
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సాయం కోసం వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేనున్నాంటూ భరోసా ఇస్తున్నారు. బీసీ సభను ముగించుకుని వెళ్తున్న సమయంలో తమ బిడ్డ చికిత్సకు సాయం కోసం రోడ్డుపై నిల్చున్న వారిని చూసిన సీఎం జగన్.. వెంటనే వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
తమ బిడ్డకు మెదడులో నరం దెబ్బ తినడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారని తల్లిదండ్రులు వివరించారు. తక్షణమే తమ బిడ్డకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా సీఎంకి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్