నా... నీ అనురాగం చిత్రం: ఆడపడుచు సంగీతం: టి.చలపతిరావు రచన: దాశరథి గానం: పి.సుశీల అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా.. నీ అనురాగం / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా.. నీ అనురాగంమల్లెల వంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి / ఎల్లకాలము ఈ తీరుగనే చెల్లిని కాపాడాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా..అన్నలు మీరే నా కన్నులుగా.. నన్నే నడిపించాలి / తల్లి తండ్రి సర్వము మీరై.. దయతో దీవించాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా..ఇల్లాలై నేనెచటికేగినా.. చెల్లిని మదిలో నిలపాలి / ఆడపడుచుకు అన్నివేళలా.. తోడూనీడగా నిలవాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా దేవుడెలా ఉంటాడని చిత్రం: దొరబాబు సంగీతం: జె.వి.రాఘవులు గీత రచయిత: దాశరథి నేప«థ్య గానం: ఘంటసాల, సుశీల దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అనురాగమెలా ఉంటుందని.. ఎవరైనా అడిగితే / మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను / చెల్లెలున్న ఈ ఇల్లే సిరిమల్లె తోట / మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట (2) / అన్నయ్య హృదయమే అందాల మేడ / చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ / కన్నతల్లి తీపి కలల రూపాలం మనము(2) / కోవెలలో వెలిగించిన దీపాలం మనము దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అల్లారు ముద్దుగా నను పెంచినావు / అమ్మనూ నాన్ననూ మరపించినావు / ఇల్లాలివై నీవు విలసిల్లవమ్మా / పిల్లాపాపలతోటి చల్లగ వుండమ్మా / పుట్టినింట ఉన్నా.. మెట్టినింట ఉన్నా..(2) / అన్నయ్య దీవెనే శ్రీరామరక్ష దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అనురాగమెలా ఉంటుందని.. ఎవరైనా అడిగితే / మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను అక్కా అక్కా నువ్ ఎక్కడే చిత్రం: అడవి చుక్క సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ రచన: సుద్దాల అశోక్‌తేజ గానం: కె.ఎస్. చిత్ర, స్వర్ణలత అక్కా అక్కా నువ్ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే /ఎక్కాడున్నానో చెప్పవే / ఆకులోన ఆకులాగా.. పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మా / నా చిట్టితల్లి నిన్ను కల్లో కూడ వీడి ఉండనే / ఆ చిలక రెక్కల్లో్ల / ఆ పచ్చ రంగుల్ని అద్దిన రాజు ఎవ్వడే / మిన్నాగు పడగల్లో / ఆ విష్ణు పాదాలు దిద్దిన మాయ దేవుడే / ఆ దేవుడే నన్ను... ఆ దేవుడే నన్ను చెల్లెలిగ చేశాడే / నీ తోడుగా నన్ను రెప్పల్లె ఉంచాడే / మన ఆటాపాటా పగలు రేయి సూర్యచంద్రుడల్లె చూస్తాడే అక్కా అక్కా నువ్ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే.. నా కాలికి ముల్లై్లతే.. నీ కంట్లో కన్నీరు / విడ్డూరం కాదా ఓయమ్మా / ఓ కన్ను ఏడిస్తే.. ఓ కన్ను నవ్వేనా / నువ్వు నేనంతేలేవమ్మా / మన అమ్మ పొత్తిళ్లో... మన అమ్మ పొత్తిళ్లో ఒదిగింది పది నెలలే.. / ఈ అక్క ఒడిలోన ఎదగాలి నూరేళ్లు / నిన్ను నన్ను చూసిన మిన్ను నింగి ఏడురంగుల ముగ్గులు వేసిందా / అక్కా అక్కా నువ్ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే అక్కా.. నీ పెళ్లైతే.. నీ గూడే వేరైతే / నీ చెల్లి దిక్కులేనిదే / నువ్వేనా గుండెల్లో గువ్వల్లే బజ్జుంటే / నాకింక బిడ్డలెందుకే / నీ కంటి కాటుకై కళ్లల్లే నేనుంటా / నీ చేతి గోరింటై నేనుంటా / పాలు పెరుగు పట్టు తేనై కలిసి నాకు అక్కై పుట్టిందే / అక్కా అక్కా నువ్ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే.. మేడంటే మేడా కాదు... చిత్రం: సుఖదుఃఖాలు సంగీతం: కోదండపాణి గీత రచయిత: దేవులపల్లి నేపథ్య గానం: ఎస్పీ బాలు మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది / నేనైతే ఆకు కొమ్మ.. తానైతే వెన్నెల వెల్ల (2) / పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది... పొదరిల్లు మాది / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదూ / పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది కోవెల్లో వెలిగే దీపం.. దేవి మా తల్లి / కోవెలలో తిరిగే పాటల గువ్వ.. నా చెల్లి / గువ్వంటే గువ్వా కాదు.. గొరవంక గాని / వంకంటే వంకా కాదు.. నెలవంక గాని / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న.. పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది / గోరింక పెళ్లైపోతే.. ఏ వంకో వెళ్లిపోతే (2) / గూడంతా గుబులై పోదా? గుండెల్లో దిగులై పోదా? / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న.. పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది (2) ఆనాటి హృదయాల ఆనందగీతం చిత్రం: అన్నదమ్ముల అనుబంధం సంగీతం: చక్రవర్తి రచన: సి. నారాయణరెడ్డి గానం: ఎస్.పి.బాలు, బృందం ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.. ఇదేలే / ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే / ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా.. (2) ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి / ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి (2) / వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం / తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి / వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి (2) / ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.. ఇదేలే / ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే.. ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా.. మల్లె తీగకు పందిరివోలె సినిమా: ఒరేయ్ రిక్షా సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన: గద్దర్ గానం: వందేమాతరం శ్రీనివాస్ మల్లె తీగకు పందిరివోలె / మసక సీకటిలో యెన్నెలవోలె / నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా / తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా / తోబుట్టువు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా పెద్ద మనిషివై పూసిన నుండే / ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో / చూసే దానిని చూడొద్దంటరు / నవ్వే చోట నవ్వొద్దంటరు / అటువంటి నే అన్నను కాను చెల్లెమ్మా / నీ చిన్ననాటి స్నేహితుడినమ్మా చెల్లెమ్మా / అడవిలోనా నెమలివోలే చెల్లెమ్మా / ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా సిన్నబోయి నువ్వు కూసున్నవంటే / ఎన్నుపూస నాదిరిగేనమ్మా / ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే / నా కనుపాపలు కమిలిపోతయి / ఒక్క ఘడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా / నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా / బువ్వదినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా / నా భుజమిరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా చదివినంత నిన్ను చదివిస్తనమ్మా / ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా / నీకు పెళ్లీడు వచ్చేనాటికి / పువ్వో పత్రో కూడబెట్టుతా / నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా / నా కన్నీళ్లతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా / రిక్షా బండినే మేనా కడతా చెల్లెమ్మా / మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా.. కన్నయ్యలాంటి అన్నయ్యలేని చిత్రం: బంగారుబాబు రచన: ఆచార్య ఆత్రేయ సంగీతం: కె.వి. మహదేవన్ గానం: ఘంటసాల, పి.సుశీల కన్నయ్యలాంటి అన్నయ్యలేని కన్నులెందుకు / ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు / నా మాటకు పలికే దేవుడు / నా మనసుకు తెలిసిన చంద్రుడు / అలిగాడమ్మా ఈనాడు (2) / నా బ్రతుకే చీకటి చేశాడు (2) / నా ఆశలు తీర్చే తండ్రే తాను / తన ఆకలి ఎరిగిన తల్లిని నేను / నా కనుపాపడు పలుకని నాడు (2) / కన్నులొచ్చినా కబోదినే / నేను కన్నులొచ్చినా కబోదినే అమ్మా.. చెల్లెమ్మా.. / అన్నయ్యా.. / కన్నమ్మ లాంటి చెల్లెమ్మ ఉంటే అన్నమెందుకు / నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతూ ఉంటే వెన్నెలెందుకు / కన్నయ్యలాంటి అన్నయ్య ఉంటే æకన్నులెందుకు / ఆ అన్నయ్య చల్లగ నవ్వుతూ ఉంటే వెన్నెలెందుకు.. చిన్నారి చెల్లి.. చిత్రం: దేవుడమ్మ సంగీతం: సత్యం గానం: బాలు, కె.బి.కె.మోహన్ రాజు, పి. సుశీల రచన: సినారె చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణమూ (2) / ఈ ఇంటి సిరిమల్లివే నీవు నేడు / ఏ ఇంటి జాబిల్లివవుతావో రేపు (2) / పల్లకిలో సాగి.. చల్లగ ఊరేగి (2) / పచ్చగ నూరేళ్లు బ్రతకాలి చెల్లి.. బ్రతకాలి చెల్లి..చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణము / ఈపూట వెలిగే మతాబాల కన్నా / నీ పాలనవ్వుల దీపాలే మిన్న (2) / ఈ ఇంట ఉన్నా.. మరే ఇంట ఉన్నా (2) / నీవున్న ఆ ఇంటే దీపావళి / దీపావళి నిత్య దీపావళి / దీపావళి నిత్య దీపావళిచిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణమూ (2) ఏ పూర్వజన్మల పుణ్యాల ఫలమో / ఈ జన్మలో నేను మీ చెల్లినయ్యాను (2) / ఏ చోట ఉన్నా ఇదే మాట అన్నా (2) / మీ పేరు నా పేరు నిలిపేనన్నా.. నిలిపేనన్నా.. / చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణము అత్త అంటే ఏదైనా చెప్పుకోవచ్చనే ధైర్యం. ఎన్నైనా చెప్పుకోనిచ్చే నమ్మకం. అందుకే మన తెలుగు సినిమాల్లో అత్త మీద పాటలు చాలానే వచ్చాయి. అందులోంచి ఓ రెండు పాటలు... అత్త ఒడి పూవు వలె.. చిత్రం: తోడు నీడ సంగీతం: కె.వి.మహదేవన్ గానం: పి. సుశీల రచన: ఆత్రేయ అత్త ఒడి పూవు వలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా / ఆడుకొని, పాడుకొని అలసిపోతివా / అలుపుతీర బజ్జో మా అందాల బొమ్మా.. అమ్మలు కన్నుల్లో తమ్మీ పూవుల్లు / అమ్మలు కన్నుల్లో తమ్మీ పూవుల్లు / తమ్మీ పూవులు పూయు / కలిరు వెన్నెల్లు / ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు / కన్నీరుæ రానీకు / కరుగునెడదల్లు అత్తఒడి పువ్వువలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా కనిపించే దేవుళ్లు కమ్మని పాపల్లు / కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు / వెయ్యాలి పాపాయి / తప్పటడుగుళ్లు / చేయాలీ ఆ పైనా గొప్ప చేతలూ / అత్త ఒడి పూవు వలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా.. కలికి చిలకల కొలికి చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు రచన: వేటూరి గానం: చిత్ర సంగీతం: కీరవాణి కలికి చిలకల కొలికి మాకు మేనత్త / కలవారి కోడలు కనకమాలక్ష్మి / అత్తమామల కొలుచు అందాల అతివ / పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి / మేనాలు తేలేని మేనకోడలిని / అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని / వాల్మీకినే మించు వరుస తాతయ్య / మా ఇంటికంపించవయ్య మామయ్య ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి / ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి / నేటి అత్తమ్మ నాటి కోడలివే / తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి / తలలోని నాలుకై తల్లిగా చూసే / పూలల్లో దారమై పూజలే చేసే / నీ కంటిపాపల కాపురం చేసే /మా చంటి పాపను మన్నించి పంపు మసక బడితే నీకు మల్లెపూదండ / తెలవారితే నీకు తేనె నీరెండ / ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు / ఏడు జన్మల పంట మా అత్త కాలు / పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది / పుట్టినింటికే మనసు పరుగుతీస్తుంది / తెలుసుకో తెలుసుకో తెలుసుకో / తెలుసుకో తెలుసుకో మనసున్న మామ / సయ్యోధ్యనేలేటి సాకేతరామ బావంటే సరదా. బావతో మాట్లాడటమూ పాటలాగే ఉంటుంది, అతణ్నిష్టపడే మరదలికి. ఆ మరదలితో మాట్లాడటం ఆ బావకూ అంతే. వాళ్లిద్దరూ పాడుకునే అలాంటి పాటలెన్నో ఉన్నాయి తెలుగులో. అందులోంచి ఈ రెండు... ఆకాశ వీధిలో.. చిత్రం: మల్లీశ్వరి రచన: కృష్ణశాస్త్రి సంగీతం: సాలూరి రాజేశ్వరరావు గానం: ఘంటసాల–భానుమతి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావా / ఆ... అందాల ఓ మేఘమాల / ఆ.. చందాల ఓ మేఘమాల / గగన సీమల తేలు ఓ మేఘమాల / మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా / మల్లి మాటేదైన నాతో / మనసు చల్లగా చెప్పిపోవా / నీలాల ఓ మేఘమాల / రాగాల ఓ మేఘమాల మమతలెరిగిన మేఘమాల / నా మనసు బావకు చెప్పి రావా ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూచెనే / బావకై చెదరి కాయలు కాచెనే / అందాల ఓ మేఘమాల / రాగాల ఓ మేఘమాల / మనసు తెలిసిన మేఘమాల / మరువలేనని చెప్పలేవా / మల్లితో.. మరవలేనని చెప్పలేవా / కళ్లు తెరిచినగాని / కళ్లు మూసినగాని (2) / మల్లి రూపే నిలిచెనే / నా చెంత.. మల్లి మాటే పిలిచెనే / జాలిగుండెల మేఘమాల / బావ లేనిది బ్రతుకజాల కురియు నా కన్నీరు / గుండెలో దాచుకొని వాన జల్లుగ కురిసిపోవా / కన్నీరు, ఆనవాలుగ బావ మ్రోల ఏలే ఏలే మరదలా.. చిత్రం: అన్నమయ్య రచన: వేటూరి గానం: ఎస్పీ బాలు, సుజాత, అనురాధ ఏలే ఏలే మరదలా / వాలే వాలే వరసలా / నచ్చింది నచ్చింది నాజూకు / నీకే ఇస్తా సోకులు / ఇచ్చేయ్ పచ్చారు సొగసులు / చాలు నీతోటి / అహ చాలు నీతోటి సరసాలు బావా... గాటపు గుబ్బలు కదలగ కులికేవు / మాటల తేటల మరదలా / వెంటరి చూపులు విసురుచు మురిసేవు / వాటపు వలపుల వరదలా / చీటికి మాటికి చెనకేవు / వట్టి బూటకాలు మానిపోయే బావ / కన్నుల గంతపు కవితలు చిలికేవు / నా ఎద చాటున మరదలా / పాడని పాటల పైటలు సదిరేవు / పల్లవి పదముల దరువులా / కంటికి వంటికి కలిపేవు / ఎన్ని కొంటె లీలలంట చాలా బావా / ఆహా పాడుకో పాట / జంట పాడుకున్న పాట జాజిపూదోట పెద్దల మాట చద్దన్నం మూట అంటూంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు చెప్పే మాటలు అలాంటివే. వాళ్లతో ఉంటే సరదాగా ఆడుతూనే ఎన్నెన్నో తెలుసుకోవచ్చు. అలాంటి పెద్ద వాళ్లు చెప్పే మాటలు, ఆ పెద్దవాళ్ల చుట్టూ చేరి పిల్లలు పాడుకునే పాటలు.. ఇవి.. శ్రీ సూర్యనారాయణా మేలుకో... చిత్రం: మంగమ్మగారి మనవడు సంగీతం: కె.వి.మహదేవన్ గానం: భానుమతి రామకృష్ణ, వాణీజయరామ్ రచన : సినారె శ్రీ సూర్యనారాయణా మేలుకో...మేలుకో / మా చిలకమ్మా బులపాటము చూసిపో...చూసిపో / తెల్లావారక ముందే ఇళ్లంతా పరుగుల్లు / చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు / ఏమీ వయ్యారమో / ఎంతా విడ్డూరమో / శ్రీ సూర్యనారాయణా మేలుకో....మేలుకో / మా అమ్మమ్మా ఆరాటము.. చూసిపో.. చూసి పో / చిట్టీ మనవడి రాక చెవిలోన పడగానే / ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు / ఏమి జాగారమో / ఎంత సంబరమో / సరిగంచు పైట సవరించుకున్నా / మరీ మరీ జారుతోంది / ఓసోసి మనవరాల ఏం జరిగింది? / తాతయ్యని నువ్వు తలచిన తొలినాడు / నీకేమి జరిగిందో అమ్మమ్మా / నాకంతే జరిగింది అమ్మమ్మా అమ్మమ్మా / అమ్మదొంగా... రంగ రంగా / కోడిని కొడితే / సూర్యుణ్ని లేపితే / తెల్లారిపోతుందా? /ఓ పిల్లా పెళ్లిఘడియ వస్తుందా? దిగివచ్చే బావను / క్షణమైనా ఆపితే / దేవుణ్ని నిలదీయనా ఓయమ్మో / కాలాన్ని తిప్పేయనా / నా పిచ్చితల్లీ / ఓ బుజ్జీ మల్లీ / నీ మనసే బంగారం/ నూరేళ్లు నిలవాలి ఈ మురిపెం / అమ్మమ్మ మాట / ముత్యాల మూట / ఆ విలువ నేనెరుగనా / ఏనాడు అది నాకు తొలి దీవెన బాబాయ్ అంటే నాన్న తర్వాత నాన్న. నాన్న దగ్గర పడే భయాలేవీ బాబాయ్ దగ్గర పడక్కర్లేదు. అది బాబాయ్ ఇచ్చే చనువు. అదే బాబాయ్ ఇవ్వగలిగే ధైర్యం కూడా! అలాంటి బాబాయ్ గురించి.. ఒక పాట.. మంచివాడు మా బాబాయి చిత్రం: కథానాయకుడు సంగీతం: టి.వి.రాజు గానం: పి. సుశీల, బెంగళూరు లత రచన: దాశరథి మంచివాడు మా బాబాయి / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి / రామలక్ష్మణులు మీరయ్యా / మీలో కలతలు ఏలయ్యా? / ఏటికి నిలిచే నీ తమ్మునిపై నిందలెందుకయ్యా..మంచివాడులే మా నాన్న / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి / అమ్మా నాన్నా వలె చూసే / అన్నా వదినా ఉన్నారూ / అన్నయ్యేదో అనగానే.. అలుక ఎందుకయ్యా.. అలుక ఎందుకయ్యా.. మంచి మనసుతో బాబాయి / మనకు కానుకలు తెచ్చాడు / మూగనోములూ విడవాలి / ముగ్గురు కలసీ నవ్వాలి / మంచివాడు మా బాబాయి / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి.. భార్యా భర్తలంటే ఒక జీవితాన్ని పంచుకునే బంధం. ఇద్దరు ఒక్కరై చేసే ప్రయాణం. అలాంటి ప్రయాణం గురించి ఎన్ని పాటలు పాడుకోవచ్చు? కొన్నివి.. ఆదిదంపతులే అభిమానించే చిత్రం: మిథునం సంగీతం : వీణాపాణి గానం: కె.జె.ఏసుదాసు రచన: జొన్నవిత్తుల ఆదిదంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం / అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం / సుధా ప్రేమికుల సదనం సదాశివుని మారేడు వనం దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం / నవరస మాన సమర సమాన సహకార స్వరమేళనం / భారతీయతకు హారతి పట్టే కృషిమయ జీవన విధానం / భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరనం... భవసాగర తరనం / అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం / పురుషార్థముల పూలబాటలో పుణ్యదంపతుల పయనం / అరవై దాటిన ఆలుమగల అనురాగామృత మ«థనం / గృహస్థ ధర్మం సగర్వమ్ముగ తానెగరేసిన జయకేతనం... జయకేతనం ఆడుతు పాడుతు చిత్రం: తోడికోడళ్లు రచన: కొసరాజు సంగీతం: మాస్టర్ వేణు గానం: ఘంటసాల, పి. సుశీల ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపూ సొలుపేమున్నది / ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది / మనకు కొదవేమున్నది (2) / ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే (2) / నీ గాజులు ఘల్లని మోగుతువుంటే నా మనుసు ఝల్లుమంటున్నది / నా మనుసు ఝల్లుమంటున్నది / ఆడుతు పాడుతు.. తీరని కోరికలూరింపంగా.. ఓర కంట నను చూస్తూ ఉంటే (2) / చిలిపి నవ్వులు చిందులు తొక్కి.. చిలిపి నవ్వులు చిందులు తొక్కి / సిగ్గు ముంచుకొస్తున్నది / నను సిగ్గు ముంచుకొస్తున్నది / ఆడుతు పాడుతు..చెదరి జారిన కుంకుమరేఖలు / పెదవులపైన మెరుస్తువుంటే (2) / తీయని తలపులు నాలో ఏమో.. తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి / అహ తికమకజేస్తూవున్నవి / ఆడుతు పాడుతు.. / మాటల్లో మోమాటం నిలిపి.. రాగంలో అనురాగం కలిపి (2) / పాట పాడుతుంటే.. నా మది పరవశమైపోతున్నది/ పరవశమైపోతున్నది..ఆ.. మనం చెప్పుకున్న ఇన్ని బంధాలను కట్టి ఉంచిన దారమే కుటుంబం. మరి ఈ బంధాలన్నింటికీ కేంద్రమైన కుటుంబ పాటలకూ లెక్కేలేదు. అందులోంచి కొన్ని.. కలిసుంటే కలదు సుఖం చిత్రం: కలిసుందాం రా సంగీతం: ఎస్.ఎ.రాజ్‌కుమార్ రచన: వేటూరి గానం: రాజేశ్ కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసేఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే / హలో ఆమని చలో ప్రేమనీ / వసంతాలిలా ప్రతీరోజు వస్తూ ఉంటే చలీ కేకలా చెలే కోకిలా / నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం / వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం / ప్రేమలన్ని ఒకసారే పెనేసాయి ఈ ఇంటా / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడుకడుతూ ఉంటే / అదే ముచ్చటా కథే ముద్దటా / తరం మారినా స్వరం మారనీ ప్రేమ / స్వరాగానికే వరం ఐనదీ / పాటలకే అందనిది పడుచుల పల్లవిలే / చాటులలో మాటులలో సాగిన అల్లరిలే / పాల పొంగు కోపాలో / పైట చెంగు తాపాలో / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి ఇంటి పేరు అనురాగం చిత్రం: మగధీరుడు సంగీతం: ఎస్.పి.బాలు రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, లలితా సాగరి ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2) / మా ఇల్లే బృందావనం (2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం / వెలుగునీడలైనా.. కలిమిలేములైనా / మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముద్దులే / ఎదిరించని జానకి నిదురించని ఊర్మిళా / తోడికోడళ్లుగా ఇల్లు చక్కదిద్దగా / ప్రేమకు రూపాలుగా రామలక్ష్మణులుగా / కొండంత అన్నలూ అండగా ఉండగా / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం / మా ఇల్లే బృందావనం(2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం వయసులో చిన్నైనా.. మనసులో పెద్దగా / తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా (2) / అమ్మగా నాన్నగా బిడ్డగా తాతగా / ఏ దేవకి కన్నా / ఏ యశోద పెంచినా / గోకులాన వెలిశాడు గోపాలకృష్ణుడు / మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2) / మా ఇల్లే బృందావనం (2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2) సంకలనం: ఫన్డే డెస్క్ పర్యవేక్షణ: రాజా (మ్యూజికాలజిస్ట్) -
రాగాల సంక్రాంతి
-
పల్లె సంప్రదాయానికి పదునుపెట్టిన గోరటి
చీమకుర్తి రూరల్: పల్లె సంప్రదాయాలకు పదాలను జతగూర్చి జనపదాలుగా మార్చి నృత్యరూపకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ జానపద కళాకారుడు గోరటి వెంకన్న. ఆశుకవిత్వంతో పద కవితలను గుక్కతిప్పుకోకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శుక్రవారం చీమకుర్తిలో జరిగిన బాలోత్సవం కార్యక్రమాన్ని వెంకన్న జానపద గీతాలతో వేదికను దద్దరిల్లేలా చేశారు. రెండోరోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మక్క, వెంకటరెడ్డితో కలిసి గోరటి వెంకన్న పల్లెల్లోని వాతావరణ పరిస్థితులను తన జానపద గేయాలతో నృత్యరూపకంలో చూపరులను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యహరిశ్చంద్రుడిగా పేరుగాంచిన చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు ఉమ్మడి రాష్ట్రాలలోనే పేరెన్నికగలవని అన్నారు. అంతటి కళాకారుడుని ఆదరించిన చీమకుర్తి వాసులకు కళలంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్తున్నాయని, స్థానికుల కళాభిమానాన్ని కొనియాడారు. ముందుగా బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వాటితో పాటు తిరువూరు బాలలు ప్రదర్శించిన ఆలోచించండి నాటిక ఆకట్టుకుంది. తొలుత రెండోరోజు బాలోత్సవం కార్యక్రమాన్ని రోటరీక్లబ్ అ«ధ్యక్షుడు శిద్దా వెంకట సురేష్, వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకూరి రఘుకిరణ్, ప్రధాన కార్యదర్శి ముప్పూరి చలమయ్య ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
105 ప్రపంచ భాషల్లో 7.20 గంటల పాటు..
విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన మల్లాది రాహత్ అద్భుత ప్రతిభ చాటాడు. 105 ప్రపంచ భాషల్లో 105 పాటలను 7 గంటల 20 నిమిషాల పాటు నిర్విరామంగా ఆలపించాడు. అందులో భారతీయ భాషలు 36 ఉండటం విశేషం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అధికారిక నమోదు కోసం గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్హాల్లో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కూచిపూడి నాట్యరామం చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిన్నిస్ నియమాల ప్రకారం 4 గంటల అనంతరం 5 నిమిషాలు విరామం తీసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి, గజల్ శ్రీనివాస్ పేరుతో ఉన్న రికార్డును రాహత్ బద్దలు కొట్టాడు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త ఎం.సి.దాస్, భారతీయ విద్యాభవన్ ప్రతినిధి పార్థసారథి సాక్షులుగా వ్యవహరించారు. గీతాలపన కార్యక్రమాన్ని ప్రత్యేక యూనికోడ్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు అందించారు. రాహత్ తండ్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ రెండు వారాల అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి నమోదు పత్రం అందుతుందని తెలిపారు. గతంలో గజల్ శ్రీనివాస్ 75 భాషల్లో పాటలు పాడి రికార్డు నెలకొల్పారని, రాహత్ 105 భాషల్లో గీతాలు ఆలపించి దాన్ని అధిగమించారని చెప్పారు. కార్యక్రమంలో కొచ్చర్లకోట చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు కొచ్చర్లకోట లక్ష్మీపద్మజ, సినీ సంగీత దర్శకుడు వీణాపాణి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి పరిమళం సుద్దాల..
ఎంగిలివారంగ పాటతోనే ఆ ఇంట పొద్దుపొడుపు. ఇంట్లో పని చేసుకుంటూ అమ్మ పాడేది.. తన పనులు చేసుకుంటూ నాన్న పాడేవారు.. పిల్లలు శ్రుతులు, రాగాలయ్యేది. వచ్చేటోళ్లు పాటలై వొస్తరో.. పాటల కోసమే వస్తరో కానీ.. చేతులతోని దరువేసే వాళ్లు, బుర్రలు వాయించేవాళ్లు.. తాళం కొట్టేవాళ్లు.. దీనికి నాన్న చేతిలోని హార్మోనియం తోడై రాగమందుకుంటే.. ఆ ఇల్లు పాటకు పుట్టినిల్లయ్యేది. అదే సుద్దాలలోని సుద్దాల హనుమంతు ఇల్లు. కదిలించే గీతాలు..భావాలు అశోక్‌తేజ రాసిన ‘ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం’ గొప్ప అనుకూల ఆలోచన కలిగించే పాట. ఎందరికో ధ్యేయాన్ని అందించిన పాట. ఆయన స్త్రీకి ఇచ్చిన గౌరవమే పనిపాటలకిచ్చి పాటలు కట్టిండు. పనినొక సంస్కృతి జేసిన ఘనత కష్టజీవిది. ‘టప, టప, టప, టప, టప, టప చెమటబొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే’ అనే పాట పనితో పాటే పుట్టింది. పని–పాటతో జతకట్టింది అనే పాట ఇటీవల అశోక్‌తేజ రాసిన శ్రమకావ్యానికి మూలభూతాలు, టపటపటప, పరికరాలు పుట్టించిన పాటలు ఎందరినోళ్లల్ల పండిన పాటలు. అశోక్‌తేజ ‘శ్రమకావ్యా’న్ని రచించిన తీరు కొత్తది. ఈ కావ్యంలో శ్రమీ, శ్రములు (శ్రమ యొక్క స్త్రీ, పురుష కాల్పనిక పాత్రలు) పాత్రధారులు. ఈ రచనను ‘శ్రమహాకావ్యం’ అని, కవిని ‘శ్రమహాకవి’ అని అన్నారు దీనికి ముందు మాట రాసిన రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి. ఆ ఇంట పాటతోనే పొద్దుపొడుపు పాటతోటి ఉద్యమానికి బాటకట్టిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. పాటంటే ఆయన గుండెలోంచి ఉబికి వచ్చే సెల. తాను పుట్టిన పాలడుగులో హరికథకుడు, ఆధ్యాత్మిక గురువు అంజయ్య శిష్యరికంలో ఆయన కళాకారుడిగా ఎదిగాడు. మంచి గొంతు.. ధ్వన్యనుకరణలో దిట్ట. అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ తను పాడుతుంటే.. విన్నవాళ్లదే భాగ్యం. సొంతగా పాట కట్టేవాడు. నటన, వాద్య, గానాలబ్బిన ఆయన తొలిసారి తన ఊళ్లో కంటబడ్డ వెట్టి పాపయ్య దుఃఖాన్ని మనసు మీదికి తీసుకుని– ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న.. ఎంత చెప్పినా తీరదో కూలన్న..’ అనే పాటకట్టిండు. నైజాం పాలన అంతమైనాక సుద్దాలకు చేరుకున్న హనుమంతు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టాడు. దాంతోపాటే సాంస్కృతిక సేనానిగా కొనసాగాడు. తనతో తన భార్య జానకమ్మ సమవుజ్జీనే. పిల్లలు పిల్లపాటలు. భారతి గొంతెత్తి పాట పాడుతుంటే హనుమంతు భావుకత్వంతో తన్మయుడయ్యే వారు. ఆ నోట జనం పాట.. సుద్దాల అశోక్ తేజ.. హనుమంతు పెద్దకొడుకు. మరో ఇద్దరు కొడుకులు ప్రభాకర్, సుధాకర్. బిడ్డ భారతి. పిల్లలకు ఇంట్లో విన్న పాటలన్నీ కంఠో‘పాట’మే. సుద్దాల హనుమంతు.. ‘పల్లెటూరి పిల్లగాడ..’ పాటతో ప్రసిద్ధుడు. పసులుకాసే పిల్ల గాని ఆర్తిని, బాధను పాటగా కట్టిన వాగ్గేయకారుడాయన. తండ్రికి తగ్గట్టే అశోక్‌తేజ– ‘కన్నతల్లీ మమ్ముల కన్నప్పటి నుంచీ కడుపునిండా తినలేదు మెతుకు.. కింటినిండ కనలేదు కునుకు..’ అంటూ బతుకుపాట కట్టాడు. ఇందులోనే– ‘యజమాని ముప్పయి పసులమందను నేను అజుమాయించకపోతి ఆరేండ్లపోరణ్ణి.. ఒక పెయ్య దప్పించుకుపొయ్యి ఆముదపుచేండ్ల ఆకులు రెండూ మేసి నామొచ్చిపడిపోతే, ఇనుపచువ్వలు కాల్చి నా ఈపూల గుంజీరి’ అనడం ద్వారా తండ్రి పాటకు కొడుకు కొనసాగింపనిపిస్తుంది. ఇది పాట వారసత్వం. అశోక్‌తేజ చదువుల కోసం హైదరాబాద్ చేరి.. అక్కడి జీవితానుభవాలను పాటలుగా కట్టి పాడాడు. ఆయన పాటల్లో ఎన్నదగినది.. ‘రాయి, సలాక, ఇసుక, ఇటుక, తాపీ, తట్ట గోడ మీద గోడ, మేడ మీద మేడ, కట్టిపోరా కూలోడా’. ఈ పాటలో ఇండ్లు కట్టే కూలోల్ల బతుకుబొమ్మను సజీవంగా చిత్రించారు. జనగీతాలు.. తండ్రివేసిన పాటల బాటలో తన పాటల బండిని తోలుకుంటూ వచ్చిండు అశోక్‌తేజ. ఆయన పాటల్లో కవిత్వముంటది. కానీ తన సినీగేయాల్లో కొన్నింటిలోనే కవిత్వముంటుంది. చిత్రమేమిటంటే అశోకన్న తనుగా రాసుకున్న పాటల్లో చాలామట్టుకు సినిమాల్లో వచ్చుడు విశేషం. ‘నీకు మచ్చాలేడా లేసేలువలే లేవులే’’ ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో!. ఇందులో రైతును చందమామతో పోల్చి చెప్పే అలంకారీయత ఉంది. తన పాటల్లో రూపకాలను ఎక్కువగా వాడతారు అశోక్‌తేజ. తను రాసిన పాట ‘అడివమ్మ మాయమ్మ అతిపేదదీరా, ఆ యమ్మకున్నది ఒక్కటే చీరా, ఆ చీర రంగేమొ ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమొ రామసక్కనిదీ ఆకలైతె చెట్టు అమ్మయితది.. ఆయుధాలడిగితే జమ్మిచెట్టయితది..’ అసాధారణ భావాల గీతమిది. ‘ఆమె’కు పాటతో పట్టాభిషేకం.. అశోక్‌తేజ ‘ఆడదాన్నిరో నేను ఆడదాన్నిరో నేను ఈడ ఎవనికి కానిదాన్ని ఏడిదాన్నిరా’ అనే పాట రాసిండు. ఆయన గురించి పాపినేని శివశంకర్ ‘స్త్రీ హృదయమున్న పురుషకవి’ అన్నారు. హనుమంతు కొంతవరకు రాసి వదిలివెళ్లిన వీర తెలంగాణ యక్షగానాన్ని పూరించారు అశోక్‌తేజ. దాని కోసం ఎంతో సాధన చేశారు. ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులిపిల్లాలమై వచ్చితిమి గనరా’, ‘ఇంతీ ఏ యింటిదానివే’ అనే పాటలు ఆ వరుసలోనివే. ‘ఆలి నీకు దండమే. అర్ధాంగి దండమే. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం..’ ఈ పాటలొక్కొక్కటే స్త్రీ హృదయాన్ని గౌరవించే ఆణిముత్యాలైన కవితా గీతాలు. పాటమ్మా.. నీకు వందనాలమ్మా.. ‘నేలమ్మ.. నీకు వేనవేల వందనాలమ్మా’.. ఈ నేలను ఇంత గొప్పపాటగా ఎవరు మలచగలిగారు? భూమిని తల్లిగా భావించి కీర్తించిన కవులెందరున్నా.. ఇట్ల నేలను వర్ణించిన కవి కానరాడు మనకు. ‘సాలేటి వానకే తుళ్లింత ఇంక సాలు, సాలుకు నువ్వు బాలింత.. ఇంత వానకే పులకరించిపోయిన భూమి, విత్తులు చల్లిన సాలు, సాలుకు బా లింత అవుతుంది. నేలమ్మవుతుంది..’ ఇదీ అశోక్ తేజ నేలమ్మను దర్శించిన వెలువరించిన తత్వం. తన ఒంటిమీద బిడ్డల చితులు కాల్చుకున్న తల్లెవరన్న వుంటరా? నేలమ్మను కవి ఊహ చేయడంలో ఒక ప్రత్యేక కవిత్వ శిల్పముంది. -
పాటలతో గిన్నిస్ బుక్కులోకి..
దుబాయ్: అసమాన ప్రతిభకనబరిస్తేనే గిన్నిస్ బుక్‌లో చోటు దక్కుతుంది. అందుకే తన వయసు 12 ఏళ్లే అయినా.. ఏకంగా 85 భాషల్లో పాటలు పాడి, గిన్నిస్బుక్కులో చోటుదక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది సుచేతా సతీష్. దుబాయ్‌లోని ఇండియన్ హైస్కూల్లో ఏడోతరగతి చదువుతున్న భారతీయ బాలిక సుచేత డిసెంబరు 29న ఈ రికార్డుపాట పాడనుంది. ఇప్పటికే ఎనభై భాషలలో పాడడం నేర్చుకుందట. వీటిని నేర్చుకోవడానికి అమెకు ఒక సంవత్సరం పట్టిందట. అయితే డిసెంబరు 29 నాటికి మరో ఐదు భాషల్లో పాడడం నేర్చుకొని, 85 భాషల్లో పాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోనే పుట్టిపెరిగిన సుచేతాకు హిందీ, మళయాలం , తమిళం వచ్చు. అంతేగాక స్కూల్లో జరిగే పోటీల్లో ఇంగ్లిష్‌లో పాటలు పాడేదట. ఈ సందర్భంగా సుచేతా మాట్లాడుతూ... ‘నా మొదటి పాట జపాన్ భాషలోనిది. మా నాన్నగారి స్నేహితురాలు జపాన్‌కు చెందిన డెర్మాటాలజిస్ట్. రోజు నా స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె మా ఇంటికి వచ్చేవారు. అప్పుడు నేను ఆమె దగ్గర జపనీస్ సాంగ్ నేర్చుకున్నాన’ని తెలిపింది. సాధారణంగా తనకు ఒక పాట నేర్చుకోవడానికి రెండు గంటల సమయం పడుతుందని, ఒక వేళ సులభంగా పలకగలిగితే దానిని అర్ధగంటలో నేర్చుకోగలనని చెబుతోంది. ప్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు తనకు బాగా కష్టంగా అనిపించాయని, అయినా ఆ భాషల్లో కూడా పాటలు పాడుతున్నానని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేశిరాజు శ్రీనివాస్ 2008లో 76 భాషలలో పాటలు పాడిన రికార్డుకు ఇప్పటిదాకా గిన్నిస్ బుక్కులో చోటుంది. ఆ రికార్డును చెరిపేసి, తనపేరిట సరికొత్త రికార్డును నెలకొల్పుతానని సుచేత నమ్మకంగా చెబుతోంది. -
ఎస్.జానకి సంచలన నిర్ణయం
మైసూరు: ఎస్.జానకి.. ఈ పేరు వినని భారతీయులు అరుదు. ఆమె పాట అమృత ధార. సుమారు 6 దశాబ్దాలుగా తన సుమధుర స్వరంతో అశేష ప్రజానీకాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ వేలాది సినీ, భక్తి గీతాలు ఆలపించి గానకోకిలగా పేరు గడించిన జానకి సినిమాల్లో గానానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మైసూరులోని మానస గంగోత్రి ఆడిటోరియంలో శనివారం జరిగిన సంగీత విభావరిలో పాల్గొన్న జానకి తన వీడ్కోలు వార్తను ప్రకటించారు. సంగీత విభావరిలో చివరి సారిగా కన్నడ చిత్రాల్లో ఆమె ఆలపించిన తనకిష్ట మైన పాటలు పాడి వీడ్కోలు పలికారు. కార్యక్రమానికి అథితిగా హాజరైన రాజమాత ప్రమోదా దేవి, ఇతర నటీమణులు జానకిని సన్మానించారు. -
జ్యూక్ బాక్స్ 26th August 2017
-
జ్యూక్ బాక్స్ 19th August 2017
-
సదరన్ స్పైస్ 2nd july 2017
-
ఒంటరి పాట
నువ్వు చూసి చాలా కాలమే అయింది నిన్ను వినక ఎన్నో రోజులైంది ఔనూ... నీకు తెలియదు కదా! లేత మామిండ్లకు వయసు మీరిందని యజమాని తోటను కొట్టించాడు మాఘమాస జాతర మరలిపోయింది తోట అంచు నది తరలిపోయింది చేపలూ పక్షులూ చెల్లాచెదురైనవి ప్రవాహానికి వంగిన గరికపోచ లేచి నిలబడిందన్న వార్త వాస్తవమే కానీ పచ్చదనాన్ని కోల్పోయిందన్నది పుకారు కాదు ఠి మద్దికుంట లక్ష్మణ్ 9441677373 -
ఇళయరాజాతో భేదాభిప్రాయాలు లేవు
చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే. అయితే ఎస్పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు. అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు. అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. -
జ్యూక్ బాక్స్
-
నేను పుట్టాను... లోకం పాడింది!
నేను పుట్టాను ఒక జననం! టాటా వీడుకోలు ఒక మరణం! జననానికీ మరణానికీ మధ్యలో... నా హృదయంలో నిదురించే చెలీ ఒక ప్రేమ నిలువవే వాలు కనుల దాన ఒక టీజింగ్ జగమే మాయ బతుకే మాయ ఒక వైరాగ్యం నిదురపోరా తమ్ముడా ఒక వేదసారం నేనొక పూల మొక్క కడ నిల్చి ఒక విలాపం. ఘంటసాల గాత్రం జీవన సూత్రం. మానవ జన్మకు దివ్యగానామృతం. ఆ స్వర వేంకటేశ్వరునికిది.. ‘సాక్షి’ పట్టిన పాటల పల్లకీ! ఘంటసాల ఇప్పటివరకూ పాడిన పాటల్లో అందుబాటులో ఉన్నవి మూడు వేల పాటలు. అందుకని ఆయన పాడిన పాటల సంఖ్య అదే అని కొందరి వాదన. ‘కాదు... ఆయన పదివేల పాటల వరకూ పాడార’ని మరికొందరి వాదన. ఆయన ఎన్ని పాటలు పాడారు? అనే పరిశోధన ఇప్పటికీ జరుగుతోంది. ఘంటసాల పాడిన పాటల్లో ‘ఇవి పాపులర్’ అని కొన్నింటినే చెప్పడం... సముద్రంలో చెమ్చా పట్టుకుని నీటిని తోడే ప్రయత్నం లాంటిదే! ఎన్నని చెప్పగలం! అందుకే అందరికీ తెలిసిన ఆయన పాపులర్ సాంగ్స్‌లో మచ్చుకు ఒక 22 పాటల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే, ఆయన పుట్టింది 1922లో కదా! రాజా, మ్యూజికాలజిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా... భగవద్గీత... ఓ రికార్డు! వేదవ్యాసుడు రాసిన ‘మహాభారతం’లో కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ బోధించిన ‘భగవద్గీత’ భక్తులకూ, వేదాంతులకూ పరమ పవిత్రమైనది. జీవన వేదాంతమంతా చెప్పే ఆ మహత్తర గీతా శ్లోకాలనూ, వాటి భావాన్నీ తెలుగు నాట వాడవాడలా పాపులర్ చేసింది ఘంటసాలే అంటే అతిశయోక్తి కాదేమో! ఆయన కన్నా ముందు గాయనీమణులు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ లాంటి కొందరు భగవద్గీత పాడినా, అవి ఏవీ అంతగా పాపులర్ కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది ప్రయత్నించినా తెలుగునాట వేరే దేనికీ ఆ స్థాయి ప్రాచుర్యం రాలేదు. హెచ్.ఎం.వి. వారి గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా ఘంటసాల చేసిన ఈ మహోపకారం ఇవాళ్టికీ ఒక రికార్డే! 1. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది.. (ప్రేమనగర్) ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది...’ ఈ పాట నేటికీ వినపడుతుంటుంది. ‘ప్రేమ్‌నగర్’లోని ఈ పాట అప్పట్లో యమ పాపులర్. నిజానికి ఇది తాగుడు సందర్భంలో వచ్చే పాట. కానీ, ఆ సందర్భంతో సంబంధం లేకుండా ఈ పాట ఎవర్గ్రీన్ అయింది. ఈ పాటను యానిమేషన్ల కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా వాడుతున్నారు. అక్కినేని నటించిన ఆఖరి చిత్రం ‘మనం’లో అక్కినేని కుటుంబమంతా కనిపించే సందర్భంలో ఈ పాటలో కొంత రీ-మిక్స్ చేసి వాడారు. 2. ఎంత ఘాటు ప్రేమయో... (పాతాళ భైరవి) గాయకుడు బడే గులామ్ అలీఖాన్‌ను మద్రాసు తీసుకొ చ్చి, పాడించడానికి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రయత్నించినప్పుడు అప్పట్లో చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఆయన కచ్చేరీని మద్రాసులో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఘంటసాల తన ఇంట్లోనే బడే గులామ్ అలీఖాన్కీ, ఆయన వాద్య బృందానికీ రెండు రోజుల పాటు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ వీళ్లందరికీ స్వయంగా చపాతీలు తయారు చేసేవారు. ఘంటసాల ఉదయం రికార్డింగ్ స్టూడియోకు వెళ్ళి, సాయంత్రం రాగానే బడే గులామ్ అలీఖాన్ బృందంతో రాగ సాధన చేసేవారు. హిందుస్తానీ రాగాలను ఆకళింపు చేసుకున్నారు . ఆ ప్రభావంతోనే ‘ఎంత ఘాటు ప్రేమయో...’ పాటను రాగేశ్రీ రాగాన్ని ఉపయోగించి స్వరపరిచారని అప్పట్లో కొందరు అనేవారు. ఘంటసాల స్వరపరచి, పాడిన ప్రేమగీతాల్లో ఇది ఎవర్ గ్రీన్. 3. నా హృదయంలో నిదురించే చెలి... (ఆరాధన) ప్రేమ పాటల్లో మరో చెప్పుకోదగ్గ పాట ‘నా హృదయంలో నిదురించే చెలి’. అక్కినేని నాగేశ్వరరావు అభినయించిన ప్రేమ పాటల్లో ఆయన సతీమణి అన్నపూర్ణకు బాగా నచ్చిన పాట ఇది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆవిడ స్వయంగా చెప్పారు. 4. అత్త లేని కోడలుత్తమురాలు... (మన దేశం) అప్పటి నుంచి ఇప్పటి దాకా శాశ్వతంగా ఉన్న పాటల్లో ఘంటసాల పాడిన ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒకటి. విశేషం ఏమిటంటే... సినిమా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన ఈ పాట ‘ప్రైవేట్ సాంగ్’గా కూడా శ్రోతల మనసు దోచుకుంది. చివరికి ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒక నానుడి అయింది. 5. నిలువవే వాలుకనుల దానా... (ఇల్లరికం) ఏ పాట అయినా ఘంటసాల నోట ప్రాణం పోసుకోవాల్సిందే. హీరోయిన్లను హీరో ఆటపట్టించే టీజింగ్ సాంగ్ ‘నిలువవే వాలు కనుల దాన..’ అలాంటిదే. ‘ఇల్లరికం’లోని ఈ పాటలో నటించడానికి అక్కినేని ఇష్టపడలేదు. అదే మాట చిత్రదర్శకుడు తాతినేని ప్రకాశరావుతో అన్నారు. కానీ, దర్శక-నిర్మాతలను కాదనలేక నటించారు. చేసిన తర్వాత కూడా ఆయనకు మనసొప్పలేదు. ‘ఈ పాటకు ఎంత ఖర్చయితే అంత ఇస్తా... సినిమాలో నుంచి తీసేయండి’ అని విన్నవించుకున్నారు. అప్పటికే సినిమా చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఉంచేశారు. మామూలుగా ఏయన్నార్ నటించిన ప్రతి సినిమా ఆయన భార్య అన్నపూర్ణ చూస్తారు. ఈ సినిమాను మూడు, నాలుగుసార్లు చూడటంతో ఆయన కారణం అడిగితే.. ‘ఈ పాట చాలా నచ్చింది.. అందుకే’ అన్నారట. 6. సుందరి నీ వంటి... (మాయాబజార్) సినీ చరిత్రలో ‘మాయాబజార్’ది ఓ ప్రత్యేకమై పేజీ. ఆ చిత్రానికి ఘంటసాల ఓ స్వరకర్తగా వ్యవహరించారు. ఇందులో ‘సుందరి నీ వంటి దివ్యస్వరూపము..’ పాట గురించి తెలియనవాళ్లు ఉండరు. ముందుగా ఈ పాటను గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు - సావిత్రి పాడగా రికార్డ్ చేయాలనుకున్నారు. ఇద్దరూ రిహార్సల్ కూడా చేశారు. ఈ పాటకు ఘంటసాల స్వరకర్త. చివరి నిమిషంలో దర్శక-నిర్మాతలు కేవీ రెడ్డి, బి. నాగిరెడ్డి ఈ పాటను ఘంటసాల పాడితే బాగుంటుందనుకున్నారు. అప్పటివరకూ హాస్యరస గీతాలంటే పిఠాపురం నాగేశ్వరరావు - మాధవపెద్ది సత్యమే. అలాంటిది ఘంటసాలతో ఈ పాట పాడించడం ఓ ప్రయోగం. ఈ పాటను ఘంటసాల ఎంత అద్భుతంగా పాడారంటే.. హాస్యరస గీతాలకు తనదైన ముద్ర సంపాదించుకున్నారు. 7. పడవా వచ్చిందే పిల్లా... (సిపాయి చిన్నయ్య) పాట సాహిత్యం ఘంటసాల పట్టించుకునేవారు. ‘సిపాయి చిన్నయ్య’కి స్వరకర్త ఎమ్మెస్ విశ్వనాథన్.అందులో ‘పడవా వచ్చిందే పిల్లా’ పాటను రికార్డ్ చేస్తామనగా ముందు రోజు ఘంటసాలతో రిహార్సల్ చేయించారాయన. విశ్వనాథన్ పాన్ నములుతూ పదాలు పలికారు. దాంతో ‘పడవా’ బదులు ‘భడవా’ అని ఘంటసాలకు వినిపించింది. అది ఇబ్బంది అనిపించింది. ఇంటికెళ్లగానే భార్యతో ‘ఆత్రేయ ఇలా రాయడం బాధగా ఉంది’ అని వాపోయారట. అప్పుడామె ‘విశ్వనాథన్ పాన్ నములుతారుగా. స్క్రిప్ట్ తెప్పించుకు చూడండి’ అన్నారు. స్క్రిప్ట్‌లో ‘పడవ’ అని చూసి, ఘంటసాల ఊపిరి పీల్చుకున్నారు. 8. ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మీ... (దసరా బుల్లోడు) ‘దసరా బుల్లోడు’లోని ‘అరెరెరెరె... ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ...’ మంచి మాస్ సాంగ్. ఈ పాటలో ఉన్న ‘అరెరెరెరె...’ అనే అక్షరాలు ఇన్స్ట్రుమెంట్ మీద వాయించడం కష్టం. అది ఘంటసాల అద్భుతంగా పలికించబట్టి మరింత పాపులర్ అయింది. ఈ పాటకు ఘంటసాల వాయిస్, ఏయన్నార్ స్టెప్స్ జనాలను ఆకట్టుకున్నాయి. ఇదే పాటను ‘నేనున్నాను’లో నాగార్జున రీ-మిక్స్ చేసి వాడారు. అక్కడ తండ్రి నర్తిస్తే, ఇక్కడ తనయుడు అంతే జోష్‌గా నర్తించారు. 9. జోరుగా హుషారుగా షికారు పోదమా... (భార్యాభర్తలు) ఘంటసాల పాడిన సరదా పాటల్లో ‘భార్యాభర్తలు’లోని ‘జోరుగా హుషారుగా షికారు పోదమా..’ ఒకటి. నాటి తరంలోనే కాదు.. నేటి తరంలో కారులో వెళ్లేటప్పుడు సరదాగా ఈ పాట వినేవాళ్లు... పాడేవాళ్లు ఉన్నారు. ఈ పాట టైటిల్‌తో ‘జోరుగా హుషారుగా’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఈ పాటను మోడ్రన్ ఆర్కెస్ట్రాతో రీ-మిక్స్ చేసి, ఉపయోగించారు. 10.కోలొ కోలోయన్న కోలో నాసామి (గుండమ్మ కథ) ఎన్టీఆర్, ఏయన్నార్.. వీరిద్దరిలో ఎవరికి పాడితే వారి గొంతులానే అనిపించడం ఘంటసాల వాయిస్ ప్రత్యేకత. ‘గుండమ్మ కథ’లో ‘కోలో కోలోయన్న కోలో నా సామి’ పాటలో ఇద్దరూ పాడుతున్నట్లు అనిపించి నా ఏ హీరోకు తగ్గట్లుగా ఆ హీరోకు ఘంటసాల గాత్రంలో వ్యత్యాసం స్పష్టంగా వినిపించింది. అలాగే ‘భూకైలాస్’లో ‘దేవ దేవ ధవళాచల మందిర...’ పాటను అటు ఎన్టీఆర్‌కీ, ఇటు ఏయన్నార్కీ తగ్గట్టుగా పాడారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’లో ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య వాద-సంవాద పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ఘంటసాల అద్భుతంగా పాడారు. అలా ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి సంవాద పద్యాలు పాడడం చక్కటి ‘ఓకల్ ఫీట్’ అని చెప్పాలి. 11.పెను చీకటాయె లోకం... (మాంగల్యబలం) ఘంటసాల పాడిన పాటల్లో ‘మాంగల్య బలం’లోని ‘పెను చీకటాయె లోకం..’ ఆయన తనయుడు ఘంటసాల రత్నకుమార్‌కు ఓ మంచి అనుభూతి. అఫ్కోర్స్ తండ్రి పాడిన పాటలన్నీ కుమారుడికి అలాంటివే అనుకోండి. అయితే ‘పెను చీకటాయె..’ స్పెషల్. ఒకసారి ఘంటసాల రత్నకుమార్ పెట్రోల్ పోయించుకోవడానికి బంక్‌కి వెళ్లారు. ఎంతసేపటికీ అక్కడి కుర్రాడు పెట్రోల్ కొట్టకపోవడంతో విషయమడిగారు. ‘ఒక్క నిమిషం సార్! ఘంటసాలగారి పాట వస్తోంది. అది అయిపోయాక కొడతా’ అన్నాడట. అప్పుడు రత్నకుమార్ ‘నేను ఘంటసాలగారి అబ్బాయిని’ అంటే ఆ కుర్రాడు ఆశ్చర్యానందాలతో చూశాడట. ఈ విషయాన్ని స్వయంగా రత్నకుమార్ పంచుకున్నారు. 