ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ | Posani Krishna Murali CID Custody Ends | Sakshi
Sakshi News home page

Posani Krishna Murali : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

Published Tue, Mar 18 2025 3:35 PM | Last Updated on Tue, Mar 18 2025 4:10 PM

Posani Krishna Murali CID Custody Ends

సాక్షి,గుంటూరు: సీఐడీ కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.  

పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 
 
బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
మరోవైపు, తనపై నమోదైన కేసులో బెయిల్‌ కోసం పోసాని కృష్ణమురళి గుంటూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా విచారణ నిమిత్తం మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement