మహేశ్‌వారి పాటలు! | Mahesh babu finalized to sarkari vari pata | Sakshi
Sakshi News home page

మహేశ్‌వారి పాటలు!

Published Sat, Jun 6 2020 5:21 AM | Last Updated on Sat, Jun 6 2020 5:25 AM

Mahesh babu finalized to sarkari vari pata - Sakshi

మహేశ్‌వారి పాటల సందడి మొదలైనట్లుంది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్‌ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించన వెంటనే చిత్రీకరణ స్టార్ట్‌ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్‌. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement