తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్‌, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన | YSRCP Bumana Karunakara Reddy And Other Leaders House Arrest In Tirupati, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతిలో గోవులన్నీ రిలయన్స్‌, జీ స్క్వేర్ నుంచి వచ్చాయి: భూమన

Published Thu, Apr 17 2025 6:56 AM | Last Updated on Thu, Apr 17 2025 2:03 PM

YSRCP Bumana Karunakara Reddy Other Leaders House Arrest In Tirupati

గోశాలకు భూమన అప్‌డేట్స్‌.. 

భూమన కామెంట్స్‌..

  • మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధించి కూటమి నేతలను అనుమతించారు.
  • గోశాల సందర్శనకు రావాలని టీడీపీ నేతలే ఛాలెంజ్‌ విసిరారు.
  • ఛాలెంజ్‌ విసిరిన వారే నన్ను గోశాలకు రాకుండా అడ్డుకున్నారు.
  • నన్ను ఉదయం నుంచి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
  • మా పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
  • ఉదయం నుంచి నేను కూడా వెయిట్‌ చేస్తున్నా అని వారికి చెప్పాను.
  • నాకు సవాల్‌ విసిరిన పల్లా శ్రీనివాస్‌ తోకముడిచి గోశాల రాలేదు.
  • ఛాలెంజ్‌ స్వీకరించి భయపడిపోయామని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
  • టీడీపీ ఎమ్మెల్యేలు నాకు ఫోన్‌ చేసి గోశాలకు రమ్మన్నారు.
  • నేను మరోసారి గోశాలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.
  • మమ్మల్ని బయటకు రానివ్వకపోగా తోసేశారు.
  • కూటమి నేతల కుట్ర మీడియా సాక్షిగా బట్టబయలైంది.
  • టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న కూటమి సర్కార్‌ హామీ ఏమైంది?.
  • 170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి.
  • 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు.
  • గోవుల మృతిపై ఈవో, చైర్మన్‌, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతన లేదు.
  • గోశాలకు వెళ్ళేందుకు అనుమతి నిరాకరించారు
  • గోశాలకు వెళ్ళకుండా అడ్డగించారు
  • జిల్లా ఎస్పీ  అధికారితో కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారు
  • గోశాలకు ఐదు మందిని అనుమతిస్తే ఎప్పుడూ అయినా మేము వెళ్లేందుకు సిద్ధం,
  • గోశాలకు రేపు అయిన, ఎల్లుండి అయినా వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం
  • గత ఏప్రిల్ నెల నుంచి ఏడాది మార్చి వరకూ 191 ఆవులు చనిపోయాయి అని గోశాల మేనేజర్ అధికారికంగా ఇచ్చారు
  • ప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు ఈ పది నెలలు చేసిన ప్రక్షాళన ఇదేనా
  • మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నెల నుంచి  మార్చి నెలవరకు 170 ఆవులు చనిపోయాయి అని అధికారికంగా ప్రకటించారు
  • 550 గోవులను రాజస్థాన్, పంజాబ్ నుంచి కొనుగోలు చేశారు
  • టీవీ9 అధినేత రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థ, జీ స్క్వేర్ సంస్థ ప్రతినిధులు  దాతలుగా 550 ఆవులు కొనుగోలు చేసి
  • టీటీడీ గోశాలకు గోవులు విరాళంగా ఇచ్చారు
  • ఇవన్నీ మా ప్రభుత్వ పాలనలో ఈవో జవహర్ రెడ్డి పాలనలో చేశాం, ఇది మా గొప్పతనం
  • బైలోన మెథడ్ ద్వారా పెరుగును చిలకడం ద్వారా వెన్నను వెలికి తీసే పద్ధతి ప్రవేశ పెట్టాం, నవనీత సేవ ప్రవేశ పెట్టాం
  • మీ పాలనలో ఆచారాలకు భిన్నంగా అరాచకాలు జరుగుతున్నాయి
  • తిరుమలలో శివ అనే డ్రైవర్ ను హత్య చేశారు
  • 70 ఏళ్ల తర్వాత తిరుమలలో హత్య జరిగింది,
  • చెప్పులు వేసుకుని మహాద్వారం వద్ద పట్టుబడ్డారు
  • గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి అక్రమాలకు పాల్పడినప్పుడు మీ పాలనలో 8 నెలలు ఎందుకు కొనసాగించారు
  • తొక్కిసలాట ఘటన లో ఎందుకు సస్పెండ్ చేశారు
  • గోశాలలో గోవుల మరణాలను వాస్తవాలు పక్కదారి పట్టిస్తున్నారు
  • మీ ఎల్లో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
  • దైవం కోసం జైలుకు వెళ్తాం, ప్రాణాలు అయినా అర్పిస్తాం
  • సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ఆవు చనిపోలేదు అని ప్రకటన చేశారు
  • పుట్టుకతోనే వృద్ధ ఆవులు అంటున్నారు టీటీడీ చైర్మన్
  • మా పాలనలో రెండేళ్ల వయస్సు ఉన్న  550 గోవులు సాహివాల్ దాతలు సహాయంతో తీసుకు వచ్చాము,
  • చంద్రబాబు పాలనలో స్పందన, ఉలుకు పలుకు లేదు, గృహ నిర్భందం
  • హిందూ సమాజం అంతా ఈ వాస్తవాలు గ్రహించాలి
  • ఈ మూడు నెలల్లో తిరుమల వేదికగా ఎన్నో అరాచకాలు జరిగాయి
  • అజ్ఞానం తలకు ఎక్కిన వాళ్ళు సమాధానం చెప్తున్నారు,
  • ఎవరి అజ్ఞానం వారి సొంత ఆస్తి
  • స్వామి వారి అనుగ్రహం ఉంది కాబట్టే నేను మూడు సార్లు టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నా.
  • గర్భంతో ఉన్న సాహివాల్ ఆవు రైలు ఢీకొని మృతి చెందితే దాన్ని కప్పి  పుచ్చేదుంకు ప్రయత్నం చేశారు
  • చనిపోయిన ఆవు చెవుకు ఉన్న ట్యాగ్ కోసేశారు, వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత గోశాల ఆవు అని అంగీకరించారు
  • స్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా చనిపోయింది, తిరుమల లో పూజలు అందుకునే ఆవు కూడా చనిపోయింది
  • ఫొటోలు మార్పింగ్ కాదు.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. 

 

తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా

  • గోశాలకు మరోసారి రమ్మని పిలిచి తోకముడిచిన టీడీపీ
  • భూమనకు ఫోన్‌ చేసి గోశాలకు రావాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు.
  • భూమనకు పులివర్తి నాని, సుధీర్‌రెడ్డి, శ్రీనివాసులు ఫోన్‌.
  • ఇటు ఫోన్‌లో రమ్మని.. అటు అడ్డుకోవడానికి పోలీసులను పంపిన ఎమ్మెల్యేలు.
  • మీడియా ముందు డ్రామాలడి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు.
  • టీడీపీ నేతలకు జవాబు చెప్పడానికి మళ్లీ బయలుదేరిన భూమన.
  • ఇంటి దగ్గరే భూమనను నిర్బంధించిన పోలీసులు.
  • గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి.
  • వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తిని లాక్కుపోయిన పోలీసులు
  • గోశాల గేటు వద్ద అభినయ్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.
  • మీడియా సాక్షిగా బట్టబయలైన టీడీపీ ఎమ్మెల్యేల బండారం.

అభినయ్‌ రెడ్డి కామెంట్స్‌..

  • సవాల్‌ స్వీకరిస్తే అడ్డుకోవడమేంటి?.
  • కూటమి నేతలు భూమనకు ఫోన్‌ చేసి రమ్మంటారు.
  • అక్కడ పోలీసులు అడ్డుకుంటారు.. ఇదేనా పద్దతి.
  • ఎస్కార్ట్‌తో భూమనను గోశాల వద్దకు తీసుకురావాలి. 

 

తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత..

ఎంపీ గుర్తుమూర్తి కామెంట్స్‌..

  • గోశాలకు రాకుండా భూమనను అడ్డుకున్నారు.
  • వేరే దారిలో నేను గోశాలకు వచ్చాను.
  • నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధం. 
     

ఉద్రిక్తత..

  • కూటమి నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.
  • ఒకవైపు.. పోలీసులతో నిర్బంధించిన కూటమి నేతలు
  • మరోవైపు భూమనకు ఫోన్లు చేస్తున్న కూటమి నేతలు.
  • గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతల ఫోన్లు.
  • గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్న పోలీసులు.
  • గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. 
  • ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకులు భూమన అభినయ్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

పల్లాకు భూమన ఫోన్‌ కాల్‌..

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌
  • మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు ిసిద్ధమన్న భూమన
  • గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం.
  • మీరు ఎక్కుడున్నారని పల్లాను ప్రశ్నించిన భూమన
  • ఈ క్రమంలో భూమన కాల్‌ కట్‌ చేసిన పల్లా.
     

మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్‌..

  • టీడీపీ నేతల సవాల్‌కు భూమన సిద్ధమయ్యారు
  • గోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా?.
  • సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌?.
  • కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు.
  • కొండపై డ్రైవర్‌ను కొట్టి చంపితే విజిలెన్స్‌ ఏం చేస్తోంది?.
  • శ్రీవారి ఆలయంపై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారు?.
  • క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా?.
  • సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌?.


భూమన కామెంట్స్‌..

  • టీడీపీ నేత చాలెంజ్‌పైనే నేను స్పందించాను.
  • గోశాలకు రావాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ పిలిచారు.
  • పోలీసు బలగాలతో నిర్బంధించడం దారుణం.
  • గోవుల మృతిపై కూటమి నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.
  • గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని భయం పట్టుకుంది.
  • నన్ను రమ్మన్న వాళ్లే ఇలా నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్‌?.
  • టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగం?. 
     

తిరుపతి..

👉గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు  

👉పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి

👉పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న ఎంపీ గురుమూర్తి, నారాయణ స్వామి

👉తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీషను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.

👉భూమన అభినయ రెడ్డి కామెంట్స్‌..

  • భూమన ఒక్కరైనా గోశాలకు వెళ్తారు.
  • తిరుమల శ్రీవారి ప్రతిష్టను కాపాడాలి.
  • కూటమి సర్కార్‌ సవాల్‌ను మేము స్వీకరిస్తే ఎందుకు అనుమతించడం లేదు?.

👉కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. తాజాగా తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద తిరుచానూరు పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. భూమనతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హౌస్ అరెస్ట్ చేశారు.

👉వివరాల ప్రకారం.. తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. గోశాల గోవుల మృతిపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. టీటీడీ  గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని  భూమనకు టీడీపీ సవాల్‌ చేసింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని వ్యాఖ్యానించింది. దీంతో, టీడీపీ ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి స్వీకరించారు. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.

👉మరోవైపు.. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని హుకుం జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్ళాలని సూచించారు. 

👉ఇదిలా ఉండగా.. అంతకుముందు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.

👉కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటిళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్‌ కెమెరాల హల్‌చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.

వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement