
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పంచమి రా.8.57 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: విశాఖ రా.8.44 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.10.04 నుండి 11.51 వరకు, దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.32 వరకు, అమృతఘడియలు: ఉ.8.02 నుండి 9.46 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.10, సూర్యాస్తమయం: 6.06.
మేషం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి ఒప్పందాలు. వాహనయోగం. బంధువులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృషభం... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. చిరకాల మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
మిథునం... వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.
కర్కాటకం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటాయి.
సింహం..... శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కన్య.... వ్యవహారాలలో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల..... కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.
మకరం..... రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కుంభం.... వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
మీనం.. ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
Comments
Please login to add a commentAdd a comment