
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తీరిది
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకిచి్చన హామీల అమలు కోసం జీవోలు జారీ చేయని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. వైఎస్ జగన్ సర్కారు అమలు చేసిన పథకాల పేర్లు మారుస్తూ చకచకా వరుస జీవోలు ఇస్తోంది. రైతులకు ఇచి్చన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాల పేర్లను మారుస్తూ వ్యవసాయ శాఖ సోమవారం జీవో జారీ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం పేరును అన్నదాత సుఖీభవగా పేరు మారుస్తూ జీవో వెలువడింది. కానీ.. రైతులకు పెట్టుబడి సాయం అమలుకు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయలేదు.
గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పేరును వడ్డీలేని రుణాలు మార్చింది తప్ప.. పథకం అమలుకు జీవో జారీ చేయలేదు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం పేరును ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చింది. వైఎస్సార్ యంత్ర సేవా పథకం పేరును వ్యవసాయ యాంత్రీకరణ పథకంగా మార్చింది. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ లేబొరేటరీస్ పేరును ఇంటిగ్రేడెట్ ల్యాబ్‌గా, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల పేరును విలేజ్ క్లస్టర్‌గా, రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా, ఆర్‌బీకే చానల్ పేరును పాడి పంటలు చానల్‌గా, ఈ–క్రాప్ యాప్ పేరును ఈ–పంటగా, వైఎస్సార్ రైతు భరోసా నెలవారీ మేగజైన్ పేరును పాడి పంటలుగా పేర్లు మార్చింది.