
ప్రభుత్వం ఆదుకోవాలి....
ఐదు ఎకరాల మామిడి తోటలో కాయలు, చెట్లు, కొమ్మలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాపు, కోత దశలో ఉన్న అరటిచెట్లు గాలివానకు పడిపోయాయి. కోలుకోలేని విధంగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి.
–సుంకేసుల మస్తాన్, రైతు,
చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం
నష్టపరిహారం అందించాలి
వై కోట, గాదెల గ్రామాల్లో గాలివానకు అరటి, మామిడి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికి అందిన పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. –మల్లెం ఈశ్వరయ్య,
సర్పంచ్, వై కోట

ప్రభుత్వం ఆదుకోవాలి....