12. జగమే మాయ బ్రతుకే మాయ... (దేవదాసు) మద్యం మత్తులో హీరో పాడే పాటలకు ప్రాణం పోయడం అంటే ఘంటసాల గాత్రానికే చెల్లుబాటైంది. ‘దేవదాసు’లో ‘జగమే మాయ బ్రతుకే మాయ...’ పాట అందుకో ఉదాహరణ.. ‘దేవదాసు’ కథను శరత్చంద్ర రాయక ముందు తాగుబోతులకు ప్రత్యేకంగా పేరూ గట్రా లేవు. ఆ సినిమా తర్వాత తాగుబోతులను ‘దేవదాసు’ అనడం మొదలైంది. ‘జగమే మాయ’ పాట మందు బాబులకే కాదు.. పాడుకునేవాళ్లందరికీ ఒక మైకం. వేదాంత పరంగా కూడా ఈ పాట ఓ మైకమే. 13. మనసు గతి ఇంతే... (ప్రేమనగర్) ‘ప్రేమనగర్’ సినిమాలో తాగుడు మానేసిన తర్వాత పాడే ‘మనసు గతి ఇంతే..’ అద్భుతంగా ఉంటుంది. మనసు పడే మథనానికి అద్భుత ఆవిష్కరణ ఈ పాట. 14.నిదురపోరా తమ్ముడా... (సంతానం) ‘సంతానం’ సినిమాలో అనిసెట్టి సుబ్బారావు రాసిన ‘నిదుర పోరా తమ్ముడా...’ అనే పాట ఉంది. ఈ పాటను ఘంటసాల - లతా మంగేష్కర్ పాడారు. ముందు లత పాడారు. ఆ తర్వాత ఘంటసాల వాయిస్‌ని రికార్డ్ చేశారు. లత కన్నా ఘంటసాల హై పిచ్‌లో పాడారు. ఆ తర్వాత ఆయన భార్య ‘పాట ఎలా వచ్చింది?’ అని అడిగితే.. ‘‘ఆ సంగతలా ఉంచితే.. ఈ పాట కోసం సుసర్ల దక్షిణామూర్తి (సంగీత దర్శకుడు) సూట్ కుట్టించుకున్నారు. బొంబాయి నుంచి లతాగారు వస్తున్నారు కదా... అందుకే సూట్ తొడుక్కున్నారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే ఆయనను మొదటిసారి సూట్లో చూశా’’ అని చమత్కరించారు. 15. శేషశైలవాస... శ్రీవేంకటేశా... (శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం) ఘంటసాల గాత్రం కొన్ని పాటలకు శాశ్వతత్వాన్ని ఇచ్చింది. ఆయన పాడిన భక్తి పాటలు శ్రోతల్లో భక్తి పారవశ్యాన్ని నింపుతాయి. అణువణువునా భక్తి తత్వాన్ని నింపుకొని ఆయన పాడిన పాటల్లో ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ చిత్రంలోని ‘శేష శైలవాస... శ్రీవేంకటేశా...’ ఒకటి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడి దేవస్థానంలో ఈ పాట మోగుతూనే ఉంటుంది. కలియుగం ఉన్నంతవరకూ ఈ పాట ఉండి తీరుతుందంటే అతిశయోక్తి కాదేమో! 16. చల్లనివెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) ‘సంతానం’ సినిమాలోని ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో..’ మంచి రొమాంటిక్ సాంగ్. ‘ప్రేమికుడు’లో ఎస్పీ బాలు-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చే సీన్లో ఎస్పీబీ ఈ పాటను ఆలపిస్తారు. అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన బాలు ఘంటసాలను గుర్తు చేసుకుని ఈ పాటను ఆ సినిమాలో ఆలపించడం చెప్పుకోదగ్గ విషయం. 17. మాణిక్యవీణామ్... (శ్యామలా దండకం) (మహాకవి కాళిదాసు) ‘మహాకవి కాళిదాసు’ చిత్రంలోని ‘మాణిక్యవీణామ్’ అని మొదలై, ‘చతుర్భుజే.. చంద్రకళా వతంసే...’ అని వచ్చే శ్యామలా దండకాన్ని ఘంటసాల పాడుతున్నప్పుడు స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావుకి విచిత్ర అనుభూతి కలిగింది. పాడుతున్నప్పుడు ఘంటసాల చుట్టూ ఓ కాంతి పుంజం ఉన్న భావన తనకు కలిగిందని పెండ్యాల స్వయంగా పేర్కొన్నారు. దండకం పూర్తయ్యాక ఘంటసాల దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయానని ఆయన అనడం విశేషం. ఆ దండకంలో ఘంటసాల గాత్రంలో దైవత్వం ఉట్టిపడిందనడానికి ఇదొక నిదర్శనం. 18. ధారుణి రాజ్యసంపద మదంబున... (పాండవ వనవాసం) ఘంటసాల పాడిన పద్యాలు.. స్తోత్రాలు ఎవర్గ్రీన్ అనాలి. ఘంటసాలకు ముందు ‘ఈలపాట’ రఘురామయ్య, సూరిబాబు.... వీళ్లందరూ పద్యాలు పాడిన పద్ధతి ఒక ఎత్తు. ఘంటసాలది మరో ఎత్తు. ‘మహాభారతం’లోని పద్యాల్లో ఘంటసాల ద్వారా పాపులర్ అయిన పద్యాల్లో ‘పాండవ వనవాసం’లోని ‘ధారుణి రాజ్యసంపద మదంబున..’, ‘కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్...’ లాంటివి చాలా ఉన్నాయి. ‘నర్తనశాల’లో తిక్కన పద్యాలు, ‘కాళహస్తీ మాహాత్మ్యం’లో ధూర్జటి మహాకవిపద్యాలు ఘంటసాల గాత్రం ద్వారా సామాన్య జనాల్లో కూడా ప్రసిద్ధి పొందాయి. స్తోత్రాల్లో ‘సీతారామ కల్యాణం’లో వాడిన ‘రావణ భుజంగ...’ స్తోత్రం ఒకటి. ఇది రావణకృతం. ఆ విషయం చాలామందికి తెలియదు. ఘంటసాల ఆలపించడంతో ఆ స్తోత్రం పాపులర్ అయింది. 19.రసికరాజ తగువారము కామా... (జయభేరి) స్వరసహితంగా ఘంటసాలగారు పాడటం మొదలుపెట్టాక ఔత్సాహిక గాయకులు కూడా ఆ ప్రయత్నం చేసేవారు. ‘జయభేరి’ చిత్రంలోని ‘రసిక రాజ తగువారము కామా...’ పాట వారికి లిట్మస్ టెస్ట్ లాంటిది. 20. శివశంకరీ... శివానందలహరి శివశంకరీ... (జగదేకవీరుని కథ) ‘జగదేకవీరుని కథ’లోని ‘శివశంకరి...’ పాట కూడా అంతే. ఔత్సాహిక గాయనీ గాయకులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి ‘రసిక రాజ తగువారము కామా...’, ‘శివశంకరి...’ - ఈ రెండు పాటలూ పాడాల్సిందే. ఈ పాటల్ని అద్భుతంగా పాడినవాళ్లు ఏ పాటనైనా పాడగలుగుతారు. వర్ధమాన గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హేమచంద్ర ఈ రెండు పాటల ద్వారానే బాగా పాపులర్ అయ్యాడు. గాయని కల్పన కూడా ఈ పాట ద్వారా చాలా పేరు తెచ్చుకున్నారు. చెన్నైకి చెందిన చిన్నారి స్ఫూర్తి ఈ పాట పాడి, ప్రశంసలు పొందింది. అంటే... వయసు తారతమ్యం లేకుండా అన్ని వయసులవారికీ ఘంటసాల పాటలు ఓ స్ఫూర్తి. 21. నేనొక పూల మొక్క కడ నిల్చి... (పుష్పవిలాపం కావ్యం) కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ‘కుంతీ కుమారి’, ‘పుష్ప విలాపం’... - ఈ రెండు ప్రైవేట్ సాంగ్స్ ఘంటసాల గాత్రంతో సామాన్య జనంలోకి ఎంతగానో చొచ్చుకుపోయాయి. ఈ రెండూ హృదయానికి హత్తుకునేవే. ముఖ్యంగా ‘పుష్ప విలాపం’లో ‘ఎంత దయలేనివారు మీ ఆడువారు..’ అంటూ ఘంటసాల పాడిన పద్ధతి ఆ తర్వాతి తరం కుర్రకారు ఆడవారిని ఆటపట్టించడానికి ఉపయోగించడం మొదలైంది. ఇక, ‘కుంతీ కుమారి’లోని ‘అది రమణీయ పుష్ప వనము’ అని రచయిత కరుణశ్రీ రాస్తే, పాడే సౌకర్యం కోసం ‘అది ఒక రమణీయ పుష్ప వనము’ అని ఘంటసాల మార్చారు. దానివల్ల ఛందస్సు దెబ్బతిన్నదనే విషయాన్ని కూడా ఎవరూ గ్రహించలేదు. ఘంటసాల పాట పాడే పద్ధతికి ఉన్న ప్రత్యేకత అది అని ఓ సందర్భంలో గాయకుడు పీబీ శ్రీనివాస్ అన్నారు. 22. టాటా వీడుకోలు... గుడ్‌బై ఇంక సెలవు... (బుద్ధిమంతుడు) ‘టాటా వీడుకోలు..’ తాగుబోతు పాట అని ‘బుద్ధిమంతుడు’ సినిమా చూసినవాళ్లకు తెలుస్తుంది. చూడనివాళ్లు ఇదేదో సరదా పాట అనుకుంటారు. ‘వీడుకోలూ...’ అంటూ ఘంటసాల ఒక రకమైన మత్తుతో పాడతారు. మత్తు పాటలకు ఘంటసాల ఇచ్చినంత పాపులారిటీ ఏ గాయకుడూ ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... దేశంలో ఏ గాయకుడికీ దక్కనంత గౌరవం ఘంటసాలకు దక్కింది. ఏ గాయకుడికీ లేనన్ని శిలా విగ్రహాలు ఆయనకే ఉన్నాయి. ఘంటసాల అకాడమీ ఉంది. ఆయన పాటలు సేకరించే వాళ్ల సంఖ్య బోలెడు. ఘంటసాల మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అలా ఆయన, ఆయన పాటలు ఎప్పటికీ చిరంజీవులే. తెలుగు సినిమాలో మరాఠీ గీతం! ‘పాండురంగ మాహాత్మ్యం’ సినిమాలో ఘంటసాల మరాఠీ గీతం పాడారు. ‘హే కృష్ణా ముకుందా మురారి..’ పాట తర్వాత కృష్ణుడి భక్తులందరూ కృష్ణుడిలో కలిసిపోతారు. అప్పుడు తుకారామ్ కూడా కృష్ణుడిలో కలసిపోతాడు. ‘తూ హీ.. బీజాజీ ఛలే..’ అనే మరాఠీ గీతాన్ని ఘంటసాల పాడారు. ఇలా ఒక తెలుగు సినిమాలో మరాఠీ గీతాన్ని ఘంటసాల పాడిన విషయం చాలామంది తెలియకపోవచ్చు. ఘంటసాల స్పెషల్ ‘స్టార్ స్టార్ సూపర్ స్టార్’ ఈరోజు రాత్రి 7.30 గం.లకు సాక్షి టీవీలో -
