
పలుచోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు
పోలీసు ఉన్నతాధికారులకు ఫుటేజ్
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan) నివాసం వద్ద కూటమి నేతలు తరచూ గొడవలు చేయడం, ఇటీవల ఆయన ఇంటిముందు పార్కుకు నిప్పుపెట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత(Police security) చర్యలు చేపట్టారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం(YSRCP central office) పరిసరాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ఉండే రోడ్డులో ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. రాకపోకలను పరిశీలించే విధంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రధాన గేటు వద్ద రెండు సీసీ కెమెరాలు, భరతమాత సెంటర్‌లో నాలుగు సీసీ కెమెరాలు, కుంచనపల్లి–ప్రాతూరు అండర్ పాస్ నుంచి బకింగ్‌హామ్ కెనాల్ మీదుగా వడ్డేశ్వరం వెళ్లే మార్గాల్లో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి నిత్యం తాడేపల్లి సీఐతోపాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.