పాటలతో దీపాలు
-
విజయనగరం ఉత్సవాల్లో సందడి
-
అలరించిన సంగీత విభావరి
పాత గుంటూరు: బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించడంతో భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు గార్డెన్స్ శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి సినీసంగీత విభావరిలో గాయకులు అమ్మవారి భక్తిగీతాలను ఆలపించారు. ఆలయకమిటీ అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య బ్యాంకు డి.జి.యం చదలవాడ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
పాటల ‘సెమట సుక్క’కు కన్నీటి వీడ్కోలు
– ప్రజా కవి వాసు అంతిమయాత్రకు తరలివచ్చిన కళాకారులు – గఫూర్, గేయానంద్ తదితరులు నివాళులు కర్నూలు(కల్చరల్): పాటవై మళ్లీ వస్తావా..! మా వాసన్న..!.. పోరు బాటకు తోడై ఉంటావా.. మా వాసన్న..! సెమట సుక్కవై నింగికెగిసావా.. మా వాసన్న..! అంటూ ప్రజా కవి ఆర్ఏ వాసుకు ప్రజానాట్య మండలి కళాకారులు నివాళులు అర్పిస్తూ పాడిన గీతం అందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణలో వాసు భౌతిక కాయాన్ని ఉంచి సీపీఎం నాయకులు, ప్రజా కళాకారులు, కవులు, గాయకులు నివాళులు అర్పించారు. అంతకుముందు స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇందిరాగాంధీ నగర్లో వాసు స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, ఎమ్మెల్సీ గేయానంద్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, ప్రజావైద్యశాల డైరెక్టర్ డా.బ్రహ్మారెడ్డి, డా.వీవీ లక్ష్మీనారాయణ, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి, గాయకుడు మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి, రచయిత ఇనాయతుల్లా, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, విశ్వకళాసమితి అధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు చంద్రన్న, ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య, రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య, తదితరులు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో పేదల గాయకుడు వాసు అమర్ రహే, జోహార్.. జోహార్.. వాసు ఆశయాలు కొనసాగిస్తాం.. అనే నినాదాలు మార్మోగాయి. వాసు సతీమణి సుజాత, కుమార్తెలు లహరి, వెన్నెలను పలువురు పరామర్శించారు. స్థానిక సుంకేసుల రోడ్డులోని క్రై స్తవ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పాటల కెరటం వాసు: పేద ప్రజల కష్టాలను ప్రజా కవి వాసు సమీపం నుంచి పరిశీలిస్తూ దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్న శ్రమజీవులు, హమాలీలు, కూలీల జీవితాలను వాసు అక్షరీకరించి పాటల కెరటమై నిలిచారని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణంలో వాసు భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఆయన సంతాప సందేశాన్ని అందించారు. వాసు ఆశయాలను కళాకారులు, కార్యకర్తలు కొనసాగించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ మాట్లాడుతూ వాసు తన జీవితాన్ని పాటలకే అంకితం చేసి ప్రజల్ని చైతన్యపరిచారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ పేదరికంపై, అణచివేతపై వాసు రాజీలేని పోరాటం చేశారన్నారు. తన పదునైన పాటలతో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టారన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు విజయకుమార్, క్రాంతి, తెలంగాణా ప్రజానాట్య మండలి నాయకులు జగ్గరాజు, నరసింహా, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయూ నాయకులు పుల్లారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మద్దయ్య, కర్నూలు ప్రజానాట్య మండలి కార్యదర్శి బసవరాజు, గాయకులు ఆశన్న, కళాకారులు లోకేష్, కరుణాకర్, సీపీఎం కార్యకర్తలు, డప్పు కళాకారులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. పాల్గొన్నారు. -
జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు
నరసరావుపేట ఈస్ట్ : మహాత్మా గాంధీ–పొట్టి శ్రీరాములు కళాసమితి, సేవా సింధూ సంస్థల ఆధ్వర్యంలో వేగాస్ ఫౌండేషన్ సౌజన్యంతో జాతీయస్థాయి తెలుగు పాటల పోటీలు ఆదివారం రాత్రి భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించారు. ఈ పోటీలలో సీహెచ్ స్టాలిన్ (బాపట్ల), జి.హిమబిందు (అద్దంకి), రమణపాత్రో (పార్వతీపురం) బహుమతులు సాధించారు. అలాగే ప్రోత్సాహక బహుమతులను సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎ.శ్రుతి, ఎం.మల్లిఖార్జునరావులకు అందించారు. ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎన్ఇసి విద్యా సంస్థల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, రాష్ట్ర బులియన్ మర్చంట్ అధ్యక్షులు కపిలవాయి విజయకుమార్, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అ««దl్యక్షులు ఊరా భాస్కరరావు తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. వాగిచర్ల వెంకటేశ్వరరావు, వై.త్యాగరాజు, షేక్ సలాం తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము అయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. పెత్రామాసను పురస్కరించుకుని జిల్లాలో శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువతులు, మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సాయంత్రం ఆలయాల వద్దకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడి సంబురాలు జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో తొమ్మిది రోజుల ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. -
మనసైన పాట